Monday 30 December 2019

జ్యోతిష్య శాస్త్ర చిట్కాలు :

ఏ భావానికి సంబందించిన ఫలితాన్ని అయిన సాదించాలి అంటే లగ్నం యొక్క బలాన్ని ముఖ్యంగా పరిశీలించాలి.
సాదించిన ఫలితాన్ని అనుభవించగల పరిస్ధితి చంద్ర బలంపై ఆధారపడి ఉంటుంది. చంద్రుడు బలహీనుడైతే సాధించిన ఫలితాన్ని అనుభవించకపోవడం గాని, అనుభవంలో తృప్తి లేకపోవటం గాని సంభవిస్తుంది.

6,8,12 బావాధిపతులు నైసర్గిక పాపులైనా, స్వక్షేత్ర, ఉచ్చ క్షేత్రాల తప్ప వారున్న భావాల ఫలితాలను, వారు చూసే భావాల ఫలితాలను తగ్గిస్తారు.
గురు, బుధులు పాపులైన వారి దృష్టి మంచిది.
6, 8, 12 భావాలకు అధిపతి అయిన గ్రహం మరో ఆదిపత్యం కూడా కలసిన ఆ మరో ఆదిపత్యం కేంద్ర కోణాలకు సంబందించినదైతే ఆ దోష ఫలితం బలహీన పడుతుంది.
6, 8, 12 భావాల అధిపతి దుర్బలుడై శత్రు క్షేత్ర స్ధితి, అస్తంగత్వం అయితే అతని దుష్ట ఫలం బలహీన పడుతుంది.
6 భావంలో గురుస్ధితి, 8 భావంలో బుధ స్దితి, 12 వ భావంలో శుక్ర స్ధితి శని యొక్క రాశి నవాంశలు మకర కుంభాలు కాకున్నా శుభ ఫలితాన్ని ఇస్తుంది.
6,8,12 భావాలలో స్వక్షేత్రాదులలో ఉన్న వారిచ్చే శుభఫలం, దోష ఫలం తక్కువే.
6,8,12 భావాలకు అధిపతులు ఏ భావంలో ఉంటే ఆభావాన్ని పాడు చేస్తారు.
6,8,12 భావాలకు లగ్నాదిపత్యం ఉన్న దోష ఫలితాన్ని ఇవ్వరు.
శుక్రుడు 12 వ భావంలో ఉంటూ మకర, కుంభాలకు చెందిన రాశి, నవాంశలలో ఉంటే జాతకుడు వ్యసనపరుడయ్యే అవకాశం ఉంది.
అష్టమాధిపత్య దోషం సూర్య చంద్రులకు లేదు. మారక స్ధానాధిపతులైన మారకం చేయలేరు.
ఆయుష్కారకుడైన శని అష్టమంలో ఆయువుకు మంచివాడు. అశుభ ఫలితాన్నిచ్చే గ్రహాలు ఎన్ని శుభగ్రహాలచే చూడబడీతే అంతగా వారి దుష్ట ఫలితాలను ఇవ్వడం మానేస్తారు.
గ్రహానికి బలం నిర్ణయించటానికి షష్ట్యంశ అతి ముఖ్యమైనది.

No comments:

Post a Comment

                         https://youtube.com/shorts/flB4WlmnbLs?si=SMNTDWimlM9c0PJd