Tuesday 25 December 2018

షడ్బలములు :

షడ్బలములు :

బలం కలిగి ఉండడం అనే విషయంలో ‘బలవాన్ షడ్బల యుక్తస్సన్’ అని చెప్పారు. స్థానంలో షడ్బలయుక్తుడయి ఉండడం ప్రధానం అని చెప్పారు. జాతక చక్రంలో గ్రహాలు షడ్బలములలో ఏదో ఒక బలమును కలిగి ఉండాలి. అప్పుడే ఆ గ్రహం బలం కలిగి ఉంటుంది. జాతకంలో యోగ కారక గ్రహాలు షడ్బలములలో ఏదో ఒక బలము ఖచ్చితంగా కలిగి ఉండాలి.
షడ్బలములు అంటే ఆరు రకములు. స్థానబలం, దిగ్బలం, దృగ్బలం, కాలబలం, చేష్టాబలం, నైసర్గిక బలం అనేవి. షడ్బలములు జాతకపరిశీలనలో ఆయుర్ధాయం, గ్రహ, భావ బలముల, బలహీనతల విషయంలో ఉపయోగపడతాయి. ఉదా:- జాతక చక్రంలో లగ్నం బలంగా ఉంటే లగ్నం నుండి ఫలితాలు బాగుంటాయి. చంద్రలగ్నం బలంగా ఉంటే చంద్రలగ్నం నుండి ఫలితాలు బాగుంటాయి. సూర్య లగ్నం బలంగా ఉంటే సూర్య లగ్నం నుండి ఫలితాలు బాగుంటాయి. అదే విధంగా దశ అంతర్ధశలలోను సూర్యుడి మహాదశలో చంద్ర అంతర్ధశ జరుగుతున్నప్పుడు ఏ గ్రహం బలంగా ఉంటే ఆ గ్రహ ఫలితాలు వస్తాయి.
స్ధానబలం గ్రహానికి ఉంటే ఉన్న ప్రదేశంలో రాణిస్తాడు.
దిగ్భలం గ్రహానికి ఉంటే సమస్య పరిష్కారం తొందరగా అవుతుంది.
చేష్టా బలం గ్రహానికి ఉంటే జాతకుడు చేసే ప్రతి పని మేలు చేస్తుంది. అతని చేష్టలు (పనులు) ఇతరులు మెచ్చుకుంటారు.
కాలబలం గ్రహానికి ఉంటే సమయం వృధా కాకుండా ఉంటుంది.
దృగ్భలం గ్రహానికి ఉంటే ఇతరుల దృష్టిలో మంచివాడవుతాడు. నరదృష్టి ఉండదు.
నైసర్గిక బలం గ్రహానికి ఉంటే ప్రత్యేకమైన ఫలితాలు ఏమి ఉండవు.
1.స్ధానబలం:- జాతకచక్రంలో ఏ గ్రహమైన ఉచ్చ, మూలత్రికోణం, స్వస్ధాన, మిత్ర స్ధానాలలో ఉన్నప్పుడు స్ధాన బలం కలిగి ఉంటుంది.
2.దిగ్భలము:- లగ్నం తూర్పును, దశమం దక్షిణాన్ని, సప్తమం పడమర, చతుర్ధం ఉత్తర దిక్కులను తెలియజేస్తాయి. గురువు, బుధులు లగ్నములో (తూర్పు) ఉన్నప్పుడు , రవి, కుజులు దశమంలో (దక్షిణం) ఉన్నప్పుడు, శని సప్తమంలో (పడమర) ఉన్నప్పుడు, శుక్ర, చంద్రులు చతుర్ధంలో (ఉత్తరం) లో ఉన్నప్పుడు బలం కలిగి దిగ్భలం కలిగి ఉంటారు. వ్యతిరేక దిశలలో ఉంటే దిగ్బలాన్ని కోల్పోతారు. ఉదా:- సూర్యుడు దశమంలో ఉంటే దిగ్భలం కలిగి ఉంటుంది. అదే చతుర్ధంలో ఉంటే దిగ్భాలాన్ని కోల్పోయి నిర్భలము పొందును.
3. చేష్టాబలం:- రవి, చంద్రులు ఉత్తరాయణంలో ప్రయాణిస్తున్నప్పుడు, కుజ, గురు, బుధ, శుక్ర, శనులు వక్రము పొంది ఉన్నప్పుడు బలాన్ని కలిగి ఉంటారు. శుభగ్రహాలు శుక్ల పక్షం నందు, పాపగ్రహాలు బహుళ పక్షము నందు బలవంతులు.
4. కాలబలం:- చంద్ర, కుజ, శనులు రాత్రి సమయములందు, రవి, గురు, శుక్రులు పగటి సమయమందు, బుధుడు అన్నీ సమయములందు బలము కలిగి ఉంటాడు. పాపగ్రహములు కృష్ణపక్షమునందు, శుభగ్రహములు శుక్లపక్షమునందు బలము కలిగి ఉంటారు. ఆయా గ్రహాలకు సంబందించిన వారము, మాసములలోనూ బలము కలిగి ఉంటారు.
5. దృగ్భలం:- గ్రహములు శుభ గ్రహములచే చూడబడుతున్నప్పుడు శుభగ్రహముల దృష్టి దృగ్భలాన్ని, పాపగ్రహముల దృష్టి వ్యతిరేఖ ఫలితాలను కలిగిస్తాయి.
6. నైసర్గిక బలం:- రవి, చంద్ర, శుక్ర, గురు, బుధ, కుజ మరియు శనులు వరసగా బలం కలిగి ఉంటారు. శని కంటే కుజుడు, కుజుని కంటే బుధుడు, బుధుని కంటే గురువు, గురువు కంటే శుక్రుడు, శుక్రుని కంటే చంద్రుడు, చంద్రుని కంటే రవి బలవంతులు.

షోడశ వర్గ చక్రాల విశ్లేషణ :

షోడశ వర్గ చక్రాల విశ్లేషణ :

జాతకచక్రంలో కేవలం రాశి చక్రాన్నే కాకుండా బావచక్రాన్ని,నవాంశ చక్రాన్ని, షోడశ వర్గ చక్రాలను కూడా పరిశీలించాలి. జాతకచక్ర పరిశీలన చేసేటప్పుడు షోడశ వర్గ చక్రాలను కూడ జాతకచక్రంలోని పరిశీలించాలి.ఈ షోడషవర్గుల పరిశిలన వలన జాతకచక్రంలోని రహస్యమైన అంశములను తెలుసుకొనుటకు అవకాశము కలదు.
ఈ షోడశవర్గులే కాక జైమిని పద్దతిలోనూ, తాజక పద్దతి యందు పంచమాంశ, షష్ఠాంశ, అష్ఠమాంశ, లాభాంశ లేక రుద్రాంశ అను నాలుగు వర్గులను సూచించినారు.
పంచమాంశ:- పూర్వపుణ్యబలం, మంత్రం, సిద్దించునా లేదా తెలుసుకోవచ్చు.
షష్టాంశ;- అనారోగ్యం అమంతర్గతంగా ఉందా లేదా బహిర్గతమంగా ఉందో తెలుపును.
అష్టమాంశ:-ప్రమాదాలు, దీర్ఘకాలిక వ్యాదులు, యాక్సిండెంట్స్,వైద్యపరంగా యాక్సిడెంట్ ద్వారా అవయవాన్ని తొలిగించుట.యాసిడ్ దాడులు.
లాభాంశ(రుద్రాంశ):-ఆర్ధికపరమైన లాభాలు,వృషభరాశి ఏలగ్నంగాని, గ్రహంగాని రాదు. వృషభరాశి శివుడికి సంబందించిన రాశి కాబట్టి ఈ రాశిలో ఏగ్రహం ఉండదు.
లగ్న కుండలి
లగ్న కుండలి జాతకానికి సంబంధించిన అన్ని అంశాలను తెలియ జేస్తుంది. మనిషి మనస్తత్త్వం, శారీరక స్థితి, గుణగణాలు, జీవన విధానం మొదలైన అనేక విషయాలు లగ్నకుండలి ద్వారా తెలుసుకొవచ్చు.
నవాంశ కుండలి(D9)
రాశి చక్రమందు యోగం ఉండి నవాంశ యందు గ్రహాల స్ధితి యుతులలో అవయోగ మేర్పడిన రాశి యందలి ఫలితమునకు విఘాతం కలుగును. రాశిచక్రం జన్మమైతే నవాంశ ప్రాణం.నవాంశ కుండలి మనిషి భాగ్యాన్ని, వైవాహిక జీవితాన్ని తెలియ జేస్తుంది. ఒక మనిషి అదృష్టవంతుడా, కాదా, అదృష్టం దేని ద్వారా వస్తుంది. తదితర విషయాలు వివాహానికి సంబంధించి వివాహ యోగం ఉన్నదా, లేదా, జీవిత భాగస్వామికి సంబంధించిన విషయాలు, వైవాహిక జీవితం ఎలా ఉంటుంది మొదలైన విషయాలు నవాంశ కుండలి ద్వారా తెలుస్తాయి.
హోరా(D2) కుండలి
హోరా కుండలి ఆర్థిక స్తితిని గురించి తెలియ జేస్తుంది. అలాగే మనలో ఉండే వివిధ అంశాల సంతులతను సూచిస్తుంది. రవిహోర(సింహరాశి)లో ఎక్కువ గ్రహలు ఉన్నట్లయితే కృషితో ఎక్కువ సంపాదన ఉంటుంది.సింహం మనలో ఉండే బహిర్గత అంశాలను, కర్కాటకం అంతర్గత అంశాలను సూచిస్తుంది.
ద్రేక్కాణ(D3) కుండలి
వైద్య జ్యోతిష్యంలో ద్రేక్కాణం ద్వారా ఏ శరీర భాగానికి అనారోగ్యం కలుగుతుందో తెలుసుకోవచ్చును.
ద్రేక్కాణం శరీర భాగాలు, ఆరోగ్య సమస్యల గురించి చెబుతుంది. ఇది లగ్న కుండలి లో 3 వ భావం, సోదరీమణులు, స్నేహితులు మరియు భాగస్వామ్యాలు గురించి చెబుతుంది. ఇది మన సామర్థ్యాన్ని పని, లేదా ఒక సమూహం లో, కొన్ని లక్ష్యాన్ని సాధించడాన్ని సూచిస్తుంది. శక్తి, ఆసక్తి, ధైర్యం, పరాక్రమం. మొదలైనవి ద్రేక్కాణ కుండలి ద్వారా తెలుసుకోవచ్చు విశ్లేషణ కొరకు లగ్న కుండలి మరియు కుజుడి స్థితి మరియు 3 వ భావాన్ని తనిఖీ చెయ్యాలి.
చతుర్థాంశ(D4) కుండలి
చతుర్థాంశ మనకు కలిగే సౌకర్యాలు, గృహ వాహనాది యోగాలు, మన జీవితం కష్టాలతో కూడినదా లేక సుఖాలతో కూడినదా, తదితర అంశాల గురించి చెపుతుంది.
సప్తాంశ(D7) కుండలి
సప్తాంశ సంతానం గురించి అలాగే మనలో ఉండే సృజనాత్మక శక్తి గురించి చెపుతుంది.సంతానం,వంశోన్నతి,వంశాభివృద్ధి చూడవచ్చు
దశమాంశ(D10) కుండలి
దశమాంశ ఉద్యోగము మరియు కీర్తి ప్రతిష్టల గురించి తెలియ జేస్తుంది. కర్మలు,వాటి ఫలితాలు,ఉద్యోగం,గౌరవాలు,కీర్తిప్రతిష్ఠలు,వృత్తిలో ఒడిదుడుకులు తెలుసుకోవచ్చు.
ద్వాదశాంశ(D12) కుండలి
ద్వాదశాంశ మన అదృష్టం గురించి, పూర్వ జన్మలో మనం చేసిన కర్మ ఫలితాలను గురించి తెలియజేస్తుంది. అలాగే వంశ సంబంధ దోషాలను గురించి కూడా తెలియ జేస్తుంది.తల్లిదండ్రులతో అనుబందాలు,వారి నుండి వచ్చే అనారోగ్యాలు,ఎవరి నుండి ఎవరికి సుఖం ఉన్నదో తెలుసుకోవచ్చును.
షోడశాంశ(D16) కుండలి
షోడశాంశ మనకు గల గృహ, వాహనాది సౌఖ్యాలను గురించి తెలిసజేస్తుంది. అలాగే ఒక వ్యక్తి అంతర్గంతంగా ఎలాంటివాడో తెలుసుకోవటానికి ఇది ఉపయోగపడుతుంది.వాహనసౌఖ్యం,వాహనాలతో చేసే వృత్తి వ్యాపారాలు లాభిస్తాయో లేదో తెలుసుకోవచ్చును.వాహనానికి ఏరంగు మంచిదో తెలుసుకోవచ్చును.
వింశాంశ(D20) కుండలి
వింశాంశ మనం చేసే దైవారాధన, అనుకూల దైవం, గురూపదేశం తదితర ఆధ్యాత్మిక అంశాలను తెలియ జేస్తుంది. మనం ఏ దేవున్ని ఉపాసన చేయాలి అనేది దీని ద్వారా కనుక్కోవచ్చు.మంత్రోచ్చారణ ,దేవుడిని పూజించేటప్పుడు అడ్డంకులు వస్తాయో లేదో తెలుసుకోవచ్చును.వింశాంశలో శుక్రుడు బలహీనంగా ఉండాలి.బలహీనంగా ఉంటేనే సన్యాసియోగం వస్తుంది.అప్పుడే దైవచింతన చేయగలడు.
చతుర్వింశాంశ(D24) కుండలి
చతుర్వింశాంశ మన విద్యను గురించి ఆధ్యాత్మికతను గురించి తెలియజేస్తుంది. ఉన్నతవిద్య,విదేశి విద్య,విద్యలో ఆటంకాలు గురించి తెలుసుకోవచ్చు.
సప్తవింశాంశ(D27) కుండలి
సప్తవింశాంశ మన శారీరక, మానసిక శక్తియుక్తుల గురించి తెలియజేస్తుంది. అలాగే మన జీవితానికి సంబందించిన అంశాల సూక్ష్మపరిశీలనకు లగ్న కుండలితో పాటు దీన్ని కూడా పరిశీలించాలి.జాతకుడిలో ఉండే బలాలు, బలహీనతలు తెలుసుకోవచ్చును.
త్రింశాంశ కుండలి(D30)
త్రింశాంశ మన కష్ట, నష్టాలను గురించి, అనుకోకుండా వచ్చే ఆపదల గురించి, ప్రమాదాల గురించి తెలియజేస్తుంది.స్త్రీ పురుషుల శీలం,వ్యక్తి యొక్క అంతర్గత ఆలోచనలు,అరిష్టాలు తెలుసుకోవచ్చును.
ఖవేదాంశ(D40) కుండలి
ఖవేదాంశ జాతకాన్ని మరింత క్షుణ్ణంగా అధ్యయనం చేయటానికి, జాతకంలో కల శుభాశుభ అంశాలను తెలుసుకోవటానికి అలాగే మనకు కల అలవాట్లను, భావోద్వేగాలను అంచనా వేయటానికి ఉపయోగపడుతుంది. మాతృవంశం నుండి వచ్చే శుభ కర్మ,అశుభ కర్మ ఫలితాలను తెలుసుకోవచ్చును.
అక్షవేదాంశ కుండలి(D45)
అక్షవేదాంశ మనకుండే నైతిక విలువలను గురించి, జాతకానికి సంబంధించిన అంశాలను సూక్ష్మ పరిశీలన చేయటానికి ఉపయోగ పడుతుంది.తండ్రివంశం నుండి వచ్చే శుభ కర్మ,అశుభ కర్మ ఫలితాలను తెలుసుకోవచ్చును.
షష్ట్యంశ కుండలి (D60)
షష్ట్యంశ జాతకానికి సంబంధించి సూక్ష్మ పరిశీలనకు అలాగే కవలల జాతకాల పరిశీలన విషయంలో ఇది ఉపయోగపడుతుంది.పూర్వజన్మ విషయాలు, కవలల విశ్లేషణకు,ముహూర్తమునకు,ముహూర్త లగ్నం షష్ట్యంశలో మంచిగా ఉండాలి.

భావకారకులు – యోగకారకులు :

భావకారకులు – యోగకారకులు :
జాతకచక్రంలో 12 భావాలకు భావకారకులు ఉంటారు. భావకారకుడు భావంలో ఉంటే ఆ భావం ఫలితాలు బాగుంటాయి. కారకోభావనాశాయ ప్రకారం భావకారకుడు భావంలో ఉంటే ఆ భావ లక్షణాలను చెడగొడతాడు. ఉదా:- పంచమం సంతాన స్ధానం, సంతాన కారకుడు గురువు , గురువు పంచమంలో ఉంటే కారకోభావనాశాయ ప్రకారం సంతానం లేటు కావటం, లేదా మనం అనుకున్న దానికి విరుద్ధంగా కలగటం జరుగుతుంది. గురువుకి ఆ క్షేత్రం శత్రుక్షేత్రం గాని, పాప గ్రహ దృష్టి ఉన్నప్పుడు మాత్రమే ఇలా జరుగుతుంది.
లగ్నభావానికి –రవి కారకుడు
ధనభావానికి-గురువు కారకుడు
భ్రాతృభావానికి-కుజుడు కారకుడు
మాతృభావానికి-చంద్రుడు,బుధుడు కారకులు
మంత్రభావానికి-గురువు కారకుడు
శతృభావానికి-శని, కుజుడు కారకుడు
వివాహభావానికి-శుక్రుడు కారకుడు
ఆయుర్భావానికి-శని కారకుడు
బాగ్యభావానికి-రవి, గురువు కారకులు
రాజ్యభావానికి-రవి,బుధ,గురు,శని కారకులు
లాభభావానికి-గురువు కారకుడు
వ్యయభావానికి-శని కారకుడు
ఈ భావకారకాదిపతులు కారక భావంలో ఉంటే ఆ భావం వర్తించే కారకాన్ని చెడగొడుతుంది. కారకోభావనాశాయ ఫలితం ఎక్కువగా పాప,శత్రు గ్రహాల దృష్టి ఉంటేనే కారకభావం చెడుతుంది.
"భావకారకుడు ఆ భావంలో ఉంటే భావాన్ని నాశనం చేస్తాడు". అనే సూత్రం ప్రసిద్ధమైనదే గాని ఫలితాలలో ఆ సూత్రానికి ప్రాముఖ్యం కనిపించటం లేదు.
తను, భాగ్య భావాలలో రవి, ద్వాదశ భావంలో శని, పంచమ భావంలో గురువు సత్పలితాలను ఇవ్వటం లేదు.
సప్తమ శుక్రుడు దోషి అనే మాట ప్రచురంగా కనిపిస్తుంది. సప్తమ శుక్రుడు ఉంటే భార్య ఆకర్షణీయంగా ఉంటుంది. నేటి కాలంలో భార్య ఆకర్షణీయంగా ఉండటాన్ని నేటి తరం వారు అభిలసిస్తున్న కారణంగా సప్తమ శుక్రుడు శుభఫల ప్రధాతగా గుర్తించవలసిన అవసరం ఉంది.
ఉదా- పురుషులకు సప్తమంలో శుక్రుడు ఉంటే కారకోభావనాశాయ, స్త్రీలకు సప్తమంలో గురువు ఉంటే కారకోభావనాశాయ అంటారు. దీని వలన పాప,శత్రు గ్రహాల దృష్టి ఉంటేనే కళత్ర దోషం ఉంటుంది.
2,11 భావాలలో గురువు ఉంటే డబ్బు ఉంటుంది కానీ సెక్యూరిటీ ఉండదు. కారకోభావనాశాయ సూత్రం ప్రకారం శత్రురాశిలో ఉన్న, పాపగ్రహ దృష్టి ఉన్న అభద్రతాభావం ఉంటుంది.
అష్టమ భావంలో శని ఉంటే ఆయుష్కారకుడు కావటం వలన ఆయుర్ధాయాన్ని కలిగి ఉంటాడు. కారకోభావనాశాయ ప్రకారం శత్రురాశిలో ఉన్న, పాపగ్రహ దృష్టి ఉన్న దీర్ఘకాల వ్యాధిని కల్పించి ఇబ్బంది పెడతాడు.
వ్యయ భావంలో శని ఉంటే యోగసాధన (తపశ్శక్తి) కలిగి ఉంటాడు. కారకోభావనాశాయ ప్రకారం శత్రురాశిలో ఉన్న, పాపగ్రహ దృష్టి ఉన్న అధికంగా ఖర్చులు, తిండి సరిగా తినలేకపోవటం, నిద్ర సరిగా పట్టకపోవటం జరుగుతుంది.
భావకారకుడు, యోగకారకుడు ఒక్కడే అయితే మంచి యోగం కలుగుతుంది.
ఉదా:- వృశ్చిక లగ్నానికి ద్వితీయ, పంచమాధిపతులు గురువు యోగకారకుడు, భావకారకుడు అవుతాడు.
కుంభ లగ్నానికి ద్వితీయ, లాభాదిపతి గురువు కావటం వలన లగ్నానికి శత్రువైన యోగకారకుడు, భావకారకుడు అవుతాడు.
మేష లగ్నానికి చతుర్ధాధిపతి చంద్రుడు యోగ కారకుడు అవుతాడు.

Monday 24 December 2018

IMPORTANCE OF YOGAS IN THE JUDGEMENT OF HOROSCOPES.

IMPORTANCE OF YOGAS IN THE JUDGEMENT OF HOROSCOPES.

Yoga is a Hindi word which means addition: but while using this term in connection with the judgement of a horoscope, yoga means a combination or disposition of some planets in such away as to mar or improve the structure of the horoscope. Good disposition of the auspicious planets in the horoscope gives rise to beneficial yogas which have been given different names as Dhana Yogas meaning wealth giving combinations, raja yogas meaning combinations which gave name,fame,honour and wealth to the native. still highly categorised yogas are called maha bhagya yogas , maha raja yogas etc..to the native. classical texts on Hindu Astrology are full of such yogas .
At first we will describe how the Dhana yogas (wealth giving combinations) and Daridra yogas (Poverty giving yogas) are formed.
Dhana Yogas :
01) when lords of 09th and 11th house are in one house
02) when lords of 09th and 10th house are in one house
03) when lords of 09th and 04th house are in one house
04) when lords of 09th and 05th house are in one house
05) when lords of 09th and 01st house are in one house
06) when lords of 09th and 02nd house are in one house
07) when lords of 10th and 11th house are in one house
08) when lords of 10th and 04th house are in one house
09) when lords of 10th and 05th house are in one house
10) when lords of 10th and 02nd house are in one house
11) when lords of 10th and 01st house are in one house
12) when lords of 11th and 01st house are in one house
13) when lords of 11th and 02nd house are in one house
14) when lords of 11th and 04th house are in one house
15) when lords of 11th and 05th house are in one house
16) when lords of 01st and 02nd house are in one house
17) when lords of 01st and 05th house are in one house
18) when lords of 01st and 04th house are in one house
19) when lords of 02nd and 05th house are in one house
20) when lords of 02nd and 04th house are in one house
21) when lords of 04th and 05th house are in one house
These yogas will bear fruit only if they are formed in auspicious houses i.e 1st, 2nd, 4th, 5th, 7th, 9th,10th and 11th. They will be of little value if they are formed in houses 3,6,8 and 12. Not only the associationof the above planets constitutes dhana yoga but the yoga arises also if there is mutual aspect or even one sided aspect amongst them.
Daridra Yogas :
Combination of Lords of :
01) 06th and 02nd Houses
02) 06th and 01st Houses
03) 06th and 04th Houses
04) 12th and 04th Houses
05) 12th and 02nd Houses
06) 12th and 01st Houses
07) 06th and 10th Houses
08) 12th and 10th Houses
09) 06th and 05th Houses
10) 06th and 07th Houses
11) 12th and 05th Houses
12) 12th and 07th Houses
13) 06th and 09th Houses
14) 12th and 09th Houses
15) 06th and 03rd Houses
16) 12th and 03rd Houses
17) 06th and 11th Houses
18) 12th and 11th Houses
Rashi Parivartan Yoga :
This means when the lord of one sign (house) is in another sign and the lord of the latter sign is in the former. This yoga becomes a mahabhagya yoga if exchange is between lords of auspicious houses viz..2,4,5,7,9,10 and 11. Such yoga gives in the mahadasa of one and the antardasa of other planet (who are involvedin the yoga) great name , fame and wealth. However , if the exchange is between the lord of good house and lord of 3,6,8 or 12it is called dainya yoga which causes ups and downs and struggles in life, particularly in the mahadasa and antardasa of planets involved in the yoga. The exchange of houses between lords of 3,6,8,and 12 amongst themselves is good and becomes vipareet rajyoga.
Sunapha Yoga :
When there are planets in the 2nd to chandra this yoga is caused. it gives wealth,name and fame to the native according to the natural qualities of planet.Even a malefic is considered good in this yoga-of course he will give the benefit according to his own qualities. Ravi,Rahu and Ketu don't count in this yoga.
Anapha Yoga :
This is formed when there are planets in the 12th house to chandra. Here it is better if the planets are natural benefics. Malefics give trouble and benefics give the native name , wealth , fame and success: but all has to be achieved by his own efforts .Here also Ravi,Rahu and Ketu are not considered.
Durudhara Yoga :
This is caused when there are planets both in the 2nd and 12th houses to chandra. Benefics give very good results and malefics cause trouble. Benefics and Malefics combined give mixed results.
Kemadruma Yoga :
This is an inauspicious yoga and is caused when there are no planets in the 2nd and 12th houses to chandra. Presence of this yoga in the horoscope , it is said , lessons the good effects of other yogas and gives little success to the native in his life. It is beleived that the evil effects of this yoga are cancelled if chandra is posited in the horoscope in kendra to the lagna , or chandra is in his own sign kataka or if there are planets in kendra position of chandra.
Chandra Mangal yoga :
If Kuja (Mangal) is associated with Moon this yoga is formed. Some say that this yoga is also formed if there is mutual aspect between chandra and kuja. The effect of this yoga is gain of wealth through occupations like bad works. If the combination has good aspect of Guru or Sukra, the gain of wealth will be through fair means.
Lagnaadhiyoga and Chandraadhiyoga :
When there are benefics (Guru,Sukra and Budha) in the houses 6,7 and 8th or 6th or 7th or 8th from lagna or chandra (chandra lagna) this yoga is formed. For the yoga to be fully effective it should be formed by all three benefics not by one or two only. The presence of this yoga in the birth chart will make the native polite and trustworthy , happy , wealthy , famous and will enable him to be victorious over his enemies. This is considered to be one of the most beneficial and auspicious yoga.
Chatussara Yoga :
This yoga is caused when all the kendras are occupied by planets. With this yoga in th horoscope the native will earn good reputation, will be very well off in his life and will be blessed with children and will have name and fame all over the country.
Vasumati Yoga :
This yoga is formed when benefics occupy Upachaya houses (3.6.10 and 11) from lagna or chandra. The result of this yoga is that person will not be dependent on others and will be wealthy.
Amala Yoga :
This yoga is formed when there is a benefic in the 10th housefrom chandra or lagna . The presence of this yoga in the birth chart will enable the native to acheive lasting fame and reputation. He will have good moral character and be prosperous.
Kahala Yoga :
This yoga is formed when the lords of the 4th and 9th houses are in kendras from each other and lord of lagna is strong. This yoga makes the native stubborn,brave and head of village or community.
Subha Vesi Yoga :
If benefic planets other than chandra occupy the 2nd from Ravi, this yoga is formed. This yoga makes the person fortunate , happy, virtuous and famous.
Papa Vesi Yoga :
This yoga is formed by the malefics being 2nd to Ravi. The result is opposite to ShubhaVesi Yoga.
Subha Vasi Yoga :
Benefic planets are in 12 th house to Ravi. The effect is good orator, well proportioned limbs , wealthy and famous.
Papa Vasi Yoga :
PapaVasi Yoga is formed by malefics in the 12th to Raviand gives opposite results.
Ubhayachari Yoga :
This is formed when there are planets on both sides of Ravi. Obviously benefic planets will give the results of the Shubha Vesi and Shubha Vasi yogas and the malefics the reserve of that.
Gaja Kesari Yoga :
Thsi yoga is formed when Guru is in kendra from chandra. This yoga gives many relations , makes the native polite and generous , builder of a village or town or its ruler and famous.
Pancha Mahapurusha Yogas :
1) Ruchaka Yoga : when Kuja is in his exaltation sign and is in kendra to lagna or chandra. The person born in this yoga will have good health , will be ruler or will hold high office in the army or police. He will be liberal , wealthy and longlived.
2) Hamsa Yoga : when Guru is in his exaltation or own sign and is in kendra to chandra or lagna. With this yoga the native will possess a beautiful body , he will be liked by others and will have a good moral character.
3) Bhadra Yoga : when Budha is in his exaltation or own sign and is in kendra to lagna or chandra the person born in this yoga will have good physique and well proportioned limbs , strong as that of a lion. He will be longlived and will do good to others.
4) Malavya Yoga : when Sukra is in his exaltation or own sign and is in kendra to lagna or chandra. Person with this yoga will have a well built body , be handsome ,wealthy , happy with wife and children. He will also be longlived, famous and will have the comfort of vehicles-(his own or those under his control).
5) Sasa Yoga : when Shani is in his exaltation or own sign and is in kendra to lagna or chandra. The person with this yoga will have many servants at this disposal. He will be cruel , a leader or the head of a village,town or he will be inclined to deprive others of their riches for his own benefit.
Pushkala Yoga :
This yoga is formed when the lord of the sign occupied by chandra (who should be associated with the lord of lagna) be in kendra or in the house of an intimate friend aspecting lagna and at the same time lagna be occupied by powerfull planets. This yoga makes the mative wealthy soft-spoken, famous and respected by government.
Lakshmi Yoga ;
This yoga is formed when the lord of lagna is powerfull and the lord of the 9th occupies a kendra trikona in own or exaltation sign.With this yoga the native will be noble , rich , learned , handsome , famous , honest , good ruler and will enjoy all comforts of life.
Kalanidhi Yoga :
Thsi yoga is formed when Guru be aspected by Budha or Sukra either in the 2nd or in the 5th house and Guru be in the 2nd or 5th in the sign of Budha or Sukra. This yog makes the native highly passionate , good natured , respected by authorities and he gets comforts of conveyances and other luxuries.
Kusuma Yoga :
This yoga is formed when Guru is in lagna , the chandra in the 7th and Ravi in the 8th from chandra. With this yoga the native will be a person of avery high status or be head of a town , village or community and he will have good reputation.
Asatyavadi Yoga :
This yoga is formed when the lord of the 2nd occupies the house of Shani or Kuja and if malefics join kendras and trikonas. This yoga makes the native a perfect liar.
Raja Yogas :
1) Three or more planets should be in exaltation , own house , occupying kendras.
2) When a planet is in debilitation but is retrograde and occupies a favourable position.
3) Three or Four Planets possess digbala.
4) The lord of the sign in which a planet is debilitated or the planet who would be exalted there should be in kendra to chandra or lagna. This is also called Neechabhanga rajayoga.
5) Chandra be in kendra (not in lagna) and be aspected by Guru.
6) Out of the lords of the 2nd,9th and 11th houses, at least one planet be in kendra from chandra , and Guru be lord of 2nd , 5th , or the 11th house.
7) (a) Lord of 9th in 9th
(b) Lord of 10th in 10th
(c) Lord of 9th in 10th or Lord of 10th in 9th
(d) Lord of 9th and 10th in 10th or in 9th
(e) Lord of 9th from 9th i.e. 5th in 5th
(f) Lord of 10th from 10th i.e. 7th in 7th
(g) Lord of 10th from 9th i.e. 6th in 6th
Mahabhagya Yoga :
As the name denotes this yoga is supposed to make the native very fortunate. This yoga is formed in day birth chart if the Lagna , Chandra and Ravi are all in odd signs. In a night birth chart the Lagna , Ravi and Chandra shold be in even signs.

Sunday 23 December 2018

పాచక,బోదక,కారక,వేదక యోగాలు

జాతకునికి ఈ సప్త గ్రహాలు అయా దశల యందు ఈ యోగాలు కలుగజేయును.పాచకయోగం పొందిన గ్రహం యొక్క దశలో వారిచ్చు ఫలములను ప్రకాశింపజేయును..భోదకయోగం పొందిన గ్రహం యొక్క దశలో వారిచ్చే ఫలములను బోదపరచేవాడగును.కారకయోగం పొందిన గ్రహం యొక్క దశలో వారిచ్చు ఫలములను చేయించేవాడగును.వేదకయోగం పొందిన గ్రహం యొక్క దశలో వారిచ్చు శుభ ఫలములను నాశనము చేయువాడు అగును.
పాచక యోగం:-సూర్యునికి 6 వ స్ధానంలో శని ఉన్న,చంద్రునికి 5 వస్ధానంలో శుక్రుడు,కుజుడికి 2 వస్ధానంలో సూర్యుడు,బుధుడికి 2 వస్ధానంలో చంద్రుడు,గురువుకి 6 వ స్ధానంలో శని,శుక్రునికి 2 వస్ధానంలో బుధుడు,శనికి 3 వ స్ధానంలో శుక్రుడు ఉన్న పాచక యోగం అంటారు.ఈ యోగ జాతకులు ధన లాభం,భూలాభం,ధైర్య సాహసాలు,దేహ సౌఖ్యాలు,అదికారాలు కలిగి ఉంటారు.
బోదక యోగం:-సూర్యునికి 7 వ స్ధానంలో కుజుడు, చంద్రునికి 9 వస్ధానంలో కుజుడు, కుజుడికి 6 వస్ధానంలో చంద్రుడు, బుధుడికి 4 వస్ధానంలో గురువు, గురువుకి 8 వ స్ధానంలో కుజుడు, శుక్రునికి 6 వస్ధానంలో సూర్యుడు, శనికి 11 వ స్ధానంలో చంద్రుడు ఉన్న భోదక యోగం అవుతుంది.ఈ యోగ జాతకులు ధన దాన్యాలు,కీర్తి ప్రతిష్ఠలు, భక్తి,విద్యా ప్రావీణ్యం కలిగి ఉంటారు.
కారక యోగం:- సూర్యునికి 9 వ స్ధానంలో గురువు, చంద్రునికి 11 వస్ధానంలో శని,కుజునికి 11 వస్ధానంలో శని,బుధునికి 5 వస్ధానంలో శుక్రుడు,గురువుకి 7 వ స్ధానంలో చంద్రుడు,శుక్రునికి 12 వ స్ధానంలో గురువు,శనికి 6 వ స్ధానంలో గురువు ఉన్న కారకయోగం అంటారు.ఈ యోగ జాతకులు మిత్రగ్రహాలతో కూడినప్పుడు మంచి ఫలితాన్ని,శత్రుగ్రహాలతో కూడినప్పుడు దుష్ట ఫలితాన్ని ,కొంతకాలం భాగ్యవంతులుగాను,కొంతకాలం దారిద్ర్యపు జీవితాన్ని అనుభవించేవారుగాను,శత్రు భయం,చోరభయం,కుటుంబ కలహాలు కలిగి ఉంటారు.
వేదక యోగం:-సూర్యునికి 11 వస్ధానంలో శుక్రుడు,చంద్రునికి 3 వ స్ధానంలో సూర్యుడు,కుజునికి 12 వస్ధానంలో బుధుడు,బుధునికి 3 వస్ధానంలో కుజుడు,గురువునికి 12 వస్ధానంలో సూర్యుడు,శుక్రునికి 4 వస్ధానంలో శని,శనికి 7 వస్ధానంలో కుజుడు ఉన్న వేధక యోగం అవుతుంది.ఈ యోగ జాతకులు మిత్రగ్రహాలతో కూడినప్పుడు మంచి ఫలితాన్ని,శత్రుగ్రహాలతో కూడినప్పుడు దుష్ట ఫలితాన్ని ఇస్తారు.అధిక దన వ్యయం చేయువారుగాను,శత్రు భాధలు,రుణభాధలు,అగ్ని ప్రమాదాలు,అవమానాలు,అధికారుల వేదింపులు,వైరాగ్యము,స్ధాన చలనం, కలిగి ఉంటారు.
No automatic alt text available.
జాతకచక్రంలో చతుర్విద పురుషార్ధాలు
ఒక వ్యక్తి జాతకచక్ర రీత్యా చతుర్విద పురుషార్ధాలైన ధర్మానికి ఎక్కువ ప్రాదాన్యత ఇస్తాడా,అర్ధానికి ప్రాదాన్యత ఇస్తాడా,కామానికి ప్రాదాన్యత ఇస్తాడా,మోక్షానికి ప్రాదాన్యత ఇస్తాడా అని అతని జాతకచక్రాన్ని పరిశీలించి చెప్పవచ్చును.
ప్రతి వ్యక్తి జీవితంలో ఏదో సాదించాలి అనే తపన,ఉత్సాహం ఉంటాయి.ఆ వ్యక్తి చతుర్విద పురుషార్ధాలలో దేనికి తన శక్తి సామార్ధ్యాలు దారపోస్తాడో జ్యోతిష్యశాస్త్రంలోని నక్షత్రాలద్వారా తెలుసుకోవచ్చును.
జాతకచక్రంలోని నక్షత్రాలు వ్యక్తిలోని గుణాలు శక్తి సామర్ద్యాలు తెలియజేస్తాయి.కాబట్టి నక్షత్రాలు వ్యక్తిలోని Aims and Goals తెలియజేస్తాయి.జాతకచక్రంలోని గ్రహాలు ఏ ఏ నక్షత్రాలలో ఉన్నాయో చూడాలి.
లగ్నం కూడా ఏ నక్షత్రంలో ఉందో చూడాలి.ఎక్కువ నక్షత్రాలు ధర్మ,అర్ధ,కామ,మోక్షాలలో దేనిలో ఉంటే ఆ అంశానికి ఎక్కువ ప్రాదాన్యతని ఇస్తాడు.
1)ధర్మం:-జాతకుడు తన జీవితంలో ఎంతవరకు నీతి నియమాలతో ,దర్మబుద్ధితో ఉండగలడో తెలియజేస్తుంది.
2)అర్ధం:- జాతకుడు తన జీవితంలో వృత్తి,ధనం,కుటుంబం,పోషణకు తన శక్తి సామర్ధ్యాలను వినియోగిస్తాడో లేదో తెలియజేస్తుంది.
3)కామం:- జాతకుడు తన జీవితంలో కోరికలు,వ్యామోహాలు,కామవాంచలు ఎంతమేరకు కలిగి ఉన్నాడో తెలియజేస్తుంది.
4)మోక్షం:-జాతకుడి జీవిత లక్ష్యం మోక్షం.
లగ్నంలో వివిధ గ్రహాల ఫలితాలు మరియు లగ్నాధిపతి వివిధ భావాలలో ఉంటే కలుగు ఫలితాల సమగ్ర పరిశీలన :
లగ్న భావ పరిశీలన 

లగ్నం అంటే జన్మించే సమయానికి తూర్పు దిగ్మండలంపై ఏ రాశి ఉదయిస్తుందో అదే లగ్నం అంటారు. లగ్నం నుండి శరీరం, ఎత్తు, రంగు, రూపం, సామర్ధ్యం, ఆయుర్ధాయం, వ్యక్తిత్వం, వ్యక్తి యొక్క గుణాలు, తెలివితేటలు మొదలగు అంశాలను తెలుసుకోవచ్చును. పుట్టిన వ్యక్తి యొక్క జన్మ సమయాన్ని శిశువును గర్భాశయం నుండి బయటకు తీసినప్పుడు కాకుండా శిశువు మొదటి శ్వాస, మొదటి ఏడుపు ద్వారా శిశువు జన్మ సమయాన్ని తీసుకొనవలెను.
లగ్నభావాన్నే తనూభావం అంటారు. బాల్యం, ఆరోగ్యం, వ్యక్తిత్వం, దేహం, నడవడిక, శరీర వర్ణం,శారీరక, మానసిక స్ధితి, జన్మించిన విధం, ఎత్తు, సామర్ధ్యం, గుణాలు, తెలివితేటలు, ఆయుర్ధాయం మొదలుగునవి తనూభావం ద్వారా తెలుసుకోవచ్చును. లగ్న కారకత్వాలు పరాశరుడు లగ్నం గురించి వివరిస్తూ లగ్నం ద్వారా తెలుసుకోదగిన అంశాలను ఈ విధంగా చెప్పాడు.
శ్లో।। తనుం రూపంచ జ్ఞానంచ, వర్ణం చైవ బలాబలం ।
ప్రకృతిం సుఖ దుఃఖంచ, తనుభావద్విచింత్యయేత్‌ ।। -
బృహత్పరాశరి, భావవివేచనాధ్యాయం, శరీరము, రూపము, వర్ణము, జ్ఞానము, బలాబలాలు, స్వభావము, సుఖదుఃఖాలు తనుభావము నుంచి తెలుసుకోవాలి.
కాళిదాసు తన ఉత్తర కాలామృతములో లగ్నభావకారకత్వాల్ని మరింతనిశితముగా విశ్లేషించాడు. శ్లో।।దేహశ్చావయవస్సుఖరాస్తే జ్ఞాన జన్మస్థలే, కీర్తిస్వప్న బలాయతీర్నృ -పనయాఖ్యాశాంతిర్వయః। కేశాకృత్యభిమాన జీవనపరద్యూతాంకమానత్వచో, నిద్రాజ్ఞాన ధనాపహార నృతిరస్కార స్వభావారుజః । వైరాగ్యప్రకృతీచ కార్యకరణం, జీవక్రియాసూద్యమః, మర్యాదప్రవినాశనంత్వితిభవేద్వర్థోపవాదస్తనోః ।।
దేహము, కాళ్ళు, చేతులు మొదలైన అవయవములు, సుఖదుఃఖములు, ముసలితనము, జ్ఞానము, జన్మభూమి, కీర్తి, స్వప్నము, బలము, ఆకారము, తర్వాత జరిగే ఫలితాలు అంటే ఒక కార్యముయొక్క పర్యవసానము ఏ విధముగా ఉంటుందో తెలుసుకోవటము, రాజనీతి, ఆయుర్దాయము, శాంతి, వయస్సు, కేశములు, అభిమానము, జీవనము, అపర విషయములు, జూదము, చిహ్నము, పౌరుషము, చర్మము, నిద్ర, అజ్ఞానము, ధనమును దొంగలించటము, మనుష్యులను తిరస్కరించు స్వభావము, రోగము లేకపోవటము, వైరాగ్యము, ప్రకృతి, కార్యములను చేయటం, జీవకార్యములయందు ప్రయత్నించుట, మర్యాదను పోగొట్టుకొనుట, మొదలైన ఫలితాలను లగ్నము ద్వారా చూడాలి.
చరలగ్నం అయిన సంచారం చేయువాడుగాను, స్ధిర లగ్నం అయిన స్ధిరంగా ఉండటం, ద్విస్వభావ లగ్నం అయిన మిశ్రమంగా ఉండటం.
జన్మించే సమయానికి లగ్నానికి మారకాధిపతి దశ గాని, భాదకాధిపతి దశ గాని, 22 వ ద్రేక్కాణాధిపతి దశ గాని, 64 వ నవాంశాధిపతి దశ గాని, అష్టమాధిపతి దశ గాని, అష్టమాన్ని చూస్తున్న గ్రహ దశలు గాని, అంతర్ధశలు గాని శిశువుకి జరుగుతున్నప్పుడు శరీరానికి సంబందించిన కష్టాలు, అనారోగ్యాలు కలుగుతాయి.
జన్మ లగ్నం చంద్రుని లగ్నం కంటే బలంగా ఉంటే వింశోత్తరి దశల ద్వారా ఫలితాలు మంచిగా వస్తాయి. చంద్ర లగ్నం జన్మ లగ్నం కంటే బలంగా ఉంటే లగ్న స్ఫుటం నుండి అనగా లగ్నం ఉన్న నక్షత్రం యొక్క అధిపతి ఎవరో ఆ దశల ద్వారా ఫలితాలు మంచిగా వస్తాయి. రవి లగ్నం అనగా రవి ఉన్నరాశి జన్మ, చంద్ర లగ్నాల కంటే బలంగా ఉంటే గురువు ఉన్న నక్షత్రం యొక్క అధిపతి దశల ద్వారా ఫలితాలు మంచిగా వస్తాయి.
లగ్నాధిపతి ఏ నక్షత్రంలో ఉంటాడో ఆ నక్షత్రానికి అధిపతి ఎవరో ఆ అధిపతి సూచించు వృత్తి సంబందించిన విషయాలలో పురోభివృద్ధి ఉంటుంది. లగ్నానికి యోగకారకులైన గ్రహాల యొక్క దశ అంతర్ధశలలోను వృత్తిలో అభివృద్ధి ఉంటుంది. లగ్నాధిపతి ఏ నక్షత్రంలో ఉంటాడో ఆ నక్షత్రానికి అధిపతి అయిన దశ అంతర్ధశాలలోనూ వృత్తి, వ్యాపార సంబంధ విషయాలలో పురోభివృద్ధి ఉంటుంది.
లగ్నంలో రవిగ్రహం ఉంటే కలిగే సాదారణ ఫలితాలు
లగ్నంలో రవి ఉంటే దీర్ఘకాలం కోపం, పగ ఉండటం. శిరోవేదన, ఉష్ణతత్వం, శరీరం పుష్టిగా ఉండటం, పల్చని జుట్టు, బట్టతల (లేత వయస్సులో), పాప గ్రహాల కలయిక వలన దయా గుణం లేకపోవటం, క్రూరంగా మాట్లాడటం జరుగుతుంది. సృజనాత్మక శక్తి, ధైర్యం, సాహసం కలిగి ఉంటారు.
లగ్నంలో చంద్రుడు ఉంటే కలిగే సాదారణ ఫలితాలు
లగ్నంలో చంద్రుడు ఉంటే గుండ్రని ముఖం, దట్టమైన జుట్టు, సున్నితమైన మనస్సు, బిడియం, సౌమ్యం, మానసికమైన సమస్యలు ( ముఖ్యంగా అమావాస్య, పౌర్ణమి రోజుల్లో), ఆటుపోటులు, కంటివ్యాది, మానసిక వ్యాది (అంతర్గత జబ్బు, ఎడమ చెవి ప్రాబ్లం, మాట త్వరగా రాకపోవటం( నత్తి), ధనానికి ప్రాబ్లం ఉండదు.
లగ్నంలో కుజుడు ఉంటే కలిగే సాదారణ ఫలితాలు
లగ్నంలో కుజుడు ఉంటే దూకుడుతనం, కలర్ తక్కువ కలిగి ఉంటారు, ముఖంపై మచ్చలు ఉండటం, దెబ్బలు తగలటం, జన, సోదర సహకారం కలిగి ఉండటం, క్రీడలలో రాణింపు, గట్టిగా మాట్లాడటం, వివాదాలు కలిగి ఉండటం, త్వరగా కోపం రావటం, ఇతరులను నిందించటం, కొట్టటం, చెడు అలవాట్లకు బానిస కావటం జరుగుతుంది.
లగ్నంలో బుధుడు ఉంటే కలిగే సాదారణ ఫలితాలు
లగ్నంలో బుధుడు ఉంటే తెలివితేటలు కలిగి ఉంటారు. అతితెలివి కూడా కలిగి ఉండటం. మంచి వస్త్రాలు ధరిస్తారు. చక్కని భాష కలిగి ఉంటారు. లెక్కలలో రాణిస్తారు. ప్రతి విషయాన్ని అంచనా వేస్తారు. వాక్ శుద్ధి కలిగి ఉంటారు. రాయబారాలు నెరవేరుస్తారు. కమ్యూనికేషన్ రంగంలో రాణిస్తారు. ఇతరులు ఏది చెబితే వింటారో అది చెప్పగలగటం, లాజిక్ గా తెలివిగా మాట్లాడి జనాలను ఆకర్షిస్తారు. నపుంసకత్వం, నరాల బలహీనత కలిగి ఉంటారు.
లగ్నంలో గురువు ఉంటే కలిగే సాదారణ ఫలితాలు
లగ్నంలో గురువు ఉంటే ఆరోగ్యవంతమైన శరీరం, కొవ్వు పట్టిన లావు శరీరం, ఉభకాయం,, ధర్మాన్ని కాపాడటం, శాంత స్వభావం, ఆలోచనా విధానం లో మార్పులు, తను కష్టపడి శత్రువుకైనా మంచి చేస్తాడు. శుభ్రత కలిగి ఉండటం, దైవ చింతన, తీర్ధయాత్రలు చేయటం, మంచి అలవాట్లు కలిగి ఉంటారు.
లగ్నంలో శుక్రుడు ఉంటే కలిగే సాదారణ ఫలితాలు
లగ్నంలో శుక్రుడు ఉంటే అందమైన శరీరం, సుగంధ ద్రవ్యాల యందు ప్రీతి, సున్నితమైన శరీరం, సుఖ జీవనంపైన మక్కువ, కష్టపడి పని చేయలేకపోవటం, ఆకర్షణ, స్త్రీలను అధికంగా ఆకర్షించుట, ఇతరుల ఆకర్షణకు లోబడటం జరుగుతుంది. లగ్జరీగా ఉండటం జరుగుతుంది.
లగ్నంలో శని ఉంటే కలిగే సాదారణ ఫలితాలు
లగ్నంలో శని ఉంటే సన్నని పొడవైన శరీరం, బద్ధకం, నల్లని శరీరం, ప్రతి పని నిదానం, లోభం, పిసినారి తనం కలిగి ఉండటం, అపరిశుభ్రం, చింపిరి జుట్టు, చిన్నతనంలోనే ముసలి ఛాయలు, మురికి బట్టలు ధరించటం, ఆలస్య వివాహాలు, ప్రతి పనిలోనూ ఆటంకం, నిరాశగా ఉండటం జరుగుతుంది. మొండిగా ప్రవర్తించటం.
లగ్నంలో రాహువు ఉంటే కలిగే సాదారణ ఫలితాలు
లగ్నంలో రాహువు ఉంటే మోసపోవటం, మోసగించటం, లొంగిపోవటం, లోగదీసుకోవటం, కులాంతర, మతాంతర వివాహాలు చేసుకోవటం, ఉద్రేకంగా ఉండటం, క్రూరమైన ఆలోచన కలిగి ఉండటం. మనస్సులో అనుకున్నది చెప్పకపోవటం, వక్రబుద్ధి కలిగి ఉండటం, చపలత్వం కలిగి ఉండటం, ఊహాత్మకమైన విషయాలు, అనుమానాలు, ఏదో జరుగుతుందని ముందుగానే ఊహించుకొని బయపడటం, అనవసరమైన అపోహలు విదేశీయానం చేయటం, స్త్రీలకు వాయుతత్వ రాసులైన లగ్నంలో రాహువు మంచిది.
లగ్నంలో కేతువు ఉంటే కలిగే సాదారణ ఫలితాలు
లగ్నంలో కేతువు ఉంటే మూడ భక్తి కలిగి ఉంటారు. తప్పుడు సలహాలు ఇస్తారు. వివాహంపై మక్కువ లేకపోవటం జరుగుతుంది. ఈ పని సరిగా చేయకపోవటం, నిలకడలేకపోవటం, వితండవాదం చేయటం వీరికున్న లక్షణాలు. ప్రతి చిన్న విషయానికి అలగటం, భయపడటం, మౌనవ్రతం పాటించటం. దైవంపైన అతి భక్తి.
లగ్నాధిపతి వివిధ భావాలలో ఉంటే కలిగే ఫలితాలు:
ఏ నక్షత్రంలో ఉంటాడో ఆ నక్షత్రానికి అధిపతి ఎవరో ఆ అధిపతి సూచించు వృత్తి సంబందించిన విషయాలలో పురోభివృద్ధి ఉంటుంది. లగ్నానికి యోగకారకులైన గ్రహాల యొక్క దశ అంతర్ధశలలోను వృత్తిలో అభివృద్ధి ఉంటుంది. లగ్నాధిపతి ఏ నక్షత్రంలో ఉంటాడో ఆ నక్షత్రానికి అధిపతి అయిన దశ అంతర్ధశాలలోనూ వృత్తి, వ్యాపార సంబంధ విషయాలలో పురోభివృద్ధి ఉంటుంది.
లగ్నాధిపతి లగ్నంలో ఉంటే ధైర్యం కలిగి ఉంటారు, మంచి ఆయుర్ధాయం, మంచి నేర్పరితనం, ఆత్మ విశ్వాసం కలిగి ఉంటారు. ఎదుటివాళ్ళను లెక్కచేయకుండా గర్వం కలిగి ఉంటారు. నైసర్గిక పాపగ్రహాలు ఉన్నప్పుడూ చెడ్డ ఆలోచనలు, చెడు స్నేహాలు కలిగి ఉంటారు. శుభగ్రహాలు ఉంటే మంచి నడవడిక, మృధు స్వభావం, గౌరవాలు, కీర్తి ప్రతిష్టలు కలిగి ఉంటారు. అన్నీ తనకు తెలుసు అని ఎదుటి వాళ్ళ మాట వినకుండా నిందించటం వీరి లక్షణాలు.
లగ్నాధిపతి ద్వితీయంలో ఉంటే శరీర పుష్టి, చక్కని మాట, ద్వితీయ కళత్రం కలిగి ఉంటారు. చక్కని బోజనప్రియులు, తనకంటే ఎక్కువ వయస్సు వారితో పరిచయాలు, స్నేహాలు, కుటుంబ పోషణ బాద్యత కలిగి ఉంటారు. భార్య తరుపున ఆస్తి కలసి రావటం, గురు శనులు కలిస్తే పిత్రార్జితం రాదు. వచ్చిన నిలవదు. మారక స్ధానం, విద్యలో రాణిస్తారు.
లగ్నాధిపతి తృతీయంలో ఉంటే శరీరం బలహీనం కలిగి ఉంటారు. కుటుంబంలో చిన్నగాని, పెద్దగాని ఆయి ఉంటారు. పాపగ్రహాల కలయిక వలన శరీర ఇబ్బందులు. సోదరుల వలన సుఖం ఉండదు. సోదరుల అభివృద్ధి ఉంటుంది. దగ్గరి ప్రయాణాలు తరచుగా చేస్తారు. క్రీడలపై మక్కువ, స్వయంగా అభివృద్ధి కలిగి ఉంటారు. కుజ సంబంధం ఉంటే మంచి క్రీడాకారుడు అవుతాడు. కేతువు సంబంధం ఉంటే విదేశాలలో బందింపబడటం జరుగవచ్చును. బుధ సంబందం ఉంటే సంగీతం, కమ్యూనికేషన్, జర్నలిస్ట్ రంగాలలో రాణిస్తారు. శుక్ర సంబందం ఉంటే లలిత కళలలో రాణిస్తారు. శని సంబందం ఉంటే రాజకీయాలలో రాణిస్తారు.
లగ్నాధిపతి చతుర్ధంలో ఉంటే స్దిరత్వం కలిగి ఉంటారు. స్ధిరమైన ఆరోగ్యం, సుఖపడతాడు. రియల్ ఎస్టేట్ రంగంలో రాణింపు, మాతృబలం కలిగి ఉంటారు. గృహ సౌఖ్యం కలిగి ఉంటారు. కుటుంబంలో గౌరవింపబడతారు. స్వయం కృషితో సౌఖ్యాలను అనుభవిస్తారు. కుటుంబంలో ఆ వ్యక్తి పుట్టిన తరువాత బాగా అభివృద్ధి చెందటం. ప్రభుత్వ ఉద్యోగం కలిగి ఉండటం. విద్యలో రాణింపు, చతుర్ధంలో రవి ఉండి లగ్నాధిపతి కలసి ఉంటే పితృ దోషం ఉంటుంది. నవమాదిపతి చతుర్ధంలో ఉన్న పితృ దోషం కలిగి ఉంటారు. లగ్నాధిపతి పంచమంలో ఉంటే మంచి ఆలోచన, ఉపాసనా శక్తి కలిగి ఉంటారు. మంచి గురువు దగ్గర విద్య నేర్చుకుంటారు. పుణ్యబలం కలిగి ఉంటారు. మంచి సంతానం కలిగి ఉంటారు. విద్యలో రాణిస్తారు. క్రితం జన్మలో అకాల మృత్యువు జరగలేదని చెప్పవచ్చును. అదృష్టవంతుడు. పుణ్యబలం ఉండటం వలన తక్కువ శ్రమతో ఎక్కువ ఫలితం సంపాదిస్తారు. పుణ్యస్నానాలు, తీర్ధయాత్రలు, సత్కర్మలు చేస్తారు. భవిష్యత్ (పంచమం రాబోవు రోజులలోని కర్మలపై ప్రభావం) కర్మలపై అవగాహన కలిగి ఉంటారు. దర్మబుద్ధి కలిగి ఉంటారు కాబట్టి న్యాయవాదిగా రాణిస్తారు సంతాన భాగ్యం కలుగుతుంది. పాప గ్రహ సంబంధం ఉంటే సంతాన నష్టం, కుజ రాహువులు ఉంటే నాగ దోషం, కుజుడు ఉంటే గర్భస్రావం చేస్తాడు. కేతువు ఉంటే అల్ప సంతానం కలిగి ఉంటారు. శుక్ర చంద్రులు ఉంటే షేర్లు, లాటరీలు, క్రీడా ద్వారా లాభాలు ఆర్జిస్తారు.
లగ్నాధిపతి షష్టంలో ఉంటే తను ఎవరి కిందయిన పనిచేస్తాడు. అప్పులు వసూలు చేసే శక్తి కలిగి ఉంటారు. అనారోగ్యాలు కలిగి ఉంటారు. శత్రువులపై విజయం, రవి, కుజుల సంబందం ఉంటే సర్జన్ గా రాణిస్తారు. రవి రాహువులు కలసి ఉన్న వైద్య వృత్తిలో రాణిస్తారు. గురువు ఉన్న ఆయుర్వేదంలో రాణిస్తారు. కోరి కోరి కష్టాలు తెచ్చుకుంటారు. తిండి సరిగా తినక ముఖం కళ తప్పటం జరుగుతుంది. గొడవలు, కొట్లాటలు చేస్తారు.
లగ్నాధిపతి సప్తమంలో ఉంటే తనలో తాను గొప్పవాడుగా ఫీలవుతాడు. వివాహంపై మక్కువ ఉండదు. కామ త్రికోణం కావటం వలన కుజ, శుక్ర సంబంధం ఉంటే కామత్వం ఎక్కువ కలిగి ఉంటారు. సమాజంలో గౌరవాలు కలిగి ఉంటారు. ఇతరుల అభిప్రాయాలకు విలువ ఇస్తారు. విదేశీ సంపాదన, విదేశాలలో రాణింపు కలిగి ఉంటారు. కుజ, రవి కలసి ఉన్న వైద్య వృత్తిలో రాణింపు, రాహు గాని కేతువు గాని ఉన్న శస్త్ర చికిత్సలు, పాప గ్రహ దృష్టి ఉంటే ఆత్మహత్య చేసుకునే అవకాశాలు ఎక్కువ. బలహీనంగా ఉంటే ఇతరులను మెప్పించటం కష్టం.
లగ్నాధిపతి అష్టమంలో ఉంటే ఆయుర్ధాయం కలిగి ఉంటారు. రహస్య సంపాదన కలిగి ఉంటారు. శరీరంలో ఏదో ఒక అనారోగ్యం లేదా లోపం ఉండి కూడా బయటకు తెలియకుండా రహస్య పరచటం జరుగుతుంది. లంచాలు, మాముళ్ళ ద్వారా సంపాదన కలిగి ఉంటారు. నిద్రలో నడిచే అలవాటు కలిగి ఉంటారు.
లగ్నాధిపతి నవమంలో ఉంటే అనుభవ పూర్వకమైన జీవితం కలిగి ఉంటారు. గౌరవాలు, కీర్తి ప్రతిష్టలు కలిగి ఉంటారు. దేవాలయ ప్రతిష్టలు చేస్తారు. మంచి గురువు దగ్గర వేద అద్యయనం చేస్తారు. ఉన్నత విద్యను అభ్యసిస్తారు. స్పర్శ విద్యలో రాణిస్తారు. నాడీ వైద్యంలో రాణింపు. తండ్రితో మంచి అవగాహన కలిగి ఉంటారు. మంచి నేర్పు గల న్యాయ నిర్ణేతగా రాణిస్తారు. విదేశీ ప్రయాణాలపై మక్కువ కలిగి ఉంటారు. వ్యయాధిపతి, సప్తమాధిపతితో సంబంధం ఉంటే చిన్న వయస్సులోనే స్ధిరపడతారు.
లగ్నాధిపతి దశమంలో ఉంటే మంచి లక్షణాలు కలిగి ఉంటాడు. కర్మ స్ధానం కావటం వలన సత్కర్మలు చేస్తాడు. దర్మ కార్యాలు చేస్తాడు. కర్మ కారకుడైన శని ఈ స్ధానంలో ఉంటే చిన్న స్ధాయి నుండి ఎదుగుదల కలిగి ఉంటారు. సొంతంగా వ్యాపారం కలిగి ఉంటారు. స్వయం కృషితో రాణిస్తారు. అభివృద్ధి, గౌరవాలు, కీర్తి ప్రతిష్టలు కలిగి ఉంటారు. అధికారం చూపించి ఇతరులచే పనులు చేయించుకునే నేర్పరితనం కలిగి ఉంటారు. మంచి ఆయుర్ధాయం కలిగి ఉంటారు. ధర్మ ( 1,5,9) అర్ధ ( 2,6,10) భావాలకు సంబంధ గోచారంలో ఉంటే వివాహ ప్రయత్నాలు ఫలిస్తాయి.
లగ్నాధిపతి ఏకాదశంలో ఉంటే ఆయువృద్ధి, రవి, బుధ, చంద్ర సంబంధం ఉంటే సుఖవంతమైన జీవితం కలిగి ఉంటారు. భౌతికపరమైన సుఖాలు, మంచి స్నేహితులు కలిగి ఉంటారు. పెద్దల ద్వారా లాభం, సొంతంగా లాభాలను ఆర్జిస్తారు. స్నేహితులకు ఉపయోగపడతాడు.
లగ్నాధిపతి ద్వాదశంలో ఉంటే బద్ధకం, చెడు ఆలోచన, ఇబ్బందులు ఎదుర్కోవటం,, పరస్త్రీలపైనా మక్కువ కలిగి ఉండటం, ఖర్చు ఎక్కువ, కుటుంబ సభ్యులతో సత్సంబంధాలు లేకపోవటం, దేశం విడిచి పోవటం, కారాగారం, విదేశాలలో స్ధిరత్వం, ఖర్చుపై నియంత్రణ లేకపోవటం. తిండి, నిద్ర సరిగా లేక అనారోగ్యాలు తెచ్చుకోవటం జరుగుతుంది. వృద్ధాప్యంలో దైవ చింతన కలుగుతుంది. కేతువుగాని, గురువు గాని అఖరి దశ లో దైవ సంబంధమైన విషయాలు పురాణ సంబంధమైన విషయాలు పై ఆశక్తి చూపుతారు.
జ్యోతిష్యంలో ధనాభివృద్ధిని తెలియజేసే "ఇందులగ్నం" :
ఉత్తరకాలామృతంలో కాళిదాసు గ్రహాలకు స్ధిరకళలను ఇచ్చారు.వీటినే దృవాంకాలు అంటారు.
రాశిచక్రంలో లగ్నం నుండి నవమాధిపతి మరియు చంద్రుడి నుండి నవమాధిపతులను నిర్ణయించివాటికి ఇచ్చిన స్ధిరకళలను కలుపగా వచ్చిన సంఖ్యను 12 కంటే ఎక్కువ వస్తే 12 చేత భాగింపగా వచ్చు శేషం చంద్రుడి నుండి లెక్కింపగా వచ్చిన రాశి ఇందులగ్నం అవుతుంది.
ఇందులగ్నం వ్యక్తి యొక్క ఆర్ధికస్ధితి ,అభివృద్ధి,వ్యాపారాభివృద్ధిని తెలుపుతుంది.ఇందులగ్నంలో ఏ గ్రహాం ఉన్నా, లగ్నాన్ని ఏ గ్రహాం చూస్తున్న ధనాభివృద్ధి బాగుంటుంది.
ఇందులగ్నం గ్రహా రహితంగా గాని,గ్రహాదృష్టి రహితంగా గాని ఉండరాదు.అలా ఉన్న యెడల ఇందులగ్నం యొక్క ప్రయోజనాలను జాతకుడు పొందలేడు.ఇందులగ్నంపై గోచార గురుడు సంచరించిన లేక చూచిన సాధారణంగా వచ్చే ధనం కాక అదనంగా ధనప్రాప్తి కలుగుతుంది.
గోచారంలో గురువు 2017 ఆగష్టు నెలలో పుష్కరాల తరువాత తులా రాశిలోకి ప్రవేశం జరుగుతుంది. గురువు తులా రాశిలో ఉన్నప్పుడు కుంభ రాశిని, మేష రాశిని, మిధున రాశిని చూస్తాడు. ఈ రాశులు ఇందులగ్నం అయిన గురు దృష్టి కారణంగా ఇందులగ్న జాతకులకు ఒక సంవత్సరం పాటు ఆదాయంలో స్ధిరత్వం, తక్కువ శ్రమతో ఎక్కువ ప్రతిఫలం పొందే అవకాశం ఉంటుంది.
ఇందులగ్నంలో గ్రహాలకు ఉన్న స్ధిర కళలు
సూర్యుడు:-30 కళలు
చంద్రుడు:-16 కళలు
కుజుడు:-6 కళలు
బుధుడు :-8 కళలు
గురువు:-10 కళలు
శుక్రుడు:-12 కళలు
శని :-1 కళ
ఉదా:- కన్యా లగ్నం, వృశ్చిక రాశి వారికి జాతకచక్రంలో జన్మ లగ్నం నుండి నవమాదిపతి శుక్రుడు, చంద్ర లగ్నం నుండి నవమాదిపతి చంద్రుడు అవుతారు.
శుక్రగ్రహ కళలు :-12
చంద్రగ్రహ కళలు:-16
----
TOTAL-28
12)28(2
24
-----
4 శేషం
చంద్రుడి నుండి 4 వస్ధానం కుంభరాశి అవుతుంది. కాబట్టి కుంభం ఇందులగ్నం అవుతుంది. ప్రస్తుతం కుంభరాశిపై శని దృష్టి, ఆగష్ట్ తరువాత గోచార గురు దృష్టి ఉంటుంది. కుంభం ఇందులగ్నం జాతకులకు ఒక సంవత్సరం పాటు ఆదాయంలో స్ధిరత్వం, తక్కువ శ్రమతో ఎక్కువ ప్రతిఫలం పొందే అవకాశం ఉంటుంది.
ఇందులగ్నం నుండి ద్వితీయంలో గాని, లాభస్ధానంలో గాని గ్రహం దిగ్బలమ్ పొందితే దిగ్బలమ్ పొందిన గ్రహం సూచించు దిక్కులలో దన ఆదాయ మార్గాలు బాగా ఉంటాయి.
ఇందులగ్నం నుండి ద్వితీయంలో గురువు ఉంటే ధనం సంపాదిస్తాడు గాని చేతిలో నిలుపుకోలేడు.కారకోబావనాశాయ సూత్రం ప్రకారం భావ కారకుడు గురువు ద్వితీయ భావంలో ఉండటం మంచిది కాదు.
ఇందులగ్నాదిపతి బలహీనమైతే(నీచ,అస్తంగత్వం,శత్రు క్షేత్రాలలో)దరిద్రం పడుతుంది.ఎంత కష్ట పడ్డ శ్రమకు తగ్గ ఫలితం రాదు.
ఇందులగ్నాదిపతి,ద్వితీయాదిపతి,నవమాదిపతి,లాభాదిపతి హోరాచక్రంలో బలంగా ఉంటే ఏ పని చేసిన అదృష్టం కలసి వస్తుంది.
ఇందులగ్నాదిపతితో కుజగ్రహ సంబందం ఉంటే భూమికి సంబందించిన(సివిల్,రియల్ ఎస్టేట్,వ్యవసాయం) వ్యాపారాలలో బాగా రాణిస్తారు.
ఇందులగ్నాదిపతితో శుక్రగ్రహ సంబందం ఉంటే బిల్డింగ్ కన్ స్ట్రక్షన్ లో బాగా రాణిస్తారు. ఇందులగ్నాదిపతితో శని కలసి 4 వస్ధానంలో ఉంటే గనులు,మైనింగ్ రంగాలలో బాగా రాణిస్తారు.
ఇందులగ్నానికి,ద్వితీయానికి,చతుర్దానికి సంబందం ఉంటే స్ధిరాస్తులైన ఇల్లు,పొలాలు,బంగారం సంపాదించుకుంటాడు.
లగ్నాదిపతి,ఇందులగ్నాదిపతి శతృ ద్విద్వాదశాలలో ఉన్న,శతృ షష్టాష్టకాలలో ఉన్న, ఇందులగ్నాదిపతి షష్టమాదిపతి,వ్యయాదిపతులతో సంబందం ఉంటే దన సంబంద విషయాలలో కోర్టు గొడవలు,వివాదాలు ఉంటాయి.
ఇందులగ్నంలో ఏదైనా గ్రహం ఉచ్చ పొందితే ఆ గ్రహం యొక్క దశ అంతర్దశలలో జాతకుడు సంపాదించిన దనం అవసరాలకు వినియోగపడుతుంది.
ఇందులగ్నాదిపతి హోరాచక్రంలో స్వక్షేత్రంలో ఉంటే స్వ,ఇతరుల సహకారంతో సంపాదిస్తాడు.మిత్ర క్షేత్రంలో ఉంటే అదృష్టం కలసి వస్తుంది.
ఇందులగ్నంలో శత్రుగ్రహాలు ఉండి గురువు పాపగ్రహాలతో కలసి శతృ క్షేత్రంలో ఉన్న జాతకుడు అక్రమార్గాల ద్వారా దనం సంపాదిస్తాడు.
ఇందులగ్నాదిపతి హోరాచక్రంలో లగ్నంలోను,హోరా లగ్నాదిపతి ఇందులగ్నంలోను ఉన్న, ఇందులగ్నాదిపతి హోరాచక్రంలో లగ్నంలోను లాభాదిపతి ద్వితీయంలోను,ద్వితీయాదిపతి లాభంలో ఉన్న ఆ జాతకుడు లక్ష్మీ పుత్రుడవుతాడు.
షష్ట్యంశ వర్గచక్ర విశ్లేషణ

షష్ట్యంశ కాల వ్యవధి 30 నిమిషాలు. ప్రతిభావాన్ని అరవై భాగాలు చేయగా 0 -30 నిమిషాల ప్రమాణం ఉంటుంది. ఒక షష్ట్యంశ బేసిరాశులలో 0 నుండి 60 వరకు, సరి రాశులలో 60 నుండి 0 వరకు లెక్కించటం జరుగుతుంది. రాశిలో ఉన్న గ్రహ స్ఫుటాన్ని 2 పెట్టి గుణించి, నిమిషాలను వదలివేసి, డిగ్రీలను 12 పెట్టి భాగించి శేషానికి 1 కలపాలి. వచ్చిన మొత్తాన్ని ఆ గ్రహం ఉన్న రాశి నుండి లెక్కించాలి. 2 నిమిషాల కాల వ్యవదిలో షష్ట్యంశ వర్గ చక్రంలో గ్రహాలు మార్పు చెందుతాయి కావున కవలల విషయంలో షష్ట్యంశ వర్గ చక్రం విశ్లేషణ అత్యంత ప్రాముఖ్యమైనది.
షష్ట్యంశ ద్వారా సమస్త విషయాలు తెలుసుకోవచ్చును. పూర్వజన్మ విషయాలు తెలుసుకోవచ్చును. కవలల పిల్లల విశ్లేషణకు, ముహూర్త విషయంలో, ముహూర్త లగ్నం షష్ట్యంశలో మంచిగా ఉండాలి.
గురుగ్రహం మృదంశలో ఉంటే గురుగ్రహ అనుగ్రహం లభించినట్టే. బేసిరాశులలో 19 వది, సరిరాశులలో 42 వది మృదంశ అవుతుంది.
బేసి రాశులలో మృదంశ డిగ్రీలు -9°-0' నుండి 9°-30'
సరి రాశులలో మృదంశ డిగ్రీలు - 20°-30' నుండి 21°-00'
బేసిరాశులలో మిధున, తుల, ధనస్సు మంచివి. సరిరాశులలో వృషభ, కర్కాటకం, మీనం మంచివి. సర్వోత్తమ స్దితి మీనరాశిలో రేవతి నక్షత్రంలో గురువు ఉండటం మంచిది. పై స్ధితులలో గురువు ఉన్న ఇబ్బంది పడుతున్నారంటే దాని అర్ధం ఈ జన్మలో గురుదోషం ఉందని అర్ధం.
లగ్నం గాని, గ్రహం గాని శుభ షష్ట్యంశలలో ఉంటే శుభ ఫలితాలను, పాప షష్ట్యంశలలో ఉంటే అశుభ ఫలితాలను ఇస్తాయి. 60 షష్ట్యంశలలో 60 మంది దేవతలు ఉంటారు.
షష్ట్యంశ దేవతలు
ఘోరశ్చ రాక్షశో దేవః కుబేరో యక్షకిన్నరౌ ।
భ్రష్టః కులఘ్నో గరలో వహ్నిర్మాయా పురీషకః ॥
అపామ్పతిర్మరుత్వాంశ్చ కాలః సర్పామృతేన్దుకాః ।
మృదుః కోమలహేరమ్బబ్రహ్మవిష్ణుమహేశ్వరాః ॥
దేవార్ద్రౌ కలినాశశ్చ క్షితీశకమలాకరౌ ।
గులికో మృత్యుకాలశ్చ దావాగ్నిర్ఘోరసంజ్ఞకః ॥
యమశ్చ కణ్టకసుధాఽమృతౌ పూర్ణనిశాకరః ।
విషదగ్ధకులాన్తశ్చ ముఖ్యో వంశక్షయస్తథా ॥
ఉత్పాతకాలసౌమ్యాఖ్యాః కోమలః శీతలాభిధః ।
కరాలదంష్ట్రచన్ద్రాస్యౌ ప్రవీణః కాలపావకః ॥
దణ్డభృన్నిర్మలః సౌమ్యః క్రూరోఽతిశీతలోఽమృతః ।
పయోధిభ్రమణాఖ్యౌ చ చన్ద్రరేఖా త్వయుగ్మపాః ॥
సమే భే వ్యత్యయాజ్జ్ఞేయాః షష్ట్యంశేశాః ప్రకీర్తితాః ।
షష్ట్యాంశస్వామినస్త్వోజే తదీశాదవ్యత్పయః సమే ॥
శుభషష్టయంశసంయుక్తా గ్రహాః శుభఫలప్రదాః ।
క్రూరషష్ట్యంశాసంయుక్తా నాశయన్తి ఖచారిణః ॥
1) ఘోరాంశ (అశుభం), 2) రాక్షసాంశ (అశుభం), 3) దేవాంశ (శుభం), 4) కుభేరాంశ (శుభం), 5) యక్షాంశ (అశుభం), 6) కిన్నెరాంశ (శుభం), 7) భ్రష్టాంశ (అశుభం), 8) కులజ్ఞాంశ (అశుభం), 9) గరళాంశ (అశుభం), 10) అగ్నింశ (అశుభం), 11) మాయాంశ (శుభం), 12) పురీశాంశ (అశుభం), 13) అపంపత్యంశ (శుభం), 14) మరుత్యంశ (శుభం), 15) కలాంశ (శుభం), 16) సర్పాంశ (అశుభం), 17) అమృతాంశ (శుభం), 18) చంద్రాంశ (శుభం), 19) మృదుంశ (శుభం), 20) కోమలాంశ (శుభం), 21) హేరంభాంశ (శుభం), 22) బ్రహ్మాంశ (శుభం), 23) విష్ణాంశ (శుభం), 24) దిగంబరాంశ (అశుభం), 25) దేవాంశ (శుభం), 26) ఇంద్రాంశ (శుభం), 27) కలినాశనాంశ (శుభం), 28) క్షితీశ్వరాంశ (శుభం), 29) కమలాకరాంశ (శుభం), 30) గుళికాంశ (అశుభం), 31) మృత్యుకరాంశ (అశుభం), 32) కళాంశ (అశుభం), 33) దావాగ్నింశ (అశుభం), 34) ఘోరాంశ (అశుభం), 35) యమాంశ (అశుభం), 36) కంటకాంశ (అశుభం), 37) సుధాంశ (శుభం), 38) అమృతాంశ (శుభం), 39) పూర్ణచంద్రాంశ (శుభం), 40) విషదగ్ధాంశ (అశుభం), 41) కులనాసంశ (అశుభం), 42) వంశక్షయాంశ (అశుభం), 43) ఉత్పాతకాంశ (అశుభం), 44) కాలరూపాంశ (అశుభం), 45) సౌమ్యాంశ (శుభం), 46) కోమలాంశ (శుభం), 47) సీతలాంశ (శుభం), 48) దంష్ట్రాకరలాంశ (అశుభం), 49) ఇంద్రముఖాంశ (శుభం), 50) ప్రవీణాంశ (శుభం), 51) కాలాగ్నింశ (అశుభం), 52) దండాయుధాంశ (అశుభం), 53) నిర్మాలాంశ (శుభం), 54) సౌమ్యాంశ (శుభం), 55) క్రూరాంశ (అశుభం), 56) అతిశీతలాంశ (శుభం), 57) అమృతాంశ (శుభం), 58) ప్రయోదాంశ (శుభం), 59) బ్రమణాంశ (అశుభం), 60) ఇందురేఖాంశ (శుభం).
బేసి రాశులకు వరుసగా వచ్చును. సరి రాశులకు వ్యతిరేకముగా అనగా ఇందురేఖ, బ్రహ్మాణాంశ లు వరుసగా వచ్చును.
ఉదాహరణ జాతకచక్రంలోని గ్రహ స్ఫుటాల ఆధారంగా షష్ట్యంశ వర్గచక్ర నిర్మాణం
రాశిచక్రంలో కన్యా లగ్నం స్ఫుటం -25°-14' నిమిషాలను 2 చేత గుణించగా 50°-28' లను నిమిషాలను వదలి 50° లను 12 చేత భాగించగా శేషం 2 వచ్చిన దానికి 1 కలుపగా 3 వచ్చును. రాశి చక్రంలోని కన్యా లగ్నానికి మూడవ స్ధానం వృశ్చికం కావున షష్ట్యంశ వర్గచక్ర లగ్నం వృశ్చిక లగ్నం అవుతుంది.
రాశి చక్రంలోని కన్యా లగ్నంలోని రవిగ్రహ స్ఫుటం 18°-52' నిమిషాలను 2 చేత గుణించగా 37°-04' లను నిమిషాలను వదలి 37° లను 12 చేత భాగించగా శేషం 1 వచ్చిన దానికి 1 కలుపగా 2 వచ్చును. రాశి చక్రంలోని కన్యా లగ్నానికి రెండవ స్ధానం తులారాశి కావున షష్ట్యంశ వర్గచక్రంలో రవి తులారాశిలో ఉంటాడు.
రాశి చక్రంలోని వృశ్చిక రాశి లోని చంద్ర గ్రహ స్ఫుటం 05°-14' నిమిషాలను 2 చేత గుణించగా 10°-28' లను నిమిషాలను వదలి 10° లను 12 చేత భాగించలేము కనుక 10° లకు 1 కలుపగా 11 వచ్చును. రాశి చక్రంలోని వృశ్చిక రాశికి 11 స్ధానం కన్యా రాశి కావున షష్ట్యంశ వర్గచక్రంలో చంద్రుడు కన్యారాశిలో ఉంటాడు.
రాశిచక్రంలోని తులారాశిలోని కుజ గ్రహ స్ఫుటం 17°-26' నిమిషాలను 2 చేత గుణించగా 34°-52' లను నిమిషాలను వదలి 34° లను 12 చేత భాగించగా శేషం 10 వచ్చిన దానికి 1 కలుపగా 11 వచ్చును. రాశి చక్రంలోని తులారాశికి 11 స్ధానం సింహారాశి కావున షష్ట్యంశ వర్గచక్రంలో కుజుడు సింహారాశిలో ఉంటాడు.
ఈ విధంగా రాశి చక్రంలోని గ్రహా స్ఫుటాలను ఆదారంగా చేసుకొని షష్ట్యంశ వర్గచక్రం నిర్మాణం ఎవరికి వారే వారి జాతక చక్రాలను తయారు చేసుకోవచ్చును.
చతుర్దాంశ వర్గ చక్ర విశ్లేషణ

రాశిలో నాలుగో భాగానికి చతుర్ధాంశ అంటారు.ఒకొక్క భాగం 7° 30 నిమిషాల ప్రమాణం ఉంటుంది.మొత్తం 12 రాశులకు 48 చతుర్ధాంశలు ఉంటాయి.
చతుర్దాంశ వర్గ చక్రం ద్వారా వాహన యోగం,వాహన ప్రమాదాలు, గృహ యోగం, గృహ సౌఖ్యం,సుఖ సౌఖ్యాలు,అదృష్టాలు,బాధ్యతలు,విద్య,ధన కనక వస్తు వాహనాల గురించి, భూమి, ఆస్తి పాస్తులు కలిగి ఉండటం,కుటుంబ సౌఖ్యత,జ్ఞానాభివృద్ధి,స్ధాన చలనం ,బందువులు,విదేశీ ప్రయాణాలు,విదేశాలలో నివశించటం, కూతురు పెళ్ళి,ఇల్లరికం అల్లుడు మొదలగు వాటి గురించి తెలుసుకోవచ్చును. జాతకచక్రంలో ఉన్న యోగాలు చతుర్ధాంశ చక్రంలో లగ్నానికి మంచి స్ధానంలో ఉన్నప్పుడు మాత్రమే ఆ యోగా ఫలితాన్ని పొందవచ్చును.
రాశి చక్రంలో గ్రహాలు గాని లగ్నం గాని 0°-00 నిమిషాల నుండి 7°30 నిమిషాల మద్యలో ఉన్నప్పుడు చతుర్దాంశ వర్గ చక్రం నందు అదే రాశిలో గ్రహం ఉంచాలి.
రాశి చక్రంలో గ్రహాలు గాని లగ్నం గాని 7°-30 నిమిషాల నుండి 15°00 నిమిషాల మద్యలో ఉన్నప్పుడు చతుర్దాంశ వర్గ చక్రం నందు చతుర్ధంలో గ్రహం ఉంచాలి.
రాశి చక్రంలో గ్రహాలు గాని లగ్నం గాని 15°-00 నిమిషాల నుండి 22°30 నిమిషాల మద్యలో ఉన్నప్పుడు చతుర్దాంశ వర్గ చక్రం నందు సప్తమంలో గ్రహం ఉంచాలి.
రాశి చక్రంలో గ్రహాలు గాని లగ్నం గాని 22°-30 నిమిషాల నుండి 30°00 నిమిషాల మద్యలో ఉన్నప్పుడు చతుర్దాంశ వర్గ చక్రం నందు దశమంలో గ్రహం ఉంచాలి.
మొదటి చతుర్ధాంశకు బ్రహ్మదేవుడి కుమారుడైన “సనకా”ఆదిపత్యం వహిస్తాడు.మొదటి చతుర్ధాంశలో ఎక్కువ గ్రహాలు ఉన్నప్పుడు ప్రేమస్వభావం కలిగి ఉంటారు.గౌరవ సత్కారాలు లభిస్తాయి.మంచి గుర్తింపు లబిస్తుంది.
రెండవ చతుర్ధాంశకు బ్రహ్మదేవుడి కుమారుడైన “సనంద”ఆదిపత్యం వహిస్తాడు.రెండవ చతుర్ధాంశలో ఎక్కువ గ్రహాలు ఉన్నప్పుడు ఎప్పుడు సంతోషమగాను,ఆనందం గాను ఉంటారు.నవ్వుతూ మాట్లాడతారు.కోప స్వభావాలు ఉండవు.
మూడవ చతుర్ధాంశకు బ్రహ్మదేవుడి కుమారుడైన “సనత్కుమార” ఆదిపత్యం వహిస్తాడు.మూడవ చతుర్ధాంశలో ఎక్కువ గ్రహాలు ఉన్నప్పుడు ప్రతి విషయంలోనూ కచ్చితమైన నిర్ణయాలు తీసుకుంటారు.కుజుడు మూడవ చతుర్ధాంశలో ఉంటే కుజ దోష ప్రభావం తక్కువగా ఉంటుంది.
నాల్గవ చతుర్ధాంశకు బ్రహ్మదేవుడి కుమారుడైన “సనాతన”ఆదిపత్యం వహిస్తాడు.నాల్గవ చతుర్ధాంశలో ఎక్కువ గ్రహాలు ఉన్నప్పుడు సంతోషాన్ని ,నిరంతర మార్పులను తెలియజేస్తుంది.
రాశి చక్రంలో లగ్నాదిపతి,చతుర్ధాదిపతి చతుర్ధాంశ వర్గ చక్రంలో ఎక్కడ ఉన్నారో పరిశీలించాలి.చతుర్ధాంశ లగ్నానికి 6,8,12 లో ఉన్న ఆయా గ్రహాల యొక్క ఫలితాన్ని పూర్తిగా పొందలేరు.
రాశిచక్రంలో గజకేసరి యోగం గాని,ఇతర పంచమహా పురుష యోగం గాని ఉన్న పంచమహాపురుష మోగ గ్రహాలు గజకేసరి యోగా గ్రహాలైన చంద్రుడు,గురువు చతుర్ధాంశ వర్గ చక్రంలో లగ్నానికి 6,812 లో ఉన్న,శత్రు క్షేత్రంలో ఉన్న యోగా ఫలితాన్ని పొందలేరు.
చతుర్ధంలో కుజ,శని,రాహు,కేతువులు రాశి చక్రంలో చతుర్ధంలో ఉండి చతుర్ధాంశ వర్గ చక్రంలో చతుర్ధంలో ఉంటే విదేశాలలో జీవిస్తారు.చతుర్ధాదిపతి వ్యయంలో ఉన్న,వ్యయాదిపతి సప్తమంలో ఉన్న,నవమంలో చతుర్దాదిపతి, వ్యయాదిపతి,నవమాదిపతి ఉన్న విదేశాలలో జీవనం కొనసాగిస్తారు. చతుర్దాదిపతి నవమంలోఉన్న విదేశాలలో విద్యను అభ్యసిస్తారు.
రాశిచక్రంలో చతుర్దాదిపతి,కుజ శుక్రులు చతుర్ధాంశలో 6,8,12 లో ఉన్న,శత్రుక్షేత్రంలో ఉన్న,తరచుగా వాహన ప్రమాదాలు జరుగుతాయి.స్దిరాస్తులకు సంబందించిన ఇబ్బందులు ఎదుర్కొంటారు.
ద్రేక్కాణం ప్రాముఖ్యత

ప్రధమ ద్రేక్కాణానికి (0° నుండి 10°) అధిపతి నారదుడు
ద్వితీయ ద్రేక్కాణానికి (10°నుండి 20°) అధిపతి అగస్త్యడు
తృతీయ ద్రేక్కాణానికి (20° నుండి 30°) అధిపతి దుర్వాసుడు.
ద్రేక్కాణం వలన జాతకుని ప్రకృతి,గుణం,,క్రియాకలాపాలు,అదృష్టాలు,సోదర సహకారాలు,రోగ తీవ్రత,రోగ ఉపశమనం మొదలగు వాటి గురించి తెలుసుకోవచ్చును. లగ్నం గాని,లగ్నాదిపతి గాని,తృతీయాదిపతి గాని,భావ కారకుడు కుజుడు గాని ద్రేక్కాణంలో షష్టాష్టకాలు,ద్విద్వాదశాలలో ఉంటే సోదరులతో ఘర్షణ ఉంటుంది.
వ్యక్తి జాతకంలో ఆడ సంతానం తరువాత పురుష సంతానం ఉందో లేదో అని తెలుసుకోవటానికి తల్లిదండ్రుల జాతకాన్ని కాకుండా పుట్టిన అమ్మాయి జాతకం ద్వారా పరిశీలించాలి.ఆ పాప జాతకంలో ద్రేక్కాణంలో తృతీయ భావానికి కుజ,గురు సంబందం ఉంటే మగ సంతానం ఉంటుంది.తల్లి దండ్రులకు అమ్మాయి తరువాత గర్బాస్రావం కాకుంటేనే మగ సంతానం ఉంటుంది.
జాతకచక్రంలో రాశిచక్రంలో గ్రహాలు గాని లగ్నం గాని 0° నుండి 10° లోపు ఉంటే ద్రేక్కాణ చక్రంలో అదేరాశిలోను,10°నుండి 20° లోపు గ్రహం గాని లగ్నం గాని ఉంటే గ్రహాం ఉన్న రాశి నుండి పంచమ స్ధానంలోను,20° నుండి 30° లోపు గ్రహం గాని లగ్నం గాని ఉంటే గ్రహం ఉన్న రాశి నుండి నవమ స్ధానంలో గ్రహాలను పొందుపరచాలి.
లగ్నం నుండి ,చంద్రుని నుండి పరిశీలించాలి.ప్రధమ ద్రేక్కాణంలో లౌకికం ఉంటుంది. ప్రతి విషయాన్ని దాటవేస్తారు.తొందరగా నిర్ణయం తీసుకోరు. జ్యోతిష్యం, మ్యూజిక్,డ్యాన్స్ లలో ప్రావీణ్యం సంపాదిస్తారు.ఎప్పుడు ఏదో ఒక పని మీద తిరుగుతూనే ఉంటారు.సమాజం కోసం కృషి చేస్తారు.
ద్వితీయ ద్రేక్కాణంలో గ్రహాలు గాని,లగ్నం గాని ఉంటే భాషా ప్రావీణ్యం, కమ్యూనికేషన్ సంపాదిస్తారు.మహా మునులవుతారు.మంచి సామర్ధ్యం ఉంటుంది. ఇతర భాషలలో ప్రావీణ్యం ఉంటుంది.
తృతీయ ద్రేక్కాణంలో గ్రహాలు గాని,లగ్నం గాని ఉంటే కోపం అధికం, వరాలు, శాపాలు ఇస్తారు,మంత్ర సిద్ధులు,దుస్తుల మీద ఇష్టం ఉండదు.కష్టాన్ని గుర్తించారు. లగ్నం కానీ చంద్రుడు కానీ దుర్వాస ద్రేక్కాణంలో ఉంటే దుస్తులు వేసుకొని అందంగా ఉండాలి అని కోరుకోరు.
ద్వి స్వభావరాశులలోని ప్రధమ ద్రేక్కాణం ఈ జన్మలోని కర్మ ద్రేక్కాణం.ఈ ద్రేక్కాణంలో ఎక్కువ గ్రహాలు ఉంటే ఎక్కువగా కష్ట పడతారు.
చర రాశులలో రెండవ ద్రేక్కాణం ఈ జన్మలోని బోగ ద్రేక్కాణం.ఈ ద్రేక్కాణంలో ఎక్కువ గ్రహాలు ఉంటే భోగాలు అనుభవిస్తారు.క్రూర మనస్సు కలిగి ఉంటారు.
ద్రేక్కాణాలు మొత్తం 36.ఇందు వృశ్చిక తృతీయ ద్రేక్కాణం మినహా మిగిలిన 35 ద్రేక్కాణాలు మానవ సంబంద ద్రేక్కాణాలు.
22 వ ద్రేక్కాణం ఖర ద్రేక్కాణం(మృత్యు ద్రేక్కాణం)ప్రశ్నాశాస్త్రంలో చోర ప్రశ్నలో చోరుడి లక్షణాలు తెలుసుకోవచ్చును.
స్త్రీ ద్రేక్కాణాలు,ఆయుధ ద్రేక్కాణాలు,సర్ప ద్రేక్కాణాలు,పక్షి ద్రేక్కాణాలు,పశు ద్రేక్కాణాలు.
స్త్రీ ద్రేక్కాణాలు:-వృషభంలో –ప్రధమ,మిధునంలో-ప్రధమ,కన్యా రాశిలో -ప్రధమ,తృతీయ, ధనస్సు,మకరం, కుంభం,మీనం-ద్వితీయ ద్రేక్కాణాలు స్త్రీ ద్రేక్కాణాలు.
స్త్రీ ద్రేక్కాణాలలో ఎన్ని గ్రహాలు ఉంటే అంత మంచిది.మంచి ప్రవర్తన,మంచి గుణం ఉంటాయి.ఇతరులచే గౌరవాలు,కీర్తి ప్రతిష్ఠలు,పొందుతారు. భోగాలు,సంపద, సుఖాలపై మక్కువ కలిగి ఉంటారు.లగ్నం,చంద్రుడు,లగ్నాధిపతి,పంచమాదిపతి, దశమాధిపతి స్త్రీ ద్రేక్కాణాలలో ఉంటే ప్రతి పనిలోను విజయాలు ఉంటాయి.
ఆయుద ద్రేక్కాణాలు:-మేషంలో-ప్రధమ,తృతీయ,మిధునంలో –తృతీయ,కన్యాలో –ద్వితీయ,తులలో –ప్రధమ,ధనస్సు,కుంభాలలో-తృతీయ,మకర,మీనాలలో-ప్రధమ ద్రేక్కాణాలు ఆయుద ద్రేక్కాణాలు.
లగ్నం గాని,చంద్రుడు గాని ఆయుద ద్రేక్కాణాలలో ఉంటే ప్రమాదాలు ఎక్కువ ఉంటాయి.అష్టమాదిపతి ఆయుద ద్రేక్కాణాలలో ఉంటే తరచూ ఆపరేషన్స్, యాక్సిడెంట్ లు జరుగుతాయి.శుక్ర సంబందం ఉంటే వాహన ప్రమాదాలు ఉంటాయి.3,8,9,10 భావాదిపతులు ఆయుద ద్రేక్కాణంలో ఉంటే యాక్సిడెంట్స్ తరచుగా జరుగుతాయి.
సర్ప ద్రేక్కాణాలు:-కర్కాటక రాశిలో –ద్వితీయ,తృతీయ,,వృశ్చికంలో-ప్రధమ, ద్వితీయ,మీనంలో –తృతీయ ద్రేక్కాణాలు సర్ప ద్రేక్కాణాలు.
సర్ప ద్రేక్కాణాలలో ఎక్కువ గ్రహలు గాని,లగ్నం గాని ఉంటే పరిస్దితులకు అనుగుణంగా పోరాడే శక్తి కలిగి ఉంటారు.అతి స్వల్ప వ్యవదిలోనే గర్వం,నేర్పరితనం,ప్రతిభ కనబరుస్తారు.వీరు సైన్యాదక్షులుగా బాగా రాణిస్తారు.వీరు నీళ్ళపైన,నేలపైనా ఎంతసేపైన ఉండగలరు.స్త్రీలకు లగ్నం గాని,లగ్నాదిపతి గాని సర్ప ద్రేక్కాణాలలో ఉంటే విష కన్యయోగం.పగపడితే సాదిస్తారు.
పశు ద్రేక్కాణాలు:-మేషలో-ద్వితీయ,వృషభంలో-ద్వితీయ,తృతీయ,తుల,సింహా, వృశ్చికంలో-తృతీయ,కర్కాటక,మకర,దనస్సులో –ప్రధమ ద్రేక్కాణాలు పశు ద్రేక్కాణాలు.
పశు ద్రేక్కాణాలలో ఎక్కువ గ్రహాలు ఉంటే పశు ప్రవృత్తి ఉంటుంది.ముఖ్యంగా చంద్రుడు ఉంటే ఈ లక్షణాలు ఎక్కువ.ఏ పని చేయ కూడదో చెయ్యచ్చో అనే జ్ఞానం కూడా ఉండదు.జాలి,కరుణ ఉండవు.కానీ తనని తాను కంట్రోల్ చేసుకునే తెలివి ఉంటుంది.
పక్షి ద్రేక్కాణాలు:-మిధునంలో-ద్వితీయ,సింహా,కుంభాలలో-ప్రధమ,తులలో-ద్వితీయ ద్రేక్కాణాలు పక్షి ద్రేక్కాణాలు.
పక్షి ద్రేక్కాణాలలో ఎక్కువ గ్రహాలు గాని,లగ్నం గాని ఉంటే భవిష్యత్ లో జరిగే సంఘటనలు తెలుస్తాయి.పరిస్ధితులను ముందుగానే గుర్తిస్తారు.ఇతరులతో కమ్యూనికేషన్ బాగుంటుంది.ఈ ద్రేక్కాణం ద్వారా చోర ప్రశ్నలో లగ్నం ఏ ద్రేక్కాణంలో పడిందో ఆ రాశి స్వభావాన్ని బట్టి చోరుడి లక్షణాలు తెలుసుకోవచ్చును.
PLANETARY STRENGTHS.

Each planet is supposed to get a particular share of strength when he occupies a particular position. There are the following six kinds of strengths considered in Hindu Astrology - called Shadbalas :
Sthanabala :
This is the strength which a planet derives by virtue of his occupying a particular house in a horoscope. A planet gets Sthanabala when he is exalted, is in his own house , moolatrikona and friendly house or when he is in own sign in shadvargas.
Digbala :
This is the directional strength. Guru and Budha have Digbala in the East (that is , when they are posited in Lagna), Ravi and Kuja have Digabala inthe South (10th House) , Shani in the West (7th house) , Shukra and Chandra inthe North (4th house).
Chestabala : (Motional Strength)
Ravi and Chandra get this source of strengthbwhen they are in Makara , Kumbha , Meena , Mesha , Vrishabha and Mithuna rashi (which is Ravi's northernly course i.e Uttarayana), Kuja , Budha , Guru , Shukra and Shani get this source of strength when they are in retrograde motion or when they are in conjunction with Chandra (i.e within 12 degree of Chandra).
Kalabala :
This means temporal strength. Chandra , Kuja , Shani are powerful at night (i.e in chart of night births). Ravi , Guru , and Shukra are powerful during the day. Budha is powerful both during the day and in the night . Malefics and Benefics are powerful during the dark half and bright half of the lunar month respectively. Budha is powerful at sunrise , Ravi at noon , Chandra at midnight , Shani in the evening , Kuja at first part of the night and Shukra at the last part of the night. Guru is powerful always. Planets are said to be powerful in their week days,months and years.
Drigbala :
Drigbala is reckoned as a result of aspect to which each planet is subjected to by the other. The aspect of a malefic or an enemy planet the Drigbala of the aspected planets while the Drigbala is increased if he receives the aspect of a benefic or friendly planet.
Naisargikabala :
This means permanent or natural strength. Ravi , Chandra , Shukra , Guru , Budha , Kuja and Shani are strong in the above order. Ravi is most powerful and Shani has the least natural strength or Naisargikabala.
PLANETARY STRENGTH AND AVASTHAS (STATES).

Planets on account of their continuous movement get into certain states of existance called avasthas. Each avastha produces its own result and this has to be taken into account at the time of the judgement of the horoscope.The various avasthas are as follow :
Deeptha (Bright) or Exaltation : - A planet in his exaltation sign is Deeptha. The result of this is gain from conveyances, respect from elders, fame, wealth and good progeny.
Swastha (Healthy) or Own house : - A planet gets this avastha when he is in his own sign or rashi. In a horoscope if Shukra is in Vrishabha or Tula rashi, we will say that he is swastha. Result : Fame , wealth , good position etc.
Mudita (Happy) : - A planet is happy when he is in a friend's sign or rashi means the rashi owned by a natural friend. For example , if in a horoscope Guru is in Simha rashi which is owned by Ravi , as Ravi is a natural friend of Guru , it is said that Guru is in a friendly sign. If Guru were in Tula or Vrishabha which is owned by Shukra , we would say that Guru is in an enemy sign as Shukra is a natural enemy of Guru.
Shantha : - When a planet is in favourable sub-division he is said to be Shantha. Aplanet in this avastha is said to give favourable results.
Shakta (Powerfull) : - A planet is powerfull when he is retrograde.
Peedya (Unhappy) : - He is in this avastha when he is in the last quarter of a sign. It is said that a planet before zero ti six degrees and 25 degrees to 30 degrees does not give his full results.
Deena (Helpless) : - Aplanet is in this avastha when he is in enemy's sign. We have already explained above what is enemy's sign.
Vikala(in trouble or distress) : - This happens when a planet is combust. Aplanet is said to be combust when he is near Ravi. The following degrees of nearness to the Ravi to the sign are said to cause combustion : Chandra 12 degree : Kuja 17 degree : Budha 13 degree : Guru 11 degree : Shukra 9 degree : Shani 15 degree.
Here again , we would say that in actual practice combustion as described above has not been found to cause adverse results as described as disease , becoming orphan , losing wife and children and disgrace.
Khala (bad) : - A planet is in this avastha when he is in his debilitation rashi or neecha rashi. If Ravi is in Tula rashi or Chandra in Vruschika rashi they would be in Khala avastha. Such planets cause losses , troubles , quarrels with parents , imprisonment etc.
Bheeta (in fear) : - This happens when a planet mves much faster than his normal motion. A planet in this avastha also gives adverse results.

                                https://youtube.com/shorts/hXs7ylVV_Rs?si=eAVlfsOGtiuuLmaF