Friday 31 January 2020

🌞రథ సప్తమి🌞 :




🌅🌞🌅🌞🌅🌞🌅🌞🌅🌞🌅

మాఘ శుక్ల సప్తమీ పుణ్యదినంలో సూర్యుడు జన్మించడమే కాకుండా, భూమికి మొట్టమొదటిసారిగా దర్శనమిచ్చి రథాన్ని అధిరోహించాడని మత్స్యపురాణం చెబుతుంది. అందుకే ఈ రోజుని రధసప్తమి అంటారు. జీవకోటికి చలి తొలగించి, నూతన ఉత్తేజాన్ని నింపే సుర్య భగవానుడికి కృతజ్ఞతలు తెలిపే పండుగే రధసప్తమి. షష్ఠితో కూడిన సప్తమి (తిధిద్వయం) కలిసి రావడం వల్ల రధసప్తమి అత్యంత శ్రేష్టమైనది. ఆ రోజు చేసే స్నానాలు, వ్రతాలు సూర్యుడికి చేసే పూజలు, దానాలు, తర్పణాదులు అధికఫలాన్నిస్తాయి. సూర్యుడు త్రిమూర్తుల ఏకరూపమనీ, సర్వభూతాలు ఆయన వల్లే ఏర్పడ్డాయనీ, సూర్యుడే పరబ్రహ్మ అని (నమస్తే ఆదిత్యత్వమేవ-చందోసి) సూర్యోపనిషత్తు తెలిపింది. వేదకాలం నుంచే సూర్యారాధన ఉంది. వేదాల్లోని సౌర సూక్తులు, ఆదిత్య హృదయం, గాయత్రీ మంత్రం మొదలైనవి ఈ విషయాన్ని ధ్రువీకరిస్తున్నాయి. సూర్యుడు నవగ్రహాల్లో ప్రధముడే కాదు, ప్రధానం కూడా. ఆయన పన్నెండు రాశుల్లో సంచరిస్తూ జీవకోటికి శుభాశుభ ఫలితాలు కలిగిస్తాడు. కోణార్క్, అరసవిల్లి ఆదిత్యాలయాలకు ప్రసిద్దం. అనంతపురం జిల్లాలోని దొడ్డేశ్వరాలయంలో సంజ్ఞ, ఛాయ అనే ఇద్దరు భార్యలతో సూర్యుడు దర్శనమిస్తాడు.
రధసప్తమి నాడు సూర్య వ్రతాన్ని ఆచరించేవారు నెత్తిమీద లోహపు ప్రమిదలో దీపం పెట్టుకొని స్నానం చేయాలి.

స్నాన విధానం:
వ్రతచడామణిలో “బంగారు, వెండి, రాగి, ఇనుము, వీనిలో దేనితోనయినా చేసిన దీపప్రమిదను సిద్ధం చేసుకొని, దానిలో (నెయ్యి, నువ్వులనూనె, ఆముదం, ఉప్పనూనె – వీనిలో ఏదో ఒకదానితో) దీపం వెలిగించి, ఆ దీపాన్ని నెత్తిపై పెట్టుకొని, నదీతీరానికిగానీ, చెరువుల వద్దకుగానీ వెళ్లి, సూర్యుణ్ణి ధ్యానించి, ఆ దీపాన్ని నీళ్లలో వదలి, ఎవరునూ నీటిని తాకకముందే స్నానం చేయాలి. స్నానం చేసేటప్పుడు ఏడు జిల్లేడాకులుగానీ, ఏడు రేగు ఆకులుగానీ తలపై పెట్టుకోవాలి.
సప్తమీవ్రతం:
రధసప్తమి ఒక్కటేకాక, కల్యాణ సప్తమి, కమలసప్తమి, శర్కరాసప్తమి, అచలాసప్తమి, రధాంకసప్తమి, మహసప్తమి, జయాసప్తమి, విజయాసప్తమి, నందాసప్తమి, సిద్ధార్ధికాది సప్తమి, సాక్షుభార్యా సప్తమి, సర్షపసప్తమి, మార్తాండసప్తమి, సూర్యవ్రతసప్తమి, సప్తసప్తి సప్తమి, అర్కసంపుటసప్తమి, నింబసప్తమి, మరీచసప్తమి, ఫలసప్తమి – మున్నగు అనేక సప్తమీ వ్రతాలను గురించి గ్రంధాలు పేర్కొన్నాయి. ఇవ్వన్నీ సూర్యుణ్ణి గుర్తించిన వ్రతాలే! ఇందులో కొన్ని రధసప్తమినాడు ఆచరించేవి!
పంచాంగకర్తలు రధసప్తమిని ‘ సూర్యజయంతి ‘ అన్నారు. వైవస్వతమన్వాది ఈనాడే కావడం విశేషం. ఈ రోజు అభోజ్యార్క వ్రతాదులు ఆచరించాలి (భోజనం చేయకుండా చేసే వ్రతం). వైవస్వతుడు ఏడవమనువు. సూర్యుడు వివస్వంతుడు. ఇతనికొడుకు కనుక వైవస్వతుడు (ఇప్పటి మనువు వైవస్వతుడే). ఇతని మన్వంతరానికి రధసప్తమియే సంవత్సరాది – అనగా ఉగాది. మన్వంత రాదిపర్వదినం పితృదేవతలకు ప్రియమైనది. కనుకనే రధసప్తమినాడు – మకర సంక్రాంతివలనే – పితృతర్పణం చేయాలి. పితృదేవతలకు సంతోషం కల్గించాలి. చాక్షుషమన్వంతరంలోని ద్రవిడ దేశాధిపతి అయిన సత్యవంతుడే, ఈ కల్పంలో వైవస్వతుడుగా పుట్టినాడు.

జిల్లేడు, రేగు ఆకుల ప్రాశస్త్యం:
రధసప్తమినాటి శిరస్నానంలో జిల్లేడు, రేగుఆకులను (రేగుపండ్లు కూడ) తలపై, భుజాలపై, చేతులపై పెట్టుకొని స్నానం చేయాలి. మన భారతీయ ఆచారాలు మూఢవిశ్వాసాలు కావు. వీటి వెనుక ఎన్నో ఆరోగ్యకరమైన విజ్ఞానాంశాలు నిల్చి వున్నాయి. వాటిల్ని గురించి తెలిసి ఆచరించినా, తెలియక ఆచరించినా సత్ఫలితం మాత్రం తప్పక వుంటుంది. కానీ తెలిపి ఆచరించడం ద్వారా తాను లాభపడుటేగాక, ఇతరులతోనూ చేయించి, వారిను సత్ఫలవంతుల్ని చెయవచ్చు.

రుద్రాక్ష చెట్టు:
ఈ చెట్టు ఎక్కువగా ఉత్తరహిందూస్ధాన్లో వున్నాయి. వీటి గింజలే రుద్రాక్షలు. వీని భేధాలూ, ప్రభావాలూ జగద్విదితం. వాతశ్లేష్మాన్ని హరిస్తాయి. రుద్రాక్షలు నానబెట్టి, ఆ నీళ్లు సేవిస్తే మశూచిక రాదు. రుద్రాక్షలు శివసంబంధమైనవి.

జిల్లేడు(అర్క):
శ్లేష్మ, పైత్య, వాత దోషాలను హరిస్తుంది. చర్మరోగాలను, వాతం నొప్పులను, కురుపులను, పాము, తేలు విషాన్నీ, పక్షపాతాన్నీ, బోదకాలు వ్యాధినీ, పోగొటుతుంది. ఇందులో తెల్లజిల్లేడు చాలా శ్రేష్టం. ఉపయోగించి విధానం తెలిస్తే దీని ఆకులు, పాలు, పూలు, కాయలు అనేక వ్యాధులపై చక్కగా పనిచేసి, ఉపశమనం కల్గిస్తాయి.

రేగు చెట్టు:
(బదరీ) దీని గింజలు మంచిబలాన్ని కల్గిస్తాయి. ఆకులు నూరి, తలకు రుద్దుకొని, స్నానం చేస్తూంటే వెంట్రుకలు పెరుగుతాయి. దీని ఆకుల్ని నలగకొట్టి, కషాయం కాచి, అందులో సైంధవలవణం కలిపి తీసుకొంటే బొంగురు గొంతు తగ్గి, స్వరం బాగా వస్తుంది. దీని పండ్లు చలువ చేస్తాయి. మంచిరక్తాన్ని కల్గిస్తాయి. మూలవ్యాధిని పోగొట్తాయి. పుల్లనివైతే వాతాన్ని తగ్గిస్తాయి. జీర్ణశక్తిని పెంచుతాయి. (జిల్లేడు, రేగు, విషయంలో కొన్ని దోషాలూ ఉన్నాయి. కనుక వేద్యుని ద్వారా తెలిసికొని ఉపయోగించాలి.)

జననీ త్వం హి లోకానాం సప్తమీ సప్తసస్తికే,
సప్తవ్యాహృతికే దేవి! నమస్తే సూర్యమాతృకే.
“సస్తాశ్వాలుండే ఓ సప్తమీ! నీవు సకల లోకాలకూ తల్లివి. సూర్యునికి తల్లివైన నీకు నమస్కారం”- అని చెప్తూ, సూర్యునికి అర్ఘ్యమివ్వాలి. సూర్యుణ్ణి పూజించాలి. పిదప తర్పణం చేయాలి.

మాఘప్రశస్తి:
మా+అఘ=పాపంలేనిది – పుణ్యాన్ని కల్గించేది. మనం చేసే పూజలూ, వ్రతాలూ అన్నీ పుణ్యసంపాదన కొరకే! శివకేశవులకు ఇరువురికీ మాఘం ప్రీతికరమైనదే! ఉత్తరాయణం మకరసంక్రమణంతో ప్రారంభమైనా – రధసప్తమి నుండియే పూర్తిగా ఉత్తరాయణ స్పూర్తి గోచరిస్తుంది. ఈ నాటి నుండి వేసవి ప్రారంభమైనట్లే!

రధసప్తమినాటి శిరస్నానం వేళ పఠించవలసిన మంత్ర శ్లోకం:
య దాజన్మకృతం పాపం మయా జన్మసు జన్మసు,
తన్మే రోగంచ శోకంచ మాకరీ హంతు సప్తమీ.
ఏతజ్ఞన్మకృతం పాపం యచ్చ జనమంతరార్జితం,
మనోవాక్కాయజం యచ్చ జ్ఞాతాజ్ఞాతేచ యే పునః
ఇతి సప్తవిధం పాపం స్నానా న్మే సప్తసప్తికే!
సప్తవ్యాధి సమాయుక్తం హర మాకరి సప్తమి.
జనమ జన్మాంతారాలో, మనోవాక్కాయాలతో, తెలిసీ, తెలియక చేసిన సప్తవిధ పాపాలవల్ల ఏర్పడిన రోగం, శోకం, మున్నగునవన్నీ ఓ లక్ష్మీకరమైన రధసప్తమీ! నిన్ను స్మరిస్తూ ఈ స్నానంతో నశించుగాక!

రథసప్తమి రోజు ఏం చేయాలంటే…

మాఘశుద్ద సప్తమి సూర్యభగవానుడు పుట్టిన తిథి. సకల జగత్తుకి వెలుగునిచ్చే సూర్యుడు రథాన్ని ఎక్కి తన డిస నిర్దేశాన్ని మార్చుకునే రోజు. అలాంటి సమయంలో చెయ్యాల్సిన కొన్ని పనులు చెయ్యటం వల్ల ఆరోగ్యం వృద్ధి చెందటమే కాదు దీర్ఘకాలిక వ్యాధుల నుండి కూడా ఉపశమనం లభిస్తుందని చెపుతున్నాయి మన శాస్త్రాలు.

రథసప్తమి ముందు రోజు రాత్రి ఉపవాసం ఉండి మర్నాడు ఉదయం సూర్యోదయానికి ముందుగానే స్నానం చెయ్యాలిట. స్నానం చేసేటప్పుడు మగవారు 7 జిల్లేడు ఆకులు,ఆడవారు 7 చిక్కుడు ఆకులు తలపై,భుజాలపై ఉంచుకుని ఈ కింద మంత్రాన్ని చదువుతూ స్నానం చేయాలి.

|| జననీ త్వం హి లోకానం సప్తమీ సప్తసప్తికే,

సప్తవ్యాహృతికే దేవి ! సమస్తే సూర్యమాతృకే ||

(“సప్తాశ్యములు గల ఓ సప్తమీ ! నీవు సకల భూతములకును, లోకములకును జననివి. సూర్యునికి తల్లినైన నీకు నమస్కారము. అని ఈ మంత్రమునకు అర్థం.)

మాఘ మాసంలో రధ సప్తమే కాదు, సూర్యుడికి ముఖ్యమైన ఆదివారాలన్నీ కూడా విశేషమైనవే. ఏ కారణంవల్లనైనా రధసప్తమినాడు పై విధంగా సూర్యారాధన చేయలేనివారు మాఘ ఆదివారంనాడు చేస్తారు. అంతేకాదు ఈ మాసంలో సముద్రస్నానం కూడా విశేషమైనదే. ఉదయంనుంచి అస్తమయందాకా

ముఖ్యఉత్సవాలు

సూర్యుడు మకరరాశిలో ప్రవేశించే మకర సంక్రాంతికి, రధ సప్తమికి ఆలయంలో విశేష పూజలు జరుగుతాయి.

మన సమీపంలో వున్న తిరుచానూరు యందు అనగా అలిమేలు మంగాపురం శ్రీ పద్మావతి అమ్మవారి ఆలయమునకు ఉత్తర దిక్కున పుష్కరిణి కి ఎదురుగా శ్రీ సూర్యనారాయణస్వామిని ఆలయము నందు ఆయనకి అత్యంత ప్రీతికరమైన మాఘమాసంలో సేవించి తరిద్దాం….

పుణ్య తిథి రథ సప్తమీ

మాఘ శుద్ద సప్తమినే రథ సప్తమి అంటారు. రథ సప్తమి అంటే, సూర్య భగవానుడి పుట్టినరోజు.

సూర్యుడు ఏడు అశ్వాలతో కూడిన రథాన్ని అధిరోహించి వస్తాడన్నది మనకు తెలిసిందే. మన్వంతర ప్రారంభంలో మాఘ శుద్ధ సప్తమినాడు, సూర్యుడు తొలిసారి రథాన్ని అధిరోహించి భూమిపై అవతరించాడట. అందుకే రథ సప్తమిని పూజ్యమైన రోజుగా భావిస్తారు. సూర్యుడే లేకపోతే లోకమే చీకటిమయంగా ఉంటుంది. సూర్యభగవానుని ప్రసన్నం చేసుకోడానికి ఈ ప్రత్యేక దినాన ఆదిత్యహృదయం చదువుతూ పూజలు చేయాలి.

కోణార్క్ లోని సూర్య దేవాలయంలో రథ సప్తమిని పురస్కరించుకుని మహా వైభవోపేతమైన ఉత్సవం జరుగుతుంది. కోణార్క్ లో జరిగే ఈ రథోత్సవాన్ని చూట్టానికి దేశం నలుమూలల నుండీ భక్తులు తండోపతండాలుగా వస్తారు.

రథ సప్తమినాడు ఏం చేయాలో ఇప్పుడు తెలుసుకుందాం.
రథ సప్తమి రోజున మనం స్నానం చేసే నీటిలో కొన్ని రేగి పండ్లను వేసుకుని చేస్తే మంచిది.
భాస్కరునికి ఇష్టమైన రథసప్తమినాడు స్నానం ఆచరిస్తూ, సూర్య భగవానుడికి మనసు అర్పణ చేసుకుంటూ నమస్కరించాలి. ఇలా చేయడంవల్ల శారీరక, మానసిక బాధలన్నీ తొలగిపోతాయి.
ప్రతిరోజూ సూర్య నమస్కారాలు చేయడం మంచిది. ముఖ్యంగా రథ సప్తమినాడు చేస్తే మరీ మంచిది.
ఆవు నేతితో దీపం వెలిగించి సూర్య భగవానుడికి నమస్కరించుకుంటూ నది లేదా చెరువులో వదిలితే మంచిది.
సూర్యుని ఎర్రటి పూలతో పూజించడం శ్రేష్టం.
రథ సప్తమి రోజున ఆదిత్య హృదయం పఠిస్తూ భక్తిగా ప్రార్ధించాలి.
రవితేజునికి రేగిపళ్ళు ఇష్టం. కనుక రేగిపళ్ళను, పరమాన్నాన్ని ఆదిత్యునికి నైవేద్యంగా సమర్పించాలి.
🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

Saturday 25 January 2020

తిధులు - విభజన :

సూర్య చంద్రుల మద్య దూరాన్ని తిధి అంటారు.చంద్రుడు సూర్యుడిని దాటి 12° నడచిన ఒక తిధి అగును.దీనిని శుక్లపక్ష పాడ్యమి అంటారు.చంద్రుడు సూర్యున్ని దాటి 180° నడచిన దానిని శుక్ల పక్ష పాడ్యమి నుండి పౌర్ణమి వరకు,చంద్రుడు సూర్యున్ని దాటి 180° వరకు ఉన్నంతకాలం శుక్ల పక్షం.చంద్రుడు సూర్యున్ని దాటి 180° నుండి 360° వరకు నడుచు కాలం కృష్ణ పక్షం అగును.ఒక నెలలో శుక్ల పక్షం,కృష్ణ పక్షం అను రెండు భాగాలుగా చేయబడింది.శుక్ల పక్షంలో 15 తిధులు,కృష్ణ పక్షంలో 15 తిధులు ఉంటాయి.శుక్ల పక్షం లో 15 తిధి పూర్ణిమ,కృష్ణ పక్షంలో 15 వతిధి అమావాస్య.

నంధ తిధులు:-పాడ్యమి, షష్ఠి, ఏకాదశి తిధులను నంధ తిధులు అంటారు. నంధ తిధులు ఆనందాన్ని కలిగిస్తాయి. శిల్పం,యజ్ఞ యాగాది కర్మలకు, వివాహానికి, ప్రయాణానికి, కొత్త వస్త్రాభరణములకు, వైద్యం, మంత్ర విద్యలు నేర్చుకొనుటకు నంధ తిధులు పనికి వస్తాయి.

భద్ర తిధులు:-విదియ, సప్తమి, ద్వాదశి తిధులను భద్ర తిధులు అంటారు. ఆత్మ రక్షణ కలిగిస్తాయి, వాస్తు కర్మలకు, యాత్రలకు, ఉపనయనమునకు, పూజలకు, విధ్యాబ్యాసమునకు, వాహనముల అధిరోహణకు ,సంగీతం, ఆహారసేకరణకు భద్ర తిధులు మంచివి.
జయ తిధులు:-తదియ, అష్టమి, త్రయోదశి తిధులను జయ తిధులు అంటారు. జయాన్ని కలిగిస్తాయి. వివాహం, గృహప్రవేశం, విగ్రహ ప్రతిష్ఠలు, యుద్దం, ఆయుధ దారణం, అధికారులను కలవటం, విద్యార్హత పరీక్షలు వీటికి జయ తిధులు మంచివి.

రిక్త తిధులు:-చవితి, నవమి, చతుర్ధశి తిధులను రిక్త తిధులు అంటారు. ఫలితాన్ని ఇవ్వలేవు. అగ్నిసంబంధ కర్మలకు, అసత్య భాషణకు, విరోదాలకు, హాని కలిగించే విషయాలకు, పాప కార్యాలకు రిక్త తిధులు మంచివి.

పూర్ణ తిధులు:-పంచమి, దశమి, అమావాస్య, పౌర్ణమి తిధులను పూర్ణ తిధులు అంటారు .పూర్ణ ఫలితాన్ని ఇస్తుంది.అమావాస్య ముందు పితృకర్మలను, మిగిలిన తిధుల యందు సకల శుభ కర్మలను వివాహం, ప్రయాణాలు, శాంతులు పూర్ణ తిధులు మంచివి, పౌర్ణమి యాత్రకు పనికి రాదు.

సిద్ధ తిధులు:-శుక్రవారంతో కూడిన నంధతిధులు, శనివారంతో కూడిన రిక్తతిధులు, గురువారంతో కూడిన పూర్ణ తిధులు, సిద్ధ తిధులు అనబడును. ఇట్టి తిధుల యందు సర్వ కార్యములు సిద్ధించును,నెరవేరును.

దగ్ధ తిధులు:-ఆదివారం ద్వాదశి ,సోమవారం ఏకాదశి, మంగళవారం పంచమి, బుధవారం తదియ,గురువారం అష్టమి,శనివారం నవమి,కలసిన దగ్ధతిధులు అంటారు.అన్ని శుభకర్మలయందు ముఖ్యముగా వాస్తు కర్మలయందు నిషిద్దం.

Friday 24 January 2020

లగ్నభావం(తనూభావం) :

లగ్నం అంటే తూర్పు దిగ్మండలంపై ఏ రాశి ఉదయిస్తుందో అదే లగ్నం అంటారు.
లగ్నభావాన్నే తనూభావం అంటారు.బాల్యం,ఆరోగ్యం,వ్యక్తిత్వం,దేహం, నడవడిక, శరీర వర్ణం,శారీరక,మానసిక స్ధితి,జన్మించిన విధం,ఎత్తు,సామర్ధ్యం,గుణాలు, తెలివితేటలు, ఆయుర్ధాయం మొదలుగునవి తనూభావం ద్వారా తెలుసుకోవచ్చును. లగ్న కారకత్వాలు: పరాశరుడు లగ్నం గురించి వివరిస్తూ లగ్నం ద్వారా తెలుసుకోదగిన అంశాలను ఈ విధంగా చెప్పాడు.

శ్లో।। తనుం రూపంచ జ్ఞానంచ, వర్ణం చైవ బలాబలం । ప్రకృతిం సుఖ దుఃఖంచ, తనుభావద్విచింత్యయేత్‌ ।। -
బృహత్పరాశరి, భావవివేచనాధ్యాయం, శరీరము, రూపము, వర్ణము, జ్ఞానము, బలాబలాలు, స్వభావము, సుఖదుఃఖాలు తనుభావమునుంచి తెలుసుకోవాలి.
కాళిదాసు తన ఉత్తర కాలామృతములో లగ్నభావకారకత్వాల్ని మరింతనిశితముగా విశ్లేషించాడు. శ్లో।।దేహశ్చావయవస్సుఖరాస్తే జ్ఞాన జన్మస్థలే, కీర్తిస్వప్న బలాయతీర్నృ -పనయాఖ్యాశాంతిర్వయః। కేశాకృత్యభిమాన జీవనపరద్యూతాంకమానత్వచో, నిద్రాజ్ఞాన ధనాపహార నృతిరస్కార స్వభావారుజః । వైరాగ్యప్రకృతీచ కార్యకరణం, జీవక్రియాసూద్యమః, మర్యాదప్రవినాశనంత్వితిభవేద్వర్థోపవాదస్తనోః ।।
దేహము, కాళ్ళు, చేతులు మొదలైన అవయవములు, సుఖదుఃఖములు, ముసలితనము, జ్ఞానము, జన్మభూమి, కీర్తి, స్వప్నము, బలము, ఆకారము, తర్వాత జరిగే ఫలితాలు అంటే ఒక కార్యముయొక్క పర్యవసానము ఏ విధముగా ఉంటుందో తెలుసుకోవటము, రాజనీతి, ఆయుర్దాయము, శాంతి, వయస్సు, కేశములు, అభిమానము, జీవనము, అపర విషయములు, జూదము, చిహ్నము, పౌరుషము, చర్మము, నిద్ర, అజ్ఞానము, ధనమును దొంగలించటము, మనుష్యులను తిరస్కరించు స్వభావము, రోగము లేకపోవటము, వైరాగ్యము, ప్రకృతి, కార్యములను చేయటం, జీవకార్యములయందు ప్రయత్నించుట, మర్యాదను పోగొట్టుకొనుట, మొదలైన ఫలితాలను లగ్నము ద్వారా చూడాలి.
చరలగ్నం అయిన సంచారం చేయువాడుగాను,స్ధిర లగ్నం అయిన స్ధిరంగా ఉండటం,ద్విస్వభావ లగ్నం అయిన మిశ్రమంగా ఉండటం.

లగ్నంలో రవి ఉంటే:-లగ్నంలో రవి ఉంటే కోపం,శిరోవేదన,ఉష్ణతత్వం,శరీరం పుష్ఠి,పల్చని జుట్టు,బట్టతల(లేత వయస్సులో),పాపగ్రహాల కలయిక వలన దయాగుణం లేక క్రూరంగా ప్రవర్తించటం,సృజనాత్మక శక్తి,ధైర్యం,సాహసం,ఉంటాయి.
లగ్నంలో చంద్రుడు ఉంటే :-లగ్నంలో చంద్రుడు ఉంటే గుండ్రని ముఖం,దట్టమైన జుట్టు,సున్నితమైన మనస్సు,బిడియం,సౌమ్యం,మానసిక ఇబ్బందులు,ఆటుపోటులు,కంటివ్యాది,మానసిక వ్యాది (అంతర్గత జబ్బు),ఎడమ చెవి ప్రాబ్లం ,మాట త్వరగా రాకపోవటం,ఫైనాన్స్ ప్రాబ్లమ్స్ ఉండవు.
లగ్నంలో కుజుడు ఉంటే:-లగ్నంలో కుజుడు దూకుడుతనం,కలర్ తక్కువ,ముఖంపైన స్పాట్స్,ముఖంపై దెబ్బలు,గాయాలు ఉండటం,జన,సోదర సహకారం,స్పోర్ట్స్ పైన మక్కువ,వాగ్ధాటి,వివాదాలు,త్వరగా కోపం,యాక్సిడెంట్,ఇతరులను నిందించటం,కొట్టటం,చెడు అలవాట్లకు బానిస కావటం జరుగుతుంది.
లగ్నంలో బుధుడు ఉంటే:-లగ్నంలో బుదుడు ఉంటే తెలివి,అతి తెలివి,మంచి వస్త్రాలు,చక్కని భాష,మ్యాధ్స్ పైన మక్కువ,అంచనా వేయగలిగే సామర్ధ్యం,వాక్ శుద్ధి,రాయభారాలు,కమ్యూనికేషన్,లాజిక్స్,తెలివితేటలను వ్యక్త పరచటం,ఇతరులు ఏది చేబితే వింటారో అది చెప్పగలగటం,నపుంసకత్వం,నరాల బలహీనత.
లగ్నంలో గురువు ఉంటే:-లగ్నంలో గురువు ఉంటే ఆరోగ్యవంతమైన లావైన శరీరం,కొవ్వు పట్టిన లావైన శరీరం,ఊబకాయం,దర్మాన్ని కాపాడటం,శాంత స్వభావం,ప్లానింగ్,తను కష్టపడి ఎవరికైన(శత్రువులకైనా) మంచి చేస్తాడు.శుభ్రత కలిగి ఉండటం,తీర్ద యాత్రలపైన మక్కువ,దైవ చింతన,మంచి అలవాట్లు,ఉన్న దానితో సంతృప్తి పడలేరు.
లగ్నంలో శుక్రుడు ఉంటే:-లగ్నంలో శుక్రుడు ఉంటే అందమైన ఆకర్షవంతమైన శరీరం,సుగంద ద్రవ్యాలపైన(సెంటు) మమకారం,సున్నితమైన శరీరం,సుఖవంతమైన,సుఖ జీవన విధానంపైన మక్కువ,కష్టపడి పని చేయలేక పోవటం,ఆకర్షణ,స్త్రీలను ఆకర్షించటం,ఇతరుల ఆకర్షణలకు లొంగి పోవటం.లగ్జరీగా ఉండటం.
లగ్నంలో శని ఉంటే:-లగ్నంలో శని ఉంటే బద్దకం,బ్లాక్ కలర్ గా ఉండటం,నెమ్మది నిధానం,లోభి,పిసినారితనం,పొడవైన శరీరం,అపరి శుభ్రం,చింపిరి జుట్టు,చిన్నతనంలోనే ముసలి ఛాయలు,మురికి బట్టలు,ఆలస్య వివాహం,ప్రతి పనిలో ఆటంకం,నిరాశ ఉండటం.మొండిగా ప్రవర్తించటం.
లగ్నంలో రాహువు ఉంటే :-లగ్నంలో రాహువు ఉంటే మోసపోవటం,మోసగించటం,లొంగిపోవటం,లొంగతీసుకోవటం, కులాంతర వివాహం చేసుకోవటం,ఉద్రేకంగా,క్రూరంగా ఉండటం,మనస్సులోని భావాలు బయటకు చెప్పకపోవటం, ఊహాత్మకమైన విషయాలు,అనుమానాలు,ఏదో జరుగుతుందని ముందుగానే ఊహించుకొని బయపడటం,అనవసరమన ఆపోహాలు ఉండటం.
లగ్నంలో కేతువు ఉంటే:-లగ్నంలో కేతువు ఉంటే తప్పుడు సలహాలు ఇవ్వటం,తీసుకోవటం,వివాహంపైన మక్కువ లేకపోవటం,ఏ పని సరిగా చేయలేకపోవటం,నిలకడ లేకపోవటం,వితండవాదం,ప్రతి చిన్న విషయానికి అలగటం,భయపడటం,మౌనవ్రతం పాటించటం.దైవంపైన అతి భక్తి.

Thursday 23 January 2020

గ్రహాలకు మిత్ర, శతృ, సమత్వాల పరిశీలన :

శుభ్ర గ్రహములు : గురువు, శుక్రుడు , పూర్ణ చంద్రుడు, బుధుడు(శుభులతో
కలసిన శుభుడు)
పాప గ్రహములు: రవి, కుజ, శని, రాహు, కేతువు, క్షీణ చంద్రుడు,
బుధుడు(పాపులతో కలసిన పాపి) అని ఉన్నది.

1) రవికి - చం, కు, గురువులు మిత్రులు : బుధుడు సముడు : శని, శుక్రులు
శత్రువులు.
2) చంద్రునకు - రవి, బుధులు మిత్రులు : మిగిలిన వారు బుధ, గురువు, శని, శుక్రులు సములు, శత్రువులు లేరు.
3) కుజునకు - రవి, చంద్ర, గురువులు మిత్రులు : బుధుడు శత్రువు: శని,
శుక్రులు సములు.
4) బుధునకు - రవి, శుక్రులు మిత్రులు : చంద్రుడు శత్రువు: కుజ, గురు,
శనులు సములు.
5) గురునకు - రవి, చంద్ర కుజులు మిత్రులు : శుక్ర, బుధులు శత్రువులు :
శని సముడు.
6) శుక్రునకు - శని, బుధులు మిత్రులు : కుజ, గురులు సములు: రవి, చంద్రుడు శత్రువులు.
7) శనినకు: శుక్ర, బుధులు మిత్రులు : రవి, చంద్ర, కుజులు శత్రువులు :
గురుడు సముడు.
చంద్రుడికి శత్రువులు లేరు.
గురువు ఎవరికి శత్రువు కాదు.

కొన్ని అనుమానాలు
1) రవికి - చం, కు, గురువులు మిత్రులు : బుధుడు సముడు : శని, శుక్రులు
శత్రువులు.
* రవి, శనులు పాపులు కదా పాపులు శత్రువులు ఎలా అయ్యారు?
* బుధుడు పాపులతో కలసిన పాపి, శుబులతో కలసిన శుభుడు - అనగా బుధునికి
పూర్ణ శుభత్వం లేదు పూర్ణ పాపత్వం లేదు. అటువంటప్పుడు రవికి బుధుడు
ఏవిధముగా శుభుడు?
* పూర్ణ చంద్రుడు శుభుడు, క్షీణ చంద్రుడు పాపి - వీరికి కూడా పూర్ణ
శుభత్వం లేదు పూర్ణ పాపత్వం లేదు. అటువంటప్పుడు రవికి మిత్రుడు ఎలా
అయ్యాడు?
* గురువు శుభ గ్రహం, రవి పాప గ్రహం - వీరెలా మిత్రులయ్యారు?
సత్యాచార్యుని హోరాశాస్త్రమందు గ్రహములకు గల మిత్ర శతృత్వ సంబంధాన్ని ఈ విధంగా తెలియజేశాడు.
సూత్రం:- గ్రహములకు తన మూల త్రికోణ రాశి నుండి, ద్వితీయ, ద్వాదశ, పంచమ, నవమాధిపతులు, స్వక్షేత్రం, ఉచ్చ రాశ్యాధిపతులు, ఆయుస్ధానాధిపతి అయిన అష్టమం, చతుర్ధాధిపతియు మిత్రులు. మిగతా స్ధానాధిపతులు శత్రువులు.
2,4,5,8,9,12 స్వ, ఉచ్చ రాశ్యాధిపతులు మిత్రులు, 3, 6,7,10,11 రాశ్యాధిపతులు శత్రువులు. మూల త్రికోణం నుండి లెక్కపెట్టినప్పుడు రెండు భావాలకు ఒక గ్రహం యొక్క ఆధిపత్యం మిత్ర, శత్రువులు అయినప్పుడు సములవుతారు.
పైన చెప్పిన విధంగా గ్రహానికి రెండు మిత్ర స్ధానాధిపతి మిత్రుడు అవుతాడు. పైన చెప్పిన విధంగా గ్రహానికి ఒకటి మిత్ర, శత్రు స్ధానాధిపతి సముడు అవుతున్నాడు. మిత్ర స్ధానాధిపతులు కాకుండా మిగతా వారు శత్రువులు అవుతారు. సూర్య చంద్రులకు ద్వయాధిపత్యం లేదు కనుక వారు ఏక రాశ్యాధిపాతులైనను మిత్రులే అవుతారు.
ఉదా;- రవికి - చం, కు, గురువులు మిత్రులు : బుధుడు సముడు : శని, శుక్రులు శత్రువులు.
సత్యాచార్యుడు చెప్పిన సూత్రం ప్రకారం సూర్యుని మూల త్రికోణ స్ధానం నుండి అనగా సింహరాశి నుండి ద్వాదశాధిపతి చంద్రుడు ఏక రాశ్యాధిపతి కావటం వలన మిత్రుడు అయ్యాడు.
సింహానికి చతుర్ధ రాశి వృశ్చికం, నవమ రాశి మేషం సూర్యునికి ఉచ్చ స్ధానం మేషం. కుజుడు ఈ మూడు స్ధానాలకు అధిపతై ద్విరాశ్యాధిపత్యం వలన సూర్యునికి కుజుడు మిత్రుడు అయ్యాడు.
సింహరాశికి పంచమ స్ధానం ధనస్సు, అష్టమ స్ధానం మీనం. ఈ రాశులకు అధిపతి గురువు. గురువు పై సూత్రం ప్రకారం ఉక్తరాశి ద్వయాధిపతి ఆగుట వలన సూర్యునికి గురువు మిత్రుడు అయ్యాడు.
సింహరాశికి ద్వితీయం కన్య, ఏకాదశ స్ధానం మిధునం. ఈ రెండు రాశులకు అధిపతి బుధుడు. పై సూత్రం ప్రకారం ద్వితీయం ఉక్త స్ధానం, ఏకాదశం ఉక్త స్ధానం కాకపోవటం వలన, ఉక్తైక రాశ్యాధిపతి (మిత్ర,శత్రు) అయిన బుధుడు సూర్యునికి సముడు అయ్యాడు.
సింహారాశికి షష్ఠమ, సప్తమ స్ధానాలు మకర, కుంభాలు. అవి ఉక్త స్ధానాలు కావు కనుక శని సూర్యునికి శత్రువు అవుతాడు.
సింహారాశికి దశమ, తృతీయ స్ధానములు వృషభ, తులలు. అవి ఉక్త స్ధానాలు కావు కనుక ఆ స్ధానానికి అధిపతి అగు శుక్రుడు సూర్యునికి శత్రువు అవుతాడు.
ఈ విధంగా మిగతా గ్రహాలకు మిత్ర, శత్రు, సమత్వాలను గుర్తించవచ్చును.

Wednesday 22 January 2020

గ్రహాలు - వక్రత్వం :

గ్రహాలు కొన్నాళ్ళు వేగంగాను, కొన్నాళ్ళు స్తంభనలోను, కొన్నాళ్ళు వక్రంగా సంచరించును. భూమితో పాటు గ్రహాలన్నీ సూర్యుని చుట్టు తిరుగుచున్నవి. గ్రహాలు సూర్యుని చుట్టు తిరుగుతున్నప్పుడు సూర్యుని అవతలకి వెళ్ళినప్పుడు భూమి మీద ఉన్నవారికి గ్రహాలు కనిపించవు. ప్రతి గ్రహం సూర్యుని చుట్టూ వాటి వాటి కక్ష్యల్లో తిరుగుతుంటాయి. భూమి కూడా తన కక్ష్యలో సూర్యుని చుట్టూ తిరుగుతుంటుంది. కాబట్టి వాస్తవంలో ఏ గ్రహానికి వక్రగతి గాని, ఇతర గతులు గాని ఉండవు. కానీ భూమి మీద ఉన్న పరిశీలకుడు ఒక గ్రహాన్ని పరిశీలిస్తున్నప్పుడు ఒకొక్కసారి ఆ గ్రహం ముందుకు వెళ్ళినట్లు, ఒకొక్కసారి వెనుకకు వెళ్ళినట్లు, ఒకొక్కసారి కదలకుండా ఉన్నట్లు కనిపిస్తుంది.
ఒక గ్రహం ముందుకు వెళ్ళినట్లు కనపడే స్ధితిని ఋజుగతి అంటారు. ఒక గ్రహం వెనుకకు వెళ్ళినట్లు కనపడే స్ధితిని వక్రం లేదా వక్రగతి అంటారు. ఒక గ్రహం వక్రగతిలో ఉన్నదంటే అది భూమికంటే వెనుక ప్రయాణిస్తుందన్న మాట. గ్రహం తానున్న రాశి నుండి గాని, నక్షత్ర పాదం నుండి వెనుకకు పోవటాన్ని వక్రం అంటారు. పాపగ్రహాలకు వక్రగమనం కలిగినచో మిక్కిలి పాప ఫలితాన్ని, శుభగ్రహాలకు వక్రగమనం కలిగినచో సకల శుభ ఫలితాన్ని ఇస్తారు.గురువు వక్రించినప్పుడు అదే రాశి ఫలితాన్ని, మిగతా గ్రహాలు వక్రించినప్పుడు వెనుక రాశి ఫలితాన్ని ఇస్తాయి. బుధ, శుక్రులు స్పీడ్ ప్లానెట్స్. బూమి కంటే ఎక్కువ వేగం కలిగి ఉన్నందున ఈ గ్రహాలను రవి దాటి పోవలసిన అవసరం లేకుండా బుధ, శుక్రులే రవిని దాటి వెళ్ళి ఆ తరువాత వేగం తగ్గి వక్రం పొందుతారు.
బుధుడు రవిని దాటి 28º ముందుకు వెళ్ళి క్రమంగా వేగం తగ్గి 22º దూరంలో వక్రిస్తాడు. ఆయా రాశులను బట్టి 14º దూరంలో కూడా వక్రించును.వక్రించినప్పుడు బుధుడు గరిష్టంగా 16 º 30 నిమిషాలు వెనుకకు వెళ్తుంది. బుధుడి వక్ర గతి కాలం 24 రోజులు.
శుక్రుడు రవిని దాటి 48º ముందుకు వెళ్ళి క్రమంగా వేగం తగ్గి 29º దూరంలో వక్రిస్తాడు. వక్రించినప్పుడు శుక్రుడు గరిష్టంగా 16 º 30 నిమిషాలు వెనుకకు వెళ్తుంది. శుక్రుని వక్ర గతి కాలం 42 రోజులు.
కుజుడిని దాటి రవి 4 రాశుల 11º ముందుకు వెళ్ళగానే కుజుడు వక్రిస్తాడు. వక్రించినప్పుడు కుజుడు గరిష్టంగా 10 º 30 నిమిషాలు వెనుకకు వెళ్తుంది. కుజిని వక్ర గతి కాలం 80 రోజులు.
గురువుని దాటి రవి 3 రాశుల 24 º ముందుకు వెళ్ళగానే గురువు వక్రిస్తాడు. వక్రించినప్పుడు గురువు గరిష్టంగా 10 º 00 నిమిషాలు వెనుకకు వెళ్తుంది. గురుని వక్ర గతి కాలం 240 రోజులు.
శనిని దాటి రవి 3 రాశుల 19 º ముందుకు వెళ్ళగానే శని వక్రిస్తాడు. వక్రించినప్పుడు శని గరిష్టంగా 06 º 58 నిమిషాలు వెనుకకు వెళ్తుంది. శని వక్ర గతి కాలం 140 రోజులు.

Tuesday 21 January 2020

కంటి రోగాలకు చక్కటి పరిష్కారం "చక్షుషీ విద్యా ప్రయోగం"

కంటి రోగాలను తగ్గించుటలో చక్షుషీ విద్యా ప్రయోగం మహత్తరమైనదని ఉపనిషత్తులు పేర్కొంటున్నాయి.సంధ్యావందనము తరువాత సూర్యుని ఎదురుగా తూర్పు వైపు కూర్చుని గాయత్రి మంత్రం 24 సార్లు చదివిన తరువాత ఈ క్రింది మంత్రముతో ఒక చెంచా నీరు భూమికి సమర్పిస్తూ వినియోగించాలి.

తస్యశ్చాక్షుషీ విద్యాయా ఆహిర్భుధ్న్య ఋషి గాయత్రీ
ఛందః సూర్యో దేవతా, చక్షు రోగ నివృత్తయే వినియోగః


తరువాత క్రింది మంత్రాన్ని 12 సార్లు జపించాలి.


ఓం చక్షుః చక్షుః స్థిరో భవ ! మాం పాహి పాహి!
త్వరితం చక్షు రోగాన్ శమయ శమయ !
మమ జాత రూపం తేజో దర్శయ దర్శయ!
యధాహం అంధోనస్యాం తథా కల్పయ కల్పయ !
కళ్యాణం కురు కురు !
యాని మమ పూర్వ జన్మో పార్జితాని చక్షుః ప్రతిరోధక దుష్కృతాని సర్వాణి నిర్మూలయ నిర్మూలయ!
ఓం నమః చక్షుస్తేజో దాత్రే దివ్యాయ భాస్కరాయ !
ఓం కరుణా కరాయామృతాయ ! ఓం నమః సూర్యాయ
ఓం నమో భగవతే సూర్యాయాక్ష తేజసే నమః !
ఖేచరాయనమః ! మహాతేనమః ! రజసే నమః !
అసతో మా సద్గమయ ! తమ సోమా జ్యోతిర్గమయా !
మృత్యోర్మా అమృతంగమయ!


ఇలా 12 సార్లు చదివిన తరువాత పంచ పాత్ర లోని జలాన్ని అర్ఘ్య రూపంలో సూర్యునికి సమర్పించాలి.
1,2 చుక్కలు జలాన్ని రెండు చేతి వేళ్ళకు రాసుకుని కళ్ళు తుడుచుకోవాలి.

Saturday 18 January 2020

పంచమస్ధానం :

వ్యక్తి పూర్వ జన్మలో(పంచమ స్ధానం)చేసిన కర్మానుసారంగా తల్లి గర్భంలో (చతుర్ధభావం)పిండంగా తయారై (లగ్నం భావం) ద్వారా జన్మించి (దశమ భావం)ద్వారా కర్మ ఫలాలను అనుభవించి(నవమ భావం)ద్వారా పుణ్యబలం ఆధారంగా మోక్షానికి చేరతాడు.
పంచమస్ధానంలో పూర్వ పుణ్యబలం, మాత్రభావం,పుత్రభావం,ఆలోచన,తెలివితేటలు,పితృభావం, ఆద్యాత్మిక జ్ఞానం, త్రికోణభావం,విద్యయందు ఆసక్తి,తల్లికి అరిష్టం,సోదరుల విజయాలు (సహకారం),LOVE, మంత్రసిద్ధి,తీర్ధయాత్రలు దైవంపై నమ్మకాన్ని,నదీ స్నానాలు,దేవాలయాల ప్రతిష్ఠ,దేవతా ప్రతిష్ఠ,స్పెక్యులేషన్,ఉన్నత విద్య,బీజస్ధానం,ప్లానింగ్,ప్రణాళిక,భవిష్యత్ కార్యక్రమాలు తెలుసుకొనే స్ధానం,తండ్రి చేసిన పుణ్యం.పంచమస్ధానంను అనుసరించి మానవునికి అంతర్గత నైజమును గురించి తెలుసుకోవచ్చును.
పంచమాదిపతికి,పంచమానికి సంబందం ఉంటే జన్మ కాగానే మరొక జన్మలోకి అడుగు పెడతాడు.ప్రతి వ్యక్తి జాతకచక్రంలోను పంచమస్ధానం బాగుంటే మిగతా భావాలు అనుకూలంగా లేక పోయిన మంచి ఆలోచన,తెలివితేటలతోటి జీవితాన్ని భవిష్యత్ కార్యక్రమాలకు అనుగుణంగా తీర్చిదిద్దుకోగలడు.
అగ్నితత్వరాసులు(మేష,సింహ,దనస్సు రాశులు) పంచమస్ధానం అయితే ఏదైనా సాదించాలనే పట్టుదల,చురుకుదనం,ఇతరులు తనని గౌరవించాలనుకోవటం,రాజకీయాలలో రాణింపు.పొగిడితే లొంగిపోయే గుణం,స్వతంత్ర ఆలోచన చేయగలరు.దుష్ప్రవర్తన కలిగి ఉంటారు.ఉద్రేక స్వభావం,దైర్యం,సాహసం కలిగి ఉంటారు.భవిష్యత్ పై ముందు చూపు కలిగి ఉంటారు.
భూతత్వరాశులు(వృషభ,కన్య,మకర రాశులు) పంచమస్ధానం అయితే మెమరీపవర్ బాగుంటుంది,ఏ విషయాన్ని అయిన సరే సూక్ష్మంగా ఆలోచించి నిర్ణయం తీసుకుంటారు.ఊహాత్మకంగా ఉంటారు.తీవ్రమైన భావోద్వేగాలు ఉంటాయి.ప్రతి విషయంలో నిర్లక్ష్యం.గతించిన విషయాలను గురించి ఆలోచిస్తారు.సహనాన్ని కోల్పోవటం.ధనం విషయంలో గుట్టుగా ఉండటం,ఈర్ష్య మొదలైన లక్షణాలు కలిగి ఉంటారు.
వాయుతత్వరాసులు(మిధున,తుల,కుంభ రాశులు) పంచమస్ధానం అయితే ప్రతి చిన్న విషయానికి భాద పడటం,భయపడటం,అలగటం,తొందరగా నిర్ణయాలు తీసుకోలేరు.ఎమోషన్స్ ఎక్కువ.అనవసర విషయాలను పట్టించుకోవటం.సాంప్రదాయాలు,ఉన్నత విలువలకు ప్రాధాన్యత ఇస్తారు.
జలతత్వరాసులు(కర్కాటక,వృశ్చిక,మీన రాశులు) పంచమస్ధానం అయితే మానసిక స్ధిరత్వం,ఊహాశక్తి,మంచి ఆలోచన,చంచలత్వం,అంతర్గత ఆలోచనలు,ప్రతి విషయంలోనూ సీక్రెట్ గా ఉంటారు.ఇతరులలో తప్పులు వెతుకుతుంటారు.విమర్శించే నైజం కలిగి ఉంటారు.విశ్రాంతి లేకుండా పని చేస్తారు.కనపడే శైలికి భిన్నంగా నడుచుకుంటారు.

Friday 17 January 2020

పంచమ భావము - మంత్ర , దేవతా ఉపాసనా యోగములు :

42) పంచమ భావమునకు బలయుక్తమగు పురుష గ్రహ సంబంధము వలన పురుష దేవతోపాసనము , బలము . గల స్త్రీ గ్రహ సంబంధము వలన స్త్రీ దేవతోపాసనము ప్రాప్తింప గలవు.
43) అంశ చక్రము నందు 5-9 స్థానములలో పాప గ్రహములుండి , శుభ గ్రహ దృష్టి నందిన యొడల తాను ఉపాసించు దేవత యొక్క పూర్ణ అనుగ్రహము లభించును.
44) పంచమ భావము నందు బలయుక్తులైన ఆయా గ్రహములకు స్థితి కలిగిన ఈ దేలుపబోవు విధముగా దైవ మంత్రోపాసనలు ప్రాప్తింపగలవు. రవి వలన శైవోపాసన , చంద్రుని వలన గౌరి - పార్వతి , యక్షిణి దేవతలు , కుజుని వలన కుమార స్వామి , వీరభద్రుడు , భైరవుడు , బుధుని వలన సరస్వతీ దేవి , హయగ్రీవుడు(విద్యాధిదేవత) , దక్షిణా మూర్తి , గురువు వలన విష్ణు దేవుడు (విష్ణుమూర్తి అవతార విశేషములు) ,శుక్రుని వలన చాముండ - దుర్గ , శని వలన క్షుద్ర దేవతలు ,రాహువు కేతువు వలన పర పీడాకర శక్తులకు ఉపాసింప గలరు.
45) ఉగ్రమగు పురుష దేవతోపాసనలు ప్రాప్తించుటకు రవి,కుజ,గురుల కలయిక , ఉగ్ర స్త్రీ దేవతోపాసనలకు శని,కుజ,శుక్రుల కలయిక పంచమములో నుండవలెను.
46) అంశ లగ్నమై యున్న రాశి నుండి రాశి చక్రము నందు 5-9 స్థానములలో రెండు పాప గ్రహములున్ననూ ఆ కోణస్థానములకు పాప గ్రహ వీక్షణలు సోకిననూ భూత పిశాచాది పీడాకర గ్రహములను వశము గావించుకొని , భూత మాంత్రికుడు కాగలడు.
47) మంత్ర కారక గ్రహము 1-4-5-7-9-10 స్థానముల యందు శుభ గ్రహ నవాంశల యందుండి , బుధ - శుక్రుల దృగ్యోగాది సంబంధములను కలిగి యున్న తన ఉపాసనా బలము వలన జరగ బోవు అన్ని విషయములను తెలుపగల సమర్ధుడు కాగలడు.
48) కేంద్ర స్థానముల యందు చంద్రుడు బలమును కలిగి , శుభ గ్రహ దృష్టి నంది యుండగా , పంచమాధిపతి ఉచ్చ - మిత్ర క్షేత్రముల యందు శుభ గ్రహ సంబంధీకుడై యున్న యొడల త్రికాల వేత్త కాగలడు.
49) అంశ చక్రమునందు శుక్ర కేతువులు ఒకరినొకరు చూచుకొనుచూ యున్న యాజ్ణీకత్వము ప్రాప్తింప గలదు.
50) చంద్ర శనులు కలసి పంచమ స్థానము నందు బలవంతుడై యుండిన గొప్ప మేధావులై , దైవ రహస్యముల . నెరుంగు శక్తి గల వారగుదురు.
51) పంచమాధిపతి - నీచను పొంది , మంత్ర కారక గ్రహము - శత్రు క్షేత్రము నందుండి , నవమ స్థానము నందు .నైసర్గిక పాప గ్రహములున్న తన మంత్ర శక్తితో పరులను హింసింప గలడు.
52) పంచమ - నవమముల యందు 6-8-12 స్థానాధిపతులుండి , మంత్ర కారక - లగ్నాధిపతులు కలసి 8వ స్థానము నందు ఉన్న పరకీయ మంత్ర శక్తితో ప్రాణములను కోల్పోవును.

Thursday 16 January 2020

పంచమ భావము - సంతాన యోగములు :

20) పంచమాధిపతి 9 వ స్థానము నందు , నవమాధిపతి పంచమ స్థానము నందు ఉన్నాను లేదా పంచమ .నవమాధిపతులకు పరస్పర , దృగ్యోగాది సంబంధములున్ననూ , ముగ్గురు పుత్రులు కలుగగలరు.
21) భాగ్యాధిపతి లేదా పంచమాధిపతి ఏకాదశ స్థానములో బలయుక్తులై యున్న నలుగురు పుత్రులు కలిగెదరు.
22) కుటుంబ(2వ స్థానము) మరియు లగ్నాధిపతులు పరస్పర దృగ్యోగాది సంబంధములను కలిగి యుండి , పంచమములో శుక్రుడు ఉన్న ప్రధమమున పుత్ర సంతానము కలుగును.
23) పంచమములో గల కేతువునకు గురు,శుక్రుల సంబంధము ఏర్పడిన స్త్రీ , పురుష సంతానము సమముగా నుండును.
24) పంచమాధిపతి ఉచ్చ యందు యుండి , లగ్నాధిపతితో గలసిన ఒక పుత్రుడు , ఒక పుత్రిక జనించగలరు.
25) పంచమములో - గురువు, 9వ స్థానములో రవి యుండి , శనికి ఐదవ రాశిలో రాహువు యున్న ఏక పుత్ర .సంతానము కలుగును.
26) పంచమ స్థానము శుభగ్రహ సంబంధమును కలిగి 9వ నవంశ స్థానములో శుక్రుడు , తృతీయములో రవి .యున్నచో వివాహమైన వెంటనే పుత్రుడు జన్మించగలడు.
27) జన్మ లగ్నాధిపతి బలమును కలిగియుండి , 9 వ స్థానములో గురువు , పంచమ స్థానములో శుక్రుడు .ఉన్నయొడల 24వ సంవత్సరము నందు పుత్ర సంతతి కలుగును.
28) పంచమ స్థానములో పాప గ్రహములుండి , గురువుకు పంచమములో శని యున్న యొడల మూడవ భార్య ద్వారా సంతతి కలుగును.
29) పంచమాధిపతి గానీ ,లగ్నాధిపతి గానీ 2-3 స్థానముల యందు ఉన్న మొదట పురుష సంతతి జన్మించును.
30) పంచమాధిపతి యున్న రాశికి 5-7-11 రాశులలో లగ్నాధిపతి యున్న మొదట పురుష సంతతి ప్రాప్తించును.
31) పంచమ , సప్తమ స్థానముల యందు బలము కలిగిన రవి,శని తో గలసి యున్న మొదట పుత్రుడు , తరువాత పుత్రిక కలుగ గలదు.
32) తృతీయములో పురుష గ్రహముండి , పూర్ణ చంద్ర దృష్టి నందిన ప్రధమముగా స్త్రీ సంతతి ప్రాప్తింప గలదు.
33) పంచమాధిపతి 4వ స్థానము నందు ఉన్న మొదట పుత్రిక , తదుపరి పుత్రుడు జన్మింప గలరు.
34) ఏదేని లగ్నము నందు గురువు కర్కాటక రాశి యందున్న ఒకే ఒక్క స్త్రీ సంతాన ముండును. అట్లే ధనస్సు .నందున్న పాప సంతతి , మీనము నందున్న స్వల్ప సంతతి కలుగును.
35) జన్మ లగ్నము ధనస్సు , మీనములుగా నుండి , గురువు కర్కాటకము నందు ఉన్న పుత్ర సంతతి ఉండదు. ఐతే ఆశ్లేష 2వ పాదము నందు గురు సంచార మున్న ఏక పుత్రుడు కలుగును.
36) చంద్రుడు పంచమములో గానీ , కర్కాటకములో గానీ యున్న స్వల్ప స్త్రీ సంతతి మాత్రము యుండును.
37) ధనుస్సు , మకర , మీన లగ్నములు గల వారికి పంచమములో రాహువు గానీ , కేతువు గానీ, యున్న .త్వరగా సంతతి కలుగును.
38) పంచమములో పాప గ్రహములు, దశమములో శుభ గ్రహములు ఉండి , లగ్న-పంచమ-నవమాధిపతులు .శుభగ్రహ సంబంధీకులై 6-8-12 స్థానముల యందు ఉన్న ఆలస్యముగా సంతానము కలుగును.
39) పంచమములో చంద్ర ,శుక్రులు ఉండి 11వ స్థానములో పాప గ్రహములున్న మొదట స్త్రీ సంతానము జన్మించును.
40) పంచమ స్థానము బలహీనమై ఉండి , 11 వ స్థానములో రాహువు యున్న వార్ధక్యములో సంతాన ప్రాప్తి .యుండును.
41) జాతకము నందు సంతాన యోగములుండి , పంచమములోన శని మాత్రమే యున్న బహుకాలమునకు .సంతానము జన్మించును.
.....సశేషం.....

Wednesday 15 January 2020

పంచమ భావము - గ్రహ ఫలితములు :

9) కుజుడు - పంచమ భావములో నున్న తీవ్ర వాంచలధికముగా నుండును. నిదాన ముండదు. దుస్సహస ముండగలదు. ప్రేమ , ద్వేషము కూడా అధికముగా నుండగలవు. ప్రతీకార వాంఛ , పగ ,ద్వేషము ,దీర్ఘ కోపము , చొరవ , సాహసము , అహింసా భావము , కఠిన ప్రవర్తన , గాఢ వస్తువులమీద ఇచ్చలుండును. తమోగుణ ప్రధానమగు ఫలితములు ప్రాప్తింపుచుండును.
10) పంచమ స్థానము నందు - కుజునితో ఏ గ్రహము కలసిన ఆ గ్రహ కారక ఫలితములు తీవ్రతరముగా ఉంటాయి.
11) పంచమ భావములో బుధుడు ఉన్న సంతాన సుఖము , పుత్ర భాగ్యము , చక్కని ముఖము , స్త్రీ సంతాన ఆధిక్యత , భోగములు , ఐహిక వాంఛలు , లోతైన హృదయము , అన్ని విషయముల యందు మంచి చెడ్డలను గ్రహింపగల శక్తి , వ్యవహార జ్ణానములు , ఉపాయములు , యుక్తి విజ్ణానము , విమర్శనా శక్తి , క్రయ విక్రయ నైపుణ్యము , పుస్తక ప్రచురణ , ప్రావీణ్యములుండగలవు.
12) పంచమ స్థానములో గల బుదునికి - రవి మరియు ఇతర శుభ గ్రహముల కలయిక వలన శుభ ఫలాభివృద్ధి . యుండును. శని మొదలుగా గల వ్యతిరేక పాప గ్రహముల కలయిక వలన అశుభ ఫలితములు అధికముగా నుండ గలవు.
13) గురువు పంచమ నందు యుండుట వలన శారీరక కాంతి , ఆరోగ్య భాగ్యము , పుత్రసంతాన ఆధిక్యత , సత్కళత్రము , మంచి స్నేహితులు , సుకీర్తి , ఆనందము , నిర్మల హృదయము , దైవ భక్తి , ఆధ్యాత్మిక జ్ణాన విషయాను రక్తి , ధర్మ వృద్ధి , మంత్ర శాస్త్ర ప్రావీణ్యము , ధన వాహన సుఖములు ప్రాప్తింప గలవు.
14) శుక్రుడు పంచమము నందున్న శాంతము , సద్గుణములు , స్వల్ప పుత్ర సంతానము , స్త్రీ సంతానాధిఖ్యత , ఐహిక సుఖ , భోగములు , దాతృత్వము , బంధు మిత్ర పూజ్యత , ధన సమృద్ధి , అధికారము , స్త్రీ లోలత , భాగ్య వర్ధనములుండగలవు .
15) పంచమములో శని యున్న నిదానము , ప్రేమ వ్యవహారముల యందు విఫలము , మానసికమైన బాధలు , నిరాశ , విరక్తి , కార్యాటంకములు , నిరాడంబరత , ఐహికమైన సుఖహీనత , బాల్యములో బంధు నష్టములు , అనారోగ్య కళత్రము , సంతాన హీనత లేదా సంతాన నష్టము ద్వారా విచారము (రోగ గ్రస్త సంతాన ప్రాప్తి) సామాన్య జీవనము కలుగును.
16) పంచమ భావము శనికి నీచ స్థానమైననూ , శత్రు స్థానమైననూ సంతతిని నశింపచేయును. ఉచ్చ స్థాన ,మిత్ర స్థాన , ఉచ్చాంశలైన స్వల్ప సంతతి కలుగును.
17 రాహువు పంచమములో యున్న మలిన సంతానము , దీనత్వము , అవ్యక్త మనోవేదన , అస్థిర బుధ్హి కలుగును. ఈ రాహువునకు పంచమములో పాపగ్రహ సంబంధములున్న వయసు పై బడిన కొద్దీ మానసిక బాధలు , అశాంతి , దేహజాడ్యములు , ఆశాభంగములు , మనోచాంచల్యము , ఆటంకములు , కష్టనష్టములు కలుగ గలవు.
18) పంచమములో కేతువు యున్న పుత్ర విచారము , మంత్ర శాస్త్ర , రసవాద విద్యా ప్రవేశము , గణిత శాస్త్ర . పరిజ్ణానము , వ్రాత యందు నేర్పు , కలహములు , పితృ ద్వేషము , తత్వ విచారములు , ఐహికాముష్మిక సుఖములు ప్రాప్తించును.
19) పంచమ భావము నందు - గురు,శుక్రులు కలసి యున్నచో అధిక పురుష సంతానము , శని,శుక్రులు .లసియున్న అధిక స్త్రీ సంతానము యుండ గలదు.
.....సశేషం.....

Tuesday 14 January 2020

పంచమ భావము - ఫలితములు :

1) జన్మ లగ్నము నుండి ఐదవ రాశియే పంచమ భావము. దీనిని "పుత్ర భావము , మంత్ర స్థానము , లక్ష్మీ స్థానము , మనః స్థానము " అనియు అందురు.
2) ఈ పంచమ భావము ద్వారా జాతకుని యొక్క "బుద్ధి , వివేకము , పుత్ర సంతతి , జ్ణాపక శక్తి , సంతోషము , మాట నేర్పు , కళల అభినివేశము , లలిత కళలు , గ్రంధ రచనా శక్తి , వ్యూహ నిర్మాణము , మంత్రి పదవి , మంత్ర ఉపాసనలు , దేవతా ప్రసన్నము , ఆటలు , వ్యాపారము , వ్రాత యందు నేర్పు , భవిష్యత్ జన్మకు సంబంధించిన విషయములు , మెదడు , పొట్ట , గర్భ స్రావము , దాన విషయములు , పితృ భాగ్యము " అను విషయములను తెలిసికోవలెను.
3) పంచమ భావమునకు గురువు కారక గ్రహము, ఇందు మనః బుద్ధికి సంబంధించిన విషయములకు చంద్రుని , సంతోష అధికారాది విషయములకు శుక్రుని కారక గ్రహముగా గ్రహింపవలెను.
4) పంచమ భావము నందు శుభ గ్రహములు ఉండి వీటికి గురు దృష్టి కలిగి , పంచమాధిపతి శుభ స్థానముల యందు శుభ గ్రహ సంబంధాధికుడై యుండుట వలన భావ ఫలితములు వృద్ధి కరముగా నుండగలవు.
5) పంచమ భావాధిపతికి పాప సంబంధము , పాప స్థితి , భావమున పాప గ్రహములుండుట , గురువు పాప సంబంధాధిక్యత నందుట వలన భావ ఫలితము లన్నియు చెడిపోగలవు.
6) పంచమ భావము నందు రవి యున్న కుశాగ్ర బుద్ధి ,, మంత్రి , విద్యా పరిజ్ణానములు , మోసములు , అధిక కోపము , స్వల్ప భోగము , ఏక పుత్ర సంతానము , అట్టి సంతానము వలన బాధలు , బాల్య దశ యందు దుఃఖము , యౌవన దశ యందు కష్టములు , భుజ రోగములచే మృతియు కలుగును.
7) చంద్రుడు పూర్ణ కళలను కలిగి , పంచమము నందు ఉన్న విశేష ధన సుఖ భోగములు , స్త్రీ సంతానాధిక్యత ,పుత్ర ప్రాప్తి , మాతృ నష్టము , కలుగ గలదు . క్షీణ చంద్రుడు ఉన్న కుటుంబ సౌఖ్యము , స్వల్ప భోగము , స్త్రీ సంతతి , చంచల స్వభావములుండును.
8) పంచమ భావమునందు కుజుడు యున్న పుత్ర హీనత , ధన లోపము , దుఃఖము , కఠిన హృదయము , నేర్పు కలిగిన వ్యాపారము ప్రాప్తించును.
.....సశేషం.....

Saturday 11 January 2020

జ్యోతిష శాస్త్రంలో ఇరవై ఏడు నక్షత్రాలను మూడు గణాలుగా విభజిస్తారు :

అవి:- దేవగణ, మానవ గణ, రాక్షస గణ నక్షత్రాలు.

అశ్వని, మృగశిర, పునర్వసు, పుష్యమి, హస్త, స్వాతి,అనూరాధ, శ్రవణం, రేవతి అను తొమ్మిది నక్షత్రాలు దేవగణ నక్షత్రాలు.

రణి, రోహిణి, ఆరుద్ర, పుబ్బ (పూర్వ ఫల్గుణి), ఉత్తర(ఉత్తర ఫల్గుణి), పూర్వాషాఢ, ఉత్తరాషాఢ, పూర్వభాద్ర, కృత్తిక, ఉత్తరాభాద్ర అను తొమ్మిది నక్షత్రాలు మానవ గణ నక్షత్రాలు.

శ్లేష, మఖ, చిత్త, విశాఖ, జ్యేష్ట, మూల, ధనిష్ట, శతభిషం(శతతార) అనే తొమ్మిది నక్షత్రాలు రాక్షస గణ నక్షత్రాలు.

రాశినక్షత్రపాదాలు :


మేష రాశి :- అశ్విని 1,2,3,4 పాదాలు భరణి 1,2,3,4 పాదాలు కృత్తిక 1 పాదం
వృషభ రాశి;- కృత్తిక 2,3,4 పాదాలు రోహిణి 1,2,3,4 పాదాలు మృగశిర 1,2 పాదాలు
మిథున రాశి;- మృగశిర 3,4 పాదాలు ఆరుద్ర 1,2,3,4 పాదాలు పునర్వసు 1,2,3
కర్కాటక రాశి;- పునర్వసు 4వ పాదం పుష్యమి 1,2,3,4 పాదాలు ఆశ్లేష 1,2,3,4 పాదాలు
సింహ రాశి;- మఖ 1,2,3,4 పాదాలు పూర్వఫల్గుణి 1,2,3,4 పాదాలు ఉత్తర ఫల్గుణి 1 పాదం
కన్యా రాశి;- ఉత్తర ఫల్గుణి 2,3,4 పాదాలు హస్త 1,2,3,4 పాదాలు చిత్త 1,2 పాదాలు
తులా రాశి;- చిత్త 3,4 పాదాలు స్వాతి 1,2,3,4 పాదాలు విశాఖ 1,2,3 పాదాలు
వృశ్చిక రాశి;- విశాఖ 4వ పాదం అనూరాధ 1,2,3,4 పాదాలు జ్యేష్ట 1,2,3,4 పాదాలు
ధనుస్సు రాశి:- మూల 1,2,3,4 పాదాలు పూర్వాషాఢ 1,2,3,4 పాదాలు ఉత్తరాషాఢ 1 పాదం
మకర రాశి;- ఉత్తరాషాఢ 2,3,4 పాదాలు శ్రవణం 1,2,3,4 పాదాలు ధనిష్ట 1,2 పాదాలు
కుంభ రాశి;-ధనిష్ట 3,4 పాదాలు శతభిష 1,2,3,4 పాదాలు పూర్వాభద్ర 1,2,3,పాదాలు
మీన రాశి;-పూర్వాభద్ర 4వ పాదం ఉత్తరాభాద్ర 1,2,3,4 పాదాలు రేవతి 1,2,3,4 పాదాలు.

Thursday 9 January 2020

108 నవాంశలు వాటి ఫలితాలు :

27 నక్షత్రాలలోను ప్రతి నక్షత్రానికి నాలుగు పాదాలు ఉంటాయి. మొత్తం నూట ఎనిమిది పాదాలే గాక వాటికి విడివిడిగా రాశ్యంశలు కూడా ఉంటాయి.
అశ్వని, రోహిణి, పునర్వసు, మఖ, హస్త, విశాఖ, మూల, శ్రవణం, పూర్వాభాద్ర అనబడే తొమ్మిది నక్షత్రాల ప్రధమ పాదాలు మేషాంశకు, ద్వితీయ పాదాలు వృషభాంశకు, తృతీయ పాదాలు మిధునాంశకు, చతుర్ధ పాదాలు కర్కటాంశకు చెంది ఉంటాయి.

భరణి, మృగశిర, పుష్యమి, పుబ్బ, చిత్ర, అనూరాధ, పూర్వాషాడ, ధనిష్ఠ, ఉత్తరాభాద్ర అనబడే తొమ్మిది నక్షత్రాల ప్రధమ పాదాలు సింహాంశకు, ద్వితీయ పాదాలు కన్యాంశకు, తృతీయ పాదాలు తులాంశకు, చతుర్ధ పాదాలు వృశ్చికాంశకు చెంది ఉంటాయి.

కృత్తిక, ఆరుద్ర, ఆశ్లేష, ఉత్తర, స్వాతి, జ్యేష్ఠ, ఉత్తరాషాడ, శతభిషం, రేవతి అనబడే తొమ్మిది నక్షత్రాల ప్రధమ పాదాలు ధనురాంశకు, ద్వితీయ పాదాలు మకరాంశకు, తృతీయ పాదాలు కుంభాంశకు, చతుర్ధ పాదాలు మీనాంశకు చెంది ఉంటాయి.

1)అశ్వని నక్షత్ర నాలుగు పాదాలకు అంశ గుణాలు

1) తస్కరాంశ:- అశ్వని నక్షత్ర ప్రధమ పాదం కుజుడిది. మంచి సంపద, భోగాలను అనుభవించువాడు, తగాదాలనిన ఇష్టం కలవాడు, లోభ గుణం కలవాడు, పరస్త్రీల యందు ఆసక్తి కలవాడు, చోర గుణం కలవాడు అగును.
2) భోగ్యాంశ:- అశ్వని నక్షత్ర ద్వితీయ పాదం శుక్రుడిది. ధర్మ నిరతుడు, తేజస్సు కలవాడు, ధన, ధాన్యాభివృద్ధి కలవాడు, దాన గుణం కలవాడు అగును.
3) విచక్షణాంశ:- అశ్వని నక్షత్ర తృతీయ పాదం బుధుడిది. సమస్త భోగాలు కలవారు, ప్రతి పనిని సాధించువాడు, పనులను నేర్పుతో చేయువాడు అగును.
4) ధర్మాంశ:-అశ్వని నక్షత్ర చతుర్ధ పాదం చంద్రుడిది. భగవంతుడి పైన భక్తి కలవాడు, పూజలు చేయువాడు, సంధ్యావందన తత్పురుడును, నిత్యం ధర్మ కార్యాచరణలో ఉండువారు అగును.

2) భరణి నక్షత్ర నాలుగు పాదాలకు అంశ గుణాలు

5)నృపాంశ:- భరణి నక్షత్ర ప్రధమ పాదం రవిది. గౌరవ, మర్యాదలు పొందువారు, మంచి లక్షణాలు కలిగి ఉంటారు. కార్య సఫలత కలవారు, ధర్మాత్ముడు అగును.
6) నపుంసకాంశ:- భరణి నక్షత్ర ద్వితీయ పాదం బుధుడిది. లోభత్వం కలవారు, నపుంసకుడు, పిసినారి, పనులయందు నేర్పరి, మధ్యవర్తిత్వం చేయువారు అగును.
7) అభయాంశ:-భరణి నక్షత్ర తృతీయ పాదం శుక్రుడిది. ప్రశాంతమైన మనస్సు కలవారు, ఉత్సాహవంతులు, శూరులు, బాద్యతారాహిత్యమైన జీవితాన్ని ఆశించేవారు అగును.
8) పాపాంశ:- భరణి నక్షత్ర చతుర్ధ పాదం కుజుడిది. క్రూర స్వభావం కలవారు, కృతజ్ఞత కలవారు, అధిక పుత్ర సంతానవంతులు, ఫలితాలను ఆశించని వారు అగును.

3) కృత్తిక నక్షత్ర నాలుగు పాదాలకు అంశ గుణాలు

9) ధానాంశ:- కృత్తిక నక్షత్ర ప్రధమ పాదం గురువుది. దాన, ధర్మాలు చేయువారు, ధనవంతులు, ప్రతాపవంతులు, పనులలో నైపుణ్యం కలవారు అగును.
10) పాపాంశ:- కృత్తిక నక్షత్ర ద్వితీయ పాదం శనిది. మొహమాటం లేకుండా ఉంటారు, పాప కర్మలు చేయువారు, వేశ్యా గృహాలలో జీవించే వాళ్ళుగా ఉంటారు.
11) ఉగ్రాంశ:- కృత్తిక నక్షత్ర తృతీయ పాదం శనిది. చెడు సావాసాలు చేయువారు, నైపుణ్యం ఉన్నప్పటికి మంద బుద్ధులుగా ఉంటారు, దుష్ఠులైన మిత్రులు కలవారు అగును.
12) ఉత్కృష్టాంశ:- కృత్తిక నక్షత్ర చతుర్ధ పాదం గురువుది. విద్యా వినయాలు కలవారు, ధర్మాత్ములు, ధార్మికులు, ఎల్లప్పుడు సంతోషం కలవారు అగును.

4) రోహిణి నక్షత్ర నాలుగు పాదాలకు అంశ గుణాలు

13) సేనాంశ:- రోహిణి నక్షత్ర ప్రధమ పాదం కుజుడిది. చంచలత్వం కలవాడు, ఎర్రని వెంట్రుకలు కలవాడు, శూరుడు, దెబ్బలాటలకు ప్రీతి కలవాడు, నిష్టూరంగా మాట్లాడు వాడు అగును.
14) భృత్యాంశ:-రోహిణి నక్షత్ర ద్వితీయ పాదం శుక్రుడిది. పొడవైన శరీరం కలవాడు, ఓటమిని అంగీకరించలేని తనం కలవారు, మంచి నడవడిక కలవారు అగును.
15) విద్యాంశ:- రోహిణి నక్షత్ర తృతీయ పాదం బుధుడిది. పండితులు గాను, కవులు గాను, గణిత శాస్త్రజ్ఞులు గాను, లోక వ్యవహార జ్ఞానం కలవారు గాను ఉంటారు.
16) అత్యాశ:- రోహిణి నక్షత్ర చతుర్ధ పాదం చంద్రుడిది. ఇతరుల ధనంపైన ఆశపడేవారు, తెలివైన వారుగాను, బుద్ధిమంతులుగాను, సజ్జనులుగాను ఉందురు.

5) మృగశిర నక్షత్ర నాలుగు పాదాలకు అంశ గుణాలు

17) రాజాంశ :- మృగశిర నక్షత్ర ప్రధమ పాదం రవిది. స్దూలమైన శరీరం కలవారు, శత్రువులపైనా విజయం సాదించువారు, ధనవంతులు, తలకు మించిన పనులను నెత్తిన వేసుకొనేవారు గాను ఉంటారు.
18)చండాంశ:- మృగశిర నక్షత్రం ద్వితీయ పాదం బుధుడిది. యజ్ఞ యాగాదులు చేయువారు, భాగ్యవంతులు గాను, మంచి వాక్ శుద్ధి కలవారు గాను ఉంటారు.
19) అభయాంశ:- మృగశిర నక్షత్రం తృతీయ పాదం శుక్రుడిది. ఉదార స్వభావం కలవారు గాను, దేనికైనా సిద్ధపడేవారు గాను, ముఖ వర్చస్సు కలవారుగాను, మంచి పనులు చేయువారు, శౌర్యవంతులు గాను ఉందురు.
20) నీచాంశ:-మృగశిర నక్షత్రం చతుర్ధ పాదం కుజుడిది. కామత్వం కలవారు, తలపైన దెబ్బ తగిలినవారు గాను, ఇతరులను ద్వేషించువారు గాను ఉందురు.

6) ఆరుద్ర నక్షత్ర నాలుగు పాదాలకు అంశ గుణాలు

21) కృపాంశ:- ఆరుద్ర నక్షత్ర ప్రధమ పాదం గురువుది. గుణవంతుడు, పెద్దల యందు భక్తి, ప్రశాంతమైన ముఖం కలవారు గాను, దయా స్వభావం కలవారుగాను, మంచి నేర్పరులుగాను ఉందురు.
22) తస్కరాంశ:- ఆరుద్ర నక్షత్ర ద్వితీయ పాదం శనిది. కలహా ప్రియులు, చోర విధ్య బాగా తెలిసినవారు, అతి దాహార్తి కలవారు, హీనమైన కాంత స్వరం కలవారు గాను ఉంటారు.
23) ఉగ్రాంశ:- ఆరుద్ర నక్షత్ర తృతీయ పాదం శనిది. శుచి శుభ్రత లేనివారు, చెడు ఆలోచనలు చేసేవారు, స్ధిరమైన ఆదాయం లేనివారు, మంత్ర తంత్రాలతో భయపెట్టేవారు అగును.
24) ఉత్కృష్టాంశ:- ఆరుద్ర నక్షత్ర చతుర్ధ పాదం గురువుది. ధర్మాన్ని పాటించేవారు, అక్కటి ఆచార వ్యవహారాలు చేయువారు, గౌరవ మర్యాదలు తెలిసిన వారై ఉంటారు.

7) పునర్వసు నక్షత్ర నాలుగు పాదాలకు అంశ గుణాలు

25) ఉత్తమాంశ:- పునర్వసు నక్షత్ర ప్రధమ పాదం కుజుడిది. భగవంతునిపైన భక్తి కలవారు, ఎర్రటి కనులు కలవారు, కోప స్వభావం, చెడు ప్రవర్తన కలవారుగాను ఉంటారు.
26) భోక్తాంశ:- పునర్వసు నక్షత్ర ద్వితీయ పాదం శుక్రుడిది. వస్త్ర అలంకార ప్రియులు, భోజన ప్రియులు, ధనవంతులు, శృంగార ప్రియులు అవుతారు.
27) సౌమ్యాంశ:- పునర్వసు నక్షత్ర తృతీయ పాదం బుధుడిది. పండితుడు, లోభ స్వభావం కలవారు, తరచూ వ్యాధి పీడితులుగాను, వ్యాపార దక్షత కలవారు, శృంగార ప్రియులు అవుతారు.
28) ధనాంశ :- పునర్వసు నక్షత్ర చతుర్ధ పాదం చంద్రుడిది. ఆదిక ధనవంతులు, ఉపకారం చేయువారు, స్త్రీల మాటలను పాటించువారు, నిర్మలత్వం కలవారు, ఆకర్షణ కలవారు అవుతారు.

8) పుష్యమి నక్షత్ర నాలుగు పాదాలకు అంశ గుణాలు

29) భూపాంశ:- పుష్యమి నక్షత్రం మొదటి పాదం రవిది. వీరికి ఏకాంతమన్న ప్రీతి, ప్రతి పని తొందరగా చేస్తారు. రోగం కలవారుగాను, స్ధూల కాయం కలగి ఉంటారు.
30) సౌమ్యాంశ:- పుష్యమి నక్షత్రం రెండవ పాదం బుధుడిది. పరస్త్రీలపైనా వ్యామోహం కలిగి ఉంటారు. వారి మూలంగా కష్టాలను తెచ్చుకుంటారు. ధనకాంక్ష కలిగి ఉంటారు.
31) శూరాంశ :- పుష్యమి నక్షత్రం మూడవ పాదం శుక్రుడిది. చాలా ప్రసన్నంగా ఉంటారు. భోగవంతులు, పరోపకారి, నిత్యం మనశ్శాంతి కలిగి ఉంటారు.
32) నీచాంశ:- పుష్యమి నక్షత్రం నాల్గవ పాదం కుజుడిది. వీరు సహజంగా కలహ ప్రియులు, ఇతరుల వస్తువులను దొంగలించువారు. పరస్త్రీల యందు ఆసక్తి కలవారుగాను ఉంటారు.

9) ఆశ్లేష నక్షత్ర నాలుగు పాదాలకు అంశ గుణాలు

33) ఉత్పన్నాంశ:- ఆశ్లేష నక్షత్ర ప్రధమ పాదం గురువుది. వీరు ధైర్యవంతులు. సత్యవాక్కులు పలుకువారు. మంచిబుద్ధి కలవారుగాను ఉంటారు.
34) పాపాంశ:- ఆశ్లేష నక్షత్ర ద్వితీయ పాదం శనిది. వీరు నిత్యం ఏదో ఒక వ్యాధితో బాధపడుతూనే ఉంటారు. పాప కార్యాలు చేయుటలో ఆసక్తి కలిగి ఉంటారు. చంచల స్వభావం కలిగి ఉంటారు. చెడ్డ పనుల ద్వారా ఆదాయం సంపాదిస్తారు. సుకి శుభ్రత లేనివారు అవుతారు.
35) క్రోధాంశ:- ఆశ్లేష నక్షత్ర తృతీయ పాదం శనిది. వీరు అబద్ధాలు ఆడటం, కుట్రలు చేయటం, అన్యాయంగా డబ్బు సంపాదించటం, బుద్ధి మాంద్యం, వాటా రోగం కలిగి ఉంటారు.
36) ఉగ్రాంశ:- ఆశ్లేష నక్షత్ర నాల్గవ పాదం గురువుది. వీరు మాట పితరులకు మారకులు అవుతారు. దాన నాశకులు, పరుల పెంపకంలో ఉండేవారు, ఒక మోస్తరుగా సుఖపడేవాళ్ళుగా ఉంటారు.

10) మఖ నక్షత్ర నాలుగు పాదాలకు అంశ గుణాలు

37) సేవాంశ:- మఖ నక్షత్ర ప్రధమ పాదం కుజుడిది. వీరి శరీరంపై ఎర్రని రోమాలు కలిగి ఉంటారు. పట్టుదల కలిగి ఉంటారు. ప్రతిష్ఠ కలవారుగా ఉంటారు.
38) భుక్తాంశ:- మఖ నక్షత్ర ద్వితీయ పాదం శుక్రుడిది వీరు ఏకాంతాన్ని కోరుకుంటారు. త్యాగం చేయువారు, దేనినైనా న్యాయంగా పొందాలి. సంపాదించాలి అని కోరుకునేవారు.
39) విచక్షణాంశ:- మఖ నక్షత్ర తృతీయ పాదం బుధుడిది. వీరు జ్ఞాన వంతులు, మేధావులు, శాస్త్రవేత్తలు, నేర్పరులుగా ఉంటారు.
40) అంత్యాంశ :- మఖ నక్షత్ర చతుర్ధ పాదం చంద్రుడిది. వీరు స్త్రీ ప్రియులు, రోగం కలవారు, తెలివైనవాళ్ళు, కుటిలమైన స్వభావం కలిగి ఉంటారు. పొట్టిగా ఉంటారు.

11) పుబ్బ నక్షత్ర నాలుగు పాదాలకు అంశ గుణాలు

41) రాజాంశ:- పుబ్బ నక్షత్ర ప్రధమ పాదం రవిది. వీరు చంచలమైన నేత్రాలు కలిగి ఉంటారు. చూడటానికి బలహీనంగా ఉంటారు. కొనుగోలు, అమ్మకాలు వ్యవహారాలు కలిగిన వ్యాపారాలలో నిపుణత్వం కలిగి ఉంటారు.
42) నపుంసకాంశ :- పుబ్బ నక్షత్ర ద్వితీయ పాదం బుధుడిది. కీర్తి ప్రతిష్ఠలు కలిగి ఉంటారు. వికృత రూపం కలిగి ఉంటారు. ఇతరులకు కష్ఠం కలిగిస్తూ ఉంటారు.
43) అభయాంశ :- పుబ్బ నక్షత్రం తృతీయ పాదం శుక్రుడిది. వీరికి పుత్ర సంతానం అధికంగా కలిగి ఉంటారు. శిల్పశాస్త్రంలో నిపుణులు అవుతారు. గణిత శాస్త్రంలోను నిపుణత్వం కలిగి ఉంటారు.
44) దరిద్రాంశ :- పుబ్బ నక్షత్రం చతుర్ధ పాదం కుజుడిది. జీవితంలో సుఖం ఉండదు. నిత్యం కష్ఠలను అనుభవిస్తారు. అధిక సంతానం కలిగి ఉంటారు. దరిద్రాన్ని అనుబావిస్తూంటారు.

12) ఉత్తర నక్షత్ర నాలుగు పాదాలకు అంశ గుణాలు

45) ఉత్పన్నాంశ:- ఉత్తర నక్షత్రం ప్రధమ పాదం గురువుది. వీరు వాత రోగం కలిగి ఉంటారు. పరిశుద్ధులు, ప్రబంధ ప్రియులు, కావ్యాస్వాదనా చతురులు కలవారు అవుతారు.
46) పాపాంశ :- ఉత్తర నక్షత్రం ద్వితీయ పాదం శనిది. వీరు పరులను పీడించేవారుగాను, చంచలత్వం కలవారుగాను, నిత్య దరిద్రులుగా ఉందురు.
47) ఉగ్రాంశ:- ఉత్తర నక్షత్రం తృతీయ పాదం శనిది. వీరు మేలు చేసిన వారిని మరిచిపోతారు. చెడు వాదనలు చేసేవాళ్ళు, డాంబికాలు పోతారు, గర్విష్టులు, అందరిని సూటిపోటీ మాటలతో వేదిస్తారు.
48) శుభాంశ :- ఉత్తర నక్షత్రం చతుర్ధ పాదం గురువుది. వీరు వినయ విధేయతలు కలవారు, విద్యా సంపన్నులు అవుతారు. పుత్ర సంతానం కలవారు అవుతారు.

13) హస్త నక్షత్ర నాలుగు పాదాలకు అంశ గుణాలు.

49) క్రూరాంశ:- హస్తా నక్షత్ర ప్రధమ పాదం కుజుడిది. వీరు పాప కర్మలు చేసేవాళ్ళు, బలవంతులు, చింతన కలవారు అవుతారు.
50) ముక్తాంశ:- హస్తా నక్షత్ర ద్వితీయ పాదం శుక్రుడిది. వీరు నిత్యం మంచి మాటలనే మాట్లాడేవారు, మంధ బుద్ధి కలవారుగాను ఉంటారు.
51) పండితాంశ:- హస్తా నక్షత్ర తృతీయ పాదం బుధుడిది. వీరు చెడ్డ బుద్ధి కలవారు, కాముకులు, వ్యాపారంలో భాగం అయిన అమ్మకాలు, కొనుగోళ్ళు విషయాలలో మహా నిపుణులుగా ఉంటారు.
52) ధనాంశ:- హస్తా నక్షత్రం చతుర్ధ పాదం చంద్రుడిది. వీరు రాచకార్యాలు చేయుటలో ఇష్టం కలవారు, సన్మానాలు పొందేవారు, అభిమానవంతులు, కొద్దిగా కోపం కలవారుగాను ఉంటారు.

14) చిత్రా నక్షత్ర నాలుగు పాదాలకు అంశ గుణాలు

53) రాజాంశ:- చిత్రా నక్షత్ర ప్రధమ పాదం రవిది. వీరు చంచల మనస్తత్వం కలవారుగా ఉంటారు. ఉగ్ర స్వభావం కలవారుగా ఉంటారు.
54) నపుంసకాంశ:- చిత్రా నక్షత్ర ద్వితీయ పాదం బుధుడిది. వీరు చాలా తియ్యగా మాట్లాడి జనాలను నమ్మిస్తారు. కోపం వస్తే చాలా కాలం ఉంటుంది. ఈ పనిని ఐనా సరే అధికకాలం అయ్యేటట్లు చేస్తారు.
55) అభయాంశ:- చిత్రా నక్షత్ర తృతీయ పాదం శుక్రుడిది. వీరు కీర్తిమంతులు, శౌర్యవంతులు, పండితులతో సహవాసం చేయటం, వారితోనే గడపటం వీరి లక్షణాలు.
56) ధనాంశ:- చిత్రా నక్షత్ర చతుర్ధ పాదం కుజుడిది. వీరు చిన్నతనంలోనే దొంగతనాలకు పాల్పడతారు. సరిపడా సంపాదించాక నేరాలు మానేస్తారు. అమిత ధైర్యవంతులు, విక్రమం కలవారుగాను ఉంటారు.

15) స్వాతి నక్షత్ర నాలుగు పాదాలకు అంశ గుణాలు

57) ఉత్పన్నాంశ :- స్వాతి నక్షత్ర ప్రధమ పాదం గురుడుది. వీరు ఎప్పుడు అతిగా మాట్లాడుతూనే ఉంటారు. సూక్ష్మ పరిశీలన కలవారు. జ్ఞానం కలవారుగాను ఉంటారు.
58) ధనాంశ :- స్వాతి నక్షత్ర ద్వితీయ పాదం శనిది. వీరు చెడ్డపేరు తెచ్చుకుంటారు. దొంగలుగా, వ్యసనపరులుగా పరిణమిస్తారు. సాయం చేసినవారిని మాత్రం మరువరు.
59) ఉగ్రాంస:- స్వాతి నక్షత్ర తృతీయ పాదం శనిది. వీరు మూర్ఖులు, అత్యంత కోపం కలవారు. శత్రువుల పట్ల ద్వేషం పెంచుకునే వారు. అతిగా ఖర్చు పెట్టేవాళ్ళుగా ఉంటారు.
60) ఉత్కృష్టాంశ :- స్వాతి నక్షత్ర చతుర్ధ పాదం గురువుది. వీరు కోపం కలిగి ఉన్న జనాభిమానం కలవారు. గురుభక్తి కలవారు. ధనికులు అయి ఉంటారు.

16) విశాఖ నక్షత్ర నాలుగు పాదాలకు అంశ గుణాలు

61) సౌఖ్యాంశ:- విశాఖ నక్షత్ర ప్రధమ పాదం కుజుడిది. పలుచటి ఛాతీ కలిగిన శరీరం. ఎర్రటి కన్నులు కలిగి ఉంటారు. మిక్కిలి ధనవంతులై ఉంటారు.
62) భోగాంశ:- విశాఖ నక్షత్ర ద్వితీయ పాదం శుక్రుడిది. రూప వంతులు, సౌందర్యవంతులు, అందమైన భార్య కాళీ ఉంటారు. సౌఖ్యవంతులు. చెవిటి వాళ్ళుగా గాని, వినికిడి లోపం ఉన్నవారుగా గాని ఉంటారు. దేనినైనా న్యాయ పరంగా సంపాదింకునేవాళ్ళు అవుతారు.
63) సౌమ్యాంశ:- విశాఖ నక్షత్రం తృతీయ పాదం బుధుడిది. ఈ జాతకులు మంచి చెడు పట్ల విచక్షణ కలిగి ఉంటారు. నేర్పరితనం కలిగి ఉంటారు. దాన గుణవంతులుగా ఉంటారు. కంటి చూపును కోల్పోవటం లేదా లోపం గాని ఏర్పడవచ్చును.
64) అర్ధాంశ:- విశాఖ నక్షత్రం చతుర్ధ పాదం చంద్రుడిది. స్త్రీలను ఆకర్షించువాడు. దృష్టి లోపం కలవాడు. ధన సంపాదన పైన ఆసక్తి కలవాడు అగును.

17) అనూరాధ నక్షత్ర నాలుగు పాదాలకు అంశ గుణాలు

65) రాజాంశ :- అనూరాధ నక్షత్ర ప్రధమ పాదం రవిది. ఈ జాతకులు మాట్లాడేటప్పుడు వినయ విధేయతలు కలిగి ఉంటారు. నీతి నియమాలు కలిగి ఉంటారు. మంత్రోపాసన చేసేవారు. మంత్రాంగాలు నెరపేవాళ్ళుగా ఉంటారు.
66) నపుంసకాంశ:- అనూరాధ నక్షత్ర ద్వితీయ పాదం బుధుడిది. ఈ జాతకులు వీణా వాయిద్యాల పట్ల మక్కువ కలిగి ఉంటారు. ఆదర్శమూర్తులు. మేధావులుగా ఉంటారు.
67) అభయాంశ :- అనూరాధ నక్షత్ర తృతీయ పాదం శుక్రుడిది. వీరికి స్ధిరత్వం ఉండదు. అనుకూలవతియైన భార్య లభిస్తుంది.
68) నీచాంశ:- అనూరాధ నక్షత్రం చతుర్ధ పాదం కుజుడిది. ఈ జాతకులు ఇతరులకు ద్రోహం చేసేవాళ్ళు, కుట్రలు కుతంత్రాలు చేసేవాళ్ళు, దరిధ్రులు అవుతారు.

18) జ్యేష్ఠ నక్షత్ర నాలుగు పాదాలకు అంశ గుణాలు

69) ఉత్పన్నాంశ :- జ్యేష్ఠ నక్షత్ర ప్రధమ పాదం గురువుది. రచనా సామర్ధ్యం కలవారు. హాస్యప్రియులు, గర్వం కలవారుగా ఉంటారు.
70) ఉగ్రాంశ:- జ్యేష్ఠ నక్షత్ర ద్వితీయ పాదం శనిది. ఎప్పుడు ఏదో ఒక అనారోగ్యంతో బాధపడేవారుగాను, ఇతరులకు సులభంగా లొంగిపోయేవారుగాను ఉంటారు.
71) పాపాంశ:- జ్యేష్ఠ నక్షత్ర తృతీయ పాదం శనిది. ఈ జాతకులు అంగవైకల్యం కలిగి ఉంటారు. మరీ అతి స్వల్పమైన భోగం కలిగి ఉంటారు. చూపు సరిగా లేకపోవటం, ఇతరుల పనులు చేయువారు అగుదురు.
72) శుభాంశ:- జ్యేష్ఠ నక్షత్ర చతుర్ధ పాదం గురువుది. వినికిడి లోపం కలిగి ఉంటారు.ధర్మ శాస్త్రాలపైనా పట్టు కలవారు. పూజలు చేయువారు. శాస్త్రవేత్తలు అవుతారు.

19) మూల నక్షత్ర నాలుగు పాదాలకు అంశ గుణాలు

73) తస్కరాంశ:- మూల నక్షత్ర ప్రధమ పాదం కుజుడిది. తండ్రి సహాకారం లేనివాడు. వ్యాధిగ్రస్తులుగా ఉంటారు. ధరిద్రులు అవుతారు.
74) భోక్తాంశ:- మూల నక్షత్ర ద్వితీయ పాదం శుక్రుడిది. మాతృసౌఖ్యం లేనివారు, దయామయులు, క్షీరాన్నం, బెల్లం పట్ల మక్కువ కలవారు. వాహన సౌఖ్యం కలవారు. భోగాలను అనుభవించేవారు.
75) విచక్షణాంశ:- మూల నక్షత్ర తృతీయ పాదం బుధుడిది. ఈ జాతకులు ధనవంతులు, ఖర్చు పెట్టే మనస్తత్వం కలవారు. మంచి సంభాషణాపరులు, విద్యావంతులు, జ్యోతిష్య విద్య తెలిసిన వాళ్ళు, ఎదుటి వారు ఏది చెబితే వినగలరో అది చెప్పగలిగే సామర్ధ్యం ఉన్నవారు.
76) ధనాంశ:- మూల నక్షత్ర చతుర్ధ పాదం చంద్రుడిది. ఈ జాతకులు ప్రభుత్వ ఉద్యోగులు, సేనాపతులు, పరోపకారులు, కామత్వం కలవారు, రోగ సూచనలు కలవారు, ఆడవారి కంఠ స్వరం కలవారు. మెత్తగా మాట్లాడేవారు, లౌకికం కలవారు అవుతారు.

20) పూర్వాషాడ నక్షత్ర నాలుగు పాదాలకు అంశ గుణాలు

77) ఉత్పన్నాంశ:- పూర్వాషాడ నక్షత్ర ప్రధమ పాదం రవిది. సౌఖ్యత లేనివారు, ఎర్రటి నేత్రాలు కలవారు, శక్తి సామర్ధ్యాలు కలవారు
78) అభయాంశ:- పూర్వాషాడ నక్షత్ర ద్వితీయ పాదం బుధుడిది. ఈ జాతకులు పెద్ద పొట్ట కలిగి ఉంటారు. ఎప్పుడు మాట్లాడుతూనే ఉంటారు. మృదువుగానే మాట్లాడుతారు. అవతలి వ్యక్తులలోని సద్గుణాలను పసిగడతారు.
79) భాగ్యాంశ :- పూర్వాషాడ నక్షత్ర తృతీయ పాదం శుక్రుడిది. ఈ జాతకులు నిత్యం శుచిగా ఉంటారు. దయా హృదయం కలిగి ఉంటారు. భాగ్యవంతులు, చపలచిత్తం కలవారుగా ఉంటారు.
80) ఉగ్రాంశ:- పూర్వాషాడ నక్షత్ర చతుర్ధ పాదం కుజుడిది. పండితుల పట్ల ద్వేషం కలవారు. ఉగ్ర స్వభావం కలవారు. పాపకార్యాలు చేయువారు, అబద్ధాలాడటం వీళ్ళ స్వభావంగా ఉంటుంది.

21) ఉత్తరాషాడ నక్షత్ర నాలుగు పాదాలకు అంశ గుణాలు

81) ఉత్పన్నాంశ:- ఉత్తరాషాడ నక్షత్ర ప్రధమ పాదం గురువుది. ఈ జాతకులు బుద్ధిమంతులు. శాస్త్రవేత్తలు, స్ధిరాస్తులు కలవారు, పెద్దలయందు భక్తి కలవారు, ధర్మపాలన చేయువారు.
82) పాపాంశ:- ఉత్తరాషాడ నక్షత్ర ద్వితీయ పాదం శనిది. ఈ జాతకులు పనికి రాని పనులు చేయటంలో సిద్ధహస్తులు. ఇతర మతాలపట్ల ప్రేమాభిమానాలు కలవారు.
83) ఉగ్రాంశ:- ఉత్తరాషాడ నక్షత్ర తృతీయ పాదం శనిది. స్ధూలమైన శరీరం కలవారు. అల్ప సంతోషులు, నిత్యం వ్యాధిగ్రస్తులుగా ఉంటారు.
84) శోభనాంశ:- ఉత్తరాషాడ నక్షత్ర చతుర్ధ పాదం గురువుది. శుభములు కలవారు, నిత్యం ఏదో ఒక పని చేసేవారు, శాస్త్ర విషయాలపై శ్రద్ధ కలవారు, వ్యాపార లక్షణాలు కలవారు, ఉత్సాహవంతులుగా ఉంటారు.

22) శ్రావణా నక్షత్ర నాలుగు పాదాలకు అంశ గుణాలు

85) మంగళాంశ:- శ్రావణా నక్షత్ర ప్రధమ పాదం కుజుడిది. కలహ ప్రియులు, పుత్ర సంతానం లేనివారు, గుల్మరోగం కలవారు అవుతారు.
86) భోక్తాంశ:- శ్రావణా నక్షత్ర ద్వితీయ పాదం శుక్రుడిది. సేవకులతో పని చేయించుకునేవారు. తంత్ర విద్యలపైనా ఆసక్తి కలవారు. కామత్వం కలవారు అవుతారు.
87) విచక్షణాంశ :- శ్రావణా నక్షత్ర తృతీయ పాదం బుధుడిది. ఈ జాతకులు అత్యంత ఉదార స్వభావం కలవారు. చిత్రలేఖకులు, కలహప్రియులుగా ఉంటారు.
88) ధనాంశ:- శ్రవణా నక్షత్ర చతుర్ధ పాదం చంద్రుడిది. ఈ జాతకులు పసు పోషకులు. యోగులు, ధార్మికులు అవుతారు. ముక్కు పొడవు కలిగి ఉంటారు.

23) ధనిష్ఠ నక్షత్ర నాలుగు పాదాలకు అంశగుణాలు

89) రాజాంశ :- ధనిష్ఠ నక్షత్ర ప్రధమ పాదం రవిది. ఈ జాతకులు స్ధూలమైన శరీరం కలవారు. దానగుణం కలవారు. స్త్రీలపైన ప్రీతి కలవారు అగును.
90) సౌమ్యాంశ :- ధనిష్ఠ నక్షత్ర ద్వితీయ పాదం బుధుడిది. వినయ విధేయతలతో మాట్లాడేవారు. ఉన్నత విద్యలు చదివేవారు అవుతారు.
91) అభయాంశ :- ధనిష్ఠ నక్షత్ర తృతీయ పాదం శుక్రుడిది. గుణవంతులు అవుతారు. చిరాయుష్మంతులు అవుతారు. సత్య పలుకులు పలుకువారు అవుతారు.
92) క్రూరాంశ :- ధనిష్ఠ నక్షత్ర చతుర్ధ పాదం కుజుడిది. ఈ జాతకులు నిత్యం పాప కర్మలు చేయుటలో లీనమై ఉంటారు. క్రూరమైన స్వభావం కలవారు. స్దూలమైన శరీరం కలవారు అవుతారు.

24) శతభిష నక్షత్ర నాలుగు పాదాలకు అంశ గుణాలు

93) ఉత్పన్నాంశ :- శతభిష నక్షత్ర ప్రధమ పాదం గురువుది. ఈ జాతకులు గోవులను పూజించువారు. బ్రాహ్మణులపట్ల గౌరవం కలవారు. సత్యం మాట్లాడువారు. స్ధిరమైన బుద్ధి కలవారు, అభిమానవంతులు, స్నేహములను కలిగి ఉంటారు.
94) పాపాంశ :- శతభిష నక్షత్ర ద్వితీయ పాదం శనిది. ఈ జాతకులు పిరికితనం కలిగి ఉంటారు. ఏ పని తొందరగా చేయరు. పాపభీతి కలవారు అగుదురు.
95) భయాంశ:- శతభిష నక్షత్ర తృతీయ పాదం శనిది. ఈ జాతకులు పుత్ర సంతానం కలిగి ఉంటారు. పాండిత్యం కలవారు. మంధబుద్ధికలవారు. పాప కర్మలు చేయువారు. ఉగ్ర కర్మలు చేయువారు అగుదురు.
96) సౌమ్యాంశ:- శతభిష నక్షత్ర చతుర్ధ పాదం గురువుది. ఈ జాతకులు స్నేహశీలురు, పండితులు, అభిమానవంతులు, యజ్ఞ కార్యాలు చేయువారు.

25) పూర్వాభాద్ర నక్షత్ర నాలుగు పాదాలకు అంశగుణాలు.

97) సేవాంశ:- పూర్వాభాద్ర నక్షత్ర ప్రధమ పాదం కుజుడిది. ఈ జాతకులు ఉద్యోగస్తులు, విష్ణు పూజ చేయువారు, భోగులుగా ఉంటారు.
98) భోగాంశ :- పూర్వాభాద్ర నక్షత్ర ద్వితీయ పాదం శుక్రుడిది. ఈ జాతకులు సాహస వంతులు, మంత్రోపాసన చేయువారు, ప్రభుత్వ వ్యతిరేకులుగా ఉంటారు.
99) విచక్షణాంశ:- పూర్వాభాద్ర నక్షత్ర తృతీయ పాదం బుధుడిది. ఈ జాతకులు పితృ ప్రియులు, సుఖవంతులుగా ఉంటారు. జ్ఞానవంతులు, భోగులుగా ఉంటారు.
100) ధనాంశ :- పూర్వాభాద్ర నక్షత్ర చతుర్ధ పాదం చంద్రుడిది. ఈ జాతకులు స్త్రీలపైనా ఆసక్తి కలవారు, అందరి చేత కీర్తింపబడేవారు, ధనవంతులు, మాతృ సేవకులుగా ఉంటారు.

26) ఉత్తరాభాద్ర నక్షత్ర నాలుగు పాదాలకు అంశ గుణాలు

101) తీక్షణాంశ:- ఉత్తరాభాద్ర నక్షత్ర ప్రధమ పాదం రవిది. ఈ జాతకులు పైత్యా శరీరం కలవారు, చపల చిత్తం కలవారు, కోపిష్ఠులు, ఎర్రని నేత్రాలు కలవారు, కృశించిన శరీరం కలవారుగా ఉంటారు.
102) అభయాంశ :- ఉత్తరాభాద్ర నక్షత్ర ద్వితీయ పాదం బుధుడిది. ఇజాతకులు జ్యోతిష శాస్త్ర పండితులుగా గాని, పంచాంగ కర్తలుగా గాని ఉంటారు. జ్ఞాన వంతులు, సౌమ్యమైన గుణం కలవారు, అవతలి వాళ్ళలోని గుణాలను గ్రహించగలిగే సామర్ధ్యం కలవారు అవుతారు.
103) అభయాంశ :- ఉత్తరాభాద్ర నక్షత్ర తృతీయ పాదం శుక్రుడిది. ఈ జాతకులు తెలివితేటలు కలవారు, శాస్త్రవేత్తలు, ధనవంతులు అవుతారు.
104) దీనాంశ:- ఉత్తరాభాద్ర నక్షత్ర చతుర్ధ పాదం కుజుడిది. ఈ జాతకులు చెడు స్నేహాలు కలవారు, శత్రువులు కలవారు, ధనం సంపాదించువారు అవుతారు.

27) రేవతి నక్షత్ర నాలుగు పాదాలకు అంశ గుణాలు

105) ఉత్పన్నాంశ :- రేవతీ నక్షత్ర ప్రధమ పాదం గురువుది. ఈ జాతకులు శాస్త్రాలపైనా పట్టు గలవారు, నీటి నియమాలు కలవారు, తాత్వికులు అగుదురు.
106) పాపాంశ:- రేవతి నక్షత్ర ద్వితీయ పాదం శనిది. పాప కర్మలు చేసేవారు, జూదం ఆడేవారు, కుటిలమైన బుద్ధి కలవారు అగుదురు.
107) ఉగ్రాంశ:- రేవతి నక్షత్ర తృతీయ పాదం శనిది. మంధ బుద్ధి కలవారు, సౌందర్యవంతులు, కోప స్వభావం కలవారు అగుదురు.
108) శోభనాంశ :- రేవతి నక్షత్ర చతుర్ధ పాదం గురువుది. ఈ జాతకులు యజ్ఞ యాగాదులు చేయువారు, ధైవ కార్యాలు చేయువారు, పండితులు, వేదాంతులు, ధైర్యవంతులు అవుతారు.

Wednesday 8 January 2020

గ్రహాలకు సంబందించిన వృత్తి కారకత్వాలు :

జాతకచక్రంలో ఏఏ గ్రహాలు అనుకూలంగా ఉన్నాయో పరిశీలించి ఆయా గ్రహాలకు సంబందించిన వృత్తులను చేసుకోవటం వలన వ్యాపారాభివృద్ధి, ధనాభివృద్ధి, గౌరవాలు, కీర్తి ప్రతిష్టలు కలుగుతాయి.
సూర్యుడు : వైద్యశాస్త్రం,బౌతికశాస్త్రం,కుజునితో కలసిన శస్త్ర చికిత్సకునిగా,గురువుతో కలసిన ఆయుర్వేదం,శనితో కలసిన అనస్తీషియా,ఆర్ధోఫిడిక్స్ వైద్యుడు,చంద్ర,శుక్రులతో కలసిన గైనకాలజిస్ట్,బుధునితో కలసిన నరాల నిపుణులు,మరియు కర్ణరోగ వైద్యం సూచించును.రాజ్యాధికారము , పరిపాలనా విభాగాములకు అధికారి , ఆఫీస్ మేనేజ్ మెంట్ , అధ్యక్ష పదవులు, ధార్మిక సంస్థలు , సంఘములకు గౌరవ అధ్యక్షులు మొదలగు అనేక విధముల యజమాని హోదా పొందగలరు. చట్ట సభలలో అధికారము, శాసన నిర్మాణ కర్తలు , ప్రజా పరిపాలకులు . ఆర్డర్స్ జారీ చేయు అధికారము , హోదా , గౌరవము కలిగిన వృత్తులను ప్రసాదించును.

చంద్రుడు : చరిత్ర,కవిత్వం,సైకాలజీ,సముద్ర గర్బమును పరిశోదించుట. నీటికి సంబంధించిన శాఖలు , ద్రవ పదార్దములకు సంబంధించినవి . తెలుపు వర్ణమునకు చెందినవి . అనగా కూల్ డ్రింక్స్ , పాలు , పాల ఉత్పత్తులు , పంచదార , బియ్యము వ్యాపారములు , రైస్ మిల్స్ , హోటల్స్ , టిఫిన్ సెంటర్స్ , మిల్క్ పార్లర్స్ , నావికుల విద్య,శుక్రునితో కలసిన పాల వ్యాపారం,పెయింట్స్,కుజ శుక్రులతో కలసిన పశువైద్యం,బుద్ధునితో కలసిన టెక్స్ టైల్స్,వస్త్ర వ్యాపారములు , వాటర్ ప్లాంట్స్ , నీరు , చేపల ఉత్పత్తులు , బావులు త్రవ్వడం , బోరింగ్స్ , సముద్రపు ఉత్పత్తులు , జలాంత ర్గామి, నావికా దళ ఉద్యోగములు , దూది వ్యాపారము , దూది ఉత్పత్తులు, పుడ్ ప్రొడక్ట్స్ , వెండి వస్తువులు తయారీ మొదలగు వృత్తులను ప్రసాదించును .

కుజుడు : గృహ నిర్మాణం,సర్వే,సివిల్ ఇంజనీర్,శస్త్ర చికిత్సలు,పశుపోషణ,శస్త్ర చికిత్సలు,మెకానికల్ ఇంజనీర్,రసాయన విద్యలు,రక్షణ విధానం,పేలుడువస్తువులు,ఫైర్ సర్వీస్,తీర్పులు,హైడ్రో ఎలక్ట్రిక్ ఇంజనీర్,విమాన చోదక విద్య,వ్యవసాయము , వ్యవసాయ ఉత్పత్తులు , మాంసపు ఉత్పత్తులు , కోళ్ల పరిశ్రమలు , యంత్రములు, పనిముట్లు తయారీ , వడ్రంగి పనులు , భవన నిర్మాణములు , కనస్ట్రక్షన్స్ , కాంట్రాక్టులు , బిల్డింగ్ మెటీరియల్ , విద్యుత్తు శక్తి శాఖలు , విద్యుత్ ప్లాంట్స్ , మిలటరీ , పోలీస్ తదితర రక్షణ శాఖలు , సైన్యమునకు సంబంధించిన ఉద్యోగాలు , మోటార్స్ , మెకానికల్ , భూ పరిశోధన, అటవీ ఉత్పత్తులు , అటవీ శాఖ కు చెందిన ఉద్యోగాలు ఇలాంటి వృత్తులు కుజుడు ఆధీనము లో ఉంటాయి .

బుధుడు : వ్యాపారం,కమర్షియల్ డిగ్రీలు,బ్రోకర్స్ , బ్యాంకులు , పైనాన్సియల్ సెక్షన్స్ , చిట్ ఫండ్ వ్యాపారములు , ట్రెజరీ డిపార్టమెంట్లు , బడ్జెట్ తయారీ చేయువారు , చిత్ర కళ,డ్రాయింగ్,పెయింటిగ్,నమూనాలు గీయుట,ఎస్టిమేటింగ్,వ్రాత,గణిత విద్య,కంస్ట్రక్షన్ డిజైన్,జ్యోతిష్యం,శుక్రునితో కలసిన చాయా చిత్రములకు చెందిన వ్యాపారం,రసాయన శాస్త్రం,జీవశాస్త్రం,వృక్షశాస్త్రం,అనువాదకులు,ఉపాద్యాయులు, పత్రికలు , పత్రికా సంపాదకులు , ముద్రణా రంగములు , పుస్తక పరిశ్రమలు , రచయితలు చార్టెడ్ ఎకౌంట్స్ , విలేఖర్లు ,జర్నలిజం , గుమస్తా ఉద్యోగాలు ,సాప్ట్ వేర్ , కంప్యూటర్ , టెక్నాలజీ సంబంధిత ఉద్యోగ వ్యాపారాలు పచ్చళ్ళు పరిశ్రమలు.

గురుడు : న్యాయవాదులు,ఆర్ధిక శాస్త్రం,సంస్కృతంలో పట్టాలు,వేదాంతం,అవదాన విద్యలు,జ్యోతిష్యం,విద్యా సంస్థలు , ఉపాధ్యాయులు, లెక్చరర్స్ , భోధనా సంబంధ ఉద్యోగములు , పురోహితులు , పూజార్లు , పూజ గది , పూజా ద్రవ్యములు , దేవాలయ సిబ్బంది , దేవాదాయ శాఖలలో ఉద్యోగాలు , పరిశోధనా రంగములు , విశ్లేషకులు , మత ప్రచారకులు , మేధావి వర్గమునకు చెందినవారు . సంస్కృతి , సంప్రదాయములను వివరించు స్వామీజీలు వీరందరూ గురుడు కు సంబంధించిన వారు . గురుడు ఆకాశ తత్వమునకు చెందిన వాడు కాబట్టి విమానయాన రంగములు , శాటిలైట్ లు మొదలగునవి .

శుక్రుడు : నాట్య రంగం,చిత్రకళలు,రసాయన శాస్త్రం,కామశాస్త్రం,గురు,బుదులతో కలసిన ఎలక్ట్రానిక్స్,వస్త్రాలు, ఆభరణ తయారీలు , ఆర్నమెంట్ నగల వ్యాపారము , బంగారు వ్యాపారము , అలంకరణ సామాగ్రి , ఇంటీరియర్ డిజైనింగ్ , ఫాన్సీ దుకాణాలు , హైర్ స్టైయిల్ డిజైనింగ్,కుట్టుపని,ఎంబ్రాయిడరీ ట్రైనింగ్,ఇల్లు,వాహనాలకు పెయింట్స్ వేయటం,మసాజ్ సెంటర్స్ , రెడీమేడ్ వస్త్రములు , వస్తువులు , స్త్రీలకు సంబంధించిన వస్తువులు , సుగంధ ద్రవ్యములు , అగరబత్తీ పరిశ్రమలు, నూతన వస్తువులు, కళలు , సినిమా రంగము , కళాకారులు , ఎలక్టానిక్ మీడియా , గాయకులు , సంగీత సాహిత్య రంగములు ,

శనిగ్రహము :గనులు,త్రవ్వకాలు,భూగర్భ శాస్త్రం,భూగోళ శాస్త్రం,పురాతన వస్తుసేకరణ,బొగ్గు గనులు,ఆర్ధోఫిడిక్స్, రాజకీయ నాయకులు , నామినేటెడ్ పోస్టులు పొందేవారు . న్యాయవాదులు , జడ్జీలు , న్యాయశాఖకు సంబంధించి ఉద్యోగులు , గాలికి సంబంధించిన రంగములు అనగా టెలీ ఫోన్ , కమ్యునికేషన్ , బట్వాడా కార్మికులు , తపాలా శాఖ , సేవకులు , కూలీలు , వ్యవసాయ కార్మికులు , కష్టముచే జీవించువారు , ఇనుము , ఉక్కు పరిశ్రమలు , ఇనుము ఉత్పత్తులు , బొగ్గు సంబంధిత శాఖలలో పనిచేయువారు , బరువులు మోయువారు , ఇన్సూరెన్స్ సంబందిత రంగములలో పని చేయువారు,ఇంగ్లీష్ విద్య,ప్రజా ప్రభుత్వ విద్యలు, సంచార జీవులు, నూనె కర్మాగారములు , పెట్రోల్ , డీసెల్ , గ్యాస్ సంబంధిత పరిశ్రమలలో ఉద్యోగ, వ్యాపారములు , సెకండ్ హ్యాండిల్ వస్తువుల వ్యాపారము మొదలగు వృత్తులు శనిగ్రహము వలన కలుగును . కంప్యూటర్ హార్డ్ వేర్ , అసెంబ్లింగ్ యూనిట్స్ మొదలగునవి .

రాహువు : ఈ గ్రహ ప్రభావము వలన డాక్టర్స్ , మత్తు పానీయముల వ్యాపారము చేయువారు , మందుల దుకాణములు, కెమికల్ ఇండస్ట్రీస్ , రసాయన శాస్త్రవేత్తలు , చెత్త వ్యాపారము ఈ గ్రహమునకు సంబంధించిన వారు.

కేతువు : చర్మపు ఉత్పత్తులు , జోళ్ళు , రబ్బరు పరిశ్రమలు , రబ్బరు ఉత్పత్తులు మొదలగు వృత్తులను కలిగించును .

Tuesday 7 January 2020

గ్రహములు - వివరములు :

"సూర్యుడు (రవి) , చంద్రుడు ,కుజుడు,బుధుడు,గురువు,శుక్రుడు,శని,రాహువు,కేతువు " 
అనువారు నవగ్రహములు. ప్రతి వారికి వారి వారి జాతకముల ననుసరించి ... జీవిత కాలములో అనేక శుభా శుభ ఫలితము ఈ నవగ్రహముల వలననే కలుగుచుంటివి. వీరిలో గురు,శుక్ర,పూర్ణ చంద్రులు మాత్రమే నైసర్గిక శుభ గ్రహములు ! మిగిలిన వారు , నైసర్గిక పాప గ్రహములు అగుదురు. బుధుడు - ఏ గ్రహ సంబంధమును పొంది యుండిన ఆ గ్రహము యొక్క శుభ లేదా పాపత్వములను కలిగి యుండగలడు . జాతక చక్రమును పరిశీలించుటకు ముందు .... ఈ గ్రహముల యొక్క పూర్తి స్వరూపస్వభావములను,వీరికి ప్రాప్తించు శుభా శుభ స్థితిని,మరియు ఉచ్చ-నీచలను, పరస్పర శత్రు-మితృత్వములను పరిశీలించుట చాలా అవసరము! కేంద్ర స్థానములకు ఆధిపత్యము వహించిన నైసర్గిక శుభగ్రహములు - పాప (అశుభ) ఫలితములు నివ్వగలవు. అదే విధముగా కోణస్థానాధిపత్యము నందిన నైసర్గిక పాప గ్రహములు కూడా చెడు ఫలితములనే కలుగ జేయును . సహజముగా "దుష్టస్థానముల"ని చెప్పబడు లగ్నాధి ... 6,8,12, స్థానముల అధిపత్యము ఏ గ్రహములకు కలిగినను వారు మంచిని చేయజాలరు. 2,3,11, అధిపత్యము కూడా అంత మంచివి కావు.
లగ్నాధి స్థాన వివరణ :
కేంద్ర స్థానములు : 1,4,7,10 (కంటకములు)
త్రికోణ స్థానములు : 1,5,9 ( కోణములు)
అపచయ స్థానములు : 1,2,4,5,7,8,9,12.
ఉపచయ స్థానములు : 3,6,10,11.
పణపరములు : 2,5,8,11.
అపోక్లీమ స్థానములు : 3,6,9,12.
త్రిషడాయములు : 3,6,11.
త్రికములు : 6,8,12.
గ్రహదృష్టి : ప్రతి గ్రహము తానున్న రాశి నుండి.... ఏడవ రాసిని , అందలి గ్రహముల వీక్షింపగలదు. మరియు గురువు పై విధముగనే 5,9, రాశులయందు : కుజుడు 4,8, రాశులయందు : శని 3,10 రాశులయందు : విశేష దృష్టిని కలిగి యుండ గలరు. 7 వ రాశి యందలి దృష్టి పూర్ణ దృష్టి ! శనికి 3,10 స్థానముల దృష్టి , కుజునికి 4,8, స్థానముల దృష్టి , గురునికి 5,9, స్థానముల దృష్టి విశేష బలమును కలిగి యుండగలదు.

Monday 6 January 2020

గ్రహములకు వక్రత్వము :

గ్రహములు సూర్యుడున్న రాశికి ఒక నిర్ణయ రాశిలో ఉన్నప్పుడు వక్రించు చుండును . అనగా సూర్యుడున్న భాగములకు చెప్పబడిన భాగములో ఏదైనా ఒక గ్రహమున్నప్పుడు ఆ గ్రహము వక్రించును. అనగా సంచారమున ముందుకు పోవలసిన గ్రహము ముందునకు పోజాలక వెనుకకు వెళ్ళును. అట్టి స్థితి వక్రత్వమనబడును. మండల గ్రహములైన రవి,చంద్రులు ఎన్నడును వక్రించరు. తారా గ్రహములైన బుధ , గురు , శుక్ర , కుజ , శను లకు వక్రత్వము కలుగు చుండును. ఛాయా గ్రహములైన రాహు,కేతువులు మామూలుగా ఎల్లప్పుడు వక్రగతినే సంచారము చేయుదురు . గ్రహము వక్రించినపుడు శుభ ఫలితములు ఇచ్చునా ? అను విషయములో మహర్షులు భిన్నాభిప్రాయములు తెలిపియున్నారు .

నీచ యందున్న గ్రహము వక్రించినచో శుభ ఫలితము నిచ్చి అభివృద్ధి కలుగ జేయును . ఉచ్చ యందున్న గ్రహము వక్రించినచో ఆ గ్రహము యొక్క మహాదశ యోగించక కష్టములు కలుగ జేయును. రాశి చక్రములో ఉచ్చలో నున్న గ్రహము వక్రించి అంశ చక్రములో నీచను పొందియున్నచో , ఆ గ్రహము యొక్క మహాదశ బాగుగా యోగించును. మరియు శుభ గ్రహములు వక్రించినచో అనగా ఆధిపత్య శుభులు వక్రించినచో మంచి యోగము నిచ్చును. అధిపాపులు వక్రించినచో పాప ఫలములు అధికముగా కలుగును. వక్రించిన గ్రహము తానున్న రాశిని వదిలి వెనుక నున్న రాశిలోకి వచ్చినపుడు , పూర్వ రాశి ఫలితములే యిచ్చును. గురుడు మాత్రము వక్రించి వెనుక రాశిలో ప్రవేశించినచో , ఆ ప్రవేశించిన రాశి ఫలితములే యిచ్చును.

Sunday 5 January 2020

గ్రహ వర్గోత్తమము :

ఏ గ్రహమైనను రాశి చక్రములో ఏ రాశి యందుండునో అంశ చక్రములో కూడా అదే రాశి యందున్నచో అది వర్గోత్తమాంశ యనబడును. వర్గోత్తమాంశ యందున్న గ్రహమునకు బలము అధికముగ నుండును . అందుచే శుభములు , జీవితములో మంచి అభివృద్ధి కలుగజేయును. జన్మ లగ్నము ఏది అగునో , అంశ చక్రములో కూడా లగ్నము అదియే అయినచో ఆ లగ్నమునకు వర్గోత్తమాంశ యగును. లగ్నమునకు వర్గోత్తమాంశయైనచో ఆ జాతకము బాగుగా యోగించును.

Saturday 4 January 2020

గ్రహముల అస్తంగత్వ - మూఢము :

రవితో యున్న గ్రహము తన బలమును కోల్పోయి , బలహీనమగును. బలహీనమైన గ్రహము శుభ ఫలముల నీయ జాలదు . రవి చంద్రులు కలసి ఒకే రాశిలో యున్న ఆ దినము అమావాస్య యగును. క్షీణ చంద్రుడు అగును. చంద్రుడు బలహీనముగా ఉన్న దినమున శుభ కార్యములు చేయరాదు. రవి గురువుతో కలసినపుడు గురుమూఢము , శుక్రునితో కలసినపుడు శుక్ర మూఢము . అనగా రవితో కలసి ఉండుట వలన గురు శుక్రులు బలహీనమగుదురు. శుభ గ్రహములు బలహీనముగా ఉన్నప్పుడు శుభ కార్యములు చేయరాదు. రవికి 12 భాగల లోపల యున్న గ్రహము అస్తంగతుడగును . రవితో గురు-శుక్రు లు కలసినపుడే గురు-శుక్ర మూఢములు కలుగును. రవి - కుజ,బుధ ,శనులతో కలసి ఉన్నప్పుడు మూఢము లేదు. రవి తో కలసి ఒకే రాశి యందున్న గ్రహమునకు అస్తంగతత్వము కల్గును. రవికి రెండవ రాశిలో యున్న గ్రహము శీఘ్రత్వము పొందును. రవికి వ్యయ స్థానము - అనగా 12 వ రాశిలో ఉన్న గ్రహము అతి శ్రీఘ్రగతిని పొందును. రవికి 5,6 స్థానములలో ఉన్న గ్రహము వక్రత్వము పొందును. రవికి 7,8 స్థానములలో ఉన్న గ్రహము అతి వక్రత్వము పొందును.

Friday 3 January 2020

చంద్రకళలను బట్టి నిత్య దేవతారాధన :

దక్ష ప్రజాపతి ఇరువై ఏడుగురు కుమార్తెలను పరిణయమాడిన చంద్రుడు రోహిణిపై ఎందుకో మిక్కిలి ప్రేమ చూపెడివాడు, ఈ విషయమై మందలించిన దక్షుని మాటను మన్నించని చంద్రుని దక్షుడు కోపగించి క్షయ వ్యాధితో బాధపడమని శపించగా, శాపవశాన చంద్రుడు క్షీణించసాగాడు, అమృత కిరణ స్పర్శలేక దేవతలకు అమృతం దొరకడం కష్టమైనది. ఓషదులన్ని క్షీణించినవి, అంత ఇంద్రాది దేవతలు చంద్రుని తోడ్కొని బ్రహ్మదేవుని కడకేగి పరిష్కార మడిగారు. అంత చతుర్ముఖుడు చంద్రునికి మృత్యుంజయ మహామంత్రాన్ని ఉపదేశించాడు. ప్రభాస తీర్థమున పరమశివునికి దయగల్గి ప్రత్యక్షమవగా చంద్రుడు శాపవిముక్తికై ప్రార్థించెను. అంత పరమేశ్వ రుడు చంద్రుని అనుగ్రహించి కృష్ణపక్షాన కళలు క్షీణించి, శుక్లపక్షమున ప్రవర్ధమానమై పున్నమి నాటికి పూర్ణ కళతో భాసిల్లుమని వరమిచ్చాడు.
కళలు చంద్రునికి సూర్యునికి మధ్య దూరం మీద ఆధారపడి ఉంటుంది. అత్యల్పదూరం అమావాస్య.అత్యధిక దూరం పౌర్ణమి. చంద్రుడు భూమి చుట్టూ భూమి సూర్యునిచుట్టూ పరిభ్రమిస్తూఉంటాయి. 16 కళలు అనివీటినే అంటారు. వాటికి పెర్లు ఉన్నాయి -
చంద్రుని పదహారు కళలు: 1. అమృత, 2. మానద, 3. పూష, 4. తుష్టి, 5. పుష్టి, 6. రతి ధృతి, 7. కామదాయిని, 8. శశిని, 9. చంద్రిక, 10. కాంతి, 11. జ్యోత్స్న, 12. శ్రీ, 13. ప్రీతి, 14. అంగద, 15. పూర్ణ, 16. అపూర్ణ. 15 తిథులకు 16 ఎందుకు అంటే పూర్తి పౌర్ణమి,పూర్తి అమావాస్య ఘడియలు అనేవి స్వల్ప సమయమే ఉంటాయి.
ఈ 16 కళలకు నిత్యం ఆరాధింపవలసిన దేవతలు ఉన్నారు.నిత్యాదేవతలు మొత్తం 16 మంది 15 నిత్యలను త్రికోణంలోని ఒక్కొక్క రేఖ యందు ఐదుగురు చొప్పున పూజించి 16వ దైన లలితా త్రిపుర సుందరీదేవిని బిందువు నందు పూజించాలి.జాతకం ప్రకారం ఎవరు ఏ తిధిన జన్మిస్తే ఆయా దేవతా మంత్రాలను 11 సార్లు జపించాలి.లేదా ఆయా తిధులను బట్టి ఆయా మంత్రాలను ప్రతిరోజు 11 సార్లు పఠించటం మంచిది.అవి
బహుళ పాడ్యమి నాడు పుట్టిన వారు “కామేశ్వరీదేవి”ని “ఓం ఐం హ్రీం శ్రీం అం “కామేశ్వరీ” నిత్యా శ్రీపాదుకాం పూజయామి తర్పయామి నమః అనే మంత్రంతో పూజించాలి.
బహుళ విదియ నాడు పుట్టిన వారు “భగమాలినీ దేవి”ని “ఓం ఐం హ్రీం శ్రీం ఆం “భగమాలినీ” నిత్యా శ్రీపాదుకాం పూజయామి తర్పయామి నమః అనే మంత్రంతో పూజించాలి.
బహుళ తదియ నాడు పుట్టిన వారు “నిత్యక్లిన్నా దేవి”ని “ఓం ఐం హ్రీం శ్రీం ఇం “నిత్యక్లిన్నా” నిత్యా శ్రీపాదుకాం పూజయామి తర్పయామి నమః అనే మంత్రంతో పూజించాలి.
బహుళ చవితి నాడు పుట్టిన వారు “బేరుండా దేవి”ని “ఓం ఐం హ్రీం శ్రీం ఈం “బేరుండా” నిత్యా శ్రీపాదుకాం పూజయామి తర్పయామి నమః అనే మంత్రంతో పూజించాలి.
బహుళ పంచమి నాడు పుట్టిన వారు “వహ్నివాసినీ దేవి”ని “ఓం ఐం హ్రీం శ్రీం ఉం “వహ్నివాసినీ” నిత్యా శ్రీపాదుకాం పూజయామి తర్పయామి నమః అనే మంత్రంతో పూజించాలి.
బహుళ షష్ఠి నాడు పుట్టిన వారు “మహావజ్రేశ్వరీ దేవి”ని “ఓం ఐం హ్రీం శ్రీం ఊం “మహావజ్రేశ్వరీ” నిత్యా శ్రీపాదుకాం పూజయామి తర్పయామి నమః అనే మంత్రంతో పూజించాలి.
బహుళ సప్తమి నాడు పుట్టిన వారు “శివదూతీ దేవి”ని “ఓం ఐం హ్రీం శ్రీం ఋం “శివదూతీ” నిత్యా శ్రీపాదుకాం పూజయామి తర్పయామి నమః అనే మంత్రంతో పూజించాలి.
బహుళ అష్టమి నాడు పుట్టిన వారు “త్వరితా దేవి”ని “ఓం ఐం హ్రీం శ్రీం ౠం “త్వరితా” నిత్యా శ్రీపాదుకాం పూజయామి తర్పయామి నమః అనే మంత్రంతో పూజించాలి.
బహుళ నవమి నాడు పుట్టిన వారు “కులసుందరీ దేవి”ని “ఓం ఐం హ్రీం శ్రీం ఌం “కులసుందరీ” నిత్యా శ్రీపాదుకాం పూజయామి తర్పయామి నమః అనే మంత్రంతో పూజించాలి.
బహుళ దశమి నాడు పుట్టిన వారు “నిత్యా దేవి”ని “ఓం ఐం హ్రీం శ్రీం ౡం “నిత్యా” నిత్యా శ్రీపాదుకాం పూజయామి తర్పయామి నమః అనే మంత్రంతో పూజించాలి.
బహుళ ఏకాదశి నాడు పుట్టిన వారు “నీలపతాకా దేవి”ని “ఓం ఐం హ్రీం శ్రీం ఏం “నీలాపతాకా” నిత్యా శ్రీపాదుకాం పూజయామి తర్పయామి నమః అనే మంత్రంతో పూజించాలి.
బహుళ ద్వాదశి నాడు పుట్టిన వారు “విజయా దేవి”ని “ఓం ఐం హ్రీం శ్రీం ఐం “విజయా” నిత్యా శ్రీపాదుకాం పూజయామి తర్పయామి నమః అనే మంత్రంతో పూజించాలి.
బహుళ త్రయోదశి నాడు పుట్టిన వారు “సర్వమంగళా దేవి”ని “ఓం ఐం హ్రీం శ్రీం ఓం “సర్వమంగళా” నిత్యా శ్రీపాదుకాం పూజయామి తర్పయామి నమః అనే మంత్రంతో పూజించాలి.
బహుళ చతుర్ధశి నాడు పుట్టిన వారు “జ్వాలామాలినీ దేవి”ని “ఓం ఐం హ్రీం శ్రీం ఔం “జ్వాలామాలినీ” నిత్యా శ్రీపాదుకాం పూజయామి తర్పయామి నమః అనే మంత్రంతో పూజించాలి.
అమావాస్య నాడు పుట్టిన వారు “చిత్రా దేవి”ని “ఓం ఐం హ్రీం శ్రీం అం “చిత్రే” నిత్యా శ్రీపాదుకాం పూజయామి తర్పయామి నమః అనే మంత్రంతో పూజించాలి.
శుక్ల పాడ్యమి నాడు పుట్టిన వారు “చిత్రా దేవి”ని “ఓం ఐం హ్రీం శ్రీం అం “చిత్రే” నిత్యా శ్రీపాదుకాం పూజయామి తర్పయామి నమః అనే మంత్రంతో పూజించాలి.
శుక్ల విదియ నాడు పుట్టిన వారు “జ్వాలామాలినీ దేవి”ని “ఓం ఐం హ్రీం శ్రీం ఔం “జ్వాలామాలినీ” నిత్యా శ్రీపాదుకాం పూజయామి తర్పయామి నమః అనే మంత్రంతో పూజించాలి.
శుక్ల తదియ నాడు పుట్టిన వారు “సర్వమంగళా దేవి”ని “ఓం ఐం హ్రీం శ్రీం ఓం “సర్వమంగళా” నిత్యా శ్రీపాదుకాం పూజయామి తర్పయామి నమః అనే మంత్రంతో పూజించాలి.
శుక్ల చవితి నాడు పుట్టిన వారు “విజయా దేవి”ని “ఓం ఐం హ్రీం శ్రీం ఐం “విజయా” నిత్యా శ్రీపాదుకాం పూజయామి తర్పయామి నమః అనే మంత్రంతో పూజించాలి.
శుక్ల పంచమినాడు పుట్టిన వారు “నీలపతాకా దేవి”ని “ఓం ఐం హ్రీం శ్రీం ఏం “నీలాపతాకా” నిత్యా శ్రీపాదుకాం పూజయామి తర్పయామి నమః అనే మంత్రంతో పూజించాలి.
శుక్ల షష్ఠి నాడు పుట్టిన వారు “నిత్యా దేవి”ని “ఓం ఐం హ్రీం శ్రీం ౡం “నిత్యా” నిత్యా శ్రీపాదుకాం పూజయామి తర్పయామి నమః అనే మంత్రంతో పూజించాలి.
శుక్ల సప్తమి నాడు పుట్టిన వారు “కులసుందరీ దేవి”ని “ఓం ఐం హ్రీం శ్రీం ఌం “కులసుందరీ” నిత్యా శ్రీపాదుకాం పూజయామి తర్పయామి నమః అనే మంత్రంతో పూజించాలి.
శుక్ల అష్టమి నాడు పుట్టిన వారు “త్వరితా దేవి”ని “ఓం ఐం హ్రీం శ్రీం ౠం “త్వరితా” నిత్యా శ్రీపాదుకాం పూజయామి తర్పయామి నమః అనే మంత్రంతో పూజించాలి.
శుక్ల నవమి నాడు పుట్టిన వారు “శివదూతీ దేవి”ని “ఓం ఐం హ్రీం శ్రీం ఋం “శివదూతీ” నిత్యా శ్రీపాదుకాం పూజయామి తర్పయామి నమః అనే మంత్రంతో పూజించాలి.
శుక్ల దశమి నాడు పుట్టిన వారు “మహావజ్రేశ్వరీ దేవి”ని “ఓం ఐం హ్రీం శ్రీం ఊం “మహావజ్రేశ్వరీ” నిత్యా శ్రీపాదుకాం పూజయామి తర్పయామి నమః అనే మంత్రంతో పూజించాలి.
శుక్ల ఏకాదశి నాడు పుట్టిన వారు “వహ్నివాసినీ దేవి”ని “ఓం ఐం హ్రీం శ్రీం ఉం “వహ్నివాసినీ” నిత్యా శ్రీపాదుకాం పూజయామి తర్పయామి నమః అనే మంత్రంతో పూజించాలి.
శుక్ల ద్వాదశినాడు పుట్టిన వారు “బేరుండా దేవి”ని “ఓం ఐం హ్రీం శ్రీం ఈం “బేరుండా” నిత్యా శ్రీపాదుకాం పూజయామి తర్పయామి నమః అనే మంత్రంతో పూజించాలి.
శుక్ల త్రయోదశి నాడు పుట్టిన వారు “నిత్యక్లిన్నా దేవి”ని “ఓం ఐం హ్రీం శ్రీం ఇం “నిత్యక్లిన్నా” నిత్యా శ్రీపాదుకాం పూజయామి తర్పయామి నమః అనే మంత్రంతో పూజించాలి.
శుక్ల చతుర్ధశి నాడు పుట్టిన వారు “భగమాలినీ దేవి”ని “ఓం ఐం హ్రీం శ్రీం ఆం “భగమాలినీ” నిత్యా శ్రీపాదుకాం పూజయామి తర్పయామి నమః అనే మంత్రంతో పూజించాలి.
పౌర్ణమి నాడు పుట్టిన వారు “కామేశ్వరీదేవి”ని “ఓం ఐం హ్రీం శ్రీం అం “కామేశ్వరీ” నిత్యా శ్రీపాదుకాం పూజయామి తర్పయామి నమః అనే మంత్రంతో పూజించాలి.

                                https://youtube.com/shorts/hXs7ylVV_Rs?si=eAVlfsOGtiuuLmaF