Friday 28 February 2020

తులా లగ్నములో లగ్నస్థ నవగ్రహములు :

తులా లగ్నము యొక్క అధిపతి శుక్రుడు. ఈ లగ్నములో జన్మించిన వ్యక్తి చూడటానిని అందముగా వుండును. సత్యవాదిగా వుండెదరు. వీరిలో పరోపకారము యొక్క భావన వుండును. గృహస్థ జీవితము కూడా సామాన్యముగా సుఖదాయకముగా వుండును. ఈ లగ్నములో ప్రధమ బావములో స్థితిలో గ్రహముల కారణముగా వేరు వేరు వ్యక్తులకు వేరు వేరు అనుభూతులు వుండగలవు.

తులా లగ్నములో లగ్నస్థ సూర్యుడు

తులా లగ్నము యొక్క కుండలిలో సూర్యుడు ఏకాదశ బావము యొక్క అధిపతిగా శత్రు స్ధానంలో ఉన్నాడు. శత్రు రాశి యొక్క లగ్నములో వున్న సూర్యుడు వ్యక్తికి నేత్ర సంబందమైన రోగములను ఇచ్చును. లాభ భావం యొక్క అధిపతిగా వుండుట వలన తిరిగి తిరిగి ఆర్ధిక స్థితి ప్రభావితము కాగలదు. ఆర్ధిక లావాదేవీలలో లోపమును తీసుకువచ్చును. లగ్నములో సూర్యునితో పాప గ్రహముల యుతి లేదా దృష్టి కలిగి వుండిన ఎడల వ్యక్తి ఉగ్రము మరియు క్రోదస్వబావము కలవారై వుండెదరు. ప్రధమ బావములో స్థితిలో వున్న సూర్యుడు వారి సప్తమ దృష్టి ద్వారా సప్తమ బావములో స్థితిలో వున్న మేషరాశిని చూస్తున్నాడు. సూర్యుని యొక్క దృష్టి కుజునిపై వుండుట కారణముగా వ్యక్తి సాహసము మరియు పరాక్రమము కలవాడై వుండును. వీరి వివాహము విల్లంభములతో కూడినదై వుండును మరియు జీవిత బాగస్వామితో సమ్యోగములో లోపము వుండగలదు.

తుల లగ్నములో లగ్నస్థ చంద్రుడు

చంద్రుడు తుల లగ్నము గల కుండలిలో లగ్నస్థుడుగా వుండుట వలన వ్యక్తి బాల్యము సంఘర్షణతో కూడి కఠినముగా వుండును. యువావస్త మరియు వృద్దావస్త సుఖమయముగాను మరియు ఆనందమయముగాను కొనసాగును. చంద్రుడు వీరిని గుణవంతునిగాను మరియు విద్వానునిగాను చేయును. వీరి మనస్సు కల్పనాశీలత మరియు అస్తిరత్వముతో కూడినదై వుండును. ఈ లగ్నములలో చంద్రుడు దశమాదిపతిగా వుండి అశుభ కారకుడు కాగలడు. సప్తమ బావములో దీని దృష్టి వుండుట వలన జీవిత బాగస్వామి క్రోది, సాహసి మరియు మహత్వకాంక్ష కలవారై వుండెదరు. లగ్నస్థ చంద్రుడు యది శుభ గ్రహములతో యుతి లేదా ధృష్టి కలిగి వున్న ఎడల సప్తమ బావముతో సంబందిత ఉత్తమ ఫలితములను పొందగలరు.

తుల లగ్నములో లగ్నస్థ కుజుడు

తుల లగ్నము గల కుండలిలో కుజుడు ద్వితీయ మరియు సప్తమ బావము యొక్క అధిపతి కాగలడు. ప్రధమ బావములో స్థితిలో వున్న కుజుడు వ్యక్తిని ద్వితీయాదిపతుడుగా వుండుట వలన ఆర్ధిక లాభములను కలిగించును. వ్యాపారము మరియు వర్తకములలో మంచి సఫలత లభించగలదు. స్వతంత్రముగా పనిచేపట్టుట వలన వీరికి లాభములు కలుగును. బాగస్వామ్యకత్వములో అధికముగా నష్టము కలిగే అవకాశములు వున్నవి. లగ్నస్థ కుజుడు వారి పూర్ణ ధృష్టితో చతుర్ధ, సప్తమ మరియు అష్టమ బావములను చూస్తున్నాడు. సుఖ బావములో కుజునితో దృష్టి కలిగి వుండుట కారణముగా సోదరుల నుండి అపేక్షిత సమ్యోగము లభించకపోవచ్చును. పూర్ణ భౌతిక సుఖము లభించుటకు అవకాశములు తక్కువగా వున్నవి. వైవాహిక జీవితములో కష్టములను ఎదుర్కొన వలసి వచ్చును. అష్టమ బావము పీడించబడి వుండుట వలన కుజుని యొక్క దశావదిలో అరోగ్య సంబందమైన సమస్యలను ఎదుర్కొన వలసి వచ్చును.

తుల లగ్నములో లగ్నస్థ బుధుడు

తుల లగ్నము యొక్క కుండలిలో బుదుడు నవమాదిపతి మరియు ద్వాదశాదిపతి కాగలడు. ఇది ఈ లగ్నములో యోగ కారకగ్రహముగా పాత్రను నిర్వాహించును. లగ్నస్తుడుగా వుండి ఇది వ్యక్తికి నవమ మరియు దశమ బావముల ఫలితములను ఇచ్చును. ఇది వ్యక్తిని దార్మిక మరియు బుద్దివంతునిగా చేయును. వీరికి జన సంబంధ కార్యక్రమాలపై శ్రద్ద కలిగి వుండెదరు. ప్రభుత్వము మరియు ప్రభుత్వ యంత్రాంగం ద్వారా వీరికి సమ్యోగము మరియు గౌరవ ప్రాప్తి చెందగలదు. జన్మ స్థలమునకు దూరముగా వీరి బాగ్యము వికసించును. వీరికి తల్లి దండ్రుల ప్రేమ మరియు సమ్యోగము లభించగలదు. బుధుడు పూర్ణ దృష్టితో సప్తమ బావమును చూస్తున్నాడు. దానివలన వైవాహిక జీవితము సామాన్యముగా సుఖమయముగా వుండును. సంతానము మరియు జీవిత బాగస్వామి వలన సమ్యోగము లభించగలదు. లగ్నస్థ బుధుడు పాప గ్రహములతో పీడించబడి వున్న ఎడల ధనము, సుఖము మరియు కుటుంబజీవితములో బాదలు కలుగవచ్చును.

తుల లగ్నములో లగ్నస్థ గురువు

తుల లగ్నము గల కుండలిలో గురువు శతృ గ్రహము కాగలడు. ఇది తృతీయ మరియు షష్టమ బావము యొక్క అధిపతి కాగలడు. గురువు కుండలిలో లగ్నస్థముగా వుండిన ఎడల ఇది మిమ్ము ఆత్మ విశ్వాసముతో ఉండే విధంగా చేయును. మిమ్ము విద్వానునిగాను మరియు సాహసిగాను చేయును. మీరు మీ బుద్ధి కుశలతో జీవితములో ధనము మరియు గౌరవాలను పొందెదరు. లగ్నములో వున్న గురువు పంచమ, సప్తమ మరియు నవమ బావమును చూస్తున్నాడు. పంచమ బావములో గురువు యొక్క దృష్టి ఈ లగ్నములో సంతాన కారకుడుగా వుండును. సోదరుల నుండి సమ్యోగము లభించగలదు. జీవిత బాగస్వామి నుండి సమ్యోగ పూరితమైన మరియు ప్రేమపూరితమైన సంబందములు ప్రదానించును. మాతృపక్షము నుండి లాభములను కలిగించును.

తుల లగ్నములో లగ్నస్థ శుక్రుడు

తుల లగ్నము యొక్క కుండలిలో శుక్రుడు లగ్నాదిపతి మరియు అష్టమాదిపతి కాగలడు. ఈ లగ్నములో శుక్రుడు యోగ కారక గ్రహము యొక్క భూమికత్వమును నిర్వహించును. ప్రధమ బావములో శుక్రుని యొక్క స్థితి కారణముగా వ్యక్తి చురుకుగాను మరియు ఆత్మవిశ్వాసముతో పరిపూరితముగాను వుండును. శుక్రుని శుభ ప్రభావము కారణముగా వ్యక్తి సామాన్యముగా అరోగ్యముగాను మరియు నిరోగస్తునిగా వుండెదరు. సౌందర్యముపై ఆకర్షత కలిగి వుండెదరు. సంగీతము మరియు కళల యందు అభిరుచి కలిగి వుండెదరు. సప్తమ బావములో శుక్రుని పూర్ణ దృష్టి వుండుట కారణముగా వ్యక్తికి అనేక ప్రేమాభిమానాలు వుండును. గృహస్థ జీవితములో ఈ విషయము కారణముగా జీవిత బాగస్వామితో వొడిదుడుకులు కూడా కలుగును. బోగ విలాసములకు సంబందమైన వస్తువులపై ధనమును ఖర్చు చేయుట వీరికి చాలా ఇష్టము.

తుల లగ్నములో లగ్నస్థ శని

తుల లగ్నము యొక్క కుండలిలో శని చతుర్దాదిపతి మరియు పంచమాదిపతిగా వుండి కేంద్రము మరియు త్రికోణ బావములకు స్వామిగా వుండును. ఈ రెండు బావముల అధిపతిగా వుండుట వలన శని ప్రముఖ యోగకారక గ్రహముగా వుండును. ఈ లగ్నములో శని లగ్నస్థుడుగా వుండుట వలన తల్లి దండ్రుల నుండి స్నేహ సమ్యోగము ప్రాప్తించగలదు. విద్య యొక్క స్థితి బాగుండును. వృత్తి విఙ్ఞ్న సంబందమైన శిక్షలో వీరికి విశేషకరమైన సఫలత లభించగలదు. శని తన యొక్క పూర్ణ ధృష్టి కారణముగా తృతీయ, సప్తమ మరియు దశమ బావములను చూస్తున్నాడు. అందువలన వీరిలో దయ మరియు కరుణ స్వబావము అధికముగా వుండును. శని వీరిని ధనవంతునిగా చేయుటతో పాటు భూమి మరియు వాహన సుఖమును కూడా ప్రసాదించును. బందు మిత్రులతో వివాదములు మరియు మతబేదములకు అవకాశములు వున్నవి.

తుల లగ్నములో లగ్నస్థ రాహువు

మీ జన్మము తుల లగ్నములో జరిగినది మరియు లగ్న బావములో రాహువు కూర్చొని వున్నాడు. మీరు అరోగ్య సంబంద సమస్యలను ఎదుర్కొనవలసి వచ్చును. రాహువు అంతర్ముఖి స్వభావముకలవారుగా చేయును. దాని కారణము ఏపనిని చేపట్టదలచిన ఆ పని పూర్తి అయ్యే వరకు ఎవరితోనూ చెప్పరు. పని జరుగుటకు ముందు దేనిగురించి మాట్లాడినా ఆ పని జరుగుటలో సమస్యలు ఎదురుకాగలవు. లగ్నములో వున్న రాహువు పంచమ, సప్తమ మరియు నవమ బావములను చూస్తున్నాడు. రాహువు యొక్క దృష్టి వలన, జీవిత బాగస్వామితో మరియు సంతానముతో సమ్యోగము లేకుండుట మరియు బాగ్యహాని కలుగజేయును.

తుల లగ్నములో లగ్నస్థ కేతువు

కేతువు తుల లగ్నము యొక్క కుండలిలో లగ్నస్థముగా వున్న కేతువు వ్యక్తిని పరిశ్రమి మరియు సాహసిగా చేయును. సాహసము మరియు పరిశ్రమ కారణముగా వ్యక్తి కఠినమైన పనులను కూడా పూర్తిచేయ శక్తి కలవాడై వుండును. ఇతరుల ధనముపై వీరి దృష్టి వుండును. సాదారణముగా వీరిలో దార్మిక బావనలు అధికముగా వుండును. మనస్సులో అనవసర భయములు వుండును. పందెములు మరియు జూదములలో ధనము అనవసరముగా ఖర్చుకాగలదు.

Wednesday 26 February 2020

కన్యా లగ్నములో నవగ్రహముల ఫలితములు :

బుధుడు కన్యా రాశి యొక్క అధిపతి. ఈ లగ్నములో జన్మించు వ్యక్తి బుద్దివంతుడుగాను, వివేక వంతుడుగాను మరియు వ్యాపారములో నిపుణత కలిగి వుండెదరు. ఈ లగ్నములో ఏ వ్యక్తి యొక్క జననము కలుగునో వారు కల్పనాశీలత కలవారై కోమల హృదయము కలవారై వుండెదరు. ఈ లగ్నములో లగ్నస్థ గ్రహముల యొక్క ఫలితములు వేరువేరుగా వుండును.

కన్యా లగ్నములో లగ్నస్థ సూర్యుడు

కన్యా లగ్నము యొక్క కుండలిలో సూర్యుడు ద్వాదశమాదిపతిగా వున్నాడు ఏ వ్యక్తి యొక్క కుండలిలో కన్యా లగ్నములో సూర్యుడు లగ్నస్థములో వుండునో వారు చూడడానికి అందముగా వుంటారు. వీరి వ్యక్తిత్వము ప్రభావశాలిగా వుండును. వీరికి దగ్గు, జలుబు మరియు హృదయ సంబందమైన సమస్యలు కలిగే అవకాశములు వున్నవి. సూర్యుని ప్రభావము కారణముగా వీరికి విదేశ యాత్రలు చేసే అవకాశము కూడా కలుగవచ్చును. లగ్నస్థ సూర్యుని యొక్క ధృష్టి సప్తమ బావముపై వుండుట వలన గృహస్థ జీవితములోని సుఖములో లోపము ఏర్పడవచ్చును. కృషి మరియు జన క్షేత్రమునకు సంబందమైన వ్యాపారములు వీరికి లాభదాయకముగా వుండును. లగ్నములో వున్న సూర్యుడు అశుభ గ్రహములతో యుతి లేదా ధృష్టి కలిగి వున్న ఎడల అనారోగ్య సమస్యలు కలుగవచ్చును.

కన్నా లగ్నములో లగ్నస్థ చంద్రుడు

చంద్రుడు కన్యా లగ్నము యొక్క కుండలిలో ఏకాదశాదిపతిగా వుండును. చంచల మనస్తత్వం కలుగును. బయటకు చెప్పుకోలేని మానసికమైన సమస్యలు అనుభవిస్తారు. లగ్నస్థుడుగా వుండుట వలన చంద్రుడు వ్యక్తిని అందమైన మరియు కల్పనాశీలత కలవాడుగా చేయును. చంద్రుని యొక్క ప్రభావము కారణముగా వ్యక్తి దయ మరియు ఆత్మ విశ్వాసము కలవాడుగా వుండును. వీరు వారి జీవితములో తీవ్రగతిలో ప్రగతిని సాదించెదరు. సప్తమ బావములో స్థితిలో వున్న గురువు యొక్క రాశిపై చంద్రుని దృష్టి వుండుట కారణముగా జీవిత బాగస్వామితో ప్రేమపూరితమైన సంబందములు కలిగి వుండును. జీవిత బాగస్వామితో అపేక్షిత సమ్యోగము కూడా ప్రాప్తించవచ్చును. వీరికి అకస్మాత్తుగా లాభము కలుగును. యది లగ్నస్థ చంద్రుడు అశుభ గ్రహముతో దృష్టి లేదా యుతి కలిగి వున్న ఎడల కష్టకారిగాను మరియు పీడాకారిగాను వుండును.

కన్యా లగ్నములో లగ్నస్థ కుజుడు

కుజుడు కన్యా లగ్నము యొక్క కుండలిలో తృతీయాదిపతి మరియు అష్టమాదిపతిగా వుండి శత్రు స్ధానంలో ఉండును. కుజుడు కన్యా లగ్నములో లగ్నస్థముగా వుండి వ్యక్తిని క్రోదము మరియు ఉగ్రము కలవాడుగా చేయును. చతుర్ధ బావములో కుజుని యొక్క ధృష్టి సోదరులతో అనుకూల సంబందములను కలిగించును. మరో ప్రక్క తల్లి దండ్రుల నుండి విభేదములను కలిగించును. ప్రధమ బావములో స్థితిలో వున్న కుజుడు తండ్రికి ఆరోగ్య సంబందమైన సమస్యలను కలిగించును. అష్టమ బావములో కుజుని దృష్టి వుండిన ఎడల శారీరక కష్టములు కలిగే అవకాశములు వుండును. గృహస్థ జీవనము కొరకు కుజుని యొక్క ఈ స్థితి శుభకారిగా వుండదు. లగ్నస్థ కుజుడు సప్తమ బావములోని ఫలితములను పీడితము చేయును. భాగస్వాముల వలన మోసపోయే అవకాశము వున్నది. కోపస్వభావము, దూకుడు తనం వలన సహకారాన్ని కోల్పోయే అవకాశాలు ఉన్నాయి.

కన్యా లగ్నములో లగ్నస్థ బుధుడు

బుధుడు కన్యా లగ్నము యొక్క కుండలిలో లగ్నాదిపతి మరియు కర్మాదిపతిగా వున్నాడు. లగ్నాదిపతి యొక్క స్వరాశిలో స్థితిలో వుండుట వలన వ్యక్తి ఆరోగ్యముగాను, అందముగాను మరియు ఆకర్షణీయముగాను వుంటారు. బుధుడు వ్యక్తికి దీర్ఘాయువును ఇచ్చును. లగ్నాదిపతి బుధుని ప్రబావము కారణముగా వ్యక్తిలో ఆత్మ విశ్వాసము పరిపూర్ణముగా వుండును. వారి ఆత్మబలము కారణముగా వ్యవసాయము మరియు వ్యాపార రంగములలో నిరంతర ప్రగతిని సాదించెదరు. వీరికి సమాజములో గౌరవము మరియు ఆదరణ లభించగలదు. ప్రధమ బావములో స్థితిలో వున్న బుధుడు సప్తమ బావమును వారి పూర్ణ దృష్టి ద్వారా చూస్తున్నాడు. బుదుని ఈ దృష్టి కారణముగా మీకు మంచి జీవిత బాగస్వామి లభించగలదు. గృహస్థ జీవితము సుఖమయము గాను మరియు ఆనందమయము గాను వుండును.

కన్యా లగ్నములో లగ్నస్థ గురువు

కన్యాలగ్నము యొక్క కుండలిలో గురువు శతృ గ్రహం కాగలడు. ఇది చతుర్ధ మరియు సప్తమ బావము యొక్క అధిపతి కాగలడు. గురువు లగ్నస్థుడుగా వుండుట వలన వ్యక్తికి తన జీవితములో తండ్రి పేరు వలన పలుకబడి లభించును. బందుమిత్రులతో వొడిదుడుకులు వుండును. పుత్రుల నుండి ఆదరము మరియు సమ్యోగము లభించగలదు. పితృ సంపత్తి నుండి వీరికి లాభము కలుగును. ప్రధమ బావములో స్థితిలో వున్న గురువు పంచమ, సప్తమ మరియు నవమ బావమును చూస్తున్నాడు. గురువు యొక్క దృష్టి కారణముగా వ్యక్తి దీర్ఘాయువు, పుత్రసంతానం మరియు విక్యాతి కలుగును. గురువు అశుభ గ్రహములలో దృష్టి లేదా యుతి కలిగి వున్న ఎడల సంతానమునకు కష్టకారి కాగలదు. మాతృ ప్రేమ కలిగి ఉంటాడు.

కన్యా లగ్నస్థ శుక్రుడు

శుక్రుడు కన్యా లగ్నము యొక్క కుండలిలో దనాదిపతి మరియు భాగ్యాదిపతిగా శుభ గ్రహముగా వుండును. లగ్నములో కన్యా రాశిలో వున్న శుక్రుడు వ్యక్తిని జీవితములో ప్రగతి బాటలో ముందుకు తీసుకు వెళ్ళును. శుక్రుని ప్రభావము కారణముగా వ్యక్తి సంగీతము లేదా కళలకు సంబందించిన మరే ఇతర రంగములోనైనా అభిరుచి కలిగి వుండెదరు. వీరిలో దార్మిక బావనలు అధికముగా వుండును. వీరికి క్రీడలు, లలిత కళలలో మంచి సఫలత లభించగలదు. ప్రభుత్వము మరియు ప్రభుత్వ విబాగముల నుండి వీరికి సమ్యోగము లభించగలదు. లగ్నస్థ శుక్రుని యొక్క దృష్టి సప్తమ బావముపై వుండిన ఎడల జీవిత బాగస్వామి సుయోగ్యము మరియు సమ్యోగము కలిగిన వారై వుండును. శుక్రుడు అశుభ గ్రహములతో యుతి లేదా దృష్టి కలిగి వుండుట వలన శుక్రుని యొక్క శుభత ప్రబావితము కాగలదు. కన్యారాశిలో శుక్రుడు నీచస్ధితి పొందుట వలన వివాహా విషయంలో సరైన నిర్ణయం తీసుకోలేరు.

కన్యా లగ్నములో లగ్నస్థ శని

కన్యా లగ్నము యొక్క కుండలిలో శని మిత్ర స్ధాన స్థితిలో వున్నాడు. ఈ లగ్నములో శని పంచమాదిపతి మరియు షష్టమాదిపతిగా వుండును. శని యొక్క ప్రభావము కారణముగా వ్యక్తి శారీరకముగా బలమైన వారుగా వుండును. కఠిన పరిశ్రమ చేయుటకు వీరు వెనుకాడరు. ఙ్ఞానము మరియు బుద్ది కుశలతలో కూడా వీరు ఉన్నత శ్రేణిగా వుండెదరు. వీరి పరివారిక జీవితము అశాంతితో కూడినదై వుండును. సంతానముతో సమ్యోగాత్మక సంబందములు వుండక పోవచ్చును. ప్రదమస్థ శని తృతీయ, సప్తమ మరియు దశమ బావమును చూస్తున్నాడు. దానివలన సంతాన విషయములో వీరికి కష్టములను ఎదుర్కొన వలసి వుండును. జీవిత బాగస్వామి చూడడానికి అందముగాను మరియు అత్యాద్మిక విచారములు గల వ్యక్తిగా వుండును. కాని వారి స్వబావము మొండిగాను మరియు క్రోదము కలిగి వుండును. గృహస్థ జీవితములో వీరిలో అప్పుడప్పుడు సమస్యలను ఎదుర్కొన వలసి వుండును.

కన్యా లగ్నములో లగ్నస్థ రాహువు

రాహువు కన్యా లగ్నములో ప్రధమ బావములో స్థితిలో వుండుట వలన వ్యక్తి పొడుగుగాను మరియు అరోగ్యముగాను కనిపించును. వీరిలో వేళాకోల లక్షణాలు మరియు స్వార్ధము వుండును. వారి పనిని ఏవిధముగానైనా చేపట్టగలరు. స్త్రీ యొక్క కుండలిలో సప్తమ బావములో రాహువు యొక్క దృష్టి వుండుట కారణముగా సంతాన సంబందములలో కష్టకారిగా వుండును. రాహువు యొక్క ఈ దృష్టి జీవిత బాగస్వామిని పీడించును. కుటుంబ జీవితమును అశాంతిగాను మరియు కలహపూరితమైనదిగాను చేయును.

కన్యా లగ్నములో లగ్నస్థ కేతువు

ప్రధమ బావములో కన్యా లగ్నములో స్థితిలో వున్న కేతువు వ్యక్తిని స్వార్ధిగా చేయును. దీనివలన ప్రభావితమైన వ్యక్తిలో స్వాభిమాన లోపము కలుగును. గుప్తాచారము మరియు డిటెక్టివ్ వంటి పనులలో వీరికి సఫలత లభించగలదు. వీరికి వాత రోగము కలిగే అవకాశములు వున్నవి. నడుములో కూడా వీరికి నొప్పి వుండగలదు. సప్తమ బావము కేతువుతో దృష్టి కలిగి వుండుట కారణముగా ఈ బావములో సంబందిత ఫలితములు పీడించబడగలవు. ఇది జీవిత బాగస్వామిని రోగగ్రస్తునిగా చేయును. సప్తమ బావము శుభ గ్రహములో యుతు లేదా దృష్టి కలిగించని ఎడల వివాహేతర సంబందములకు కూడా అవకాశములు వున్నవి.

Sunday 23 February 2020

సింహ లగ్నములో నవగ్రహముల యొక్క ఫలితములు :

ఏ వ్యక్తి యొక్క జననము సింహ లగ్నములో కలుగునో వారు చూడడానికి అందముగాను మరియు అరోగ్యముగాను వుండెదరు. వీరు మహత్వకాంక్ష కలిగి మొండి స్వబావము కలిగి వుండెదరు. వీరు ఎంత సాహసము కలవారో అంతే ఆత్మవిశ్వాసము కలవారు కూడా. వీరిలో సాహసము మరియు ఆత్మ విశ్వాసము అధికముగా వుండును. రాజనీతిలో వీరికి అభిరుచి వుండును. ఈ లగ్నము గల కుండలిలో ప్రధమ బావములో స్థితిలో వున్న గ్రహములు ఏ ప్రకారము ఫలితములను ఇచ్చునో పరిశీలిద్దాము.

సింహ లగ్నములో లగ్నస్థ సూర్యుడు

సూర్యుడు సింహ లగ్నము యొక్క కుండలిలో లగ్నాదిపతిగా వుండి శుభకారక గ్రహముగా వుండును. స్వరాశిలో వున్న సూర్యుడు వ్యక్తిని గుణవంతునిగాను మరియు విద్వావంతునిగాను చేయును. ఇది వ్యక్తిలో ఆత్మ విశ్వాసమునకు పరిపూర్ణతను కలిగించును. వారి కార్య కుశలత మరియు ప్రతిభ కారణముగా సమాజములో సన్మానితులు కాగలరు. వీరు ఏ పనిని చేపట్టిన పూర్తి మనోభలముతో చేపట్టెదరు. కార్యములలో త్వరత్వరగా మార్పులను తీసుకొని వచ్చుట వీరు ఇష్టపడరు. వీరు పరాక్రమము కలవారు. ఇతరులకు ఉదార స్వబావముతో సహాయము చేయుదురు. ప్రధమ బావములో స్థితిలో వున్న సూర్యుడు సప్తమములో స్థితి శని యొక్క రాశి కుంభరాశిని చూస్తున్నాడు. దానివలన దాంపత్య జీవితములో అశాంతి కలిగి వుండును. మిత్రుల నుండి మరియు బాగస్వాముల నుండి కోరుకున్న సమ్యోగము లభించక పోవచ్చును. సూర్యుడు లగ్నంలో ఉండటం వలన దీర్ఘకాలిక కోపాలను మనసులో దాచుకొని హృదయ సంబంధ అనారోగ్యాలను పొందుతారు. పొగడ్తలకు లొంగిపోతారు.

సింహ లగ్నములో లగ్నస్థ చంద్రుడు

చంద్రుడు సింహ లగ్నము యొక్క కుండలిలో ద్వాదశ బావమునకు అధిపతి. ఈ దశావదిలో ఇది మిత్రుడు కావటం వలన శుభ మరియు వ్యయాధిపతి కావటం వలన అశుభ రెండు ప్రకారముల ఫలితములను ప్రదానించును. సింహరాశిలో చంద్రుడు లగ్నములో స్థితిలో వుండిన ఎడల వ్యక్తి చురుకైన స్వబావము కలిగి వుండెదరు. వీరి మనస్సు స్థిరత్వము లేకుండా వుండును. మరియు ఒక చోట వీరు నిలకడగా వుండుటకు ఇష్టపడరు. వీరు ఏ విదమైన సహాయమునైనా నిశ్వార్ధ రూపముగా చేయుటకు ఇష్ట పడతారు. వీరు మంచి స్వబావము కలిగినవారై వుండెదరు. వీరికి తల్లి దండ్రుల నుండి ప్రేమ మరియు సమ్యోగము లభించగలదు. చంద్రుడు వీరికి రాజనీతిలో సఫలతను పొందుటకు సమ్యోగమును ఇచ్చును. సప్తమ బావములో చంద్రుని దృష్టి కుంబముపై వుండుట వలన వైవాహిక జీవితములో కష్టములు కలుగును. చంద్రునితో పాప గ్రహములు వుండుట వలన చంద్రుని శుభ స్థితిలో లోపము ఏర్పడవచ్చును.

సింహ లగ్నములో లగ్నస్థ కుజుడు

కుజుడు సింహ లగ్నము యొక్క కుండలిలో మిత్ర స్ధానములో ఉండుట వలన శుభకారక గ్రహము కాగలడు. ఇది ఈ లగ్నములో చతుర్ధ మరియు నవమ బావము యొక్క అధిపతి కాగలడు. లగ్నములో కుజుడు వ్యక్తిని సాహసి, నిర్బయుడు మరియు ఆత్మ విశ్వాసముతో పరిపూర్ణముగా చేయును. వ్యక్తి ఒకటి కన్న ఎక్కువ విధముగా ధనమును ప్రాప్తి చెందగలడు. లగ్నములో వున్న కుజుడు చతుర్ధ, సప్తమ మరియు అష్టమ బావములను చూస్తున్నాడు. కుజుని యొక్క దృష్టి వలన బాగస్వామితో విరోధములకు కారణము కాగలదు. వైవాహిక జీవితములో వొడిదుడుకులు వుండగలవు మరియు శత్రువుల ద్వారా పీడించబడగలరు. కుజుని ప్రబావము వలన సంతానము కలుగును కాని చాలా పరీక్షించవలసి వుండును. లగ్న కుజుడు వేరేవాళ్ళ మీద కోపాన్ని ఇక్కడ ప్రదర్శిస్తారు. తొదరగా కోపాన్ని తెచ్చుకుంటారు. తరువాత పశ్చాత్తాప పడతారు.

సింహ లగ్నములో లగ్నస్థ బుధుడు

సింహ లగ్నము యొక్క కుండలిలో బుధుడు ద్వితీయ మరియు ఏకాదశ బావము యొక్క అధిపతి కాగలడు. ఈ లగ్నము గల వ్యక్తికి రెండు ధన స్ధానాలకు అధిపతి కావటం వలన ధనము కారకముగా వుండును. ఈ లగ్నములో బుధుడు ఉన్న ఎడల వ్యక్తి ధనవంతుడు కాగలడు. వీరి కళలకు సంబందించిన ఏ రంగములోనైనా సంబందములను కలిగి వుండవచ్చును. వీరికి శత్రుభయము ఎల్లప్పుడూ వుండును. సప్తమ బావములో బుధుని యొక్క దృష్టి జీవిత బాగస్వామి పట్ల ప్రేమను పెంచును. వీరు వారి జీవిత బాగస్వామి పట్ల ప్రేమ కలిగి వుండెదరు. కాని జీవిత బాగస్వామి నుండి వీరికి అనుకూల సమ్యోగము లభించదు. సంతాన సుఖము విల్లంబములను కలిగినదై వుండును. బుధునితో పాటు పాప గ్రహములు లేదా శత్రు గ్రహముల యుతి కలిగి వుండిన ఎడల బుధుని శుభ ప్రభావములో లోపము ఏర్పడవచ్చును.

సింహ లగ్నములో లగ్నస్థ గురువు

గురువు సింహ లగ్నము యొక్క కుండలిలో పంచమాదిపతి మరియు అష్టమాదిపతి కాగలడు. ఈ రాశిలో గురువు లగ్నస్థములో వుండుట కారణముగా వ్యక్తి శారీరకముగా అందముగాను మరియు ఆకర్షణీయముగాను వుండును. వీరి మాటలు ప్రభావశాలిగా వుండును. గురువు వీరిని బుద్దివంతునిగాను మరియు ఙ్ఞానవంతునిగాను చేయును. పంచమ, సప్తమ మరియు నవమ బావముపై గురువు యొక్క దృష్టి వుండుట వలన వ్యక్తి దయాస్వబావము కలిగి మంచి భావాలు కలిగిన వారై వుండెదరు. వీరిలో ధనమును బద్రపరచు స్వబావము కలిగి వుండెదరు. ఙ్ఞానము మరియు బుద్ది వలన వీరు ఉన్నత పదవులను పొందెదరు. ఉద్యోగ వ్యాపారములు రెండింటిలోనూ వీరికి సఫలత లభించగలదు. గౌరవ మర్యాదలు కూడా వీరికి లభించగలవు. జీవిత బాగస్వామి మరియు సంతానము నుండి వీరికి సుఖము మరియు సమ్యోగము లభించగలదు. పాప గ్రహముల నుండి యుతి లేదా దృష్టి గురువు అయిన ఎడల ఫలితములలో లోపము ఏర్పడగలదు. అప్పుడు గురువుకు పరిహారములు చేయవలసి వుండును.

సింహ లగ్నములో లగ్నస్థ శుక్రుడు

శుక్రుడు సింహ లగ్నములో తృతియాదిపతి మరియు దశమాదిపతిగా వుండును. ఈ లగ్నములో ఇది కేంద్రాదిపతి దోషము వలన పీడించబడిన గ్రహముగా వుండును. శుక్రుడు యది సింహ రాశిలో లగ్నస్థముగా వుండిన ఎడల వ్యక్తికి అందమైన మరియు ఆకర్షణీయమైన వ్యక్తిత్వమును ప్రదానించును. శుక్రుని ప్రభావము వలన వ్యక్తి యొక్క మనస్సు బౌతిక సుఖముల పట్ల ఆకర్షణీయముగా వుండును. మెట్టింటి నుండి సమయమునకు తగ్గట్టు లాభములు ప్రాప్తించగలవు. శుక్రుడు సప్తమ బావమును పూర్ణ దృష్టితో చూస్తున్నాడు దాని వలన వ్యక్తి వారి ధనమును అపవ్యయము చేయును. ఈ స్థితిలో వ్యక్తి స్వయముపై అదుపు లేకుండా వుండును. అన్య వ్యక్తితో వీరికి అనౌతిక సంబందములు వుండగలవు. దానివలన ఆర్ధిక సమస్యలను ఎదుర్కొన వలసి వచ్చును. సప్తమ బావములో శుభ గ్రహము స్థితిలో వుండి మరియు దీనిపై శుభ గ్రహముల దృష్టి వున్న ఎడల వ్యక్తి జీవిత బాగస్వామికి నమ్మకమైన వారుగా వుండగలరు.

సింహ లగ్నములో లగ్నస్థ శని

శని సింహ లగ్నము యొక్క కుండలిలో షష్టమ మరియు సప్తమ బావము యొక్క అధిపతి కాగలడు. శని సిమ్హా లగ్నంలో శత్రు స్ధానంలో ఉన్నట్టు. సింహ లగ్నము యొక్క కుండలిలో లగ్నములో వున్న శని అశుభ ఫలదాయకముగా వుండును. ఇది వ్యక్తిని అసమాజికమైన కార్యములను చేయుటకు ప్రోత్సాహించును. వ్యక్తిని అపకీర్తిని పొందుటకు బాగముగా వుండును. లగ్నములో విరాజితమైన శని తృతీయ, సప్తమ మరియు దశమ బావమును పూర్ణ దృష్టి ద్వారా చూస్తున్నాడు. శని యొక్క దృష్టి యొక్క ప్రబావము కారణముగా తెలివిగాను మరియు కపటస్వభావము కలవాడై వుండును. వీరి వ్యవహారముల కారణముగా మిత్రుల నుండి వీరికి కోరుకున్న సమ్యోగము లభించకపోవచ్చును. జీవిత బాగస్వామి నుండి కూడా కష్టములు కలుగును. ఇతరుల సంపత్తిపై వీరు పేరాశ కలిగి వుండెదరు. శనితో పాటు శుభ గ్రహముల యుతి లేదా శని శుభ గ్రహముల దృష్టిలో వుండిన ఎడల అశుభ కొంత తగ్గవచ్చును.

సింహ లగ్నములో లగ్నస్థ రాహువు

సింహ లగ్నము యొక్క కుండలిలో రాహువు అశుభ పలదాయకముగా వుండును. ఈ లగ్నములో ప్రధమ బావములో వున్న రాహువు వ్యక్తి యొక్క ఆత్మ భలమును బలహీన పరచును. ఆత్మవిశ్వాస లోపము కారణముగా వ్యక్తి స్వతంత్ర రూప నిర్మాణమునకు బయపడును. వీరు గౌరవ మర్యాదలను కాపాడుకొనుటకు చాలా పయత్నించవలసి వుండును. తంత్ర మంత్రములు మరియు గుప్త విద్యలందు ఆసక్తి అధికముగా వుండును. రాజనీతిలో వీరికి రాహువు యొక్క సమ్యోగము లభించగలదు. రాహువు యొక్క సప్తమ దృష్టి యొక్క ప్రభావము కారణముగా వర్తక వ్యాపారములలో భాగస్వాములు మరియు మిత్రుల నుండి విషేశ లాభములు లభించవు. వ్యాపారములో నష్టము కూడా కలుగవచ్చును. స్త్రీ పక్షము నుండి కూడా వీరికి కష్టము కలుగవచ్చును.

సింహ లగ్నములో లగ్నస్థ కేతువు

సింహరాశి సూర్యుని యొక్క రాశి. కేతువు సూర్యుని యొక్క శత్రువు. అందువలన ఈ రాశిలో కేతువు శుభ ఫలితములను ఇవ్వడు. లగ్నములో కేతువు ఉన్న ఎడల వ్యక్తి ఆరోగ్యము బలహీనముగా వుండును. కేతువు యొక్క దశలో వ్యక్తి అరోగ్యములో వొడిదుడుకులు వుండగలవు. తల్లిదండ్రులతో విషేశమైన ప్రేమ ఏమీ వుండదు. మానసిక చింతన మరియు సమస్యలను వీరిని బాదించు చుండును. సప్తమ బావములో కేతువు యొక్క పూర్ణ దృష్టి కారణముగా వైవాహిక జీవితములోని సుఖములో లోపము ఏర్పడగలదు. జీవిత బాగస్వామి జబ్బుపడగలరు లేదా వారితో వొడిదుడుకులు వుండగలవు.

Thursday 20 February 2020

కర్కాటక లగ్నములో నవగ్రహములు :

కర్కాటక లగ్నము యొక్క అధిపతి చంద్రుడు. మీ లగ్నము కర్కాటకమైన ఎడల మీరు ప్రయాణములందు ఆసక్తి కలిగి వుండెదరు. మీ కల్పనాశీలత మరియు స్మరణ క్షమత బాగుండును. మీలో ఎల్లప్పుడు ప్రగతిబాటలో ముందుకు నడిచే కోరిక కలిగి వుండెదరు. యది మీ కుండలిలో లగ్న బావములో మరే గ్రహమైనా వున్న ఎడల దానివలన మీరు ప్రబావితులు కాగలరు.

కర్కాటక లగ్నము యొక్క కుండలిలో లగ్నస్థ సూర్యుడు

కర్కాటక లగ్నము యొక్క కుండలిలో సూర్యుడు ద్వితీయ బావము యొక్క అధిపతి కాగలడు. ప్రధమ బావములో చంద్రుని యొక్క రాశి కటకములో వుండుట వలన గ్రహము ఆరోగ్య సంబందమైన విషయములో కష్టకారిగా వుండును. సూర్య దశలో ఆరోగ్యము వలన వ్యక్తి కష్టపడుచుండును. వీరిలో అభిమానము మరియు కోపము వుండును. వీరిలో వ్యాపారము పట్ల అపేక్ష మరియు ఉద్యోగము చేయుట ఇష్టకరముగాను వుండును. ప్రభుత్వ సంబంద విషయములలో సమస్యలను ఎదుర్కొన వలసి వచ్చును. తండ్రితో మతబేదములు వుండును. వీరు నిలకడగా ఒకచోట కూర్చొనుటకు ఇష్టపడరు. బందుమిత్రులతో వివాదములను ఎదుర్కొన వలసి వుండును.

కర్కాటక లగ్నము యొక్క కుండలిలో లగ్నస్థ చంద్రుడు

చంద్రుడు కర్కాటక లగ్నము యొక్క కుండలిలో లగ్నాదిపతిగా వుండుట కారణముగా శుభకారక గ్రహముగా వుండును. చంద్రుడు స్వరాశిగా వుండును. మంచి స్వబావము కలిగి పరోపకారిగా వుండును. వీరిలో భగవంతుని పట్ల భక్తి మరియు పెద్దవారిపై గౌరవ మర్యాదలు కలిగి వుండెదరు. వీరిలో మనోభలము అధికముగా వుండును. వారి ప్రయత్నములో సమాజములో ఉన్నత స్థానమును పొందెదరు. వ్యాపారములో వీరికి సఫలత లభించును. కళా క్షేత్రములో కూడా వీరికి మంచి సఫలత లభించగలదు. చంద్రుని యొక్క దృష్టి సప్తమ బావములో వుండుట కారణముగా జీవితభాగస్వామి యొక్క సంబందములలో ఉత్తమ ఫలితములను ఇచ్చును. వ్యక్తిని విద్యావానుడుగాను మరియు ఙ్ఞానవంతునిగాను చేయును. ధన బావములో చంద్రుని యొక్క ప్రభావము వుండిన ఎడల ఆర్ధిక స్థితి బాగుండును. వివాహము తరువాత వీరికి విషేశమైన లాభములు కలుగును. కఠినమైన సత్యము మరియు నేరుగా మాట్లాడు అలవాట్లు వుండుట వలన వీరు విరోధములను ఎదుర్కొన వలసి వచ్చును.

కర్కాటక లగ్నము యొక్క కుండలిలో లగ్నస్థ కుజుడు

కుజుడు కర్కాటక లగ్నము గల కుండలిలో పంచమాదిపతి మరియు దశమాదిపతి కాగలడు. ఇది దశమాదిపతి మరియు త్రికోణాదిపతిగా వుండుట వలన కర్కాటక లగ్నములో మంగళకరమైనదిగా వుండును. కుజుని ప్రబావము వలన క్రోదము మరియు ఉగ్ర స్వభావము కలిగి వుండును. వీరిలో మహత్వకాంక్ష అధికముగా వుండును. రాజకీయ రంగములో కుజుడు వీరికి లాభములను ప్రదానించును. ప్రధమ బావములో వున్న కుజుడు చతుర్ధ బావమును మరియు అష్టమ బావమును చూచును. కుజుని యొక్క దృష్టి కారణముగా వ్యక్తికి ఆర్ధిక లాభము లభించుచుండును. కాని వ్యయము కూడా అదే అనుపాతములో వుండును. దన సేకరణము చేయుట వీరికి కఠిన కరమైన విషయముగా వుండును. వైవాహిక జీవితములో మదురతలో లోపము ఏర్పడవచ్చును. అనగా కుజుని యొక్క దృష్టి వలన సప్తమ బావము ప్రభావితము కాగలదు. కుటుంబ జీవితము కలహ పూరితముగా వుండును. లగ్నస్థ కుజుని యొక్క ప్రభావము వలన వ్యక్తి సంతాన సుఖమును పొందగలడు. స్వబావములో తెలివితేటలు మరియు పేరశ కారణముగా అప్పుడప్పుడు వీరి అవమానములను ఎదుర్కొన వలసి వచ్చును.

కర్కాటక లగ్నము యొక్క కుండలిలో లగ్నస్థ బుధుడు

బుధుడు కర్కాటక లగ్నము యొక్క కుండలిలో అశుభ కారక గ్రహము కాగలడు. ఇది ఈ లగ్నములో తృతీయ మరియు ద్వాదశ బావము యొక్క అధిపతి కాగలడు. బుదుడు యది లగ్న బావములో స్థితిలో వున్న ఎడల వ్యక్తి యొక్క ఆచరణ, అలవాట్లు సందేహ పూరితమైనవిగా వుండును. జీవనోపాది కొరకు వీరికి ఉద్యోగము ఇష్టకరముగా వుండును. వ్యాపారము చేయుటలో వీరికి అభిరుచి తక్కువగా వుండును. వీరికి బందు మిత్రులతో మరియు సోదరులతో విశేషకరమైన ఆప్యాయత ఏమీ వుండదు. సప్తమ బావముపై బుధుని యొక్క దృష్టి వుండుట కారణముగా గృహస్థ జీవితములో అశాంతి కలిగి వుండును. బాగస్వాముల నుండి హాని కలుగును. శత్రువుల కారణముగా కష్టములను ఎదుర్కొన వలసి వుండును.

కర్కాటక లగ్నము యొక్క కుండలిలో లగ్నస్థ గురువు

కర్కాటక లగ్నములో గురువు షష్టమ మరియు నవమ బావము యొక్క అధిపతి. షష్టమ యొక్క అధిపతిగా వుండుట వలన ఏ చోట అయితే గురువు దోషించబడునో ఆ చోట అదే త్రికోణాదిపతిగా వుండుట వలన శుభ ఫలదాయకముగా కూడా వుండును. కర్కాటక లగ్నములో వున్న గురువు ఉచ్చ స్ధితిని పొందును. వ్యక్తిత్వమును ఆకర్షణీయముగా చేయును. ఇది తన యొక్క పూర్ణ దృష్టితో పంచమ, సప్తమ మరియు నవమ బావమును చూచును. పంచమ బావములో గురువు యొక్క దృష్టి సంతానము యొక్క సందర్బములో శుభ పలదాయకముగా వుండును. సప్తమ బావములో జీవిత భాగస్వామి విషయములో ఉత్తమతను ప్రదానించును. నవమ బావముపై దృష్టి వుండుట కారణముగా బాగ్యము ప్రభలముగా వుండును. జీవితము ధన దాన్యములతో పరిపూర్ణముగా వుండును. వ్యాపారములో ఉదార స్వబావమును మరియు దయాస్వభావమును కలిగించును.

కర్కాటక లగ్నము యొక్క కుండలిలో లగ్నస్థ శుక్రుడు

కర్కాటక లగ్నంలో శురుడు శత్రు స్ధానంలో ఉంటాడు. ఇది ఈ లగ్నము యొక్క కుండలిలో శుక్రుడు చతుర్ధ మరియు ఏకాదశ బావము యొక్క అధిపతిగా వుండును. రెండు కేంద్రబావముల అధిపతిగా వుండుట కారణముగా శుక్రునికి కేంద్రాదిపతి యొక్క దోషము కలుగును. శుక్రుడు లగ్నస్థముగా వుండుట వలన వ్యక్తిలో సాహస లోపము కలుగును. వీరి మనస్సులో అనవసర భయము కలుగుతుండును. ఆర్ధిక స్థితి బాగుండును. ఉద్యోగము మరియు వ్యాపార రంగములలో వీరికి మంచి సఫలత లభించగలదు. శుక్రుని యొక్క దృష్టి సప్తమ బావములో స్థితిలో వున్న శని యొక్క రాశిపై వుండిన ఎడల వ్యక్తిలో పనిచేయవలననే కోరిక అధికముగా వుండును. స్త్రీలపై వీరికి విశెష ఆకర్షణ కలిగి వుండెదరు.

కర్కాటక లగ్నము యొక్క కుండలిలో లగ్నస్థ శని

కర్కాటక లగ్నము యొక్క కుండలిలో శని సప్తమాదిపతి మరియు అష్టమాదిపతిగా వుండును. ఈ లగ్నము యొక్క కుండలిలో శని అశుభ, కష్టకారి మరియు పీడాదాయకముగా వుండును. ఈ రాశిలో శని లగ్నస్థముగా వుండుట వలన వ్యక్తి అరోగ్యములో ఒడిదుడుకులు వుండును. వ్యక్తి సన్నగా వుండును. వీరి స్వభావము విలాస వంతమైనదిగా వుండును. వీరు సుఖమును కోరుకునే వారుగా వుండెదరు. అధిక బాగ ధనమును విలాస వంతమైన విషయములకై ఖర్చుచేయుదురు. లగ్నస్థ శని తల్లి దండ్రుల సుఖములో లోపమును కలిగించును. సంతాన విషయములో కూడా ఇది కష్టకారిగా వుండును. శని దాని యొక్క పూర్ణ దృష్టి వలన తృతీయ, సప్తమ మరియు దశమ బావమును చూస్తున్నాడు. దాని కారణముగా సోదురుల నుండి మరియు కుటుంబస్తుల నుండి విశేష సంయోగము లభించక పోవచ్చును. గృహస్థ జీవితములో లోపము ఏర్పడవచ్చును. శని ఆర్ధిక లాభమును ప్రదానించిన ఎడల ఖర్చులకు కూడా అనేక మార్గమును తెరువబడును. నేత్ర సంబందమైన రోగములకు కూడా అవకాశములు వున్నవి.

కర్కాటక లగ్నము యొక్క కుండలిలో లగ్నస్థ రాహువు

రాహువు కర్కాటక లగ్నము యొక్క కుండలిలో ప్రధమ బావములో స్థితిలో వుండుట కారణముగా వ్యక్తిని విలాస వంతునిగా చేయును. వీరి మనస్సు సుఖ బోగముల పట్ల ఆకర్షితులు కాగలరు. వ్యాపారములో సఫలతను పొందుటకు వీరు కఠినముగా పరిశ్రమించవలసి వుండును. ఉద్యోగములో వీరికి తొందరగా సఫలత లభించగలదు. రాహువు వారి ఏడవ దృష్టి నుండి సప్తమ బావమును చూడును దానివలన వైవాహిక జీవితము అశాంతిగా వుండును. జీవిత బాగస్వామి నుండి ఆప్యాయత లబించదు. భాగస్వామి నుండి నష్టము కలుగును.

కర్కాటక లగ్నము యొక్క కుండలిలో లగ్నస్థ కేతువు

కర్కాటక లగ్నము యొక్క కుండలిలో ప్రధమ బావములో వున్న కేతువు అరోగ్యమును ప్రభావితము చేయును. కేతువు యొక్క దశ సమయములో అరోగ్య విషయములో వొడిదుడుకులు ఏర్పడును. సమాజములో మానవ సంబంధ విషయాల పట్ల విషేశ అభిరుచి కలిగి వుండెదరు. వీరికి గుప్త శత్రువులు కూడా వుండును. దానివలన సమస్యలను ఎదుర్కొన వలసి వచ్చును. సప్తమ బావములో కేతువు యొక్క దృష్టి ఈ బావము యొక్క ఫలితములను బలహీన పరుచును. ఈ బావములో కేతువు వలన పీడించబడి వుండుట వలన వైవాహిక జీవితములోని సుఖములలో లోపము ఏర్పడును.

Monday 17 February 2020

మిధున లగ్నములో నవగ్రహముల ప్రభావము :

రాశి చక్రము యొక్క మూడవ రాశి మిధునము. మీ కుండలిలో లగ్నబావములో ఈ రాశి వుండిన ఎడల మీ లగ్నము మిధునముగా చెప్పబడును. మీ లగ్నముతో పాటు ప్రధమ బావములో ఏ గ్రహమైతే వుండునో అది మీ లగ్నమును ప్రభావితము చేయును. మీ జీవితములో జరిగే అన్ని విషయములకు ఈ లగ్నములో వున్న గ్రహముల ప్రభావము కూడా వుండవచ్చును.

మిధున లగ్నములో సూర్యుడు

మిధున లగ్నము యొక్క కుండలిలో లగ్నములో వున్న సూర్యుడు వారి మిత్ర రాశిలో వుండును సూర్యుని యొక్క ప్రభావము కారణముగా వ్యక్తి యొక్క ముఖముపై రక్తిత్వము ప్రకాశవంతముగా వుండును. వ్యక్తి అందముగాను మరియు ఆకర్షణీయముగాను వుండును. వీరి వ్యక్తిత్వము ఉదార స్వభావము కలిగి వుండును. వీరిలో సాహసము, ధైర్యము మరియు పురుషార్ధము అధికముగా వుండును. బాలావస్థలో వీరు అనేక రోగములను ఎదుర్కొన వలసి వచ్చును. యువావస్థలో కష్టములను మరియు సమస్యలను ఎదుర్కొన వలసి వచ్చును. వృద్దావస్థ సుఖము మరియు ఆనందమయముగా వుండును. వీరికి ఆర్దిక సమస్యలను ఎదుర్కొన వలసి వచ్చును. సప్తమ బావములో సూర్యుని దృష్టి వుండుట కారణముగా వివాహములో ఆటంకములు కలుగును. వైవాహిక జీవితము అశాంతికరముగా వుండును.

మిధున లగ్నములో చంద్రుడు

మిధున లగ్నములో చంద్రుడు ధన బావమునకు అధిపతి కాగలడు. ఈ రాశిలో చంద్రుడు లగ్నస్థముగా వుండుట కారణముగా వ్యక్తి ధనవంతునిగాను మరియు సుఖముగాను వుండును. వీరు అస్థిర వ్యక్తిత్వము కలవారై వుండెదరు. దుష్టస్వబావము కలిగి వుండును. మనోభలము అధికముగా వుండి వాణి కోమలముగా వుండును. వీరి వ్యక్తిత్వములో మెరటితనము మరియు అభిమానము కూడా సమపాల్లలో వుండును. సంగీతము పట్ల ప్రేమ కలిగి వుండెదరు. లగ్నములో వున్న చంద్రుడు సప్తమ బావమును చూస్తున్నాడు. అందువలన అందముగాను మరియు ఙ్ఞానం గల జీవిత బాగస్వామి లభించగలదు. గృహస్థ జీవితము సుఖమయముగా వుండును. ఆర్ధిక స్థితి బాగుండును ఎందుకంటే ధన సేకరణ చేయుటలో తెలివిగా ప్రవర్తించెదరు. చంద్రునితో పాటు పాప గ్రహములు వుండుట కారణముగా చంద్రుని శుభత ప్రబావితము కాగలదు. అందువలన చంద్రుని ప్రభలముగా చేయుటకు తప్పక ఉపాయములను చేయవలెను.

మిధున లగ్నములో కుజుడు

కుజుడు మిధున లగ్నము యొక్క కుండలిలో శత్రువుగా వుండును. ఇది ఈ రాశిలో షష్టమాదిపతి మరియు ఏకాదశాదిపతి కాగలడు. మిధున లగ్నములో కుజుడు లగ్నస్థుడుగా వుండిన శక్తి మరియు పరాక్రమము కలిగి వుండెదరు. జీవితములో అస్థిరత అధికముగా వుండును. వ్యక్తి యాత్రలను ఆనందించువాడిగా వుండును. సేన లేదా రక్షణా విభాగములో వీరికి సఫలత లభించగలదు. వీరికి తల్లి దండ్రుల నుండి పూర్తి సుఖము లభించక పోవచ్చును. శత్రువుల వలన కూడా వీరికి కష్టము కలుగును. సప్తమ బావములో కుజుని యొక్క దృష్టి కారణముగా గృహస్థ జీవితములో అనేక విధములైన కష్టములు ఎదురుకాగలవు. జీవిత బాగస్వామి ఆరోగ్య సంబందమైన సమస్యలతో పీడించబడగలడు.

మిధున లగ్నములో బుధుడు

బుధుడు మిధున లగ్నము యొక్క అధిపతి. ఈ లగ్నములో ఇది శుభ మరియు కారక గ్రహము. మిధున లగ్నములో ప్రధమ బావములో వున్న బుధుడు వ్యక్తిని బుద్ధివంతునిగాను, వాక్ పుష్టి మరియు ఉత్తమ స్మరణ శక్తిని ప్రదానించును. వీరు ప్రాకృతికముగానే కుశల వ్యాపార మెలుకవలను తెలిసుకొని వుండెదరు. ఆర్ధిక స్థితి సామాన్యరూపముగా బాగుండును ఎందుకంటే వీరికి ధన సంపాదనకు ఒకే మార్గములో నడిచే అలవాటు లేకుండును. ఒకటి కన్నా ఎక్కువ మార్గముల నుండి ధన సంపాదన చేయుట వీరి వ్యక్తిత్వము యొక్క గుణముగా చెప్పబడును. వీరు లేఖకునిగా, రచయితగా లేదా సంపాదకునిగా సఫలతను పొందగలరు. భూమి, భవనము మరియు వాహన సుఖము లభించగలదు. జీవిత బాగస్వామి నుండి సమ్యోగము మరియు ప్రసన్నత లభించగలదు.

మిధున లగ్నములో గురువు

మిధున లగ్నములో గురువు సప్తమ మరియు దశమ బావము యొక్క అధిపతి కాగలడు. రెండు కేంద్రములకు అధిపతిగా వుండుట వలన మిధున లగ్నములో గ్రహము శత్రు గ్రహముగా వుండును. ప్రధమ బావములో గురువుతో పాటు బుధుడు వుండిన ఎడల ఇది గురువు యొక్క అశుభ ప్రభావములను తగ్గించును. గురువు యొక్క లగ్నస్థముగా వుండుట వలన వ్యక్తి అందముగాను మరియు తెల్లగాను వుండును. గురువు యొక్క ప్రభావము కారణముగా వీరికి జలుబు, దగ్గు వంటి సమస్యలు వుండగలవు. చతురత, ఙ్ఞానం మరియు సత్య ఆచరణలు కలిగిన వ్యక్తిగా వుండెదరు. వీరికి సమాజములో గౌరవ మర్యాదలు లభించును. గురువు యొక్క విషేశత ఏమనగా అది దాని సంబందమైన విషయములలో విశెషశుభతను ప్రదానించును మరియు పంచమ, సప్తమ మరియు నవమ బావమునకు సంబందించిన విషయములలో వ్యక్తికి అనుకూల పరిణామములు ప్రాప్తించును. యది లగ్నములో గురువుతో పాటు పాప గ్రహము వుండిన ఎడల పరిణామములు కష్టకరముగా వుండును.

మిధున లగ్నములో శుక్రుడు

మిధున లగ్నము యొక్క కుండలిలో శుక్రుడు పంచమాదిపతి మరియు దశమాదిపతి కాగలడు. త్రికోణాదిపతిగా వుండుట కారణముగా ఈ లగ్నములో శుక్రుడు యోగకారక గ్రహము కాగలడు. లగ్నములో మిత్ర రాశిలో వున్న శుక్రుడు శుభప్రభావములను ఇచ్చు వాడగును. దానివలన కుండలిలో ఈ గ్రహస్థితి వున్న వాళ్ళు చూడటానికి సన్నముగా వున్న ఆకర్షణీయముగా వుంటారు. ఆర్ధిక స్థితి బాగుండును. బౌతిక సుఖముల పట్ల వీరు అత్యంత అభిరుచి కలిగి వుండెదరు మరియు సుఖ సంతోషముల కొరకు ధనమును ఖర్చు చేయుట వీరికి ఇష్టముగా వుండును. సమాజములో గౌరనీయముగా వుండెదరు. సప్తమ బావములో దీని దృష్టి వుండుట కారణముగా వైవాహిక జీవితములో జీవిత బాగస్వామి పట్ల ప్రేమ అబిమానములు వుండును.

మిధున లగ్నములో శని

మిధున లగ్నము యొక్క కుండలిలో శని అష్టమ మరియు నవమ బావము యొక్క అధిపతిగా వుండును. త్రికోణ బావము యొక్క అధిపతిగా వుండుట కారణముగా శని అష్టమ బావమును యొక్క దోషములను దూరము చేయును. మరియు కారకముగా వాటి పాత్రను పాటించును. మిదున లగ్నము యొక్క కుండలిలో లగ్నములో వున్న శని ఆరోగ్యముపై కొంతవరకు సమస్యలను కలిగించును. దీని ప్రబావము కారణముగా వ్యక్తి సన్నగా వుండి వాతము, పిత్తము మరియు చర్మరోగముల వలన సమస్యలను కలిగి వుండెదరు. ఇది భాగ్యమును ప్రభలముగా చేయును మరియు ఈశ్వరుని పట్ల శ్రద్దను కలిగించును. లగ్నస్థ శని యొక్క దృష్టి సప్తమ బావములో వుండుట కారణముగా వ్యక్తికి కామ ప్రదమైన కోరికలు అధికముగా వుండును. దశమ బావముపై శని యొక్క దృష్టి ప్రభుత్వ పక్షము నుండి దండనను మరియు కష్టములను కలిగించును. తల్లి దండ్రుల సంబందములలో కష్టములను కలిగించును. శని వ్యక్తిని పరిశ్రమిగా చేయును.

మిధున లగ్నములో రాహువు

రాహువు మిధున లగ్నములో మిత్రరాశిలో వుండును. ఈ రాశిలో రాహువు ఉచ్చరాశిలో వుండుట కారణముగా వ్యక్తిని తెలివిగల వాడిగాను మరియు కార్య కుశలత గల వ్యక్తిగాను చేయును. వ్యక్తి వారి పని చేపట్టులలో తెలివిగా వుండెదరు. వీరిలో సాహసము అధికముగా వుండును. లగ్నస్థ రాహువు వ్యక్తిని ఆకర్షణీయముగాను మరియు అరోగ్యకరమైన శరీరమును ప్రదానించును. మిదున లగ్నము గల స్త్రీలకు లగ్నస్థ రాహువు సంతానము యొక్క సందర్బములో కష్టములను కలిగించును. రాహువు వీరి వైవాహిక జీవితములో కలహములను ఉత్పన్నము చేయును.

మిధున లగ్నములో కేతువు

కేతువు మిధున లగ్నము యొక్క కుండలిలో వుండుట కారణముగా స్వాబిమానములో లోపము ఏర్పడవచ్చును. స్వతంత్ర రూపముగా పనిచేయక ఇతరులతో పాటు పనిచేయుటలో ఎక్కువ ఆసక్తి కలిగి వుండెదరు. వ్యాపారములో కోరిక, మరియు ఉద్యోగము చేయుట వీరికి ఇష్టము. వీరు స్వార్ధ ప్రవృత్తి కలిగిన వారై వుండెదరు. కేతువు యొక్క ప్రబావము కారణముగా వాతము మరియు పిత్తము వంటి వ్యాదులు వీరిని బాదించును. కామ ప్రదమైన కోరికలు వీరికి ప్రభలముగా వుండును. వైవాహిక జీవితము వొడిదుడుకులలో వుండును.

Sunday 16 February 2020

వృషభ లగ్నములో లగ్నస్థ నవగ్రహముల యొక్క ఫలితములు

రాశి చక్రములో రెండవ రాశి వృషభము. మీ కుండలిలో లగ్న భావములో ఈ రాశి వుండిన ఎడల మీ లగ్నము వృషభముగా చెప్పబడును. మీ లగ్నముతో బాటు మొదటి స్థానములో ఏ గ్రహమైతే వున్నదో అది మీ లగ్నమును ప్రభావితము చేయును.

వృషభ లగ్నములో లగ్నస్థ సూర్యుడు

ఈ లగ్నములో సూర్యుడు కారక గ్రహము మరియు చతుర్ధాధిపతి కాగలడు . లగ్న భావములో సూర్యుడు వారి శత్రువైన శుక్రుని రాశిలో స్థితిలో వుండి శుభ ఫలితములలో లోపములను కలిగించును. తల్లి దండ్రుల నుండి వీరికి సామాన్య సుఖము లభించును. ప్రభుత్వ రంగము నుండి కూడా వీరికి సామాన్యముగా వుండును. సప్తమ బావములో సూర్యుని దృష్టి వుండుట కారణముగా జీవిత బాగస్వామితో మతబేదములు దాంపత్య జీవితములో అశాంతి కష్టములు కలుగును. ద్విపత్నీ యోగమును కూడా కలిగించును. ఉద్యోగములో అస్థిరత్వము మరియు సహోద్యోగులతో సమస్యలను ఎదుర్కొనవలసి వచ్చును. ఈ లగ్నములో ప్రధమ బావములో సూర్యుడు వుండుట కారణముగా చాలా తక్కువ వయస్సులోనే తలవెండ్రుకలు రాలిపోవును.

వృషభ లగ్నములో లగ్నస్థ చంద్రుడు

చంద్రుడు ఈ లగ్నములో ఉచ్చ స్ధితిలో వుండుట కారణముగా ఇది సాదారణముగా ఉత్తమ ఫలితములను ఇచ్చును. లగ్నస్థ చంద్రుని ప్రభావము కారణముగా మనోభలము మరియు ఆత్మ భలము ఎల్లప్పుడూ వుండును. బంధు మిత్రుల నుండి సమ్యోగము మరియు సుఖము ప్రాప్తించగలదు. మాట్లాడే పద్దతి మధురతతో కూడినదై వుండును. చంద్రుడు పూర్ణ దృష్టి నుండి సప్తమ బావమును చూస్తున్నాడు. చంద్రుని ఈ దృష్టి జీవిత బాగస్వామి విషయములో ఉత్తమ పరిణామ దాయకముగా వుండును. జీవిత భాగస్వామి అందముగాను మరియు ఆకర్షణీయముగాను వుండును. వైవాహిక జీవితము సామాన్య రూపముగా సుఖ మయముగా వుండును. ఆర్ధిక స్థితి బాగుండును.

వృషభ లగ్నములో లగ్నస్థ కుజుడు

వృషభ లగ్నము యొక్క కుండలిలో కుజుడు సప్తమాదిపతి మరియు ద్వాదదశాదిపతిగా వుండును. ఈ లగ్నము సామాన్యముగా వుండును. ప్రధమ బావములో వున్న కుజుడు ఆకర్షణీయమైన మరియు అందమైన శరీరమును ప్రదానించును. వీటి ప్రభావము వలన వ్యక్తి గౌరవనీయకముగా వుండును. ఆత్మవిశ్వాసము అధికముగా వుండును. ఈ లగ్నములో కుజుడు సప్తమాదిపతి మరియు ద్వాదశమాదిపతిగా వుండుట వలన సహొద్యోగుల నుండి మరియు ఉద్యోగము నుండి లాభము కలుగును. దేశ విదేశములు వెల్లే అవకాశములు కలుగవచ్చును. లగ్నములో స్థితిలో వున్న కుజుని దృష్టి చతుర్ధ బావముపై వుండును. దాని ప్రబావము కారణముగా భూమి, భవనము, వాహనము మరియు తల్లి యొక్క సుఖములలో లోపము ఏర్పడగలదు. సప్తమ బావములో ధృష్టి సంబందము వుండుట కారణముగా వైవాహిక జీవితములో వొడిదుడుకులు వుండును. వీరికి సంతానము మరియు భార్య కారణముగా కష్టములు ఏర్పడును. దెబ్బ తగులుట మరియు రక్త వికారమునకు అవకాశములు వున్నవి. వీరికి ఖర్చుల స్థితిని కూడా ఎదుర్కొనవలసి వుండును.

వృషభ లగ్నములో లగ్నస్థ బుధుడు

బుధుడు వృషభ లగ్నము యొక్క కుండలిలో యోగకారక గ్రహముగా వుండును. ఈ లగ్నములో ద్వితీయాదిపతి మరియు పంచమాదిపతిగా వుండి శుభపరిణామములు కలిగించును. ప్రధమ బావములోని బుధుడు బుద్ధివంతునిగాను మరియు ధనవంతునిగాను చేయును. వీరికి వ్యాపారములో మంచి సఫలత లభించును. లగ్నస్థ బుధుడు వినోద స్వబావము గల వ్యక్తిత్వమును ప్రదానించును. ఇటువంటి వ్యక్తి జీవితమును ఆనందముగా మరియు ఉల్లాసముగా జీవించవలననే కోరిక కలిగి వుండెదరు. వీరికి ప్రభుత్వ పక్షము నుండి అనుకూలత లబించగలదు. జీవిత భాగస్వామి యొక్క సందర్బములో బుధుడు మంగళకారిగా వుండును. లగ్నస్థ బుధుడు అందమైన మరియు బుద్దివంతుడైన జీవిత భాగస్వామిని ప్రదానించును. వ్యాపారము మరియు ఉద్యోగ రంగములో లాభములను కలిగించును. బాగస్వామ్యకత్వము చాలా ఎక్కువ ఫలదాయకముగా వుండును.

వృషభ లగ్నములో లగ్నస్థ గురువు

గురువు వృషభ లగ్నములో అష్టమ మరియు ఏకాదశ బావము యొక్క అధిపతి కాగలడు. శత్రు గ్రహము యొక్క రాశిలో స్థితిలో వున్న గురువు బలహీన ఫలితములను ఇచ్చును. వ్యక్తికి ఆరోగ్య సంబంద సమస్యలను ఎదుర్కొనవలసి వచ్చును. జీవనోపాయ విషయములో సమస్యలను ఎదుర్కొన వలసి వుండును. వీరికి మానసిక సమస్యలను కూడా ఎదుర్కొనవలసి వుండును. పరిశ్రమకు తగ్గ ప్రతిఫలము లభించుట కష్టము. లగ్నములో స్థితిలో వున్న గురువు పంచమ, సప్తమ మరియు నవమ బావమును చూస్తున్నాడు. గురువు యొక్క ఈ దృష్టి కారణముగా వ్యక్తి యొక్క బాగ్యము బలహీనముగా వుండును. గురువు వీరికి ఙ్ఞానము, సంతానము మరియు ధర్మమును ప్రభావితము చేయును. సప్తమ బావములో గురువు యొక్క దృష్టి వుండుట కారణముగా వైవాహిక జీవితములో జీవిత భాగస్వామి నుండి అనుకూల పరిణామములు లభించవు.

వృషభ లగ్నములో లగ్నస్థ శుక్రుడు

శుక్రుడు వృషభ లగ్నము యొక్క కుండలిలో లగ్నాదిపతి మరియు షష్టమాదిపతిగా వుండును. లగ్నస్థముగా వుండి వ్యక్తిని అందముగాను మరియు ఆకర్షణీయముగాను చేయును. ఇది వ్యక్తికి ఆత్మ భలమును మరియు ఆత్మ విశ్వాసమును ప్రదానించును. షష్టమాదిపతి శుక్రుడు రోగములను, వ్యాదులను ఇచ్చును. శుక్ర దశ యొక్క సమయములో ఆరోగ్యములో వొడిదుడుకులు వుండగలవు. ప్రధమ బావములో స్థితిలో వున్న శుక్రుడు సప్తమ బావమును చూస్తున్నాడు దానివలన బౌతిక సుఖము లభించగలదు. వైవాహిక జీవితము ప్రేమపూరితముగా వుండును. ఉద్యోగములో ఉత్తమత వుండును. బ్యాగస్వామి మరియు మిత్రుల సమ్యోగము లభించగలదు.

వృషభ లగ్నములో లగ్నస్థ శని

వృషభ లగ్నము యొక్క కుండలిలో శని నవమ మరియు దశమ బావము యొక్క అధిపతిగా వుండును. ఈ రాశి శని యొక్క మిత్ర రాశి. ఈ రాశిలో శని యోగకారక గ్రహము కాగలడు. లగ్నములో వృషభ రాశిలో వున్న శని వ్యక్తిని అత్యదిక పరిశ్రమ మరియు కార్యకుశలత కలవాడుగా చేయును. శారీరకముగా అలసిపోయి పుష్టిత్వము ఇచ్చును. ప్రభుత్వ రంగము నుండి మరియు తండ్రి నుండి సమ్యోగమును మరియు లాభమును ప్రదానించును. ప్రధమ బావములో స్థితిలో వున్న శని యొక్క దృష్టి తృతీయ, సప్తమ మరియు దశమ బావముపై వుండును. వీరు బాగ్యోదయము జన్మస్థానము నుండి దూరముగా కలుగును. మెట్టింటి వారి నుండి లాభము ప్రాప్తించును. జీవిత భాగస్వామి నుండి సమ్యోగము ప్రాప్తించును. శని యొక్క దృష్టి వలన వైవాహిక జీవితములో విల్లంఘములు ఏర్పడును మరియు బంధు మిత్రుల నుండి సమ్యోగము లభించదు.

వృషభ లగ్నములో లగ్నస్థ రాహువు

రాహువు వృషభ లగ్నము యొక్క కుండలిలో ప్రధమ బావములో స్థితిలో వుండుట కారణముగా రాహువు యొక్క గోచర కాలములో ఆరోగ్య సంబందమైన సమస్యలను ఎదుర్కొనవలసి వుండును. రాహువు కార్యములలో బాదను కలిగించును మరియు అవరోదములను శృష్టించును. లగ్నస్థ రాహువు వ్యక్తిని గుప్త విద్యలలో పారంగితునిగా చేయును. ఈ బావములో స్థితిలో వున్న రాహువు వైవాహిక జీవితమును కల్యాణ పూరితముగా చేయును.

వృషభ లగ్నములో లగ్నస్థ కేతువు

వృషభ లగ్నము యొక్క కుండలిలో లగ్న బావములో స్థితిలో వున్న కేతువు వ్యక్తిని అల్పశిక్షను కలిగిన ఆశావాదిగా చేయును. దానితో పాటు పరిశ్రమించే వ్యక్తిగా చేయును. వారి పరిశ్రమ మరియు లగ్నము కారణముగా అసంభవ పనులను కూడా సంభవకరమైనవిగా చేయును. వీరి పరిశ్రమి అయినప్పటికీ వీరిలో సాహస లోపము కలిగి వుండును. స్వతహాగా విచారణ చేసి వీరి పనులను పూర్తిచేయుట కఠినకరముగా వుండును. జూదము, లాటరీ మరియు పందెములపై వీరి ధనము నష్టము కలుగును.

Friday 14 February 2020

మేష లగ్నములో లగ్నస్థ నవ గ్రహముల యొక్క ఫలితములు :

మేష లగ్నము యొక్క అధిపతి కుజుడు. ఈ లగ్నములో కుజుడు లగ్నాదిపతి మరియు అష్టమాదిపతిగా వుండును. గురువు, సూర్యుడు, చంద్రుడు ఈ లగ్నములో కారక గ్రహము యొక్క భూమికత్వమును నిర్వహించును. బుధుడు, శుక్రుడు మరియు శని మేష లగ్నములో అకారకమైన మరియు అశుభ గ్రహము యొక్క ఫలితములను ఇచ్చును. కుండలిలో లగ్న భావములో స్థితిలో వుండి గ్రహములు జీవితాంతము వ్యక్తిని ప్రభావితము చేయును.

మేష లగ్నములో లగ్నస్థ సూర్యుడు
మేష లగ్నము యొక్క కుండలిలో సూర్యుడు పంచమ బావము యొక్క అధిపతి కాగలడు. త్రికోణమునకుఅధిపతి అగుట వలన సూర్యుడు వీటికి శుభ కారక గ్రహము కాగలడు. లగ్నములో సూర్యుని యొక్క ఉచ్చస్థితిలో వ్యక్తి అందముగాను, ఆకర్షణీయముగాను వుండును. వీరిలో స్వాభిమానము మరియు ఆత్మ విశ్వాసము వుండును. విధ్య యొక్క స్థితి బాగుండును. జీవిత సరళిలో తండ్రితో వివాదములు కలిగే అవకాశములు వున్నవి. ఆర్ధిక స్థితి బాగుండును. సూర్యుడు పాప గ్రహములతో పీడించబడని ఎడల ప్రభుత్వము మరియు ప్రభుత్వ పక్షము నుండి లాభము కలుగుటకు అవకాశములు వుండును. సూర్యుని ప్రభావము వలన సంతాన సుఖము ప్రాప్తించగలదు. సూర్యుడు తన యొక్క పూర్ణ దృష్టిని సప్తమ బావములో స్థితిలో వున్న శుక్రుని తులా రాశిని చూస్తున్నాడు. దీని ప్రభావము కారణముగా అందమైన జీవిత భాగస్వామి లభించగలడు. జీవిత భాగస్వామి నుండి సమ్యోగము లభించగలదు. కాని కొన్ని సమయములలో గృహస్థ జీవితము బాదించబడును.

మేష లగ్నములో లగ్నస్థ చంద్రుడు
చంద్రుడు మేష లగ్నము యొక్క కుండలిలో సుఖదాయిగా వుండును . ప్రధమ బావములో దీని యొక్క స్థితి వుండుట కారణముగా శాంత స్వబావము కలిగి వున్నప్పటికి కొంటెతనము కలవారై వుండెదరు. కల్పనాశీలత మరియు బోగ విలాశములను అనుభవించే కోరిక కలవారై వుండెదరు. వీరికి తల్లి నుండి మరియు తల్లి పక్షము నుండి సమ్యోగము ప్రాప్తించగలదు. భూమి, భవనము మరియు వాహన సుఖము ప్రాప్తించగలదు. ప్రకృతి మరియు సౌదర్యముపై వీరు ఆకర్షితులు కాగలరు. చలి వలన కలిగే దగ్గు, జలుబుతో పీడించబడగలరు. సంబంద రోగములకు కూడా అవకాశములు వున్నవి. ఆర్ధిక స్థితి బాగుండును. ప్రభుత్వము మరియు ప్రభుత్వ పక్షము నుండి లాభము కలుగును. సప్తమ బావములో తుల రాశిలో స్థితిలో వున్న చంద్రుని ధృష్టి కారణముగా వీరి జీవిత బాగస్వామి గుణవంతుడు, కళాప్రేమి మరియు సహయోగి కాగలడు.

మేష లగ్నములో లగ్నస్థ కుజుడు
మేష లగ్నము యొక్క కుండలిలో కుజుడు లగ్నాదిపతి మరియు అష్టమాదిపతి కాగలడు. లగ్నాదిపతి అగుట వలన కుజుడు అష్టమ బావము యొక్క దోషము నుండి ముక్తి పొందగలడు. కుజుడు లగ్నస్థడగుట వలన వ్యక్తి కండలు తిరిగి మరియు అరోగ్యముగా వుంటాడు. వీరిని పరాక్రమి మరియు సాహస వంతులుగా చేయును. వీరిలో కోపము మరియు మొరటితనము కలిగి వుండెదరు. వారి ఆత్మ భలము వలన కఠినమైన పనులను కూడా పూర్తిచేయు సామర్ధ్యము కలవారై వుండెదరు. సమాజములో గౌరవనీయముగాను మరియు ప్రతిష్ట కలిగి వుండెదరు. బలహీనుల పట్ల వీరి హృదహములో సానుభూతి వుండగలదు. కుజుడు వారి పూర్ణ దృష్టి వలన చతుర్ధ, సప్తమ మరియు అష్టమ బావమును చూసును. దీని కారణముగా భూమి మరియు వాహన సుఖము లభించగలదు. దుర్ఘటన కలుగుటకు కూడా అవకాశములు వున్నవి. జీవిత భాగస్వామితో మతబేదములు కలుగును అందువలన వైవాహిక జీవితములోని సుఖము ప్రభావితము కాగలదు. యది కుజుడు దూషించబడి వుండిన ఎడల సుఖములో లోపము ఏర్పడగలదు.

మేష లగ్నములో లగ్నస్థ బుధుడు
బుధుడు మేష లగ్నము యొక్క కుండలిలో అశుభ గ్రహముగా వుండును. ఇది ఈ లగ్నము యొక్క కుండలిలో తృతీయ మరియు ఆరవ బావము యొక్క అధిపతి కాగలడు. బుధుడు లగ్నములో విరాజితమై వున్నప్పుడు వ్యక్తిని బుద్దివంతునిగాను మరియు ఙ్ఞానిగాను చేయును. శిక్షా సంబందమైన అభిరుబి వుండును. లేఖకునిగా లేదా కళల క్షేత్రములో మంచి అవకాశములు వుండును. బుధుని దశావదిలో బందుమిత్రులతో వివాదములు మరియు మనస్సులో అశాంతి కలుగును. షష్టేశుడైన బుధుని కారణముగా ఉదర సంబందమైన రోగములు, మూర్చవ్యాది, ఆజన్మ రోగములు మరియు మతిమరుపు సంబందమైన వ్యాదులు అవకాశములు వున్నవి. వ్యాపారములో వీరికి మంచి సఫలత లభించగలదు. సప్తమ బావములో బుధుని యొక్క దృష్టి సంతానము యొక్క సంబందములో కష్టములను కలిగించును. జీవిత భాగస్వామి యొక్క ఆరోగ్యముపై ప్రభావితమును చూపును. సప్తమస్త తుల రాశిపై బుధుని యొక్క దృష్టి కారణముగా జీవిత భాగస్వామి గుణవంతుడు కాగలడు. వైవాహిక జీవితము సామాన్యముగా వుండును.

మేష లగ్నములో లగ్నస్థ గురువు
మేష లగ్నము యొక్క కుండలిలో గురువు భాగ్యాదిపతి మరియు వ్యయాదిపతిగా వుండును. ద్వాదశ బావము యొక్క అధిపతిగా వుండుట వలన కారణములేని మరియు అశుభ ఫలదాయిగా వుండును. కాని త్రికోణము యొక్క స్వామిగా వుండుట వలన దీని యొక్క అశుభ ప్రభావము దూరము కాగలదు. మరియు ఇది శుభ కారక గ్రహము కాగలదు. మేష లగ్నము యొక్క కుండలిలో గురువు లగ్నస్థముగా వుండుట వలన వ్యక్తి విద్వాంసుడు మరియు ఙ్ఞాని కాగలడు. వీరి వాణి ప్రభావ శాలి మరియు ఓజస్వమైనదిగా వుండును. గురువు వీరిని సమాజములో సమానితులు గాను మరియు ప్రతిష్టాత్మకమైన వారి గాను చేయును. లగ్నస్థ గురువు, పంచమ, సప్తమ మరియు నవమ బావమును చూడును. దీని కారణముగా సంతాన సుఖము లభించగలదు. దార్మిక కార్యములలో అభిరుచి కలిగి వుండును. శత్రు గ్రహము యొక్క తుల రాశితో దృష్టి సంబందము వుండుట కారణముగా జీవిత బాగస్వామితో మనస్సు బాదించబడి వుండును.

మేష లగ్నములో లగ్నస్థ శుక్రుడు
శుక్రుడు మేష లగ్నము యొక్క కుండలిలో ద్వితీయాదిపతి మరియు సప్తమాదిపతి కాగలడు. ఈ లగ్నము యొక్క కుండలిలో ఇది కష్టకారి మరియు రోగకారకమైన గ్రహముగా పాత్రను నిర్మానించును. లగ్నములో దీని ఉపస్థితి కారణముగా వ్యక్తికి కనపడడానికి అందముగా వున్నా అరోగ్య సంబందమైన సమస్యలను కలిగి వుండును. శుక్రుని దశావదిలో వీరికి విషేశకరమైన కష్టములు కలుగును. విపరీత లింగపు వ్యక్తిపై వీరు ఆకర్షితులు కాగలరు. ఈ ఆకర్షణ కారణముగా వీరికి కష్టములు కూడా కలుగును. ధన నష్టము కలుగును. సంగీతము మరియు కళల యందు వీరికి అభిరుచి అధికముగా వుండును. ప్రదమస్థముగా వుండి శుక్రుడు ప్రధమ బావములో స్వరాశి అయిన తుల రాశిని చూచును. దానివలన జీవిత భాగస్వామి వినోదకరమైన అలవాట్లు కలవారై వుండెదరు. వీరు ప్రేమ స్వభావము కలిగి వుండెదరు కాని వారి అలవాట్ల కారణముగా వైవాహిక జీవితము ప్రబావితము కాగలదు.

మేష లగ్నములో లగ్నస్థ శని
మేష లగ్నము గల కుండలిలో శని కర్మాదిపతిగా వుండును. ఈ లగ్నము యొక్క కుండలిలో శని యొక్క నీచస్థితి వుండుట కారణముగా వ్యక్తి సన్నగా మరియు కోపము కలవాడై వుండును. ధన స్థితి సామాన్యముగా వుండును. లగ్నాదిపతి శని తృతీయ సప్తమ మరియు దశమ బావములను పూర్ణ దృష్టితో చూస్తున్నాడు. దాని కారణముగా మిత్రులు మరియు బందువులతో కోరుకున్న సమ్యోగము లభించుటకు అవకాశములు తక్కువగా వున్నవి. ఉద్యోగ వ్యాపారములలో స్థిరత్వము లేకుండా వుండును. జీవిత బాగస్వామితో చెడు మనస్తత్వము కలుగ వచ్చును. యది శని శుభ గ్రహములో యుతి లేదా దృష్టి కలిగి వున్న ఎడల శుభ పరిణామములు కలుగగలదు. మేష లగ్నానికి లాభాధిపతిగా శని భాదకుడు కావటం వలన ఈ లగ్నం వారికి శని దశ అంతర్ధశలలో మానసికమైన చికాకులు, అనారోగ్య భాదలు, అన్ని రకాల బాధలు కలుగును.

మేష లగ్నములో లగ్నస్థ రాహువు
రాహువు మేష లగ్నము యొక్క కుండలిలో లగ్నస్థముగా వుండిన ఎడల వ్యక్తికి ఆత్మ విశ్వాసము అధికముగా వుండును. ఉదర సంబంద వ్యాదులతో కష్ట పడగలరు. జీవితములో చాలా సంఘర్షణము చేయ వలసి వుండును. ఉద్యోగ వ్యాపారములలో సఫలత కొరకు చాలా పరిశ్రమించవలసి వుండును. వ్యాపారము చేయవలననే కోరిక, ఉద్యోగములో అధిక సఫలత లభించును. ప్రదమస్థ రాహువు సప్తమ బావములో స్థితిలో వున్న తుల రాశిని చూస్తున్న ఎడల సోదరులు మరియు మిత్రుల నుండి అపేక్షిత సమ్యోగము లభించగలదు. జీవిత భాగస్వామి రోగముల వలన బాదించబడును. గృహస్థ జీవితము యొక్క సుఖము ప్రభావితము కాగలదు.

మేష లగ్నములో లగ్నస్థ కేతువు
మేష లగ్నము యొక్క కుండలిలో కేతువు లగ్నస్థముగా వుండిన ఎడల శారీరకముగా శక్తిశాలిగా వుండెదరు. సాదారముగా వీరు అరోగ్యముగా మరియు రోగములు ఏమీ లేనివారుగా వుండెదరు. వీరిలో సాహసము మరియు ఆత్మ విశ్వాసము వుండును. దానివలన శత్రు వర్గము బలయబీతితో వుండెదరు. సమాజములో గౌరవము మరియు ఖ్యాతి లభించగలదు. రాజనీతి యరియు కూటనీతి యందు సఫలత కలిగి వుండెదరు. మాతృ మరియు మాతృ పక్షము నుండి సమ్యోగము ప్రాప్తించగలదు. జీవిత భాగస్వామి మరియు సంతానము నుండి కష్టము యొక్క అనుభూతి కలుగును.

                                https://youtube.com/shorts/hXs7ylVV_Rs?si=eAVlfsOGtiuuLmaF