Monday 29 January 2018

చంద్రగ్రహణం

31_జనవరి_గ్రస్తోదయ_చంద్రగ్రహణం

స్వస్తిశ్రీ హేవళంబి నామ సంవత్సర మాఘ పౌర్ణమి నాడు అనగా 31.01.2018 నాడు “రాహుగ్రస్త గ్రస్తోదయ  చంద్ర గ్రహణం” సంభవించ నుంది. ఇట్టి చంద్ర గ్రహణానికి పాశ్చాత్యులు చాలా ప్రాధాన్యతను ఇచ్చారు.


భారత కాలమానం ప్రకారం సాయత్రం ప్రారంభం అవుతుంది.

చంద్రగ్రహణం వేళలు ఇవీ...

మన తెలుగు రాష్ట్రాలలోని ప్రధాన పట్టణాలలో #చంద్రోదయాన్ని అనుసరించి గ్రహణ ప్రారంభసమయాలు ఇలా ఉన్నాయి.

1.#హైద్రాబాద్: 18:05hrs to 20:41. కావున ఆద్యంత పుణ్యకాలం : 2hr.36 min
2.#రాజమండ్రి: 17:52 to 20:41 ఆద్యంతపుణ్యకాలం : 2 hr 49 min
3.#విజయవాడ : 17:58 to 20:41
ఆద్యంతపుణ్యకాలం : 2 hr 43 min
4.#తిరుపతి : 18:06 to 20:41
ఆద్యంతపుణ్యకాలం : 2hr 35 min
5. #విశాఖపట్నం : 17:45 to 20:41
ఆద్యంతపుణ్యకాలం : 2hr 56 min
6. #కాకినాడ : 17:50 to 20:41
ఆద్యంతపుణ్యకాలం: 2hr51 min.

ఈ ప్రాంతాల్లో కనిపిస్తుంది...

చంద్ర గ్రహణం భారతదేశంతో సహ ఆసియా ఖండం, అమెరికా, యూరప్ ఈశాన్యప్రాంతం, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్, పసిఫిక్ మహాసముద్రం, హిందూ మహాసముద్రం ప్రాంతములందు చంద్ర గ్రహణం కనబడుతుంది.

గ్రహణ దోషం గల నక్షత్రాలు:

పుష్యమి, ఆశ్రేష లకు దోషం అధికం. విశాఖ ౪, అనురాధ, జ్యేష్ఠ, మూల, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ ౧ వారికి దోషము మధ్యమ. ఇట్టి నక్షత్ర జాతకులందరికి గ్రహణ శాంతి. వీరు గ్రహణాన్ని వీక్షించ రాదు.

గ్రహణ దోషం గల రాశులు:

కర్కాటక, ధనుస్సు మరియు మకరం వారికి దోషం అధికం
మిథున మరియు సింహ వారికి దోషం మధ్యమం
వృషభ, కన్య, కుంభ రాశుల వారికి శుభం
మిగిలిన రాశుల వారికీ ఫలం: మిశ్రమం
మిథున, కర్కాటక, సింహ, ధనుస్సు మరియు మకర రాశులందు జన్మించిన వారికీ గ్రహణ శాంతి. వీరు గ్రహణాన్ని వీక్షించ రాదు.

"గ్రహణే సంక్రమణేవాసి, నస్నాయాద్యది మానవః
సప్తజన్మని కుష్ఠిస్యాత్‌, దుఃఖభాగేచ జాయతే||

గ్రహణకాలమునగాని, సంక్రమణ కాలాదులలోగాని, స్నానము చేయనివారు, ఏడుజన్మల పర్యంతము కుష్ఠురోగాది బాధలతో, దుఃఖితులైయుందురు.

"రాత్రో స్నానం నకుర్వీత'' అను నిషేధం ప్రకారం ప్రతిదినము రాత్రికాలమున స్నానము చేయరాదు.

నైమిత్తికంతు కుర్వీత స్నానం దానంచ, రాత్రిషు

అను ధర్మము ప్రకారము ఏదేని గ్రహణాదికారణములు నిమిత్తముగ చేసికొని  రాత్రి కాలమున  స్నానాదులు చెయవచ్చును.

జన్మక్షే నిధనం గ్రహేజ నిభతో ఘాతః క్షతిః శ్రీర్వ్యధా
చింత సౌఖ్య కళత్ర దౌస్ధ్య మృతయః స్సుర్శాననాసః సుఖం
లాభోపాయ ఇతి క్రమాత్త ద శుభ ధస్త్యే జపహపః స్వర్ణగో
దానం శాంతి రధో గ్రహం త్వశుభదం నో వీక్షమహుః పరే 

జన్మ నక్షత్రమందు గ్రహణం వచ్చిన నాశనం, జన్మ రాశి యందు గ్రహణం వచ్చిన మానసిక సమస్యలు, ద్వితీయ మందు హాని, తృతీయ మందు సంపద, చతుర్ధమందు రోగం, పంచమం నందు చికాకులు, షష్టమందు సౌఖ్యం, సప్తమం నందు భార్యకు కష్టాలు, అష్టమం నందు మరణతుల్య కష్టాలు, నవమం నందు గౌరవ భంగం, దశమం నందు సుఖం, ఏకాదశం నందు లాభం, ద్వాదశం నందు అపాయం. అశుభ దోష పరిహారానికి జపం, స్వర్ణ దానం, గోదానం, శాంతి చేయాలి. అశుభ ఫలప్రదమైన గ్రహణాన్ని చూడరాదు.

రాజ్యాభిషేక (ప్రమాణ స్వీకారం) నక్షత్రంలో గ్రహణం పడితే రాజ్య భంగం, బంధు క్షయం, మరణతుల్య కష్టాలు. ఉద్యోగస్తులు, వ్యాపారస్ధులు ఉద్యోగంలో, వ్యాపారంలో ప్రవేశించిన నక్షత్రాన్ని గుర్తు పెట్టుకొని ఉద్యోగ, వ్యాపార కాలంలో ఆ నక్షత్రంలో గ్రహణం పడితే శాంతి చేసుకోవటం మంచిది.   

గ్రహణ సమయమున దేవత అర్చనలు, దైవ ధ్యానము, జపతపాదులు చేయడం క్షేమము. గ్రహణ సమయంలో రాహుకేతువులతో సూర్యచంద్రుల కాంతులు మిళితమయ్యి, అనేక విషకిరణాలు ఉద్భవిస్తాయి. అవి చాలావరకూ మానవ నిర్మాణానికి ఇబ్బందులను కలిగిస్తాయి. ఎంతో సున్నితంగా ఉండే స్త్రీ గర్భంలోని శిశువుకు హాని కలగకూడదని గ్రహణం చూడొద్దంటారు.గ్రహణ సమయంలో మానవ ప్రయత్నముగా గర్భవతులు దైవధ్యానమే శ్రేయస్కరము.

చంద్రగ్రహణం పౌర్ణమి నాడు మాత్రమే సంభవిస్తుంది.అన్ని పౌర్ణమి లకు చంద్రగ్రహణం ఏర్పడదు. .చంద్రగ్రహణం పౌర్ణమి నాడు ఏర్పడటానికి,కొన్ని పౌర్ణమిలకు ఏర్పడకపోవటానికి కొన్ని కారణాలు ఉన్నాయి.చంద్రుడు పౌర్ణమి నాడు సూర్యునికి ఎదురుగా ఉంటాడు.అంటే భూమికి ఇరువైపుల సూర్య చంద్రులు ఉంటారు.సూర్య చంద్రుల మద్యలో భూమి ఉంటుంది.అన్ని పౌర్ణమిలకు సూర్యుడు ,భూమి,చంద్రుడు ఒకే సరళ రేఖపై ఉండరు .అందువల్ల అన్ని పౌర్ణమిలకు చంద్రగ్రహణం ఏర్పడదు.

సూర్యుడు చంద్రుడు,భూమి ఒకే సరళరేఖపై ఉండి చంద్రుడు రాహువు దగ్గర గాని కేతువు దగ్గర గాని ఉండటం వల్ల భూమి యొక్క నీడ చంద్రునిపై పడుతుంది.చంద్రుడు పూర్తిగా కనపడకపోవటాన్ని సంపూర్ణ చంద్రగ్రహణం అంటారు.పాక్షికంగా కనపడటాన్ని పాక్షిక చంద్రగ్రహణం అంటారు.చంద్రబింబం పూర్తిగా కనిపించకుండా పోయి మరల పూర్తిగా కనిపించే వరకు గల కాలాన్ని గ్రహణం అంటారు.సూర్య చంద్ర గ్రహణాలకు రాహు కేతువులు కారణం కావటం వల్ల మన పూర్వీకులు సూర్య చంద్రులను రాహు కేతువులు మింగటం వల్ల గ్రహణాలు ఏర్పడుతున్నాయని చమత్కరించారు.

గ్రహణములు అనగానే కీడు జరుగుతుంది, ఫలానా నక్షత్రములలో జనించిన వారు ఈవిధముగా పరిహారం చేయాలి, ఆలయాలు మూసేయాలి, లోకంలో ప్రకృతి విపత్తులు సంభవిస్తాయి. ఈ గ్రహణ ప్రభావము 2,3 నెలల వరకు ఉంటుందని. ఈ గ్రహణ సమయంలో ఇంట్లో దీపారాధన చేయరాదని, కొందరు చేయ వచ్చని. ఫలానా నక్షత్రముల వారికిశాంతి చేయించాలని. ఈ గ్రహణ సమయంలో కొన్ని పనులు శుభమును ఇస్తాయని, కొన్నిఅశుభమును ఇస్తాయని. గ్రహణ సమయంలో పుట్టిన వారికి గ్రహణ మొర్రి వస్తుందని, గ్రహణ సమయంలో గర్భిని స్త్రీలు బయటకు వెళ్లరాదని, పౌర్ణమి-అమావాస్య నిజముగా అందరికి కీడు చేస్తాయా. ఇలాచాలా అపోహలు, అనుమానాలు ఉన్నాయి.

గ్రహణం సంభవించినపడు విడుదల అయ్యే కిరణాలు ప్రభావంతో అనారోగ్య సమస్యలు వస్తాయని, మన పెద్దలు కొన్ని నియమాలు పెట్టారు. ఆ కిరణాలు ఎక్కడికైనా చొచ్చుకు పోతాయి కాబట్టి గ్రహణ సమయంలో వండటం, తినడం లాంటివి చేయకూడదు అంటారు.

No comments:

Post a Comment

                         https://youtube.com/shorts/flB4WlmnbLs?si=SMNTDWimlM9c0PJd