Monday 4 May 2020

భావాధిపతులు - ఫలితాలు 1 :

1. లగ్నాధిపతి ద్వితీయస్థానమునందున్న జాతకులు మిక్కిలి అద్భుతములైన లక్షణాల్ని కలిగి వుంటారు. వీరు మంచి భక్తి శ్రద్ధా విశ్వాసములు మరియు విద్యాసక్తులను కలిగి వున్నవారై వుంటారు. వీరికి వాక్చాతుర్యమనేది భగవంతుడు ప్రసాదించిన గొప్పవరము. భవిష్యత్తునందు ఏమి జరుగబోవునో తెలిసికొనగల లేదా ఊహ చేసికొనగల సామర్ధ్యమనేది వీరికి వుంటుంది. ప్రముఖంగా చెప్పాలంటే , వీరు అధిక సుఖసంతోషాలను కలిగిన వ్యక్తులై వుంటారు.

2. ద్వితీయాధిపతి ద్వితీయస్థానమునందున్న జాతకులకు ఆర్ధిక భద్రత వుంటుంది. ఏదేమైనప్పటికి , వీరి యొక్క గర్వము మరియు అహంకారములను ఇతరులు అపార్ధము చేసికొనవచ్చును. వీరు పొగడ్తలను ఇష్టపడతారు. వీరు అన్నీ తమకే తెలుసుననే స్వభావమును కలిగిన వారై వుంటారు. వీరి యొక్క ప్రేమ వ్యవహారములవలన వీరు తమయొక్క స్నేహితులు మరియు కుటుంబ సభ్యులచేత కూడా విమర్శింపబడుదురు. వీరు చాలా పరిమిత కుటుంబాన్ని కలిగి వుంటారు.

3.తృతీయాధిపతి ద్వితీయస్థానమునందున్న జాతకులు వారు చేసెడి పనియందు ఆసక్తిని చూపనందున , వారు సోమరితనము మరియు బద్దకము కల వారుగా కనిపిస్తూ వుంటారు. వీరు ఇరుగు పొరుగు వారితో తగువులాడేడి అవకాశాలు కూడా వున్నాయి. వీరు మాట్లాడునపుడు అజాగ్రత్త అధికప్రసంగం మరియు ప్రయోజకమైన లక్షణాలు గోచరిస్తాయి. వీరికి చిన్న సోదరుడు గానీ , సోదరి గానీ వుంటారు. లేదా చిన్న సోదరుని నుంచి ఎడబాటు వుండే అవకాశం వుంది.

4.చతుర్ధాధిపతి ద్వితీయస్థానమునందున్న జాతకులు చాలా ధైర్యమును కలిగిన వారు , అదృష్టవంతులు  మరియు సంతోషవంతులు. వీరికి తల్లివైపు నుండి ఆస్తి లభించవచ్చు. వీరికి వారియొక్క నోటి దురుసుతనము వల్ల శత్రువులు (మిత్రులకంటే) అధికముగా వుంటారు.

5. పంచమాధిపతి ద్వితీయస్థానమునందున్న జాతకులు రాష్ట్రము నందుగానీ , దేశము నందుగానీ లేదా అంతర్జాతీయ స్థాయిలో గానీ ఔన్నత్యాన్ని లేదా గొప్పతనాన్ని తప్పక పొందుతారు. అది కూడా వీరి వెనుకటి జీవితమును అవసరము లేదా అవకాశములపై ఆధారపడి వుంటుంది. ఏదో ఒకనాడు వీరు వార్తాపత్రికలలో ప్రముఖ వార్త అవుతారు. వీరి సంతానము యొక్క లేదా సోదరుల యొక్క గొప్పతనము వలన అతి నమ్మకము మరియు గర్వము పెరగవచ్చు. వీరు చాలా అధికారవాంఛగలవారు. అందుచే చిన్న స్నేహపూర్వక సలహాను కూడా వీరు ఇష్టపడరు. పిల్లల నుంచి , స్నేహితుల నుంచి , ఇరుగు పొరుగు వారి నుంచి లేదా ప్రేమికుల నుంచి బలవంతంగా స్వీకరించబడే అబ్యర్ధనలు వీరి కోపానికి గురికావచ్చు . వీరికి అందమైన జీవిత భాగస్వామి మరియు సత్ప్రవర్తన కలిగిన సంతానము వుంటారు.

6. షష్టాధిపతి ద్వితీయస్థానమునందున్న జాతకులు చాలా సాహస వంతులై వుంటారు మరియు జీవించడం ఎక్కడైతే కష్టముగా వుంటుందో ఆ ప్రదేశములకు మారుతుంటారు.వీరు చాలా కష్టపడి పని చేస్తారు. ఏ విషయాన్నైనా నాఫలమయ్యే విధంగా మరియు ఒప్పించే విధంగా చెప్పగల మార్గము వీరికి తెలుస్తుంది. వీరు ఆర్ధిక ఇబ్బందులకు మరియు నిధుల కొరతకు చాలా జంకుతారు. వీరి కుటుంబము యొక్క మరియు వీరి భవిష్యత్ యొక్క భద్రతను కాపాడాల్సిన అసాధ్యమైన అవసరాన్ని వీరి అంతరాత్మ ద్వారా పొందుతారు. ఆరోగ్యము గురించి బాధ పడాల్సిన అవసరము లేదు. వీరు ప్రేమించిన వారి నుంచి మరియు స్నేహితుల నుంచి లభించిన నిశ్శబ్దతిరస్కారము , శత్రువుల నుంచి తిన్నగా వచ్చిన ఎదుర్పాటు కన్నా వీరిని అధికంగా కలవరపరుస్తుంది. వీరు స్నేహితులతో మానసికముగా దగ్గరవుతారు. వీరు ప్రధమమునుంచే జాగ్రత్త వహించకున్నయొడల శత్రువులవలన ధన నష్టము కలుగవచ్చు. వీరికి మాట్లాడుటలో నత్తి దోషము వుండవచ్చు.

7.సప్తమాధిపతి ద్వితీయస్థానమునందున్న జాతకులకు వివాహానంతరము ధనము ప్రాప్తిస్తుంది. అందువలన వీరి భార్య అదృష్టవంతురాలిగా , సంపన్నురాలిగా గౌరవించబడును. అటుపైన వీరు జీవితములో  ముందుకు వెళ్ళే కొద్దీ ఆమె పొందిన ఆశీర్వాద బలము వల్ల , గ్రహ బలము వల్ల పురోభివృద్ధిని పొందవచ్చును. వీరికి నమ్మకమైన స్నేహితులు లేకపోవచ్చు. వీరు ప్రయాణాలలో సౌఖ్యములు అనుభవిస్తారు. కుటుంబమునకు చెడ్డపేరు వచ్చే కార్యక్రమాలలో ఫాల్గొనుటకు వీరు పురికొల్పబడతారు. వీరు పలు విధములైన మనుష్యులను ముందుగా తగినంతగా పరీక్షించి , శోధించకపోవుటవల్ల అనేకరకాలైన కష్టాలకు గురి అవుతారు. వదంతులను వీరు భరించవలసివుంటుంది.వీరు ఏ విధంగానూ బాధ్యత వహించని విషయాలకు శిక్షింపబడతారు.ఉన్నతాధికారుల అసంతృప్తివలన ఆగ్రహమునకు గురికాకుండా సంరంక్షించుకోవాలి. ఆత్మ విశ్వాసమే మనిషికి బలమని గుర్తించాలి.

8. అష్టమాధిపతి ద్వితీయస్థానమునందున్న జాతకులు శరీరకముగా చురుకుగా వుండకపోవచ్చు. నేత్రములు మరియు దంతములకు సంబంధించిన ఆరోగ్యసమస్యలు ఎదుర్కోవలసివచ్చును. వీరికి ఆహారములో చాలా రుచులు అవసరము. వీరికి లభించిన ఆహారము ఇష్టపడకపోవచ్చు. పోగొట్టుకున్నది లభించుట కష్టము కాబట్టి దానిని సంరంక్షించుకొనుటకు మరియు నిలబెట్టుకొనుటకు ప్రయతించవలెను. సాధారణముగా వీరిలాంటి మనస్తత్వము కల్గిన వ్యక్తి , జీవిత భాగస్వామి నుండి స్వచ్చమైన మరియు మిక్కుటమైన ప్రేమాభిమానాలు పొందుచున్నప్పుడు వేరే ఆలోచనలు రావు. వీరి స్నేహితులు మొండిగా ప్రవర్తించినపుడు వీరు చాలా శాంతముగా వుండుటకు శక్తినంతయు కూర్చుకొనవలసియుండును.

9.నవమాధిపతి ద్వితీయస్థానమునందున్న జాతకుని తండ్రి గారు ధనవంతులై , పలికుబడి కలిగిన వారై వుంటారు .

10.దశమాధిపతి  ద్వితీయస్థానమునందున్న జాతకులు వాస్తవానికి వృత్తి యందు వీరు చాలా గొప్పవారు. వీరు జీవితములో బాగా అభివృద్ధి చెందుతారు మరియు బాగా ధనమును సంపాదిస్తారు. ప్రారంభములో వీరి కులవృత్తి లోనేవుండి , దానినే అభివృద్ధి పరచు అవకాశాలు కలవు. దాని యందు వీరు రాణించనిచో కులవృత్తిని ఆనందముగా వదిలివేయుదురు. తల్లిదండ్రులనుండి ఆస్తి లభించును. పురాతన జ్యోతిశాస్త్ర పుస్తకముల ప్రకారము వీరి పేరు ప్రతిష్టలు నలుమూలలకు వ్యాపించును.

11.ఏకాదశాధిపతి ద్వితీయస్థానమునందున్న జాతకులు వీరు సోదరులతో గానీ లేదా సోదరీలతో గానీ సత్సంబంధములను కలిగియుండేదరు. స్నేహితులతో భాగస్వామ్యత్వము మరియు వ్యాపారము సాధారణముగా వీరికి మంచి లాభములను తెచ్చిపెట్టును. వీరికి దానగుణము కలదు. దానికితోడు మతాభిమానము కూడా వుండును.

12. ద్వాదశాధిపతి ద్వితీయస్థానమునందున్న జాతకులు అనాలోచితముగా ఆర్ధిక బాధలను ఆహ్వానించేదరు. వీరు అసహజమైన భోజనపు అలవాట్లను కలిగి యుండేదరు. వీరికి కంటిచూపు తక్కువగా వుండును. ఇంటియందు ప్రశాంతత లోపించును. చేతకాని పరిస్థితులు ఎదురైనప్పుడు వీరు యుక్తితో వ్యవహరించేదరు. మతములో ఆనందము లభించునని వీరు గ్రహించుదురు.

No comments:

Post a Comment

                                https://youtube.com/shorts/hXs7ylVV_Rs?si=eAVlfsOGtiuuLmaF