Wednesday 21 February 2018

అగ్నితత్వ రాశులలో జన్మించిన వారి లక్షణాలు

అగ్నితత్వ రాశులలో జన్మించిన వారి లక్షణాలు

అగ్నితత్వ రాశులు :- మేషం, సింహాం, ధనస్సు రాశుల వారు అగ్నితత్వానికి చెందినవారు. వీటికి వరుసగా అధిపతులైన కుజ, సూర్య, గురువు అగ్నితత్వం కలిగి ఉంటారు. అగ్నితత్వ రాశుల వారు ఉష్ణ తత్వం కలిగి కోప స్వభావాలు కలిగిఉంటారు. అగ్నితత్వం కావటం వలన వికాసం, శక్తి సామర్ధ్యాలు, చైతన్యం, ప్రేరణ, సాహసం, పౌరుషం, కోపం మొదలగు లక్షణాలు కలిగి ఉంటారు. న్యాయకత్వం, దైర్యసాహసాలు, శత్రువులపైన విజయాలు.

చర, స్ధిర, ద్విస్వభావ రాశుల వారి స్వభావాలు


చర, స్ధిర, ద్విస్వభావ రాశుల వారి స్వభావాలు

మేషం, కర్కాటకం, తుల, మకర రాశులు చర రాశులు.
వృషభం, సింహం, వృశ్చికం, కుంభ రాశులు స్ధిర రాశులు.
మిధునం, కన్య, ధనస్సు, మీనం రాశులు ద్విస్వభావ రాశులు.
 
 చర రాశులు:- మేషం, కర్కాటకం, తుల, మకర చర రాసులలో జన్మించిన వారికి చురుకుదనం, శీఘ్ర గమనం, దైర్యం, సాహసం, కొత్త విషయాల యందు ఆసక్తి, పరిసరాలు, పరిస్ధితులు, వృత్తులు, దినచర్యలలో మార్పులు కోరుకుంటూ ఉంటారు. క్షణ కాలంలో నిర్ణయాలు తీసుకుంటారు. ఉత్సాహము చూపుట, ఎప్పుడు తిరుగుతుండుట వీరి లక్షణాలు. ప్రేరణ కలిగి ఉంటారు. కార్యసాధనలో ఉత్సుకత కలిగి ఉంటారు. సంకల్ప బలం, ఆత్మ విశ్వాసం, పనులు ప్రారంబించటంలో ఉత్సాహాన్ని కనబరుస్తారు. చపలత్వం ఎక్కువ కలిగి ఉంటారు. అభిప్రాయాలు, ఆలోచనలు, విధానాలు మార్చుకోగలిగే సామర్ధ్యం కలిగి ఉంటారు. ఎప్పుడు పర్యటనలు, మార్పులు, వైవిధ్యం ఇష్టపడతారు. సుస్ధిరత తక్కువ కలిగి ఉంటారు. ఆవేశం ఎక్కువ కలిగి ఉంటారు. ఎప్పుడు ఏదో ఒక వ్యాపకం కలిగి ఉంటారు. 

Thursday 1 February 2018

కుజ, శుక్రుల సంయోగ దోష నివారణకు “తెల్ల పగడం”

కుజ, శుక్రుల సంయోగ దోష నివారణకు “తెల్ల పగడం” 

జాతక చక్రంలో కుజ, శుక్రులు కలసి 10 డిగ్రీల లోపు ఉన్నప్పుడు వారిద్దరి మధ్య సంయోగం ఏర్పడుతుంది. ముఖ్యంగా కుజ, శుక్రుల కలయిక జీవితంలో వైవాహిక జీవితంపైన, సంసార జీవితంపైన ఎక్కువగా ప్రభావితం చేస్తాయి. చెడు గ్రహ ప్రభావం వలన కామ కోరికలు అధికంగా కలగి ఉండటం, లైంగిక సమస్యలు కలిగి ఉండటం జరుగుతుంది. 

                                https://youtube.com/shorts/hXs7ylVV_Rs?si=eAVlfsOGtiuuLmaF