Thursday 30 April 2020

మీన లగ్నములో లగ్నస్థ నవగ్రహముల ప్రభావము :

మీన లగ్నము యొక్క అధిపతి గురువు. ఈ లగ్నములో సూర్యుడు, చంద్రుడు, కుజుడు మరియు గురువు యోగకారక గ్రహములుగా వుండును. బుధుడు, శుక్రుడు మరియు శని ఈ లగ్నములో అవయోగ కారక గ్రహములుగా వుండి అశుభ ఫలితములను ఇచ్చును.

మీన లగ్నములో లగ్నస్థ సూర్యుని ప్రభావము

సూర్యుడు మీన లగ్నము యొక్క కుండలిలో షష్టమాదిపతిగా వుండును. షష్టమ బావములో వుండుట వలన సూర్యుడు మీన లగ్నములో లగ్నస్థముగా వుండి సూర్యుడు వ్యక్తిని ఆరోగ్యముగాను మరియు నిరోగిగాను చేయును. ఎవరి కుండలిలో అయితే ఈ స్థితి వుండునో వారు ఆత్మవిశ్వాసము గల పరిశ్రమి కాగలరు. ఏ కార్యమునైనా పూర్తి మనోబావముతో చేయుదురు. శత్రువులు మరియు విరోదుల నుండి బయపడరు. సూర్యుని పూర్ణ దృష్టి సప్తమ బావములో కన్యా రాశిపై వుండును. వ్యాపారము చేయవలననే కోరిక, ఉద్యోగములో సఫలత లభించగలదు. వైవాహిక జీవితములో జీవిత బాగస్వామితో ఒడిదుడుకుల కారణముగా గృహస్థ జీవితము ప్రభావితము కాగలదు.

మీన లగ్నములో లగ్నస్థ చంద్రుని ప్రబావము

మీన లగ్నము యొక్క కుండలిలో చంద్రుడు పంచమాదిపతి కాగలడు. ఈ లగ్నములో త్రికోణాదిపతిగా వుండుట వలన చంద్రుడు శుభ కారక గ్రహముగా వుండును లగ్నములో దీని స్థితి వ్యక్తికి సుఖముగాను మరియు శుభకరముగాను వుండును. చంద్రుని ప్రభావము కారణముగా వ్యక్తి అందము మరియు ఆకర్షణీయమునకు అధిపతి కాగలడు. వీరి మాటలు మధురమైనవిగా మరియు ప్రభావశాలిగా వుండును. వీరిలో ఆత్మ విశ్వాసము వుండును. అందువలన వీరు ఏ పనిని చేయుటకు బయపడరు. మాతృ పక్షము నుండి మరియు తల్లి నుండి సుఖమును మరియు స్నేహమును పొందగలరు. చంద్రుడు పూర్ణ దృష్టి ద్వారా బుధుని రాశి కన్యను చూస్తున్నాడు. దీని ప్రబావము కారణముగా జీవిత బాగస్వామి మరియు సంతానము నుండి సుఖము మరియు సమ్యోగము లభించగలదు. అనవసర మనస్పర్ధలు కలుగును.

మీన లగ్నములో లగ్నస్థ కుజుని ప్రబావము

కుజుడు మీన లగ్నము గల కుండలిలో ద్వితీయ మరియు నవమ బావము యొక్క అధిపతిగా వుండును. లగ్నములో దీని స్థితి కారణముగా వ్యక్తి శక్తిశాలి మరియు పరాక్రమిగా వుండును. ఇది వ్యక్తిని మొరటివాడిగా చేయును. అధ్యాత్మికములో వీరికి అభిరుచి అధికముగా వుండును. ఇతరులకు సహాయము చేయుతకు సిద్దముగా వుండెదరు. వీరి ఆర్ధిక స్థితి బాగుండును. ధనమును అనవసరముగా ఖర్చు చేయరు. వీరికి దృష్టి దోషము మరియు కర్ణ దోషము కలిగే అవకాశములు వున్నవి. ప్రధమ బావములో స్థితిలో వున్న కుజుడు చతుర్ధ, సప్తమ మరియు అష్టమ బావములను తన దృష్టితో ప్రభావితము చేయుచున్నాడు. ఈ ప్రభావము కారణముగా మిత్రులు మరియు బాగస్వాముల వలన లాభము కలుగును. తల్లి మరియు తల్లి సమానమైన మహిళతో స్నేహము మరియు సమ్యోగము లభించగలదు.

మీన లగ్నములో లగ్నస్థ బుధుని ప్రబావము

బుధుడు మీన లగ్నము యొక్క కుండలిలో చతుర్ధ మరియు సప్తమ బావము యొక్క అధిపతిగా వుండుట వలన కేంద్రాదాదిపతి దోషము కారణము వలన , నీచ స్ధానము వలన దూషించబడుదురు. లగ్నములో బుధుని స్థితి కారణముగా వ్యక్తి శ్రమకారకుడు కాగలడు. వారి పరిశ్రమ, బుద్ధి బలముల వలన ధనార్జన చేయగలరు. పితృ సంపత్తి నుండి వీరికి విషేశ లాభములు కలుగవు. స్త్రీల వలన వీరికి విషేశ లాభములు మరియు సమ్యోగము లభించగలదు. లగ్నములో వున్న బుధుడు సప్తమ బావములో స్వరాశిని చూస్తున్నాడు. దీని ప్రభావము కారణముగా వర్తక వ్యాపారములలో మిత్రుల మరియు బాగస్వాముల నుండి సమ్యోగము లభించగలదు. గృహస్థ జీవితము సుఖమయముగా వుండును. అనుకూలమైన జీవిత బాగస్వామి లభించును. వారి సమ్యోగము లభించగలదు.

మీన లగ్నములో లగ్నస్థ గురుని ప్రబావము

గురువు మీన లగ్నము యొక్క కుండలిలో లగ్నాదిపతి మరియు దశమాదిపతిగా వుండును. లగ్నాదిపతిగా వుండుట కారణముగా రెండు కేంద్ర బావములకు అధిపతిగా వున్నప్పటికి కూడా కేంద్రాదిపతి దోషము కలుగదు. లగ్నములో దీని స్థితి కారణముగా వ్యక్తి అత్యంత బాగ్యశాలిగా వుండును. శారీరకముగ అరోగ్యముగా మరియు అందముగా వుండును. వీరు దయా స్వభావము మరియు వినమ్రత కలిగి వుండును. దర్మముపై నమ్మకము కలిగి ఆత్మ విశ్వాసముతో పరిపూర్ణముగా వుండును. లగ్నస్థ గురువు తన యొక్క పూర్ణ దృష్టితో పంచమ, సప్తమ మరియు నవమ బావములను చూస్తున్నాడు. దీని ప్రభావము కారణముగా తండ్రి మరియు సంతానము నుండి సుఖము ప్రాప్తించగలదు. గృహస్థ జీవితము సుఖమయముగా వుండును.

మీన లగ్నములో లగ్నస్థ శుక్రుని ప్రబావము

శుక్రుడు మీన లగ్నము యొక్క కుండలిలో తృతీయ మరియు అష్టమ బావము యొక్క అధిపత్ కాగలడు. ఈ లగ్నము యొక్క కుండలిలో ఇది అవయోగ కారకముగా వుండును. ఈ లగ్నములో శుక్రుడు ప్రధమ బావములో వుండుట కారణముగా వ్యక్తి అందముగాను మరియు ఆకర్షణీయముగాను వుండును. వీరికి పిత్తవాత రోగము కలుగు అవకాశములు వుండును. వీరి పనిలో వీరు నిపుణత కలిగి వుండెదరు. వీరు సాహసము మరియు పరాక్రమము కలిగిన వారై వుండును. వీరు ఏ విషయమునైనా చాలా లోతుగా తెలుసుకొనుటకు ఆసక్తి కలిగిన వారై వుండును. తల్లి నుండి సుఖము మరియు సమ్యోగమునకు అవకాశములు తక్కువగా వున్నవి. సంతానము యొక్క సందర్బములో కష్టములు కలుగును. సప్తమ బావములో శుక్రుని పూర్ణ దృష్టి వుండుట వలన గృహస్థ జీవితము సుఖమయముగా వుండును.

మీన లగ్నములో లగ్నస్థ శని యొక్క ప్రబావము

శని మీన లగ్నము యొక్క కుండలిలో ఏకాదశాదిపతి మరియు ద్వాదశాదిపతిగా వుండును. లగ్న బావములో శని యొక్క ఉపస్థితి కారణముగా వ్యక్తి సన్నగా వుండును. శని యొక్క ప్రబావము కారణముగా వ్యక్తి నేత్ర రోగము వలన బాదించబడును. వీరికి స్వతంత్రముగా నిర్ణయములను తీసుకొనుట కష్టకరముగా వుండును. జీవితములో ప్రగతి కొరకు ఇతరుల సలహాలను పాటించవలసి వుండును. ధన సేకరణ యొక్క ప్రవృత్తి వుండును. షేర్, పందెములు మరియు లాటరీల వలన వీరికి అకస్మాత్తుగా లాభము కలుగును. లగ్నస్థ శని తృతీయ బావములో వృశ్చికరాశిని, సప్తమ బావములో కన్యా రాశిని మరియు దశమ బావములో గురుని రాశి ధనుస్సును చూస్తుండును. ఈ బావములలో శని యొక్క దృష్టి వలన మిత్రుల నుండి అపేక్షిత లాభము మరియు సమ్యోగము లభించదు. బాగస్వాముల నుండి హాని కలుగును. దాంపత్య జీవితములో కష్టములు ఉన్న సర్ధుకుపోతారు.

మీన లగ్నములో లగ్నస్థ రాహువు యొక్క ప్రభావము

రాహువు మీన లగ్నము యొక్క కుండలిలో లగ్నస్థముగా వుండుట వలన వ్యక్తి కండలు తిరిగిన ఆరోగ్యము కలిగి వుండును. రాహువు వీరికి చతురతను మరియు బుద్దిని ప్రదానించును. వీరిలో స్వార్ధ బావన వుండగలదు. వీరి పనులను చేపట్టుటకు వీరు ఎవరితోనైనా మితృత్వమును చేయగలరు. వారి పనిని ఎలా పూర్తిచేసుకొనవలనో వీరికి బాగా తెలుసును. వీరిలో సహాసము అధికముగా వుండును. లగ్నస్థ రాహువు సప్తమ బావములో స్థితిలో వున్న బుధుని కన్యా రాశిని చూస్తున్నాడు. జీవిత బాగస్వామి అరోగ్య సంబందమైన సమస్యలతో బాదించబడును. గృహస్థ జీవితములో కష్టములను ఎదుర్కొన వలసి వచ్చును.

మీన లగ్నములో లగ్నస్థ కేతువు యొక్క ప్రబావము

కేతువు మీన లగ్నము గల కుండలిలో లగ్నస్థముగా వుండిన ఎడల వ్యక్తి అరోగ్య సంబంద సమస్యలతో బాదించబడగలడు. నడుము నొప్పి, మరియు వాత రోగములు కలుగు అవకాశములు వున్నవి. ఆత్మ విశ్వాసము తక్కువగా వుండుట వలన స్వతంత్రముగా నిర్ణయములను తీసుకొనలేరు. వ్యాపారము చేయాలనే కోరిక, ఉద్యోగము చేయుట వీరికి ఇష్టముగా వుండును. స్వార్ధ సిద్ది కొరకు సామాజిక నియమములను ఉల్లంఘించుటకు కూడా వెనుకాడరు. సప్తమ బావములో కేతువు యొక్క దృష్టి జీవిత బాగస్వామికి కష్టకారిగా వుండును. కేతువు వీరిని వివాహేతర సంబందములకు ప్రేరితము చేయును. ఫలితముగా గృహస్థ జీవితములోని సుఖము బాదించబడును. ఆర్ధిక స్థితి సామాన్యముగా వుండును. మోక్షప్రాప్తి కలిగించును.

Sarada Stotram :


Tuesday 28 April 2020

కుంభ లగ్నములో లగ్నస్థ నవగ్రహముల ఫలితాలు :

కుంభ లగ్నము యొక్క అధిపతి శని. ఈ లగ్నములో బుధుడు, శుక్రుడు మరియు శని శుభ యోగకారక గ్రహములు కాగలవు. సూర్యుడు, చంద్రుడు, కుజుడు, మరియు గురువు అశుభ మరియు అకారక గ్రహములుగా వుండును.

కుంభ లగ్నములో లగ్నస్థ సూర్యుడు

కుంభ లగ్నము గల కుండలిలో సూర్యుడు సప్తమాదిపతిగా వుండును. కేంద్రాదిపత్యం వలన శుభ ఫలితములను ఇచ్చును. కుంభ లగ్నము యొక్క కుండలిలో సూర్యుడు యది లగ్నస్థుడైన ఎడల వ్యక్తి చూడడానికి అందముగా మరియు పరిపూర్ణ ఆత్మ విశ్వాసము కలిగి వుండును. శ్వాస సంబంద సమస్యలను ఎదుర్కొన వలసి వచ్చును. సప్తమాదిపతి సూర్య లగ్నస్తుడుగా వుండిన ఎడల జీవిత బాగస్వామి అందముగాను మరియు సమ్యోగమును ఇచ్చువాడుగాను వుండును. అప్పుడప్పుడు వివాదములు వుండగలవు. మిత్రుల నుండి మరియు బాగస్వాముల నుండి సమ్యోగము లేదా లాభము లబించగలదు. వర్తక వ్యాపారములలో త్వరగా సఫలత లభించగలదు. ఆర్ధిక స్థితి సామాన్యముగా వుండును.

కుంభ లగ్నములో లగ్నస్థ చంద్రుడు

చంద్రుడు కుంభ లగ్నము గల కుండలిలో ఆరవ బావము యొక్క అధిపతిగా వుండును. ప్రధమ బావములో చంద్రుని స్థితి వుండుట కారణముగా వ్యక్తికి దగ్గు, జలుబు మరియు జీర్ణ శక్తి సంబందమైన రోగములు కలిగే అవకాశములు వుండును. చంద్రుని యొక్క ఈ స్థితి కారణముగా వ్యక్తి యొక్క మనస్సు అశాంతితో కూడినదై వుండగలదు. కుటుంబ జీవితములో కలహములు, వివాదములు జరిగే అవకాశములు వున్నవి. చంద్రుని దృష్టి సప్తమస్థ సూర్య రాశి సింహముపై వుండును. ఈ దృష్టి సంబందము కారణముగా జీవిత బాగస్వామి అందముగాను మరియు మహత్వాకాంక్షిగాను వుండును.

కుంభ లగ్నములో లగ్నస్థ కుజుడు

కుజుడు కుంభ లగ్నము గల కుండలిలో తృతీయ మరియు దశమ బావము యొక్క అధిపతి కాగలడు. ఈ లగ్నములో కుజుడు అశుభ మరియు అవయోగ కారక గ్రహముల భూమికత్వమును నిర్వహించును. కుజుడు లగ్నస్థముగా వుండుట వలన వ్యక్తి శారీరకముగా దృడముగాను మరియు బలముగాను వుండును. వీరిలో సాహాసము మరియు పరాక్రమము అధికముగా వుండును. వారి పరిశ్రమ వలన కఠినమైన పనులను కూడా పూర్తిచేయుటకు ప్రయత్నించెదరు. తండ్రి మరియు తండ్రి పక్షము నుండి వీరికి అనుకూల సమ్యోగము లభించగలదు. సమాజములో గౌరవ మర్యాదలు మరియు ప్రతిష్టను కలిగి వుండెదరు. స్వభావములో ఉగ్రత కారణముగా అనవసర వివాదములను కొని తెచ్చుకొనెదరు. కుజుని యొక్క దృష్టి వృషభము, సప్తమ బావములో సింహము మరియు అష్టమములో కన్యలో వుండిన ఎడల జీవిత బాగస్వామి గుణవంతులు మరియు వ్యవహారిక స్వభావము కలవారై వుండును. వైవాహిక జీవితము సామాన్యముగా సుఖమయముగా వుండును. సప్తమాదిపతి మరియు కుజుడు పీడించబడి లేదా పాప ప్రభావములో వుండిన ఎడల సప్తమ బావములో సంబందిత సుఖములు బాదించబడగలవు.

కుంభ లగ్నములో లగ్నస్థ బుధుడు

బుధుడు కుంభలగ్నము గల కుండలిలో పంచమాదిపతి మరియు అష్టమాదిపతి కాగలడు. అష్టమాదిపతిగా వుండుట కారణముగా ఇది అవ యోగ కారక మరియు అశుభ ఫలదాయిగా వుండును. లగ్నములో దీని ఉపస్థితి కారణముగా వ్యక్తి బుద్దివంతుడు మరియు ఙ్ఞాని కాగలడు. శిక్షా రంగములో వీరికి సఫలత లభించగలదు. వీరి మాటల ద్వార ప్రజలను ప్రభావితము చేయుదురు. జల క్షేత్రములో వీరికి ఆసక్తి అధికముగా వుండును. పడవ ప్రయాణములు మరియు జల యాత్రలు వీరికి ఆనందమును కలిగించును. బుధుని దశలో మానసిక సమస్యలు మరియు కష్టముల అనుభూతి కలుగగలదు. ప్రధమస్థ బుధుడు సప్తమ బావములో స్థితిలో వున్న సింహ రాశిని చూస్తున్నాడు. దాని కారణముగా జీవిత బాగస్వామితో వివాదములు మరియు మతబేదములు వుండగలవు.

కుంభ లగ్నములో లగ్నస్థ గురువు

కుంభ లగ్నము గల కుండలిలో గురువు అవ యోగకారక గ్రహము కాగలడు. ఇది ద్వితీయ మరియు ఏకాదశ బావము యొక్క అధిపతిగా వుండును. లగ్నములో దీని ఉపస్థితి కారణముగా వ్యక్తి బుద్ధివంతుడు మరియు ఙ్ఞాని కాగలడు. వీరిలో ఆత్మ బలము మరియు ఆత్మ విశ్వాసము వుండును. ధన సేకరణ చేయు కళలలో కూడా నిపుణులుగా వుంటారు. అందువలన ఆర్ధిక సమస్యలను తక్కువగానే ఎదుర్కొనవలసి వచ్చును. లగ్నములో వున్న గురువు పంచమ, సప్తమ మరియు నవమ బావములపై దృష్టి కలిగి వుండును. గురువు యొక్క దృష్టి కారణముగా బందు మిత్రుల నుండి లాభము ప్రాప్తించగలదు. తండ్రి పక్షము నుండి లాభము కలుగును. సంతానము మరియు జీవిత బాగస్వామి నుండి సుఖము ప్రాప్తించగలదు.

కుంభ లగ్నములో లగ్నస్థ శుక్రుడు

కుంభ లగ్నము గల కుండలిలో శుక్రుడు సుఖాదిపతి మరియు బాగ్యాదిపతిగా వుండును. సుఖాదిపతి మరియు భాగ్యాదిపతిగా వుండుట కారణముగా ఇది ప్రముఖ కారక గ్రహముగా వుండును. లగ్నములో స్థితి కారణముగా వ్యక్తి చూడడానికి అందముగా మరియు ఆకర్షణీయముగా వుండును. వీరు బుద్దివంతులు మరియు గుణవంతులు కాగలరు. అద్యాత్మికములో వీరికి అభిరుచి అధికముగా వుండును. పూజలు, భజనలు, దార్మిక కార్యకలాపములలో వీరికి అభిరుచి వుండును. తల్లి నుండి ప్రేమ మరియు సమ్యోగము లభించగలదు. భూమి, భవనము మరియు వాహన సుఖము ప్రాప్తి చెందగలరు. శుక్రుడు సప్తమస్థ సింహరాశిని చూస్తున్నాడు. అందువలన వైవాహిక జీవిత సుఖము బాదించబడగలదు. జీవిత బాగస్వామితో వొడిదుడుకులు ఏర్పడగలవు.

కుంభ లగ్నములో లగ్నస్థ శని

శని కుంభ లగ్నము గల కుండలిలో లగ్నాదిపతి మరియు ద్వాదశాదిపతిగా వుండి కారక గ్రహము యొక్క భూమికత్వమును నిర్వహించును. లగ్నాదిపతి శని స్వరాశిలో స్థితిలో వుండి వ్యక్తి ఆరోగ్యమును మరియు నిరోగముతో కూడిన శరీరమును ప్రదానించును. శని యొక్క ప్రభావము కారణముగా వ్యక్తి ఆత్మవిశ్వాసముతో పరిపూర్ణత చెంది వుండును. వారి వ్యక్తిత్వము మరియు ఆత్మ బలము కారణముగా సమాజములో గౌరవ మర్యాదలు మరియు ప్రతిష్టలను పొందగలరు. లగ్నములో వున్న శని తృతీయ బావములో మేషరాశి, సప్తమములో సింహరాశి మరియు దశమములో వృశ్చిక రాశిని చూస్తున్నాడు. శని యొక్క దృష్టి కారణముగా సోదరులతో అపేక్షిత సమ్యోగములో సమస్యలు ఏర్పడగలవు. జీవిత బాగస్వామితో సమస్యలు ఏర్పడగలవు. వైవాహిక జీవితము ప్రభావితము కాగలదు. వ్రూత్తిలో గుప్త శత్రువులు ఉందురు.

కుంభ లగ్నములో లగ్నస్థ రాహువు

ప్రధమ బావములో రాహువు యొక్క స్థితి కారణముగా అరోగ్యములో వొడుదుడుకులు వుండగలవు. రాహువు యొక్క దశా కాలములో ఉదర సంబంద రోగములు కలిగే అవకాశములు వున్నవి. వర్తక వ్యాపారములలో సమస్యలను ఎదుర్కొనవలసి వచ్చును. వ్యవసాయ కోరిక వున్నప్పటికీ ఉద్యోగము ఫలదాయకముగా వుండును. లగ్నస్థ రాహువు సప్తమ బావములో సూర్యుని రాశి సింహమును చూస్తున్నాడు. శత్రు రాశిపై రాహువు యొక్క దృష్టి వైవాహిక జీవిత సుఖమును బలహీన పరచును. బాగస్వాముల నుండి వీరికి లాభము కలిగే అవకాశములు తక్కువగా వున్నవి. గుప్త విషయములు మరియు విద్యల యందు వీరికి అభిరుచి వుండును. ఆత్మవిశ్వాసము తక్కువగా వుండుట కారణముగా నిర్ణయములు తీసుకొనుటలో సమస్యలను ఎదుర్కొనెదరు.

కుంభ లగ్నములో లగ్నస్థ కేతువు

కేతువు కుంభ లగ్నము గల కుండలిలో లగ్నస్థముగా వుండి వ్యక్తిని అస్థిరునిగా చేయుచున్నాడు. వీరి మనస్సు బోగవిలాసములను కూడినదై వుండును. తల్లి దండ్రులతో వివాదములు మరియు మనస్తాపములు కలిగే అవకాశములు వున్నవి. సప్తమ బావముపై కేతువు యొక్క దృష్టి వుండుట కారణముగా గృహస్థ సుఖములో లోపము ఏర్పడగలదు. కుటుంబములో అశాంతి ఏర్పడగలదు. కేతువుతో పాటు శుభ గ్రహముల యుతి లేదా దృష్టి సంబందములు వుండిన ఎడల కేతువు యొక్క అశుభ ప్రబావము తగ్గగలదు.

Monday 27 April 2020

మకర లగ్నము యొక్క కుండలిలో లగ్నస్థ నవగ్రహముల ఫలితాలు :

మకర లగ్నములో ఏ వ్యక్తి యొక్క జననము జరుగునో వారు సన్నగా వుంటారు. సాదారణముగా వీరి వివాహము ఆటంకాలతో జరుగును. వీరికి నియమానుసారముగా నడుచుకొనుట ఇష్టపడును. వీరు మొరటు స్వభావము మరియు క్రూర స్వబావము కలిగి వుండెదరు. వీరు వారి పనులలో ఎవరు జోక్యము చేసుకొనుట ఇష్టపడరు.

మకర లగ్నములో లగ్నస్థ సూర్యుడు

మకర లగ్నము గల కుండలిలో సూర్యుడు అష్టమ బావము యొక్క అధిపతి కాగలడు. లగ్న బావములో సూర్యుని స్థితి కలిగి వుండుట కారణముగా వ్యక్తి అరోగ్య సంబంద సమస్యలను ఎదుర్కొనవలసి వచ్చును. ఎముకలలో నొప్పి మరియు ఉదర సంబంద రోగములు కలిగే అవకాశములు ప్రబలముగా వున్నవి. దృష్టి దోషము కలిగే అవకాశములు వున్నవి. పేరాశ మరియు స్వార్ధము వుండగలదు. శత్రురాశిలో సూర్యుని ఉపస్థితి కారణముగా జీవితములో కఠిన పరిస్థితులను మరియు బాధలను ఎదుర్కొనవలసి వచ్చును. పరిశ్రమ మరియు ఆత్మబలముతో కఠినమైన పరిస్థితులపై విజయమును ప్రాప్తి చెందగలరు. తండ్రితో వొడిదుడుకులు వుండగలవు. బందుమిత్రులతో కూడా విరోదములను ఎదుర్కొన వలసివచ్చును. వ్యాపారము చేయాలనే కోరిక మరియు ఉద్యోగము చేయుట వీరికి ఇష్టము. గృహస్థ జీవితములో వొడిదుడుకులు వుండగలవు.

మకర లగ్నములో లగ్నస్థ చంద్రుడు

చంద్రుడు మకర లగ్నము యొక్క కుండలిలో సప్తమ బావము యొక్క అధిపతి కాగలడు. శత్రురాశిలో లగ్నస్థముగా వుండి చంద్రుడు వ్యక్తికి అందమైన శరీరమును ప్రదానించును. చంద్రుని ప్రభావము కారణముగా వ్యక్తి వినోద మనస్తత్వము కలిగిన వారై వుండెదరు. సౌందర్యము పట్ల ఆకర్షితులు కాగలరు. చంద్రుని శత్రు రాశిలో వుండుట వలన కళ్ళు మరియు చెవులలో బాదలను ఎదుర్కొన వలసి వచ్చును. లగ్నములో కూర్చొని వున్న చంద్రుడు సప్తమ బావములో తన రాశి అయిన కటకము చూస్తుండును. దానివలన జీవిత బాగస్వామి అందముగాను మరియు మంచి గుణము కలిగి వుండును. జీవిత బాగస్వామితో సమ్యోగము మరియు సమయాను కూలముగా లాభము ప్రాప్తి చెందగలదు.

మకర లగ్నములో లగ్నస్థ కుజుడు

మకర లగ్నము యొక్క కుండలిలో కుజుడు సుఖాదిపతి మరియు లాభాదిపతి కాగలడు. కుజుడు ఈ రాశిలో లగ్నస్థముగా వున్న ఎడల ఆ వ్యక్తి క్రోద స్వబావము కలిగి వుండును. తండ్రి మరియు తండ్రి పక్షము నుండి సమ్యోగము లభించగలదు. తండ్రి పేరు వలన వీరికి సమాజములో పేరు ప్రఖ్యాతులు లభించగలవు. శని యొక్క ప్రభావము కారణముగా జీవితములో వీరి పితృ సంపత్తి త్యాగము చేయవలసిన అవసరము వుండగలదు. ప్రధమ బావములో వున్న కుజుడు చతుర్ధ, సప్తమ మరియు అష్టమ బావములను చూస్తున్నాడు. ఈ బావములలో కుజుని యొక్క దృష్టి కారణముగా వ్యక్తి దార్మిక ప్రవృత్తి కలవాడై వుండును. కుజని దోషము కారణముగా గృహస్థ జీవితములోని సుఖము బాదించబడును.

మకర లగ్నములో లగ్నస్థ బుధుడు

బుధుడు మకర లగ్నము యొక్క కుండలిలో షష్టమాదిపతి మరియు నవమాదిపతిగా వుండును. బుధుడు లగ్నస్థుడుగా వుండిన ఎడల వ్యక్తి బుద్దివంతుడు మరియు జ్ఞాని కాగలడు. వీరిలో ఈశ్వరుని పట్ల విశ్వాసము మరియు దయాస్వభావము కలిగి వుండును. కళలపై అభిరుచి వుండును. గౌరవ మర్యాదలు మరియు ధనము ప్రాప్తించగలదు. కర్కాటక రాశిపై బుధుని దృష్టి వలన జీవిత బాగస్వామి అందముగా ఉన్నా షష్టాదిపతి కావటం వలన ఎడబాటు, జీవిత బాగస్వామి ఉగ్రస్వబావము కలిగిన వారై వుండును. సంతానము కలుగుటలో కొంత సమయము పట్టవచ్చును.

మకర లగ్నములో లగ్నస్థ గురువు

మకర లగ్నము యొక్క కుండలిలో గురువు వ్యయాదిపతి మరియు తృతీయాదిపతిగా నీచ స్ధితి కలిగి వుండి అవయోగ కారక గ్రహము యొక్క భూమికత్వమును పాటించును. లగ్నములో గురువు యొక్క ఉపస్థితి కారణముగా వ్యక్తి జ్ఞాని మరియు గుణవంతుడు కాగలడు. వీరిలో బౌధిక క్షమత అధికముగా వుండును. కాని వీరు వీరి గుణమును మరియు యోగ్యతను సముచితముగా ఉపయోగించలేరు. ఇతరుల విచారములలో ఎల్లప్పుడూ ప్రబావితము కాగలరు. అందువలన సమస్యలను కూడా ఎదుర్కొన వలసి వచ్చును. లగ్నస్థ గురువు యొక్క దృష్టి, పంచమ, సప్తమ మరియు నవమ బావములపై వుండును. గురువు యొక్క దృష్టి కారణముగా వివాహమునకు తరువాత వీరి భాగ్యోదయము జరుగును. స్త్రీ సంతానం కలుగును. తండ్రితో విభేదాలు ఉండవచ్చును.

మకర లగ్నములో లగ్నస్థ శుక్రుడు

శుక్రుడు మకర లగ్నము యొక్క కుండలిలో పంచమాదిపతి మరియు సప్తమాదిపతి కాగలడు. ఈ లగ్నములో శుక్రుడు శుభ కారక గ్రహము కాగలడు. లగ్న స్థితి కారణముగా వ్యక్తి అందముగాను మరియు బుద్దివంతుడుగాను వుండును. శుక్రుడు వీరిని విలాశవంతుడిగాను మరియు స్వార్ధస్వభావము కలవాడుగాను చేయును. వీరిలో అవసర వాదిత్వము కూడా వుండును. వీరు సాదారణముగా వారి అవసరముల కొరకు మిత్రత్వము చేపట్టెదరు. విపరీత లింగపు వ్యక్తిపై ఆకర్షితులు కాగలరు. సప్తమ బావములో స్థితిలో వున్న కటక రాశిలో శుక్రుని దృష్టి వలన జీవిత బాగస్వామి ప్రేమతో వ్యవహరించే వాడుగా ఉన్ననూ చంచల స్వభావం కలిగి ఉంటారు. సుఖ దు:ఖములలో సమ్యోగము మరియు సహాయమును అందించును.

మకర లగ్నములో లగ్నస్థ శని

శని మకర లగ్నము యొక్క కుండలిలో లగ్నాదిపతి మరియు ద్వితీయాదిపతిగా వుండును. లగ్నాదిపతిగా వుండుట వలన ఇది శుభ మరియు యోగ కారక గ్రహము కాగలదు. లగ్నములో శని యొక్క స్థితి కారణముగా వ్యక్తి బాగ్యశాలికాగలడు. శారీరకముగా కండలు తిరిగి శక్తిశాలిగా వుండెదరు. కాని మాట్లాడే రీతిలో దోషము కలిగే అవకాశములు వుండును. ఉద్యోగము మరియు వ్యాపారము రెండింటిలోనూ వీరికి మంచి సఫలత లభించగలదు. ప్రభుత్వ సేవలకు వీరికి అవకాశములు ప్రాప్తించగలదు. తల్లి నుండి స్నేహము ప్రాప్తించగలదు. సప్తమ బావములో శని యొక్క దృష్టి వుండుట వలన జీవిత బాగస్వామికి కష్టములు కలుగును. వైవాహిక సుఖము ప్రభావితము కాగలదు.

మకర లగ్నములో లగ్నస్థ రాహువు

రాహువు మకర లగ్నము గల కుండలిలో ప్రధమ బావములో స్థితిలో వుండుట కారణముగా అనవసరముగా బ్రమణము చేయవలసి వచ్చును. పనులలో సమస్యలు ఏర్పడవచ్చును. దానివలన జరుగుననుకున్న పనికూడా జరుగకుండా వుండిపోవును. వ్యాపారములో అపేక్ష వున్నప్పటికీ ఉద్యోగము లాభదాయకముగా వుండును. వ్యవసాయములో కష్టములు మరియు హాని కలిగే అవకాశములు వున్నవి. సప్తమ బావముపై రాహువు యొక్క దృష్టి బాగస్వాముల నుండి, మిత్రుల నుండి అపేక్షిత లాభములను కలిగించదు. గృహస్థ జీవితములోను, సంసార సుఖములు బలహీన పడగలవు.

మకర లగ్నములో లగ్నస్థ కేతువు

మకర లగ్నము గల కుండలిలో కేతువు ప్రధమ బావములో వుండుట వలన వ్యక్తి అరోగ్యములో వొడిదుడుకులు వుండగలవు. అన్ని సమయములలో విభిన్న విధములైన కష్టములను మరియు సమస్యలను ఎదుర్కొనవలసి వచ్చును. విపరీత లింగపు వ్యక్తిపై విశేష ఆకర్షణ కలిగి వుండెదరు. శత్రువుల కారణముగా వీరికి కష్టములు వుండగలవు. సమాజములో గౌరవ మర్యాదల కొరకు అనుచిత పనులను చేపట్టి దానివలన అపజయమును పొందగలరు. సప్తమ బావములో కేతువు యొక్క దృష్టి జీవిత బాగస్వామికి కష్టములను కలిగించును. జీవిత బాగస్వామి నుండి సుఖము మరియు సమ్యోగములలో లోపము రాగలదు.

Friday 24 April 2020

ధనుర్ లగ్నములో లగ్నస్థ నవగ్రహముల ఫలితములు :

ధనుర్ లగ్నము యొక్క అధిపతి గురువు. ఈ లగ్నములో ఎవరి జననమైతే కలుగునో వారు మానవీయ గుణములతో పరిపూర్ణతను కలిగి వుండెదరు. ఇతరుల పట్ల దయాబావము కలిగి వుండెదరు. సాదారణతను ఇష్టపడతారు. ఈశ్వరుని పట్ల నమ్మకము కలిగి బాగ్యశాలిగా వుండెదరు.

ధనుర్ లగ్నములో లగ్నస్థ సూర్యుడు

ధనుర్ లగ్నము యొక్క కుండలిలో సూర్యుడు బాగ్యాదిపతి కాగలడు. లగ్నములో విరాజితమైన ఎడల వ్యక్తికి అరోగ్యమైన మరియు అందమైన శరీరము కలుగగలదు. ఙ్ఞానము, బుద్ది మరియు ఆత్మబలమును ప్రదానించును. వీరి మాటలు ప్రభావముగాను మరియు ఆకర్షణీయముగాను వుండును. వ్యాపారము లేదా ఉద్యోగము రెండూ వీరికి లాభదాయకముగా వుండును. అయిననూ వీరికి ఉద్యోగములో వీరికి విశేష సఫలత లభించగలదు. లేఖనము, చదువుట మరియు బౌతిక కార్యములలో లోపప్రియతను పొందగలరు. చిత్రకళ లేదా శిల్పకళలలో వీరికి అభిరుచి వుండగలదు. లగ్నస్థ సూర్యుని సప్తమ బావములో బుధుని యొక్క రాశి మిధునమును చూస్తున్నాడు. సూర్యుని దృష్టి ఫలితము కారణముగా ధనము, ప్రఖ్యాతి మరియు మిత్రుల నుండి సహకారం ప్రాప్తించగలదు. ఆర్ధిక స్థితి బాగుండును. భాగ్యాదిపతి సూర్యుడు ప్రభుత్వ రంగము నుండి లాభమును కలిగించును. జీవిత బాగస్వామి మరియు సంతాన సుఖము లభించగలదు.

ధనుర్ లగ్నములో లగ్నస్థ చంద్రుడు 

చంద్రుడు ధనుర్ లగ్నము గల కుండలిలో అష్టమాదిపతిగా వుండుట సఫల ఫలితములను ఇచ్చును. చంద్రుడు లగ్నములో స్థితిలో వున్న ఎడల వ్యక్తి యొక్క మనస్సు స్ధిరత్వము లేకుండా వుండును. అనుసందానాత్మక పనులలో వీరి అభిరుచి వుండగలదు. లగ్నస్థ చంద్రుని కారణముగా వ్యక్తి ఆరోగ్య సంబందమైన సమస్యలను ఎదుర్కొనవలసి వచ్చును. వ్యక్తి ప్రయాణముల పట్ల ఆసక్తి కలవాడై వుండును. వీరికి ప్రకృతిలో దృశ్యములు మరియు జలక్షేత్రములు ప్రియమైనవిగా వుండును. కళలతో కూడిన విభిన్న రంగములలో మరియు లేఖనములో వీరికి అభిరుచి అధికముగా వుండును. ఈ విషయములలో వీరికి సఫలత చాలా తొందరగా లభించగలదు. చంద్రుని దృష్టి సప్తమ బావములోని మిధునరాశిపై ఉండును కావున అందమైన మరియు సమ్యోగముగల జీవిత బాగస్వామి లభించును. సంతాన సుఖము ఆలస్యముగా కలుగును.

ధనుర్ లగ్నములో లగ్నస్థ కుజుడు 

కుజుడు ధనుర్ లగ్నము యొక్క కుండలిలో పంచమాదిపతి మరియు దశమాదిపతిగా వుండి శుభ యోగకారక గ్రహముగా వుండును. వ్యక్తి తన స్వయం క్రుషి మరియు శ్రద్ద వలన ధనమును ఆర్జించెదరు. కుజుడు గురువు యొక్క ధనుర్ రాశిలో వుండుట వలన శిక్షామార్గములో అవరోధములను కలిగించును. ప్రదమస్థ కుజుడు చతుర్ధ, సప్తమ మరియు అష్టమ బావమును చూస్తున్నాడు. ఈ దృష్టి కారణముగా గృహస్థ జీవితములో బార్యా భర్తల మద్య వొడిదుడుకులు కలుగవచ్చును. చిన్న చిన్న వివాదములు కూడా ఉత్పన్నము కాగలవు.

ధనుర్ లగ్నములో లగ్నస్థ బుధుడు 

బుధుడు ధనుర్ లగ్నము గల కుండలిలో సప్తమ మరియు దశమ రెండు కేంద్రములకు అధిపతి కాగలడు. రెండు కేంద్రములకు అధిపతిగా వుండుట వలన ఈ గ్రహము అవయోగ కారక గ్రహము కాగలడు. కాని బుధుడు లగ్నస్థుడుగా వుండిన ఎడల వ్యక్తికి అందమైన మరియు నిరోగములతో కూడిన శరీరమును ప్రదానించును. తల్లి దండ్రుల నుండి స్నేహమును మరియు సమ్యోగమును ప్రదానించును. ప్రభుత్వము మరియు ప్రభుత్వ రంగము నుండి లాభము మరియు గౌరవమును ప్రదానించును. మెట్టింటి నుండి వీరికి సమయానుకూలముగా లాభమును ప్రదానించును. బుదుడు సప్తమ బావములో స్థితిలో వున్న స్వరాశిని చూస్తున్నాడు దానికారణముగా అందమైన మరియు సమ్యోగము గల జీవిత బాగస్వామి లభించును. మిత్రుల నుండి భాగస్వామ్యుల నుండి లాభములను ప్రదానించును. వ్యాపారములో లాభములు కలుగును. ఆర్ధిక స్థితి బలముగా వుండును.

ధనుర్ లగ్నములో లగ్నస్థ గురువు

గురువు ధనుర్ లగ్నము యొక్క కుండలిలో లగ్నాదిపతి మరియు చతుర్ధాదిపతి కాగలడు. గురువు స్వరాశి ధనురాశిలో లగ్నస్థముగా వుండిన ఎడల వ్యక్తికి అందమైన మరియు అరోగ్యముకరమైన శరీరమును ప్రదానించును. వ్యక్తి బుద్ది మరియు ఙ్ఞానము కలిగి వుండును. సమాజములో గౌరవ మర్యాదలు మరియు ప్రతిష్టలను పొందగలరు. భూమి, భవనము మరియు వాహన సుఖమును పొందగలరు. ప్రధమ బావములో వున్న గురువు యొక్క పూర్ణ దృష్టి పంచమ బావములో మేష రాశిలో సప్తమలో మిధునముపై మరియు నవమ బావములో సింహరాశిపై వుండును. గురువు యొక్క దృష్టి ఫలితము కారణముగా వ్యక్తి సాహసము మరియు దయాస్వబావము కలిగి వుండును. జీవిత బాగస్వామి నుండి మరియు సంతానము నుండి సుఖము ప్రాప్తించగలదు. జీవితము ఐశ్వర్యము మరియు సుఖముతో పరిపూర్ణముగా వుండును. ఉద్యోగము మరియు వ్యాపారములో సఫలత లభించగలదు. శత్రుభయము వుండగలదు కాని వారు మీకు హాని కలిగించలేరు.

ధనుర్ లగ్నములో లగ్నస్థ శుక్రుడు 

ధనుర్ లగ్నము యొక్క కుండలిలో శుక్రుడు అవయోగకారక మరియు అశుభ గ్రహము కాగలదు. ఇది ఈ లగ్నము యొక్క కుండలిలో ఆరవ మరియు పదకొండవ బావములకు అధిపతిగా వుండును. శుక్రుడు ధనుర్ లగ్నములో లగ్నస్థముగా వుండుట కారణముగా వ్యక్తి చూడడానికి అందముగా వుంటాడు. కాని శుక్రుడు షష్టమాదిపతిగా వుండుట కారణముగా వ్యక్తికి అరోగ్య సంబంద సమస్యలను ఎదుర్కొనవలసి వచ్చును. శుక్రుడు ఏకాదశాదిపతిగా ఆర్ధిక స్థితి బాగుపడును. రాజకీయ క్షేత్రముల నుండి లాభమును ప్రదానించును. శుక్రుని ప్రభావము కారణముగా వీరికి ప్రభుత్వ ఉద్యోగము లభించుటకు అవకాశములు ప్రభలముగా వున్నవి. సంగీతము మరియు కళల యందు ఆసక్తి అధికముగా వుండును. శుక్రుడు సప్తమ బావము మిత్ర గ్రహమైన మిధునముపై పూర్ణ దృష్టి కలిగి వుండును. ఫలితముగా వీరి జీవిత బాగస్వామి అందముగాను మరియు సమ్యోగము గలవారుగాను వుండును. గృహస్థ జీవితము సుఖమయముగా వుండును.

ధనుర్ లగ్నములో లగ్నస్థ శని

శని ధనుర్ లగ్నము యొక్క కుండలిలో ద్వితీయ మరియు తృతీయ బావము యొక్క అధిపతి కాగలడు. ఈ లగ్నములో శని లగ్నస్థములో వుండుట కారణముగా వ్యక్తి సన్నగా వుంటాడు. శని ప్రభావము కారణముగా వ్యక్తి నేత్ర రోగము వలన పీడించబడగలడు. వీరికి స్వతంత్రముగా ఏ నిర్ణయము తీసుకొనవలనన్నా కష్టముగా వుండును. జీవితములో ప్రగతి కొరకు ఇతరుల సహాకారం వీరు అదికముగా కోరుకుంటారు. ధనము బద్రపరచుట వీరి ప్రవృత్తి కలిగి వుండెదరు. షేర్, పందెములు మరియు లాటరీలలో వీరికి అప్పుడప్పుడు అకస్మాత్తుగా లాభములు కలుగవచ్చును. లగ్నస్థ శని తృతీయ బావములో కుంబరాశిని, సప్తమ బావములో మిధున రాశిని మరియు దశమ బావములో బుధుని రాశి కన్యను చూస్తుండును. ఈ బావములలో శని యొక్క దృష్టి వున్న ఎడల మిత్రుల నుండి అపేక్షిత లాభము మరియు సమ్యోగము లభించదు. బాగస్వాముల నుండి హాని కలుగును. దాంపత్య జీవితములో కష్టము యొక్క అనుభూతి కలుగగలదు.

ధనుర్ లగ్నములో లగ్నస్థ రాహువు

ధనుర్ లగ్నము యొక్క కుండలిలో రాహువు లగ్నస్థముగా వుండుట వలన వ్యక్తి పొడుగుగా మరియు అరోగ్యముగా వుండును. వీరి బుద్ధి కుటిలనీతి కలదై వుండును. వారి పనిని ఏవిదముగానైనా చేపట్టు నేర్పు కలిగినవారై వుండెదరు. స్వహితము వీరి సిద్దాంతము. రాహువు యొక్క దృష్టి కారణముగా సంతాన సుఖములో బాధలు మరియు జీవిత బాగస్వామి నుండి సమ్యోగము లభించుటకు అవకాశములు తక్కువగా వుండును. జీవిత బాగస్వామి ఆరోగ్యము కారణముగా సమస్యలు కలుగును.

ధనుర్ లగ్నములో లగ్నస్థ కేతువు

కేతువు యొక్క ఉపస్థితి ధనుర్ లగ్నము యొక్క కుండలిలో ప్రధమ బావములో వుండుట కారణముగా వ్యక్తి యొక్క అరోగ్యములో వొడుదుడుకులు వుండగలవు. నడుము మరియు శరీర చేర్పులలో నొప్పి వుండగలదు. ఆత్మ బలము లోపము కారణముగా ఏ విధమైన మహత్వపూరితమైన విషయములలోనూ నిర్ణయములు తీసుకొనుట కఠినముగా వుండును.

                                https://youtube.com/shorts/hXs7ylVV_Rs?si=eAVlfsOGtiuuLmaF