Tuesday 24 December 2019

ఇందు లగ్నము :


రవి యొక్క కళలు 30, చంద్రునకు 16, కుజునకు 6, బుధునకు 8, గురునకు 10 , శుక్రునకు 12, శనికి 1 , అని చెప్పబడేను. ఈ కళలను బట్టి జన్మ లగ్నము లగాయతు , చంద్ర లగ్నము లగాయతు, నవమాధిపతులయొక్క కళలను కలిపి ఆ మొత్తమును 12 చేత భాగించగా , శేషమెంతయుండునో చంద్రుడున్న రాశి లగాయతు అన్నవ రాశి "ఇందు లగ్న" మగును . చంద్రుడు జన్మ లగ్నములో యున్నచో తొమ్మిదవ స్థానాధిపతి యొక్క కళలను ఒక్కటి మాత్రమే గ్రహించి , దానిని 12 చే భాగించి శేషము యెంత యుండునో లగ్నము లగాయతు అన్నవ రాశి "ఇందు లగ్నము" అగును. శేషము రానిచో 12 శేషముగా భావించవలయును.
ఉదాహరణ జాతకము :
లగ్నము లగాయతు 9 వ రాశి మకరం. దాని అధిపతి శని .
చంద్ర లగ్నం లగాయతు 9 వ రాశి వృషభం . దాని అధిపతి శుక్రుడు.
శని కళలు = 1, శుక్రుని కళలు = 12.
ఈ రెండింటి కళలను కూడిన 1+12=13 వచ్చును.13 ను 12 చే భాగించగా వచ్చు శేషము =1 .
ఈ '1' ప్రకారం చంద్ర లగ్నం నుండి లెక్కించిన చంద్రుడు వున్న రాశియే ఇందు లగ్నం అవుతుంది.
కావున ఈ జాతకుని ఇందు లగ్నం "కన్య".
ఇందు లగ్నము - ఫలము.
ఇందు లగ్నమందు ఏదైనా గ్రహము ఉంటే , ఆ గ్రహము యొక్క దశ పూర్తిగా యోగించును.
ఇందు లగ్నంలో పాప గ్రహము వున్నను , దాని దశలో జాతకునికి శుభములు కలుగును.
పాపగ్రహ యుతులు కాని శుభ గ్రహాలు ఇందు లగ్నంలో వుంటే మంచి ధన యోగం.
2,4,5,9,10,11, స్థానాలకు అధిపతులైన పాప గ్రహము ఇందులగ్నంలో వుంటే ధన యోగం కలుగుతుంది.
ధన , లాభాధిపతులు ఇందులగ్నంలో వుంటే రాజయోగం.

No comments:

Post a Comment

                         https://youtube.com/shorts/flB4WlmnbLs?si=SMNTDWimlM9c0PJd