Sunday 3 May 2020

భావాధిపతులు - ఫలితాలు :

1. లగ్నాధిపతి లగ్నస్థానములో వున్నచో  అట్టి జాతకులు ధనమును సంపాదించుదురు. దాన్ని బహు చక్కగా జాగ్రత్తపరుచుచూ వుంటారు. ఈ జాతకులందలి స్వయం వ్యక్తిత్వము గుర్తించబడుతుంది. వీరు తమ యొక్క ఆదర్శ పూరితమైన జీవిత విధానమునకు వారే తృప్తి నొందుతూ వుంటారు. సహజంగా వీరు సాహసులైనప్పటికి  , కొన్ని పర్యాయములలో ఆలోచనా రహితులుగా వుంటారు. ఏదేమైనప్పటికి వీరిలో మార్పు కలిగే అవకాశం వుంటుంది. వీరు పలురకాలైన విషయశక్తులను కలిగి వుంటారు. ఇంకనూ , అనేక విషయములచేతను , పలురకాలైన వ్యక్తులచేతనూ వ్యామోహితులవుతారు. వీరు శారీరక మరియు మానసికములుగా కూడా బహు జాగరుకతతో తప్పక వుండి తీరవలేను. వీరు విదేశములలో నివాసముండుటగానీ లేదా విదేశ ప్రయాణము చేయుట గానీ సంభవించవచ్చును.

2. ద్వితీయాధిపతి లగ్నస్థానమునందున్న జాతకులు వారికి చిన్న సందేహము కల్గినప్పటికి, చివరకు ధనార్జన చేయుదురు.  వీరికి తమ తల్లిదండ్రులతో సంబంధబాంధవ్యాలనేవి సంతృప్తిని కలిగించేవిగా వుండవు. వీరు తమ యుక్త వయస్సునందు కూడ సుఖసౌఖ్యములకొరకు , భద్రతలకొరకు గృహమునందు వెదుకులాడ వలసివచ్చును. వీరు తమ తల్లిదండ్రులను ద్వేషించుటేగాక వారిని తమ వ్యక్తిగత ఆనందాభివృద్ధులకు అడ్డంకులని భావిస్తారు . వ్యాపార రీత్యా జరుగు మోసాలను అరికట్టేందుకుగాను వీరు మిక్కిలి జాగ్రత్తగా మసలుకోవలెను. వీర్కి ఆర్ధికపరమైనటువంటి అభివృద్ధి అధికమై మరల అర్ధరహితముగా క్రుంగిపోవుట మూలముగా కొంత మానసిక క్లేశములు గానీ , మనఃశ్శాంతిని కోల్పోవుట గానీ సంభవించును. కొన్ని పర్యాయములు వీరు పరులపట్ల కరుకుగా ప్రవర్తిస్తారు.

3.తృతీయాధిపతి లగ్నస్థానమునందున్న జాతకులు తమ యొక్క స్వయంకృషి వలన అభివృద్ధి చెందుటయే గాక , తమ యొక్క విద్యార్హతలు , తెలివితేటలు , విజ్ణానములవలన కొనియాడబడుతూ వుంటారు. వీరి యొక్క కోపము మరియు ఇతరులను ఎగతాళి చేసెడి స్వభావము వలన అందరూ వీరికి భయపడుతూ వుంటారు. వీరు బలహీనముగా , చిక్కినట్టుగా  కన్పించిననూఅవసరమైనప్పుడు వీరియొక్క యదార్ధశక్తిని మరియు జీవనోపయోగ్యత్వమును ప్రదర్శిస్తూ వుంటారు. వీరు సంఘజీవనమునకు , మరియు సంప్రదాయమునకు విలువనిస్తూ వుంటారు. వీరికి తగిన ప్రోత్సాహము లభించినచో సంగీతము , నాట్యము , నటనల యందు ఆసక్తి అధికమగుటయే గాక , సన్మార్గమున వీరు జీవనోపాధిని కూడా సంపాదించుకుందురు. వీరు చాలా ధైర్యము మరియు నిర్భయత్వములు కల్గినవారెగాక మంచి నటులు కూడ.

4. చతుర్ధాధిపతి లగ్నస్థానమునందున్న జాతకులు బాగా తెలిసిన యువతినే వివాహమాడే అవకాశం వుంటుంది. వీరు చదువుకున్న వారై వుంటారు . కానీ బహిరంగ సమావేశాలలో ఫాల్గొనటానికి సిగ్గుపడుతూ వుంటారు. వీరు తమ వారసత్వపు ఆస్తిని నిలుపుకోలేరు.

5.పంచమాధిపతి లగ్నస్థానమునందున్న జాతకులు వారు ఎంచుకున్న రంగమునందు పాండిత్యాన్ని చూపుతారు. శాస్త్ర పరిశోధనలు , ఇంద్రజాల ప్రదర్శనలు మరియు కష్టమైనవి లేదా పోటీ కలిగినవి ఏవైనా వీరిని ఆకర్షిస్తాయి. వీరు నిజంగా ఖర్చు చేయగలిగిన దాని కంటే ఎక్కువగా పిల్లల పట్ల ఖర్చు చేయుదురు. సంతానములో ఎవ్వరూ కూడ వారి నిర్ణయాలను వీరిపై బలవంతంగా రుద్దలేరు. వీరికి అధికారము చెలాయించగల శక్తి వుంటుంది. వీరు పోలీసు అధికారి గానీ , న్యాయాధిపతి గానీ అవుతారు. వీరు బుద్ధి లేదా అబుద్ధి పూర్వకముగానైనా సంతానమును పొందటానికి ఆలస్యము చేస్తారు.

6. షష్టమాధిపతి లగ్నస్థానమునందున్న జాతకులు సహజముగా ధైర్యవంతులై వుంటారు. కానీ వీరు స్వంత కుటుంబమును ఎదిరించేవారుగా మారే అవకాశం వుంటుంది. వీరు సైనిక దళములో చేరటం గానీ , లేదా జైలుకు సంబంధించిన పనిని ఏదైనా చేసే అవకాశం వుంటుంది.వీరు బహుశా మేనమామతో కలిసి జీవించటం గానీ లేదా ఆయనకు దగ్గరవటం గానీ జరుగుతుంది. అనారోగ్యము వీరిని సతతమూ బాధిస్తుంది. దానిలో కొంత భాగము ఊహించుకొన్నవే అవుతాయి. వీరు మంచి పుత్రవాత్సల్యమును కల్గినవారై , మరియు సంతానమునకు మంచి సలహాలను , మంచి శిక్షణను అందించగలరు. వీరి జీవిత భాగస్వామి వీరి ధైర్యమునకు మరియు భద్రతకు అనుకూలంగా సహాయపడుతారు. ఇది వీరిద్దరికీ సంబంధించిన అన్నీ విషయములందు ఆర్ధిక , శారీరక మరియు ఇతరములైన అన్నీ పరిస్థితులనూ అనుసరింతురు. చిన్నతనమందు వీరికి సరియైన శిక్షణ లభించని యొడల నేరస్తులుగా మరే అవకాశాలు ఉత్పన్నమవుతాయి.

7. సప్తమాదిపతి లగ్నస్థానమునందున్న జాతకులు మొదటనుండి తెలిసిన అమ్మాయిని వివాహమాడు సూచనలున్నవి. వీరికి స్కూల్ లోనూ లేదా కాలేజీ లోనూ తెలిసిన అమ్మాయి భార్య కావొచ్చు. ఏమైననూ వీరి భార్య తెలివైనది , సున్నితమైనది మరియు గృహ నిర్వహణలో నైపుణ్యము కలదిగా వుండును. యువకులుగా మొదటనుండీ అందమైన ఉత్సాహపరులైన అమ్మాయిలను ఆకర్షించుదురు. వీరు జీవిత భాగస్వామిని ఎన్నుకొనుటలో సౌందర్యమునకు ఆదిక ప్రాధాన్యతను ఇచ్చేదరు. భర్తగా వీరు ఇతరులు ఊహించినంత విశాల హృదయులు కాకపోవచ్చు. వీరి భార్య వారి శక్తిని , మానసిక ఆనందమును పరిరక్షించుటలో తగినంత కృషి చేయును. వీరి విజయమునకు ఇది ముఖ్యమైనది. వీరు మంచి కీర్తి గల కుటుంబములో జన్మించుటవల్ల ఔన్నత్యము , ఠీవి నడవడిలో ప్రతిబింబిస్తుంది. దంపతులుగా వీరిద్దరు సంపాదనమును వ్యర్ధమొనరించుకోకుండా తగు జాగ్రత్త వహించాలి .

8.అష్టమాధిపతి లగ్నస్థానమునందున్న జాతకులు వీరికి బహుశా ఆచారకాండలు మరియు సంప్రదాయాలు చికాకు కల్గించవచ్చు. వీరిని వీరు ఒక నాస్తికునిగా పిలుచుకోవచ్చు. వీరు చిన్నతనమునుంచీ అన్నిటినీ తెలుసుకొనవలేనన్న జిజ్ణాసకలవారు. బహుశా వీరు పూర్తిగా స్థిరపడకముందే అనేక సంబంధములందు చిక్కుకొని హృదయ వేదనను అనుభవింతురు. వీరు అనుకున్న గమ్యమును చేరే వరకు మరలా మరలా ప్రయత్నిస్తూనే వుండాలి. వీరు కురూపితనము మరియు రుగ్మతల కారణముగా శరీరకముగా బాధపడవచ్చు . వీరు శారీరకముగా కొంచెము నీరసముగా కనిపించవచ్చు. ప్రభుత్వ సంస్థలతో వ్యవహారము చేయునపుడు జాగ్రత్తగా వుండవలెను. వీరి పన్నుల లెక్కలను అకారణముగా తనిఖీ చేయవచ్చు. వీరు వృద్ధాప్యదశ లోనికి చేరుకున్న కొలదీ ఆధ్యాత్మిక చింతన పెరుగును.

9.నవమాధిపతి లగ్నస్థానమునందున్న జాతకులు దూరప్రాంతాలలో పని చేయవచ్చును. లేదా తరచూ వృత్తి రీత్యా ప్రయాణాలు చేయవలసిరావచ్చును. వీరి ప్రయాణాలు వీరి జీవిత భాగస్వామికి మానసిక వేదనను కలిగించవచ్చు. వీరి అత్తమామలతో వున్న సత్సంబంధాలను చెడగొట్టుకొనరాదు. వీరు అనుసరించు విధములో అత్తమామలకు దగ్గరగా చేరినచో వారి నుంచి నిదానముగా లాభము పొందేదరు.

10.దశమాధిపతి లగ్నస్థానమునందున్న జాతకులు స్వశక్తితో పైకివస్తారు. వీరు ఎవరికిందా పనిచెయ్యక స్వతంత్ర ప్రతిపత్తిగల వృత్తిని ఎన్నుకుంటారు. వీరు జ్ణానసంపత్తిని అభివృద్ధి పరచుకొన్నచో వీరు ఎంచుకున్న వృత్తి యందు పేరు ప్రతిష్టలను  , గుర్తింపును పొందేదరు. వేరు ప్రజాసేవకు అంకితమైన కొన్ని సంస్థల స్థాపన , మరియు వాటిని నడుపుట యందు ఫాల్గొనవచ్చును. వీరు చేయు పనులన్నిటియందు కవిత్వ ధోరణి కంపించవచ్చు. ఆరోగ్య సమస్యలేవైనా వున్నచో అవి చిన్నతనము వరకే పరిమితం. వీరి భవిష్యత్ నందలి పెరుగుదల నెమ్మదిగా , తిన్నగా వుండును.

11.ఏకాదశాధిపతి లగ్నస్థానమునందున్న జాతకులు వీరు ధనిక కుటుంబము నందు జన్మించుదురు. మరియు ఆస్తిని సంపాదించుదురు. వీరి అన్నగారిని ఒకరిని నష్ట పోవుదురు. వీరికి మంచిని ఎన్నుకోగల మరియు చెడును తిరస్కరించగల సామర్ధ్యము కలదు. వీరి యొక్క ప్రతిభను , విజ్ణానమును పూర్తిగా వినియోగించుటకు అవకాశమున్న వృత్తిలో వీరు బాగా రాణించుదురు.

12.ద్వాదశాధిపతి లగ్నస్థానమునందున్న జాతకులు మంచి అందమైన వారు మరియు సరస సంభాషణా చతురులు . వీరు అర్భక శరీరము మరియు కలత చెందే మనస్సు కలిగి యుందురు. వీరికి ప్రయాణములు అనివార్యము. అప్పుడప్పుడు శ్వాసకోశ సమస్యలు కలగవచ్చును. అవి వీరిని భాదించేవని ఋజువగును. కారణములు లేకుండగానేవీరి భవిష్యత్ గురించి అనుమానములు తలయెత్తును.

No comments:

Post a Comment

                                https://youtube.com/shorts/hXs7ylVV_Rs?si=eAVlfsOGtiuuLmaF