Monday, 25 March 2024
Friday, 1 January 2021
VEDIC EVENTS FOR THE MONTH OF JAN 2021.
VEDIC EVENTS FOR THE MONTH OF JAN 2021.
01 JAN – NEW YEAR DAY
04 JAN – VENUS ENTERS SAGITTARIUS
05 JAN – MERCURY ENTERS CAPRICORN
06 MAY – 8 TH WANING MOON
09 JAN – EKADASI
10 JAN – PRADOSHAM
11 JAN – MINI SHIVARATRI
13 JAN – NEW MOON
13 JAN – HANUMAN JAYANTHI
14 JAN – MAKAR SANKRANTHI
14 JAN – SUN ENTERS CAPRICORN
17 JAN – VASANTHA PANCHAMI
20 JAN – 8 TH WAXING MOON
20 JAN – RADHA SAPTHAMI
24 JAN – EKADASI
25 JAN – MERCURY ENTERS AQUARIUS
26 JAN – PRADOSHAM
28 JAN – FULL MOON
28 JAN – VENUS ENTERS CAPRICORN
Tuesday, 1 December 2020
VEDIC EVENTS FOR THE MONTH OF DECEMBER 2020.
07 DEC – 8TH WANING MOON
11 DEC – VENUS ENTERS SCORPIO
11 DEC – EKADASI
12 DEC – SHANI PRADOSHAM
13 DEC – MINI SHIVARATRI
14 DEC – NEW MOON
15 DEC – SUN ENTERS SAGITTARIUS
17 DEC – MERCURY ENTERS SAGITTARIUS
21 DEC – 8TH WAXING MOON
24 DEC – MARS ENTERS ARIES
25 DEC – CHRISTMAS
25 DEC – VAIKUNTHA EKADASI
25 DEC – EKADASI
27 DEC – PRADOSHAM
30 DEC – FULL MOON
Thursday, 20 August 2020
భావాధిపతులు - ఫలితాలు 2
1.లగ్నాధిపతి తృతీయస్థానమునందు వున్నటువంటి జాతకులు గొప్పవి మరియు సాహసమైనటువంటి కార్యములలో ఫాల్గొంటారు. వీరు పలురకాలైన వ్యక్తులతో ఒకే పర్యాయము సమానంగా సంబంధ వ్యవహారములను నడిపెడి సమర్ధతలను కలిగి వుంటారు. అయితే అది సామాన్యమైన స్నేహములవరకు మాత్రమే పనికి వస్తుందిగాని , ప్రేమ సంబంధిత వ్యవహారములైనచో ప్రమాదకరములుగా పరిణమిస్తాయి. వీరి యొక్క కొన్ని ఆచరణా వ్యవహారాలు ఇతరులకు అసహజముగాను , శాస్త్ర విరుద్ధముగాను గోచరిస్తుంటాయి. ఇతరులు వీరి గురించి చర్చించుకునే ఆస్కారం వుంటుంది. అది వీరికి ఇష్టము లేనట్లయితే , తమ జీవన విధానములోని డాంబికతను తగ్గించుకోవాలి. వీరు సంగీతము లేదా గణిత శాస్త్రము నందు గుర్తింపును పొందే అవకాశము వుంటుంది. వీరి ఆరోగ్య పరిస్తితి అస్థిరంగా వుంటుంది.
2.ద్వితీయాధిపతి తృతీయ స్థానములో వున్న జాతకులు ధైర్యము , తెలివి తేటలు , నీతి మరియు లోభత్వములను కలిగిన వారై వుంటారు. వీరు ప్రేమను దాని యొక్క స్వభావసిద్ధమైన ఉనికితో సమానముగా చూస్తారు. ప్రేమయొక్క విలువను మరియు గొప్పదనమును ఎటువంటి అంచనా వేయకుండగనే వీరికి వీరే ఇచ్చిపుచ్చుకొను ధోరణిగా వ్యవహరింతురు. వీరు మత సంబంధమైన నమ్మకాలను వీడి , ప్రాపంచిక సుఖములకు అలవాటు పడవచ్చు. వీరు తమ సోదరి వలన సహాయములు పొందుతారు. సంగీతము మరియు లలితకళల యందు వీరికిగల ఆసక్తులు సరియైన సమయంలో వీరికి పేరు ప్రఖ్యాతలను తెస్తాయి. వీరు సహజంగానే ప్రేమ మరియు వ్యాపారములందు కూడా తోడుయొక్క అవసరములను గుర్తిస్తారు. వీరు మతసంబంధిత కార్యములందు అధిక శ్రద్దను కలిగి వుండకపోవచ్చు.
3.తృతీయాధిపతి తృతీయ స్థానములో వున్న జాతకులకు అన్నదమ్ములు లేదా అక్కచెల్లెళ్లతో గానీ లేదా వీరి తరువాత తరము వారితో గానీ కలిసి జీవించుట , చనువుగా మసలుట మరియు వారితో కలసి పనిచేయుట మొదలైనవి వేరికి సంతోషాన్ని కలిగిస్తుంటాయి. వీరు నిష్కపటులు మరియు న్యాయమైన వారు. వీరికి మోసం చేయుట తెలియదు. వీరు నిరంతర ఆశావహ దృక్పధమును కలిగినవారు. ప్రతి క్రొత్తరోజు కూడా వీరికి క్రొత్త జీవితమును ప్రారంభించుటకు బ్రహ్మాండమైన అవకాశములను బహూకరిస్తుంది. వీరు గతములోకి ఎప్పుడూ కూడా తిరిగి చూచుకోని బాధపడవలసిన అవసరము లేదు.వీరికి వీరికంటే చిన్నవారైన సోదరులవలన కొన్ని ఇబ్బందులు కలగవచ్చు.
4.చతుర్ధాధిపతి తృతీయ స్థానములో వున్న జాతకులు వీరిని వీరు వ్యక్తిగతముగా తీర్చుకుంటారు. తల్లిదండ్రులనుండి శీలమును , సాధు స్వభావమును అలవరచుకుంటారు. జబ్బులనుండి రక్షించుకొనుటకు తగిన చర్యలు వీరుగైకొనాలి . వీరికి దాయాదులు వున్న యొడల వారితో పరిష్కారములు జరుపునపుడు జాగ్రత్తగా వుండాలి.
5. పంచమాధిపతి తృతీయ స్థానములో వున్న జాతకులు మంచి సంభాషణా చాతుర్యాన్ని కలిగివుండి ఏ వార్త అయినా వీరికి చేరిన దానికన్నా త్వరగా , వీరు ఊహలను చేర్చిగానీ , లేదా వెంటనే బహిర్గతము చేస్తుంటారు. వీరు వీరిపనియందు ఆసక్తిని కలిగి వుండుటయేగాక వీరి తోటిపనివారితో , ఆకాచెల్లెళ్లతో , సోదరులతో , అందరితో కూడా న్యాయంగానే ప్రవర్తిస్తుంటారు. వీరికి వీరి కుటుంబముయొక్క ఆర్ధిక భద్రతయే ప్రధాన ధ్యేయము. పిల్లలు వీరి అభిప్రాయాల్ని అపార్ధము చేసికొనే ప్రమాదం వుంటుంది. అంతేగాక వీరిని అతి పిసినారిగా భావిస్తారు. ధనమునకు సంబంధించిన వివాదాలకు వ్యతిరేకంగా , వీరి పిల్లలు అతి త్వరగానే వీరి హృదయమంతా కూడా వారి ఆసక్తులే నిండి వున్నాయని కనుగొంటారు. వీరు పిల్లల భద్రత విషయంలో ఎటువంటి అవకాశానికి తావు ఇవ్వకుందురు.
6.షష్టమాధిపతి తృతీయ స్థానములో వున్న జాతకులు వీరు సరియైన సహకారములు లభించనిచో చీదరపడతారు. దీనివలన వీరికి కోపము , అస్థిరత్వము , లేదా అభద్రతా భావము కలుగుతుంది. కాబట్టి , వీరు అవసరమైనప్పుడు వీరి అభిప్రాయములను చెప్పుట లేదా వాటిని క్రియలో పెట్టుట చేయలేకపోవుదురు. వీరు ప్రేమించిన వారితో ఏదైనా తేల్చుకోనవలెనన్నచో , ఫలితం-పూర్తిగా యుద్ధమే. నిర్ణయము తీసికొనుటకు బలవంతము చేయుటయే వీరి స్నేహితులు , బంధువులు , తోటి వ్యాపారస్తులు మరియు ప్రేమికులు లేదా భాగస్వామిచేయు పెద్దతప్పు. వీరు వీరి స్వంత మార్గములో నడచి, కావలసినంత సమయమును తీసుకొని నిర్ణయములు చేసినంత వరకూ , వారి ప్రయత్నములేవీ ఫలించవు కానీ , వీరు వీరి సోదరులు , మేనమామలతో స్నేహపూర్వకముగా వుండటం వలన వీరికి లాభిస్తుందనే విషయాన్ని గుర్తించాలి . వీరికి వీరి సోదరునితో తీవ్ర విరోధము కలగవచ్చును.
7.సప్తమాధిపతి తృతీయ స్థానములో వున్న జాతకులు కళత్ర తృప్తి కొరకు వీరు ఏ పని అయిననూ చేస్తారు. ప్రియమైన భర్తగా అది వీరి కర్తవ్యమని తలుస్తారు. వీరు విశ్వాస పాత్రులైన భర్తగా వుండుటయే గాక ఆమె భావములను మనస్సులో ఎల్లప్పుడూ గౌరవిస్తారు. ఆమె వీరి జీవితంలో ప్రవేశించిన తరువాత వీరు అధికంగా అభివృద్ధి చెందుటవలన ఆమె యందు వీరు అధికమైన ప్రేమ , ఆరాధన కలిగి ఉంటారు. వీరు అలంకరణ యందు మంచి అభిరుచి కలవారు కనుక వీరి దుస్తులు , వీరి భార్య దుస్తులు ఎన్నిక చేయుటలో చాలా శ్రద్ధ తీసుకుంటారు. చట్టసంబంధమైన విషయాలలో చాలా మంది వీరి సలహాలకై ఎదురు చూస్తుంటారు. సాహిత్య రంగమున వీరికి చెప్పదగ్గ ఆసక్తి ఉండదు. చాలా సంబంధములు చూసిన తరువాత వీరు చివరకు మంచిపేరుగల కుటుంబము నుండి వచ్చిన అమ్మాయిని వివాహమాడుదురు. సమయం వచ్చినప్పుడు వీరు యుక్తిగా వీరి గమ్యమును సాధించెడి సామర్ధ్యమును కలిగిఉంటారు.
8.అష్టమాధిపతి తృతీయ స్థానములో వున్న జాతకులకు చెవికి సంబంధించిన సమస్యలు కలగవచ్చును. వినిపించుటయందు లోపము కనిపించినచో వెంటనే వైద్యము అవసరము. వీరు దగ్గరి బంధుత్వములను లేదా ప్రాణ స్నేహములను ఆనందించలేక లేదా ఆహ్వానించలేక పోవుదురు. వీరు ఇతరులతో సమానమైనవారిని ,నమ్మకముగా అనిపించినవారిని, గానీ , క్రొత్తవారితో కలియుటకు ఇష్టపడరు . వీరు భావములను , భయములను , మానసిక అశాంతిని ఎవ్వరితోనూ చర్చించరు. కావున నరముల బలహీనత ఏర్పడుటకు అవకాశము వుండును.
9.నవమాధిపతి తృతీయ స్థానములో వున్న జాతకులకు వ్రాయుట , మాట్లాడుట మరియు ప్రసంగము చేయు సామర్ధ్యముల ద్వారా ఆదాయము లేక లాభములు ఉండును. వీరి సోదరీ సోదరులు వీరికి ఆర్ధిక సహాయము చేస్తారు.
10.దశమాధిపతి తృతీయ స్థానములో వున్న జాతకులు వ్యాపారము నిమిత్తము ప్రయాణములు చేయవలసి యుండును. వీరు మంచి వక్తలుగా గానీ , రచయితలుగా గానీ అగుదురు. వీరు భవిష్యత్ నిర్మాణము నందు వీరి సోదరులు నామమాత్రపు సాధనములై వుండవచ్చును. ఏమైనను , కొంతమంది సోదరులతో శత్రుత్వమును , లేదా వీరి అదృష్టములోని తికమకలను వీరు తప్పించుకొనలేరు . వీరు నిజాయతీ పరులు గనుక సహోద్యోగులలో అధికా రపూర్వకముగా గౌరవమును పొందెదరు. అంతేగాక అవసరమైనప్పుడు తగినంత సహకారము , మంచితనము వీరికి లభించును.
11.ఏకాదశాధిపతి తృతీయ స్థానములో వున్న జాతకుల అభివృద్ధికి సోదరుల సహాయము లభించును. వీరికి అధిక సంఖ్యలో స్నేహితులు ఇరుగుపొరుగు వారు మరియు బంధువులు వుందురు. వీరి సాంఘిక నైపుణ్యతలు తప్పులేనివి. వీరు సోదరులయొక్క లేదా సోదరీల యొక్క అభిమానమును , ప్రేమను పొందుదురు.
12.ద్వాదశాధిపతి తృతీయ స్థానములో వున్న జాతకులు భయస్థులు మరియు నెమ్మదైనవారు. వీరి సోదరుడు వీరి నుండి నెమ్మదిగా పోవుదురు లేదా కుటుంబమును వదిలివేయుదురు. వీరు వస్త్ర ధారణ విషయంలో అంత శ్రధ్హ వహించక పోవుట వలన కొన్ని సమయములందు చాలా వికారముగా వుందురు. వీరు సమయమును , ధనమును , వీరి తమ్ముల గురించి వెచ్చించుదురు. రచనా వ్యాసంగమునందు గడిపిన సమయములో మంచి ఫలితమును పొందుదురు. వీరు స్నేహితులను లెక్కచేయక కుటుంబ సహచర్యముతో తృప్తి చెందుదురు.
Thursday, 21 May 2020
Monday, 4 May 2020
భావాధిపతులు - ఫలితాలు 1 :
2. ద్వితీయాధిపతి ద్వితీయస్థానమునందున్న జాతకులకు ఆర్ధిక భద్రత వుంటుంది. ఏదేమైనప్పటికి , వీరి యొక్క గర్వము మరియు అహంకారములను ఇతరులు అపార్ధము చేసికొనవచ్చును. వీరు పొగడ్తలను ఇష్టపడతారు. వీరు అన్నీ తమకే తెలుసుననే స్వభావమును కలిగిన వారై వుంటారు. వీరి యొక్క ప్రేమ వ్యవహారములవలన వీరు తమయొక్క స్నేహితులు మరియు కుటుంబ సభ్యులచేత కూడా విమర్శింపబడుదురు. వీరు చాలా పరిమిత కుటుంబాన్ని కలిగి వుంటారు.
3.తృతీయాధిపతి ద్వితీయస్థానమునందున్న జాతకులు వారు చేసెడి పనియందు ఆసక్తిని చూపనందున , వారు సోమరితనము మరియు బద్దకము కల వారుగా కనిపిస్తూ వుంటారు. వీరు ఇరుగు పొరుగు వారితో తగువులాడేడి అవకాశాలు కూడా వున్నాయి. వీరు మాట్లాడునపుడు అజాగ్రత్త అధికప్రసంగం మరియు ప్రయోజకమైన లక్షణాలు గోచరిస్తాయి. వీరికి చిన్న సోదరుడు గానీ , సోదరి గానీ వుంటారు. లేదా చిన్న సోదరుని నుంచి ఎడబాటు వుండే అవకాశం వుంది.
4.చతుర్ధాధిపతి ద్వితీయస్థానమునందున్న జాతకులు చాలా ధైర్యమును కలిగిన వారు , అదృష్టవంతులు మరియు సంతోషవంతులు. వీరికి తల్లివైపు నుండి ఆస్తి లభించవచ్చు. వీరికి వారియొక్క నోటి దురుసుతనము వల్ల శత్రువులు (మిత్రులకంటే) అధికముగా వుంటారు.
5. పంచమాధిపతి ద్వితీయస్థానమునందున్న జాతకులు రాష్ట్రము నందుగానీ , దేశము నందుగానీ లేదా అంతర్జాతీయ స్థాయిలో గానీ ఔన్నత్యాన్ని లేదా గొప్పతనాన్ని తప్పక పొందుతారు. అది కూడా వీరి వెనుకటి జీవితమును అవసరము లేదా అవకాశములపై ఆధారపడి వుంటుంది. ఏదో ఒకనాడు వీరు వార్తాపత్రికలలో ప్రముఖ వార్త అవుతారు. వీరి సంతానము యొక్క లేదా సోదరుల యొక్క గొప్పతనము వలన అతి నమ్మకము మరియు గర్వము పెరగవచ్చు. వీరు చాలా అధికారవాంఛగలవారు. అందుచే చిన్న స్నేహపూర్వక సలహాను కూడా వీరు ఇష్టపడరు. పిల్లల నుంచి , స్నేహితుల నుంచి , ఇరుగు పొరుగు వారి నుంచి లేదా ప్రేమికుల నుంచి బలవంతంగా స్వీకరించబడే అబ్యర్ధనలు వీరి కోపానికి గురికావచ్చు . వీరికి అందమైన జీవిత భాగస్వామి మరియు సత్ప్రవర్తన కలిగిన సంతానము వుంటారు.
6. షష్టాధిపతి ద్వితీయస్థానమునందున్న జాతకులు చాలా సాహస వంతులై వుంటారు మరియు జీవించడం ఎక్కడైతే కష్టముగా వుంటుందో ఆ ప్రదేశములకు మారుతుంటారు.వీరు చాలా కష్టపడి పని చేస్తారు. ఏ విషయాన్నైనా నాఫలమయ్యే విధంగా మరియు ఒప్పించే విధంగా చెప్పగల మార్గము వీరికి తెలుస్తుంది. వీరు ఆర్ధిక ఇబ్బందులకు మరియు నిధుల కొరతకు చాలా జంకుతారు. వీరి కుటుంబము యొక్క మరియు వీరి భవిష్యత్ యొక్క భద్రతను కాపాడాల్సిన అసాధ్యమైన అవసరాన్ని వీరి అంతరాత్మ ద్వారా పొందుతారు. ఆరోగ్యము గురించి బాధ పడాల్సిన అవసరము లేదు. వీరు ప్రేమించిన వారి నుంచి మరియు స్నేహితుల నుంచి లభించిన నిశ్శబ్దతిరస్కారము , శత్రువుల నుంచి తిన్నగా వచ్చిన ఎదుర్పాటు కన్నా వీరిని అధికంగా కలవరపరుస్తుంది. వీరు స్నేహితులతో మానసికముగా దగ్గరవుతారు. వీరు ప్రధమమునుంచే జాగ్రత్త వహించకున్నయొడల శత్రువులవలన ధన నష్టము కలుగవచ్చు. వీరికి మాట్లాడుటలో నత్తి దోషము వుండవచ్చు.
7.సప్తమాధిపతి ద్వితీయస్థానమునందున్న జాతకులకు వివాహానంతరము ధనము ప్రాప్తిస్తుంది. అందువలన వీరి భార్య అదృష్టవంతురాలిగా , సంపన్నురాలిగా గౌరవించబడును. అటుపైన వీరు జీవితములో ముందుకు వెళ్ళే కొద్దీ ఆమె పొందిన ఆశీర్వాద బలము వల్ల , గ్రహ బలము వల్ల పురోభివృద్ధిని పొందవచ్చును. వీరికి నమ్మకమైన స్నేహితులు లేకపోవచ్చు. వీరు ప్రయాణాలలో సౌఖ్యములు అనుభవిస్తారు. కుటుంబమునకు చెడ్డపేరు వచ్చే కార్యక్రమాలలో ఫాల్గొనుటకు వీరు పురికొల్పబడతారు. వీరు పలు విధములైన మనుష్యులను ముందుగా తగినంతగా పరీక్షించి , శోధించకపోవుటవల్ల అనేకరకాలైన కష్టాలకు గురి అవుతారు. వదంతులను వీరు భరించవలసివుంటుంది.వీరు ఏ విధంగానూ బాధ్యత వహించని విషయాలకు శిక్షింపబడతారు.ఉన్నతాధికారుల అసంతృప్తివలన ఆగ్రహమునకు గురికాకుండా సంరంక్షించుకోవాలి. ఆత్మ విశ్వాసమే మనిషికి బలమని గుర్తించాలి.
8. అష్టమాధిపతి ద్వితీయస్థానమునందున్న జాతకులు శరీరకముగా చురుకుగా వుండకపోవచ్చు. నేత్రములు మరియు దంతములకు సంబంధించిన ఆరోగ్యసమస్యలు ఎదుర్కోవలసివచ్చును. వీరికి ఆహారములో చాలా రుచులు అవసరము. వీరికి లభించిన ఆహారము ఇష్టపడకపోవచ్చు. పోగొట్టుకున్నది లభించుట కష్టము కాబట్టి దానిని సంరంక్షించుకొనుటకు మరియు నిలబెట్టుకొనుటకు ప్రయతించవలెను. సాధారణముగా వీరిలాంటి మనస్తత్వము కల్గిన వ్యక్తి , జీవిత భాగస్వామి నుండి స్వచ్చమైన మరియు మిక్కుటమైన ప్రేమాభిమానాలు పొందుచున్నప్పుడు వేరే ఆలోచనలు రావు. వీరి స్నేహితులు మొండిగా ప్రవర్తించినపుడు వీరు చాలా శాంతముగా వుండుటకు శక్తినంతయు కూర్చుకొనవలసియుండును.
9.నవమాధిపతి ద్వితీయస్థానమునందున్న జాతకుని తండ్రి గారు ధనవంతులై , పలికుబడి కలిగిన వారై వుంటారు .
10.దశమాధిపతి ద్వితీయస్థానమునందున్న జాతకులు వాస్తవానికి వృత్తి యందు వీరు చాలా గొప్పవారు. వీరు జీవితములో బాగా అభివృద్ధి చెందుతారు మరియు బాగా ధనమును సంపాదిస్తారు. ప్రారంభములో వీరి కులవృత్తి లోనేవుండి , దానినే అభివృద్ధి పరచు అవకాశాలు కలవు. దాని యందు వీరు రాణించనిచో కులవృత్తిని ఆనందముగా వదిలివేయుదురు. తల్లిదండ్రులనుండి ఆస్తి లభించును. పురాతన జ్యోతిశాస్త్ర పుస్తకముల ప్రకారము వీరి పేరు ప్రతిష్టలు నలుమూలలకు వ్యాపించును.
11.ఏకాదశాధిపతి ద్వితీయస్థానమునందున్న జాతకులు వీరు సోదరులతో గానీ లేదా సోదరీలతో గానీ సత్సంబంధములను కలిగియుండేదరు. స్నేహితులతో భాగస్వామ్యత్వము మరియు వ్యాపారము సాధారణముగా వీరికి మంచి లాభములను తెచ్చిపెట్టును. వీరికి దానగుణము కలదు. దానికితోడు మతాభిమానము కూడా వుండును.
12. ద్వాదశాధిపతి ద్వితీయస్థానమునందున్న జాతకులు అనాలోచితముగా ఆర్ధిక బాధలను ఆహ్వానించేదరు. వీరు అసహజమైన భోజనపు అలవాట్లను కలిగి యుండేదరు. వీరికి కంటిచూపు తక్కువగా వుండును. ఇంటియందు ప్రశాంతత లోపించును. చేతకాని పరిస్థితులు ఎదురైనప్పుడు వీరు యుక్తితో వ్యవహరించేదరు. మతములో ఆనందము లభించునని వీరు గ్రహించుదురు.
Sunday, 3 May 2020
భావాధిపతులు - ఫలితాలు :
2. ద్వితీయాధిపతి లగ్నస్థానమునందున్న జాతకులు వారికి చిన్న సందేహము కల్గినప్పటికి, చివరకు ధనార్జన చేయుదురు. వీరికి తమ తల్లిదండ్రులతో సంబంధబాంధవ్యాలనేవి సంతృప్తిని కలిగించేవిగా వుండవు. వీరు తమ యుక్త వయస్సునందు కూడ సుఖసౌఖ్యములకొరకు , భద్రతలకొరకు గృహమునందు వెదుకులాడ వలసివచ్చును. వీరు తమ తల్లిదండ్రులను ద్వేషించుటేగాక వారిని తమ వ్యక్తిగత ఆనందాభివృద్ధులకు అడ్డంకులని భావిస్తారు . వ్యాపార రీత్యా జరుగు మోసాలను అరికట్టేందుకుగాను వీరు మిక్కిలి జాగ్రత్తగా మసలుకోవలెను. వీర్కి ఆర్ధికపరమైనటువంటి అభివృద్ధి అధికమై మరల అర్ధరహితముగా క్రుంగిపోవుట మూలముగా కొంత మానసిక క్లేశములు గానీ , మనఃశ్శాంతిని కోల్పోవుట గానీ సంభవించును. కొన్ని పర్యాయములు వీరు పరులపట్ల కరుకుగా ప్రవర్తిస్తారు.
3.తృతీయాధిపతి లగ్నస్థానమునందున్న జాతకులు తమ యొక్క స్వయంకృషి వలన అభివృద్ధి చెందుటయే గాక , తమ యొక్క విద్యార్హతలు , తెలివితేటలు , విజ్ణానములవలన కొనియాడబడుతూ వుంటారు. వీరి యొక్క కోపము మరియు ఇతరులను ఎగతాళి చేసెడి స్వభావము వలన అందరూ వీరికి భయపడుతూ వుంటారు. వీరు బలహీనముగా , చిక్కినట్టుగా కన్పించిననూఅవసరమైనప్పుడు వీరియొక్క యదార్ధశక్తిని మరియు జీవనోపయోగ్యత్వమును ప్రదర్శిస్తూ వుంటారు. వీరు సంఘజీవనమునకు , మరియు సంప్రదాయమునకు విలువనిస్తూ వుంటారు. వీరికి తగిన ప్రోత్సాహము లభించినచో సంగీతము , నాట్యము , నటనల యందు ఆసక్తి అధికమగుటయే గాక , సన్మార్గమున వీరు జీవనోపాధిని కూడా సంపాదించుకుందురు. వీరు చాలా ధైర్యము మరియు నిర్భయత్వములు కల్గినవారెగాక మంచి నటులు కూడ.
4. చతుర్ధాధిపతి లగ్నస్థానమునందున్న జాతకులు బాగా తెలిసిన యువతినే వివాహమాడే అవకాశం వుంటుంది. వీరు చదువుకున్న వారై వుంటారు . కానీ బహిరంగ సమావేశాలలో ఫాల్గొనటానికి సిగ్గుపడుతూ వుంటారు. వీరు తమ వారసత్వపు ఆస్తిని నిలుపుకోలేరు.
5.పంచమాధిపతి లగ్నస్థానమునందున్న జాతకులు వారు ఎంచుకున్న రంగమునందు పాండిత్యాన్ని చూపుతారు. శాస్త్ర పరిశోధనలు , ఇంద్రజాల ప్రదర్శనలు మరియు కష్టమైనవి లేదా పోటీ కలిగినవి ఏవైనా వీరిని ఆకర్షిస్తాయి. వీరు నిజంగా ఖర్చు చేయగలిగిన దాని కంటే ఎక్కువగా పిల్లల పట్ల ఖర్చు చేయుదురు. సంతానములో ఎవ్వరూ కూడ వారి నిర్ణయాలను వీరిపై బలవంతంగా రుద్దలేరు. వీరికి అధికారము చెలాయించగల శక్తి వుంటుంది. వీరు పోలీసు అధికారి గానీ , న్యాయాధిపతి గానీ అవుతారు. వీరు బుద్ధి లేదా అబుద్ధి పూర్వకముగానైనా సంతానమును పొందటానికి ఆలస్యము చేస్తారు.
6. షష్టమాధిపతి లగ్నస్థానమునందున్న జాతకులు సహజముగా ధైర్యవంతులై వుంటారు. కానీ వీరు స్వంత కుటుంబమును ఎదిరించేవారుగా మారే అవకాశం వుంటుంది. వీరు సైనిక దళములో చేరటం గానీ , లేదా జైలుకు సంబంధించిన పనిని ఏదైనా చేసే అవకాశం వుంటుంది.వీరు బహుశా మేనమామతో కలిసి జీవించటం గానీ లేదా ఆయనకు దగ్గరవటం గానీ జరుగుతుంది. అనారోగ్యము వీరిని సతతమూ బాధిస్తుంది. దానిలో కొంత భాగము ఊహించుకొన్నవే అవుతాయి. వీరు మంచి పుత్రవాత్సల్యమును కల్గినవారై , మరియు సంతానమునకు మంచి సలహాలను , మంచి శిక్షణను అందించగలరు. వీరి జీవిత భాగస్వామి వీరి ధైర్యమునకు మరియు భద్రతకు అనుకూలంగా సహాయపడుతారు. ఇది వీరిద్దరికీ సంబంధించిన అన్నీ విషయములందు ఆర్ధిక , శారీరక మరియు ఇతరములైన అన్నీ పరిస్థితులనూ అనుసరింతురు. చిన్నతనమందు వీరికి సరియైన శిక్షణ లభించని యొడల నేరస్తులుగా మరే అవకాశాలు ఉత్పన్నమవుతాయి.
7. సప్తమాదిపతి లగ్నస్థానమునందున్న జాతకులు మొదటనుండి తెలిసిన అమ్మాయిని వివాహమాడు సూచనలున్నవి. వీరికి స్కూల్ లోనూ లేదా కాలేజీ లోనూ తెలిసిన అమ్మాయి భార్య కావొచ్చు. ఏమైననూ వీరి భార్య తెలివైనది , సున్నితమైనది మరియు గృహ నిర్వహణలో నైపుణ్యము కలదిగా వుండును. యువకులుగా మొదటనుండీ అందమైన ఉత్సాహపరులైన అమ్మాయిలను ఆకర్షించుదురు. వీరు జీవిత భాగస్వామిని ఎన్నుకొనుటలో సౌందర్యమునకు ఆదిక ప్రాధాన్యతను ఇచ్చేదరు. భర్తగా వీరు ఇతరులు ఊహించినంత విశాల హృదయులు కాకపోవచ్చు. వీరి భార్య వారి శక్తిని , మానసిక ఆనందమును పరిరక్షించుటలో తగినంత కృషి చేయును. వీరి విజయమునకు ఇది ముఖ్యమైనది. వీరు మంచి కీర్తి గల కుటుంబములో జన్మించుటవల్ల ఔన్నత్యము , ఠీవి నడవడిలో ప్రతిబింబిస్తుంది. దంపతులుగా వీరిద్దరు సంపాదనమును వ్యర్ధమొనరించుకోకుండా తగు జాగ్రత్త వహించాలి .
8.అష్టమాధిపతి లగ్నస్థానమునందున్న జాతకులు వీరికి బహుశా ఆచారకాండలు మరియు సంప్రదాయాలు చికాకు కల్గించవచ్చు. వీరిని వీరు ఒక నాస్తికునిగా పిలుచుకోవచ్చు. వీరు చిన్నతనమునుంచీ అన్నిటినీ తెలుసుకొనవలేనన్న జిజ్ణాసకలవారు. బహుశా వీరు పూర్తిగా స్థిరపడకముందే అనేక సంబంధములందు చిక్కుకొని హృదయ వేదనను అనుభవింతురు. వీరు అనుకున్న గమ్యమును చేరే వరకు మరలా మరలా ప్రయత్నిస్తూనే వుండాలి. వీరు కురూపితనము మరియు రుగ్మతల కారణముగా శరీరకముగా బాధపడవచ్చు . వీరు శారీరకముగా కొంచెము నీరసముగా కనిపించవచ్చు. ప్రభుత్వ సంస్థలతో వ్యవహారము చేయునపుడు జాగ్రత్తగా వుండవలెను. వీరి పన్నుల లెక్కలను అకారణముగా తనిఖీ చేయవచ్చు. వీరు వృద్ధాప్యదశ లోనికి చేరుకున్న కొలదీ ఆధ్యాత్మిక చింతన పెరుగును.
9.నవమాధిపతి లగ్నస్థానమునందున్న జాతకులు దూరప్రాంతాలలో పని చేయవచ్చును. లేదా తరచూ వృత్తి రీత్యా ప్రయాణాలు చేయవలసిరావచ్చును. వీరి ప్రయాణాలు వీరి జీవిత భాగస్వామికి మానసిక వేదనను కలిగించవచ్చు. వీరి అత్తమామలతో వున్న సత్సంబంధాలను చెడగొట్టుకొనరాదు. వీరు అనుసరించు విధములో అత్తమామలకు దగ్గరగా చేరినచో వారి నుంచి నిదానముగా లాభము పొందేదరు.
10.దశమాధిపతి లగ్నస్థానమునందున్న జాతకులు స్వశక్తితో పైకివస్తారు. వీరు ఎవరికిందా పనిచెయ్యక స్వతంత్ర ప్రతిపత్తిగల వృత్తిని ఎన్నుకుంటారు. వీరు జ్ణానసంపత్తిని అభివృద్ధి పరచుకొన్నచో వీరు ఎంచుకున్న వృత్తి యందు పేరు ప్రతిష్టలను , గుర్తింపును పొందేదరు. వేరు ప్రజాసేవకు అంకితమైన కొన్ని సంస్థల స్థాపన , మరియు వాటిని నడుపుట యందు ఫాల్గొనవచ్చును. వీరు చేయు పనులన్నిటియందు కవిత్వ ధోరణి కంపించవచ్చు. ఆరోగ్య సమస్యలేవైనా వున్నచో అవి చిన్నతనము వరకే పరిమితం. వీరి భవిష్యత్ నందలి పెరుగుదల నెమ్మదిగా , తిన్నగా వుండును.
11.ఏకాదశాధిపతి లగ్నస్థానమునందున్న జాతకులు వీరు ధనిక కుటుంబము నందు జన్మించుదురు. మరియు ఆస్తిని సంపాదించుదురు. వీరి అన్నగారిని ఒకరిని నష్ట పోవుదురు. వీరికి మంచిని ఎన్నుకోగల మరియు చెడును తిరస్కరించగల సామర్ధ్యము కలదు. వీరి యొక్క ప్రతిభను , విజ్ణానమును పూర్తిగా వినియోగించుటకు అవకాశమున్న వృత్తిలో వీరు బాగా రాణించుదురు.
12.ద్వాదశాధిపతి లగ్నస్థానమునందున్న జాతకులు మంచి అందమైన వారు మరియు సరస సంభాషణా చతురులు . వీరు అర్భక శరీరము మరియు కలత చెందే మనస్సు కలిగి యుందురు. వీరికి ప్రయాణములు అనివార్యము. అప్పుడప్పుడు శ్వాసకోశ సమస్యలు కలగవచ్చును. అవి వీరిని భాదించేవని ఋజువగును. కారణములు లేకుండగానేవీరి భవిష్యత్ గురించి అనుమానములు తలయెత్తును.
Saturday, 2 May 2020
VEDIC EVENTS FOR THE MONTH OF MAY 2020.
Thursday, 30 April 2020
మీన లగ్నములో లగ్నస్థ నవగ్రహముల ప్రభావము :
సూర్యుడు మీన లగ్నము యొక్క కుండలిలో షష్టమాదిపతిగా వుండును. షష్టమ బావములో వుండుట వలన సూర్యుడు మీన లగ్నములో లగ్నస్థముగా వుండి సూర్యుడు వ్యక్తిని ఆరోగ్యముగాను మరియు నిరోగిగాను చేయును. ఎవరి కుండలిలో అయితే ఈ స్థితి వుండునో వారు ఆత్మవిశ్వాసము గల పరిశ్రమి కాగలరు. ఏ కార్యమునైనా పూర్తి మనోబావముతో చేయుదురు. శత్రువులు మరియు విరోదుల నుండి బయపడరు. సూర్యుని పూర్ణ దృష్టి సప్తమ బావములో కన్యా రాశిపై వుండును. వ్యాపారము చేయవలననే కోరిక, ఉద్యోగములో సఫలత లభించగలదు. వైవాహిక జీవితములో జీవిత బాగస్వామితో ఒడిదుడుకుల కారణముగా గృహస్థ జీవితము ప్రభావితము కాగలదు.
మీన లగ్నములో లగ్నస్థ చంద్రుని ప్రబావము
మీన లగ్నము యొక్క కుండలిలో చంద్రుడు పంచమాదిపతి కాగలడు. ఈ లగ్నములో త్రికోణాదిపతిగా వుండుట వలన చంద్రుడు శుభ కారక గ్రహముగా వుండును లగ్నములో దీని స్థితి వ్యక్తికి సుఖముగాను మరియు శుభకరముగాను వుండును. చంద్రుని ప్రభావము కారణముగా వ్యక్తి అందము మరియు ఆకర్షణీయమునకు అధిపతి కాగలడు. వీరి మాటలు మధురమైనవిగా మరియు ప్రభావశాలిగా వుండును. వీరిలో ఆత్మ విశ్వాసము వుండును. అందువలన వీరు ఏ పనిని చేయుటకు బయపడరు. మాతృ పక్షము నుండి మరియు తల్లి నుండి సుఖమును మరియు స్నేహమును పొందగలరు. చంద్రుడు పూర్ణ దృష్టి ద్వారా బుధుని రాశి కన్యను చూస్తున్నాడు. దీని ప్రబావము కారణముగా జీవిత బాగస్వామి మరియు సంతానము నుండి సుఖము మరియు సమ్యోగము లభించగలదు. అనవసర మనస్పర్ధలు కలుగును.
మీన లగ్నములో లగ్నస్థ కుజుని ప్రబావము
కుజుడు మీన లగ్నము గల కుండలిలో ద్వితీయ మరియు నవమ బావము యొక్క అధిపతిగా వుండును. లగ్నములో దీని స్థితి కారణముగా వ్యక్తి శక్తిశాలి మరియు పరాక్రమిగా వుండును. ఇది వ్యక్తిని మొరటివాడిగా చేయును. అధ్యాత్మికములో వీరికి అభిరుచి అధికముగా వుండును. ఇతరులకు సహాయము చేయుతకు సిద్దముగా వుండెదరు. వీరి ఆర్ధిక స్థితి బాగుండును. ధనమును అనవసరముగా ఖర్చు చేయరు. వీరికి దృష్టి దోషము మరియు కర్ణ దోషము కలిగే అవకాశములు వున్నవి. ప్రధమ బావములో స్థితిలో వున్న కుజుడు చతుర్ధ, సప్తమ మరియు అష్టమ బావములను తన దృష్టితో ప్రభావితము చేయుచున్నాడు. ఈ ప్రభావము కారణముగా మిత్రులు మరియు బాగస్వాముల వలన లాభము కలుగును. తల్లి మరియు తల్లి సమానమైన మహిళతో స్నేహము మరియు సమ్యోగము లభించగలదు.
మీన లగ్నములో లగ్నస్థ బుధుని ప్రబావము
బుధుడు మీన లగ్నము యొక్క కుండలిలో చతుర్ధ మరియు సప్తమ బావము యొక్క అధిపతిగా వుండుట వలన కేంద్రాదాదిపతి దోషము కారణము వలన , నీచ స్ధానము వలన దూషించబడుదురు. లగ్నములో బుధుని స్థితి కారణముగా వ్యక్తి శ్రమకారకుడు కాగలడు. వారి పరిశ్రమ, బుద్ధి బలముల వలన ధనార్జన చేయగలరు. పితృ సంపత్తి నుండి వీరికి విషేశ లాభములు కలుగవు. స్త్రీల వలన వీరికి విషేశ లాభములు మరియు సమ్యోగము లభించగలదు. లగ్నములో వున్న బుధుడు సప్తమ బావములో స్వరాశిని చూస్తున్నాడు. దీని ప్రభావము కారణముగా వర్తక వ్యాపారములలో మిత్రుల మరియు బాగస్వాముల నుండి సమ్యోగము లభించగలదు. గృహస్థ జీవితము సుఖమయముగా వుండును. అనుకూలమైన జీవిత బాగస్వామి లభించును. వారి సమ్యోగము లభించగలదు.
మీన లగ్నములో లగ్నస్థ గురుని ప్రబావము
గురువు మీన లగ్నము యొక్క కుండలిలో లగ్నాదిపతి మరియు దశమాదిపతిగా వుండును. లగ్నాదిపతిగా వుండుట కారణముగా రెండు కేంద్ర బావములకు అధిపతిగా వున్నప్పటికి కూడా కేంద్రాదిపతి దోషము కలుగదు. లగ్నములో దీని స్థితి కారణముగా వ్యక్తి అత్యంత బాగ్యశాలిగా వుండును. శారీరకముగ అరోగ్యముగా మరియు అందముగా వుండును. వీరు దయా స్వభావము మరియు వినమ్రత కలిగి వుండును. దర్మముపై నమ్మకము కలిగి ఆత్మ విశ్వాసముతో పరిపూర్ణముగా వుండును. లగ్నస్థ గురువు తన యొక్క పూర్ణ దృష్టితో పంచమ, సప్తమ మరియు నవమ బావములను చూస్తున్నాడు. దీని ప్రభావము కారణముగా తండ్రి మరియు సంతానము నుండి సుఖము ప్రాప్తించగలదు. గృహస్థ జీవితము సుఖమయముగా వుండును.
మీన లగ్నములో లగ్నస్థ శుక్రుని ప్రబావము
శుక్రుడు మీన లగ్నము యొక్క కుండలిలో తృతీయ మరియు అష్టమ బావము యొక్క అధిపత్ కాగలడు. ఈ లగ్నము యొక్క కుండలిలో ఇది అవయోగ కారకముగా వుండును. ఈ లగ్నములో శుక్రుడు ప్రధమ బావములో వుండుట కారణముగా వ్యక్తి అందముగాను మరియు ఆకర్షణీయముగాను వుండును. వీరికి పిత్తవాత రోగము కలుగు అవకాశములు వుండును. వీరి పనిలో వీరు నిపుణత కలిగి వుండెదరు. వీరు సాహసము మరియు పరాక్రమము కలిగిన వారై వుండును. వీరు ఏ విషయమునైనా చాలా లోతుగా తెలుసుకొనుటకు ఆసక్తి కలిగిన వారై వుండును. తల్లి నుండి సుఖము మరియు సమ్యోగమునకు అవకాశములు తక్కువగా వున్నవి. సంతానము యొక్క సందర్బములో కష్టములు కలుగును. సప్తమ బావములో శుక్రుని పూర్ణ దృష్టి వుండుట వలన గృహస్థ జీవితము సుఖమయముగా వుండును.
మీన లగ్నములో లగ్నస్థ శని యొక్క ప్రబావము
శని మీన లగ్నము యొక్క కుండలిలో ఏకాదశాదిపతి మరియు ద్వాదశాదిపతిగా వుండును. లగ్న బావములో శని యొక్క ఉపస్థితి కారణముగా వ్యక్తి సన్నగా వుండును. శని యొక్క ప్రబావము కారణముగా వ్యక్తి నేత్ర రోగము వలన బాదించబడును. వీరికి స్వతంత్రముగా నిర్ణయములను తీసుకొనుట కష్టకరముగా వుండును. జీవితములో ప్రగతి కొరకు ఇతరుల సలహాలను పాటించవలసి వుండును. ధన సేకరణ యొక్క ప్రవృత్తి వుండును. షేర్, పందెములు మరియు లాటరీల వలన వీరికి అకస్మాత్తుగా లాభము కలుగును. లగ్నస్థ శని తృతీయ బావములో వృశ్చికరాశిని, సప్తమ బావములో కన్యా రాశిని మరియు దశమ బావములో గురుని రాశి ధనుస్సును చూస్తుండును. ఈ బావములలో శని యొక్క దృష్టి వలన మిత్రుల నుండి అపేక్షిత లాభము మరియు సమ్యోగము లభించదు. బాగస్వాముల నుండి హాని కలుగును. దాంపత్య జీవితములో కష్టములు ఉన్న సర్ధుకుపోతారు.
మీన లగ్నములో లగ్నస్థ రాహువు యొక్క ప్రభావము
రాహువు మీన లగ్నము యొక్క కుండలిలో లగ్నస్థముగా వుండుట వలన వ్యక్తి కండలు తిరిగిన ఆరోగ్యము కలిగి వుండును. రాహువు వీరికి చతురతను మరియు బుద్దిని ప్రదానించును. వీరిలో స్వార్ధ బావన వుండగలదు. వీరి పనులను చేపట్టుటకు వీరు ఎవరితోనైనా మితృత్వమును చేయగలరు. వారి పనిని ఎలా పూర్తిచేసుకొనవలనో వీరికి బాగా తెలుసును. వీరిలో సహాసము అధికముగా వుండును. లగ్నస్థ రాహువు సప్తమ బావములో స్థితిలో వున్న బుధుని కన్యా రాశిని చూస్తున్నాడు. జీవిత బాగస్వామి అరోగ్య సంబందమైన సమస్యలతో బాదించబడును. గృహస్థ జీవితములో కష్టములను ఎదుర్కొన వలసి వచ్చును.
మీన లగ్నములో లగ్నస్థ కేతువు యొక్క ప్రబావము
కేతువు మీన లగ్నము గల కుండలిలో లగ్నస్థముగా వుండిన ఎడల వ్యక్తి అరోగ్య సంబంద సమస్యలతో బాదించబడగలడు. నడుము నొప్పి, మరియు వాత రోగములు కలుగు అవకాశములు వున్నవి. ఆత్మ విశ్వాసము తక్కువగా వుండుట వలన స్వతంత్రముగా నిర్ణయములను తీసుకొనలేరు. వ్యాపారము చేయాలనే కోరిక, ఉద్యోగము చేయుట వీరికి ఇష్టముగా వుండును. స్వార్ధ సిద్ది కొరకు సామాజిక నియమములను ఉల్లంఘించుటకు కూడా వెనుకాడరు. సప్తమ బావములో కేతువు యొక్క దృష్టి జీవిత బాగస్వామికి కష్టకారిగా వుండును. కేతువు వీరిని వివాహేతర సంబందములకు ప్రేరితము చేయును. ఫలితముగా గృహస్థ జీవితములోని సుఖము బాదించబడును. ఆర్ధిక స్థితి సామాన్యముగా వుండును. మోక్షప్రాప్తి కలిగించును.
Tuesday, 28 April 2020
కుంభ లగ్నములో లగ్నస్థ నవగ్రహముల ఫలితాలు :
కుంభ లగ్నము గల కుండలిలో సూర్యుడు సప్తమాదిపతిగా వుండును. కేంద్రాదిపత్యం వలన శుభ ఫలితములను ఇచ్చును. కుంభ లగ్నము యొక్క కుండలిలో సూర్యుడు యది లగ్నస్థుడైన ఎడల వ్యక్తి చూడడానికి అందముగా మరియు పరిపూర్ణ ఆత్మ విశ్వాసము కలిగి వుండును. శ్వాస సంబంద సమస్యలను ఎదుర్కొన వలసి వచ్చును. సప్తమాదిపతి సూర్య లగ్నస్తుడుగా వుండిన ఎడల జీవిత బాగస్వామి అందముగాను మరియు సమ్యోగమును ఇచ్చువాడుగాను వుండును. అప్పుడప్పుడు వివాదములు వుండగలవు. మిత్రుల నుండి మరియు బాగస్వాముల నుండి సమ్యోగము లేదా లాభము లబించగలదు. వర్తక వ్యాపారములలో త్వరగా సఫలత లభించగలదు. ఆర్ధిక స్థితి సామాన్యముగా వుండును.
కుంభ లగ్నములో లగ్నస్థ చంద్రుడు
చంద్రుడు కుంభ లగ్నము గల కుండలిలో ఆరవ బావము యొక్క అధిపతిగా వుండును. ప్రధమ బావములో చంద్రుని స్థితి వుండుట కారణముగా వ్యక్తికి దగ్గు, జలుబు మరియు జీర్ణ శక్తి సంబందమైన రోగములు కలిగే అవకాశములు వుండును. చంద్రుని యొక్క ఈ స్థితి కారణముగా వ్యక్తి యొక్క మనస్సు అశాంతితో కూడినదై వుండగలదు. కుటుంబ జీవితములో కలహములు, వివాదములు జరిగే అవకాశములు వున్నవి. చంద్రుని దృష్టి సప్తమస్థ సూర్య రాశి సింహముపై వుండును. ఈ దృష్టి సంబందము కారణముగా జీవిత బాగస్వామి అందముగాను మరియు మహత్వాకాంక్షిగాను వుండును.
కుంభ లగ్నములో లగ్నస్థ కుజుడు
కుజుడు కుంభ లగ్నము గల కుండలిలో తృతీయ మరియు దశమ బావము యొక్క అధిపతి కాగలడు. ఈ లగ్నములో కుజుడు అశుభ మరియు అవయోగ కారక గ్రహముల భూమికత్వమును నిర్వహించును. కుజుడు లగ్నస్థముగా వుండుట వలన వ్యక్తి శారీరకముగా దృడముగాను మరియు బలముగాను వుండును. వీరిలో సాహాసము మరియు పరాక్రమము అధికముగా వుండును. వారి పరిశ్రమ వలన కఠినమైన పనులను కూడా పూర్తిచేయుటకు ప్రయత్నించెదరు. తండ్రి మరియు తండ్రి పక్షము నుండి వీరికి అనుకూల సమ్యోగము లభించగలదు. సమాజములో గౌరవ మర్యాదలు మరియు ప్రతిష్టను కలిగి వుండెదరు. స్వభావములో ఉగ్రత కారణముగా అనవసర వివాదములను కొని తెచ్చుకొనెదరు. కుజుని యొక్క దృష్టి వృషభము, సప్తమ బావములో సింహము మరియు అష్టమములో కన్యలో వుండిన ఎడల జీవిత బాగస్వామి గుణవంతులు మరియు వ్యవహారిక స్వభావము కలవారై వుండును. వైవాహిక జీవితము సామాన్యముగా సుఖమయముగా వుండును. సప్తమాదిపతి మరియు కుజుడు పీడించబడి లేదా పాప ప్రభావములో వుండిన ఎడల సప్తమ బావములో సంబందిత సుఖములు బాదించబడగలవు.
కుంభ లగ్నములో లగ్నస్థ బుధుడు
బుధుడు కుంభలగ్నము గల కుండలిలో పంచమాదిపతి మరియు అష్టమాదిపతి కాగలడు. అష్టమాదిపతిగా వుండుట కారణముగా ఇది అవ యోగ కారక మరియు అశుభ ఫలదాయిగా వుండును. లగ్నములో దీని ఉపస్థితి కారణముగా వ్యక్తి బుద్దివంతుడు మరియు ఙ్ఞాని కాగలడు. శిక్షా రంగములో వీరికి సఫలత లభించగలదు. వీరి మాటల ద్వార ప్రజలను ప్రభావితము చేయుదురు. జల క్షేత్రములో వీరికి ఆసక్తి అధికముగా వుండును. పడవ ప్రయాణములు మరియు జల యాత్రలు వీరికి ఆనందమును కలిగించును. బుధుని దశలో మానసిక సమస్యలు మరియు కష్టముల అనుభూతి కలుగగలదు. ప్రధమస్థ బుధుడు సప్తమ బావములో స్థితిలో వున్న సింహ రాశిని చూస్తున్నాడు. దాని కారణముగా జీవిత బాగస్వామితో వివాదములు మరియు మతబేదములు వుండగలవు.
కుంభ లగ్నములో లగ్నస్థ గురువు
కుంభ లగ్నము గల కుండలిలో గురువు అవ యోగకారక గ్రహము కాగలడు. ఇది ద్వితీయ మరియు ఏకాదశ బావము యొక్క అధిపతిగా వుండును. లగ్నములో దీని ఉపస్థితి కారణముగా వ్యక్తి బుద్ధివంతుడు మరియు ఙ్ఞాని కాగలడు. వీరిలో ఆత్మ బలము మరియు ఆత్మ విశ్వాసము వుండును. ధన సేకరణ చేయు కళలలో కూడా నిపుణులుగా వుంటారు. అందువలన ఆర్ధిక సమస్యలను తక్కువగానే ఎదుర్కొనవలసి వచ్చును. లగ్నములో వున్న గురువు పంచమ, సప్తమ మరియు నవమ బావములపై దృష్టి కలిగి వుండును. గురువు యొక్క దృష్టి కారణముగా బందు మిత్రుల నుండి లాభము ప్రాప్తించగలదు. తండ్రి పక్షము నుండి లాభము కలుగును. సంతానము మరియు జీవిత బాగస్వామి నుండి సుఖము ప్రాప్తించగలదు.
కుంభ లగ్నములో లగ్నస్థ శుక్రుడు
కుంభ లగ్నము గల కుండలిలో శుక్రుడు సుఖాదిపతి మరియు బాగ్యాదిపతిగా వుండును. సుఖాదిపతి మరియు భాగ్యాదిపతిగా వుండుట కారణముగా ఇది ప్రముఖ కారక గ్రహముగా వుండును. లగ్నములో స్థితి కారణముగా వ్యక్తి చూడడానికి అందముగా మరియు ఆకర్షణీయముగా వుండును. వీరు బుద్దివంతులు మరియు గుణవంతులు కాగలరు. అద్యాత్మికములో వీరికి అభిరుచి అధికముగా వుండును. పూజలు, భజనలు, దార్మిక కార్యకలాపములలో వీరికి అభిరుచి వుండును. తల్లి నుండి ప్రేమ మరియు సమ్యోగము లభించగలదు. భూమి, భవనము మరియు వాహన సుఖము ప్రాప్తి చెందగలరు. శుక్రుడు సప్తమస్థ సింహరాశిని చూస్తున్నాడు. అందువలన వైవాహిక జీవిత సుఖము బాదించబడగలదు. జీవిత బాగస్వామితో వొడిదుడుకులు ఏర్పడగలవు.
కుంభ లగ్నములో లగ్నస్థ శని
శని కుంభ లగ్నము గల కుండలిలో లగ్నాదిపతి మరియు ద్వాదశాదిపతిగా వుండి కారక గ్రహము యొక్క భూమికత్వమును నిర్వహించును. లగ్నాదిపతి శని స్వరాశిలో స్థితిలో వుండి వ్యక్తి ఆరోగ్యమును మరియు నిరోగముతో కూడిన శరీరమును ప్రదానించును. శని యొక్క ప్రభావము కారణముగా వ్యక్తి ఆత్మవిశ్వాసముతో పరిపూర్ణత చెంది వుండును. వారి వ్యక్తిత్వము మరియు ఆత్మ బలము కారణముగా సమాజములో గౌరవ మర్యాదలు మరియు ప్రతిష్టలను పొందగలరు. లగ్నములో వున్న శని తృతీయ బావములో మేషరాశి, సప్తమములో సింహరాశి మరియు దశమములో వృశ్చిక రాశిని చూస్తున్నాడు. శని యొక్క దృష్టి కారణముగా సోదరులతో అపేక్షిత సమ్యోగములో సమస్యలు ఏర్పడగలవు. జీవిత బాగస్వామితో సమస్యలు ఏర్పడగలవు. వైవాహిక జీవితము ప్రభావితము కాగలదు. వ్రూత్తిలో గుప్త శత్రువులు ఉందురు.
కుంభ లగ్నములో లగ్నస్థ రాహువు
ప్రధమ బావములో రాహువు యొక్క స్థితి కారణముగా అరోగ్యములో వొడుదుడుకులు వుండగలవు. రాహువు యొక్క దశా కాలములో ఉదర సంబంద రోగములు కలిగే అవకాశములు వున్నవి. వర్తక వ్యాపారములలో సమస్యలను ఎదుర్కొనవలసి వచ్చును. వ్యవసాయ కోరిక వున్నప్పటికీ ఉద్యోగము ఫలదాయకముగా వుండును. లగ్నస్థ రాహువు సప్తమ బావములో సూర్యుని రాశి సింహమును చూస్తున్నాడు. శత్రు రాశిపై రాహువు యొక్క దృష్టి వైవాహిక జీవిత సుఖమును బలహీన పరచును. బాగస్వాముల నుండి వీరికి లాభము కలిగే అవకాశములు తక్కువగా వున్నవి. గుప్త విషయములు మరియు విద్యల యందు వీరికి అభిరుచి వుండును. ఆత్మవిశ్వాసము తక్కువగా వుండుట కారణముగా నిర్ణయములు తీసుకొనుటలో సమస్యలను ఎదుర్కొనెదరు.
కుంభ లగ్నములో లగ్నస్థ కేతువు
కేతువు కుంభ లగ్నము గల కుండలిలో లగ్నస్థముగా వుండి వ్యక్తిని అస్థిరునిగా చేయుచున్నాడు. వీరి మనస్సు బోగవిలాసములను కూడినదై వుండును. తల్లి దండ్రులతో వివాదములు మరియు మనస్తాపములు కలిగే అవకాశములు వున్నవి. సప్తమ బావముపై కేతువు యొక్క దృష్టి వుండుట కారణముగా గృహస్థ సుఖములో లోపము ఏర్పడగలదు. కుటుంబములో అశాంతి ఏర్పడగలదు. కేతువుతో పాటు శుభ గ్రహముల యుతి లేదా దృష్టి సంబందములు వుండిన ఎడల కేతువు యొక్క అశుభ ప్రబావము తగ్గగలదు.
https://youtu.be/FUR-4Lbj4Tw?si=XCIZVUq6ALiWlu1S





