వృత్తి ఉద్యోగ వ్యాపారాలలో రాణించడానికి స్వయంకృషి , పట్టుదల , ఆత్మ విశ్వాసంతో పాటు 'గ్రహానుకూలత' కూడా అవసరం. జాతక శాస్త్రాన్ననుసరించి , మానవుడి జనన కాలాన్ని బట్టి ఆ వ్యక్తి 27 నక్షత్రాల్లో ఏదో ఒక నక్షత్రానికి చెందినవాడై వుంటాడు . ఈ నక్షత్రాల్లో జన్మించిన వారికి పన్నెండు రాశులు శుభాశుభములను నిర్ణయిస్తాయి. ఈ పన్నెండు రాసులకు అధిపతులుగా నవగ్రహాలు వ్యవహరిస్తుంటాయి. అంటే ఒక వ్యక్తి 'ఫలానా నక్షత్రం' లో జన్మిస్తే , అతని జనన కాలంలో ఆ నక్షత్రం 'ఏ రాశిలో' వుందో ...ఆ రాశి ననుసరించి 'నవగ్రహాలు ఆ సమయంలో ఏ గృహాల్లో వున్నాయో...'గుణించి ఆ వ్యక్తి జాతక చక్రాన్ని తయారు చేస్తారు. ఆ జాతక చక్రాన్ని బట్టి అతడు పుట్టింది మొదలు చివరి క్షణం వరకూ అతడి జీవితంలో ఎప్పుడు ఏయే మార్పులు సంభవిస్తాయో , వృత్తి,వ్యాపార,కుటుంబ,అదృష్ట,ఆరోగ్య,శుభాశుభ పరిణామాలను జ్యోతిష్య వేత్తలు అనుసరించి వ్యాపార,వ్యవహార,వృత్తి కార్యక్రమాల్లో సంభవించే దుష్ఫలితాలను నివారించి సత్ఫలితాలను పొందడానికి గ్రహశాంతులు,దానాలు,దైవపూజలు,తదితర కార్యాలు చేస్తుంటారు. ఇట్టి దైవ సంబంధమైన అంశాలలో అత్యంత పవిత్రమైనది ,మహాశక్తి సంపన్నమైనది,వేదకాలం నుంచీ పూర్వులు ఆచరించి సత్ఫలితాలను పొందినది, నిరపాయకరమైనది,ఎలాంటి దుష్ఫలితాలను చూపనిది ఏదంటే అది 'రుద్రాక్ష ధారణ'.
No comments:
Post a Comment