Friday, 13 December 2019

కుంభ లగ్నం :

ఇది రాశి చక్రములో అత్యంత పవిత్రమైన నాల్గవ స్థిర లగ్నము . వాయుతత్వపు త్రిపుటి లో మూడవది . ఆధ్యాత్మిక స్థాయి స్థిరమగుటకు కూడా ఈ లగ్నము ప్రాతినిధ్యము వహించును. మంత్రోఛారణ చేయు సాధకులలో పరవశత్వము , తాదాత్మ్యత అను ప్రభావములు ఈ లగ్నానికి సంబంధించినవే. ఈ లగ్నము కార్యకారణములపై ఆధిపత్యము వహించుచున్నది. ఒకానొక ఆదర్శము , ఆశయము , వాస్తవ రూపము ధరించుటకు ఈ లగ్నమునకు , ఈ లగ్న భావమునకు గల కీలక సూత్రము. పరమ గురువుల పరమ లక్ష్యము వాస్థవీకరించుటలో ఈ లగ్న దివ్య కారకత్వమే కారణము. బాధలు , కష్ట నష్టములు , అగ్ని పరీక్షలు , కరువు కాటకములు , మొదలైన బాధలు,గాధలు చేదుగా మారుచున్నప్పుడు ఈ లగ్న అధిపత్యము ఏర్పడును. యురేనస్ అను వరుణ గ్రహ మూర్తి ఈ లగ్నముపై సంపూర్ణ ఆధిపత్యము వహించును. ఈ లగ్నము యొక్క రంగు నీలి రంగుకు , వంగఛాయకు మధ్యస్థముగా వుండు ఛాయావర్ణము. సంగీతము మీద కూడా ఈ లగ్నమునకు ఆధిపత్యము కలదు. ఈ సంగీతము ఆత్మాభివ్యక్తీకరణ చెందు దివ్య సంగీత మగును. అనగా గాంధర్వ గానమగును. వరుణ గ్రహము సృష్టి లయములో ప్రధాన భూమికను పోషించును. అందుకనే పెద్దలు ఇది శివుని మూడవ కంటిలో వుండు నదిగా వ్యాఖ్యానిస్తారు. ఈ లగ్నమందు ఏ గ్రహము ఉచ్చ పొందుట గాని , నీచ పొందుట గాని జరుగదు . బుధ శుక్రు లకు మిత్ర క్షేత్రము గాని , రవి చంద్ర కుజ గురు లకు శత్రు క్షేత్రము గాను వహించును.
లౌకిక కారకత్వములు :
లలిత కలల యందు అభిరుచి , సంస్కృతి , తెలివి తేటలు , ఏ పనినైనా వాయిదా వేయుట , సోమరితనము , ఓర్పు , మధ్యపానాశక్తి , కంటి జబ్బులు , నరముల బలహీనత , రక్త హీనత , రక్త దోషము , గుండె జబ్బు , బెణుకు , నెప్పులు , విపరీత వ్యాధులు , సూక్ష్మ గ్రహణ శక్తి , ఈ లగ్న మూల సూత్రము. ఈ లగ్నము వారికి ప్రస్తుతపు సమాజమునకు సంబంధించి తీరని అసంతృప్తి వుంటుంది. చట్టాన్ని , వ్యవస్థని , పునః నిర్మించాలని ఆలోచిస్తారు. ఒక నిర్దిష్ట లక్ష్యమునకు ఉన్ముఖమైన ప్రణాళిక గల జీవితము ఏర్పడును. వీరి శక్తిని వీరు గమనిస్తే జీవితమును సద్వినియోగ పరచుకోగలరు. చక్కటి తర్క జ్నానము వుండును. ఈ లగ్నము వారికి ఆత్మ విశ్వాసము తక్కువ. పరిసరముల వ్యక్తుల భావ తరంగములు వీరిని ఎక్కువగా ప్రభావితులను చేయును. మత సాంఘిక ,ఆర్ధిక, రాజకీయ , సమస్యలు పరిష్కరించే రంగాలు వీరికి ఉపయోగపడును. విద్యా సంస్థలు నడుపుటలో వీరు ప్రావీణ్యం ఎక్కువగా కలిగి వుంటారు. వీరిది ప్రేమ తత్వము కానీ ప్రేమ వ్యక్తీకరణకు సంబంధించిన పనులు చేత కావు. వీరిని దగ్గరగా వున్నవారి కన్నా కొత్త పరిచయస్తులు ఎక్కువగా గౌరవిస్తారు. ఎంతటి అపకారినైనను హాని చేయలేరు. జ్యోతిషం , యోగ విద్య , మానసిక శక్తుల సాధనము , వైద్య శాఖ , మనస్తత్వ శాఖ , మొదలైనవి వీరికి రాణించును. శారీరక శ్రమతో కూడినవి గానీ , మార్పు లేక ఒకే విధమైన పని గాని వీరు చేయలేరు. వీరు ఎక్కువగా మేల్కొని యుండుట వలన చిరాకు , నిద్రలేమి , నరముల పట్లు , మెడ ,వెన్ను నొప్పి , నీరసము వుండును.
లక్షణాలు :
బలిష్టమైన శరీరము , గుండ్రని ముఖము , చక్కటి ముఖ వర్చస్సు , కలిగి వుంటారు. ఇతరుల కష్టములను తమవిగా భావించి ఉపకారము చేయగలరు. ఇతరుల మనోభావములను బాగుగా గ్రహించగలరు.పలుకుబడిని సంపాదించు వారగుదురు. వీరు ఎల్లప్పుడూ కళత్ర సుఖము కోసము పాటుపడుచున్ననూ విచారమే కలుగుచుండును. వీరి జీవితములో మధ్య మధ్య అవమానములు , అపవాదులు , తటస్థించుచుండును. విశేషమైన జ్నాపక శక్తి , పట్టుదల ,కార్య సాధన , ఏ విషయాన్నైనా బాగుగా పరిశీలించిన పిదప కార్య రంగము లోనికి దిగుట ,
శాస్త్రీయమైన సత్యాన్వేషణ వీరికి స్వభావ సిద్ధ్హము . వీరి మంచితనము అంతరంగములో వుండును గాని పైకి కనిపించక పోవుట ఈ లగ్నము వారి యొక్క ప్రత్యేకతగా చెప్పవచ్చు. వీరు మత సంబంధమైన విషయాలలో ఆసక్తిని చూపిస్తారు. సుగంధ ద్రవ్యాలన్నా , పువ్వు లన్నా , ఎక్కువ ప్రీతి కలిగి వుంటారు.
వీరికి అంటు వ్యాధులు , దంత వ్యాధులు , రక్త ప్రసారము , మితిమీరిన శ్రమ , వీరి శరీరాన్ని ఇబ్బంది పెట్టవచ్చు.
ఈ లగ్నమునకు రవి,కుజ ,శను లు ఒంటరిగా కేంద్ర కోణములలో యోగము నిచ్చెదరు. గురువు లాభము నందు కంటే ద్వితీయాన యోగము నిచ్చును. శని ద్వితీయం , ద్వాదశములలో యోగము నిచ్చును.

Thursday, 12 December 2019

మకర లగ్నం :

రాశి చక్రములో ఇది నాల్గవ చర లగ్నము . ఈ లగ్నము బాలభాస్కర తేజస్సును సూచించును. మకర కాల గర్భము నందు అనంతములైన రహస్యములు దాగివున్నవని ఋగ్వేదమునందు సాక్ష్యము కలదు. అవి ఆధ్యాత్మిక సంకేత గర్భితములు. సూర్యకిరణములు దివ్య శక్తి పూరితములు. అవి ఉషః కాలమందు మరింత శక్తివంతంగా ఉండును. మకర మాసము దేవతల ఉషః కాలము. ఈ మకర లగ్నము మరణ ద్వారముగా గుర్తింప బడినది. జీవుల ఉత్పత్తికి అనగా పుట్టుటకు కర్కాటకము సంకేతము కాగా శారీరక మరణమునకు మకర లగ్నము ప్రభావము కలిగియున్నది. కాల స్వరూపుడు ఆయుష్కారకుడు , అయిన శని కి ఇది మొదటి స్వక్షేత్రము. మకర లగ్నము దేవతలకు ప్రాతః సంధ్యా కాలము. కర్కాటకము సాయం సంధ్యా కాలము. మొదటిది సురసంధ్య రెండవది అసుర సంధ్య . మకర లగ్నము నుండి కర్కాటకము వరకు లగ్నములు ఉత్తర దిశగా వంగి తోరణమువలె వుండును. దీనిని దేవాలయ పరిభాషలో మకర తోరణమని వ్యవహరించు చున్నారు. అనగా మరణమును అతిక్రమించిన దివ్య ప్రాంగణములోనికి అడుగిడుటకు సంకేతము. ఈ తోరణమే మానవునికి-దైవానికి వారధి. దైవము యొక్క సాయుజ్యమునను కాకపోయినను సామీప్యమును సూచించును. మకర , కర్కాటక లగ్నములకు అధిపతులైన శని , చంద్రులు ఇరువురు శీతల గ్రహములు. వీరికి భిన్నములైన సాంఖ్యసారూప్యము కలదు. ఒక రాశి ని అతిక్రమించుటకు చంద్రునికి 2 1/2 రోజులు పడితే శనికి 2 1/2 సంవత్సరములు పట్టుచున్నది. భౌతిక జన్మపై చంద్రునికి , భౌతిక మరణముపై శని కి ఆధిపత్య మెక్కువ.
లౌకిక కారకత్వములు :
ఈ లగ్నము కాలపురుషుని మోకాళ్ళని తెలియజేయును. వృషభ , కన్య, మకరములు శూద్రజాతికి చెందినవి. అత్యాశ , నేర్పరితనము , ఎత్తుగడలు , పిసినారి తనము , అధిక శ్రమ , స్వార్ధపరత్వము , దారుఢ్యము లేని శరీరము , అజీర్ణము , రక్త దోషములు , కీళ్లవాతములు , నెప్పులు , చర్మ వ్యాధులు , మొదలైనవి ఈ లగ్న కారకత్వము లోనివి.
లక్షణాలు :
గుండ్రని మొఖము , లోతైన కళ్ళు , సన్నని దేహము , కలిగి వుంటారు . ముతక అయిన తల వెంట్రుకలు కలిగి వుంటారు. కార్య సాధన స్వభావ మెక్కువ . పని నెరవేరే అవకాశముల కోసం ఎంతకాలమైనా వుంటారు. అమాయకుల వలె కనిపిస్తారు కానీ వ్యవహార సామర్ధ్యమెక్కువ. వీరిని కోపించిన వారిని అవసరమనుకుంటే సంతోషపెట్టి దాస్యము చేయించుకోగలరు.ఏ విషయములోనైనా తన క్రింద వారితో నిర్మొహమాటంగా ప్రవర్తించ గలరు. పై వారితో ప్రవర్తించలేరు. అపారమైన జ్నాపకశక్తి కలిగివుంటారు. అడ్రస్ లు , టెలిఫోన్ నెంబర్లు , ధరల వివరాలు , వేలకువేలు నోటిమీద గుర్తుంచుకొనగలరు. సంకల్ప బలం ఎక్కువ. ఓటమిని ఒక పట్టాన అంగీకరించరు.
మంచివాళ్ళని కూడా అనుమానించుట క్షేమమని వీరి నమ్మకము. కీడించి మేలెంచుట , ఏమరిపాటు లేకుండుట , వీరి మానసిక స్థితి . ధన , పదవీ వ్యామోహాలుంటాయి. అపకారము చేసిన మనిషిని ఎప్పటికీ మన్నించారు. వివాహ సందర్భములో తండ్రితో వివాదములు ఏర్పడవచ్చు.
ఈ లగ్నానికి అధిపతి అయిన శని ఆయుష్కారకుడు. ఈ శని నపుంసక గ్రహమే కాక క్రూర గ్రహము కూడా. తమోగుణ ప్రధానుడైన ఈతడు పశ్చిమ దిక్కునకు అధిపతి. దారిద్ర్యము , మరణము , ఆయుర్దాయము , దుఃఖము , దురదృష్టము , అనివార్య కష్టములు , ఆలస్యము , విషాదము , సోమరితనము , దీర్ఘ వ్యాధులు , , అలాగే జాగ్రత్త , పట్టుదల , శక్తి ,ధైర్యము , ఖర్చు చేయుటలో నేర్పరి తనము , పనులు చక్క బెట్టుటలో నేర్పు , ఆలోచనా శక్తి , జీవితములో ఒక ప్రత్యేక రంగములో అనుభవము కూడా ఇతని లక్షణములే ఇంకనూ మలమూత్ర వ్యాధులు , దంతములు , ఎముకల వ్యాధులు , ఆకస్మిక ప్రమాదములు , చలి , జలుబు , చేముడు , క్షయ , క్యాన్సరు , పక్షవాతము , మెదడుకి సంబంధించిన రోగములు , ఇతని కారకత్వములే . ఈ లగ్నమునకు బుధ , శుక్రు ల సంబంధము యోగము నిచ్చును. శని కేంద్ర కోణములలో యోగించును. శని , శుక్రు ల సంబంధము కేంద్రములలో మంచిది గాదు . శని , కుజు ల సంబంధము కేంద్ర , కోణములలో మంచిది. శని , గురు ల సంబంధం కేంద్రములయందు మంచిది. గురువు కేంద్రములయందు యోగించును. గురు , బుధ ల సంబంధము పాప స్థానముల యందు మంచిది. కుజుడు 4 , 10 , కేంద్రముల యందు , లాభము నందు యోగించును. శుక్రుడు
కోణములయందు యోగించును. సుకృనికి శని , బుధ ల సంబంధం వుండరాదు. బుధుడు కేంద్ర , కోణములలో యోగించును. రవి షష్టామవ్యయము లందు యోగించును. రాహు,కేతువు లు కేంద్రములందు యోగించును.

Wednesday, 11 December 2019

ధనుర్లగ్నము :

ద్వాదశ లగ్నాలలో ఇది తొమ్మిదవ లగ్నము. జాతకుల నవమ భావమునకు సంబంధించునది. ఈ లగ్నమును దివ్య ప్రభోదాత్మక లగ్నమందురు . సామాన్య మానవులకు సంబంధించి దూర ప్రయాణములను ,స్వప్నములను , ఆశయములను , స్వీయ ప్రణాళికలను ఈ లగ్నము సూచించును.
ఈ లగ్న ప్రభావము వలన మహా మహుములైన , ధర్మానిర్ణేతలు , న్యాయ వాదులు జన్మించుచున్నారు. ఈ లగ్నము ద్వి స్వభావము. బాణమును సంధించు ధనుర్ధారి ఈ లగ్న సంకేతము. బారి ప్రయోగము , గుర్రపు స్వారీ , గుర్రపు పందెములు , ఈ లగ్నాధిపత్యములో వుండును.
సూర్యుడు ధనస్సు లగ్నమున సంచరిస్తున్న సమయము విశేషమైన దివ్య ప్రభోదాత్మకమైన కాలము. అందులోనూ శుద్ధ ఏకాదశీ పర్వదినము , పండుగ(వైకుంఠ ఏకాదశి) . ఎండినవి అయిన పండ్లు ఈ లగ్న ప్రభావము లోనికి వచ్చును. పప్పు ధాన్యములు ఈ లగ్నాధిపత్యములో వుండును.
మంత్రము మననము చేయుటలో ఈ లగ్న సహకారము వుండును. ఈ లగ్నము దేవతల బ్రాహ్మీ ముహూర్త లగ్నము . ఈ లగ్నమునకు సంబంధించిన ధాతువు తగరము . ఇది బృహస్పతి ఆధీనములో వుండును.
లౌకిక కారకత్వములు :
ఈ లగ్నము క్షత్రియ లగ్నము . ఈ లగ్నమందు ఏ గ్రహము ఉచ్చ పడుట గానీ , నీచ పడుట గానీ జరుగదు . కానీ బుదునికి మాత్రము శత్రు క్షేత్రమే గాక హానికర ప్రదేశము కూడా అగుచున్నది. రవి , చంద్ర , కుజ లకు , మిత్ర లగ్నము . బుధ ,శుక్ర , శను లకు శత్రు లగ్నము.
ఉదార స్వభావం , ఎప్పుడు ఏదో ఒక పనిని చెయ్యటం , ఆటపాటలలో ఆసక్తి , ప్రజ్న , అకారణంగా ఇతరులపై అపనమ్మకం , తాత్విక చింతన , ప్రమాదాలకు గురియగుట , తొడలు , పిరుదులు , నరములు , వీటికి సంబంధించిన అనారోగ్యము , కీళ్ల వ్యాదులు , గాయములు , రక్త దోషములు , ఈ లగ్న ప్రభావములో వుండును. అదే విధంగా అశ్వసంపద , పత్రికలు , యాగ శాలలు , ఆయుధ సామాగ్రి కూడా ఈ లగ్న ప్రభావము లోనివే .
లక్షణాలు :
కాంతివంతమైన కళ్ళు , పొడవైన ముక్కు , దట్టమైన కనుబొమ్మలు , వెడల్పు ముఖము కలిగి అందముగా వుంటారు. వీరి మానసిక ప్రవృత్తి గంటకొరకముగా మారగలదు. దయా దాక్షిణ్యములు వున్ననూ శీఘ్ర కోపం కలిగి వుంటారు. గ్రహణ శక్తి , వాక్చాతుర్యము ఎక్కువ. మత , వేదాంత , సంగీత , సాహిత్య , కవిత్వముల యోడల ఆపేక్షను కలిగి వుంటారు.
పిత్రార్జిత ధనాన్ని వృద్ధి పరచ గలరు. భోగములను అనుభవిస్తారు. వీరి ఆర్ధికాభి వృద్ధి క్రమేణా జరుగును గానీ , ఆకస్మికముగా జరుగదు. భార్య పట్ల అనురాగము కలిగి వుంటారు.
నిస్సంకోచముగా, నిర్మొహమాటముగా, మాట్లాడటం వీరి నైజము. కుటిలత్వము వీరికి తెలియదు. వీర్కి ఏకాగ్రత శక్తి ఎక్కువ . వార్ధక్యము లో కూడా మనస్సును ఆశావంతముగా వుంచుకొని యువకుల లక్షణాలను కలిగి వుంటారు . కష్ట , సుఖముల యందు సమ భావములను ప్రదర్శించగలరు. నచ్చని వారి దగ్గరకు వెళ్లరు. చిన్న వయస్సులో కుటుంబ సంబంధ ఇబ్బందులు వుండవచ్చు. పట్టుదలతో స్వప్రయత్నంతో స్థిరపడగలరు. సోదర వర్గము అల్ప సంఖ్యలో వుంటుంది. వీరి సంతతి లో ఒకరు దత్తత పోవుట గానీ , దూరముగా పెరుగుట గానీ జరగవచ్చు.

Tuesday, 10 December 2019

వృశ్చిక లగ్నము :

ఇది రాశి చక్రమందు మూడవ స్థిర రాశి . రెండవ జల రాశి. "రహస్యం" అనేది ఈ లగ్నానికి చెందిన కీలక పదము. నీటి మడుగులు ,కుంటలు , లోతైన గుంటలు , నీడలో పెరుగు మొక్కలు , నేలపై పాకులాడు విష జంతువులు , నిర్మానుష్య ప్రదేశాలు , రహస్య ప్రదేశాలు , నేర ప్రవృత్తి గలవారు , ఈ లగ్న ప్రభావములో వుండును. అంతే గాక , దివ్య ప్రభోదములు అందుకొనదగు ప్రదేశములు , మహాతపశ్శాలురు అయినవారు కూడా ఈ లగ్న ప్రభావములోనే వుందురు .
రాశి చక్రమున ఇది 8 వ లగ్నము . దీని సాంఘిక శక్తి , అష్టమ భావ సూచకము . దీని ప్రభావము వలన మరణము,తెలివి కోల్పోవుట , స్పృహ తప్పుట , సంధి లక్షణములు లాంటికి అవసాన దశలు ఉత్పన్నమగును. పెద్ద ఉల్లిపాయలు , వెల్లుల్లి పాయలు , నల్లమందు , కొన్ని ఇతర మత్తు పదార్ధములు ఈ లగ్న ప్రభావములో వుండును. శరీరములో జననేంద్రియములు (మర్మ స్థానాలు) మూత్రపిండాలు ఈ లగ్న ప్రభావములో వుండును.
వృశ్చికలగ్నము అధోస్తాయి , సర్పములపై ఆధిపత్యము వహించును. వృషభం ఉన్నతస్థాయి ఆధ్యాత్మిక పారవశ్యమునకు సంబంధించినది. దేవదేవుడైన శ్రీకృష్ణుని కాళీయ మర్ధనములోని ఆంతర్యము ఈ రెండు లగ్నములకు సంబంధించినదై యున్నది. ఈ అనంత కాలగమనంలో నదుల వరదలు , సముద్రపు ఆటుపోటులు , ఉప్పెనలు , భూకంపములు , అగ్ని పర్వతపు ప్రేలుళ్ళు మొదలైనవి కూడా ఈ లగ్న ప్రభావములో వుండును. అష్టమ భావమునకు జ్యోతిష్య సంకేతము తంత్రము. అనగా మానవునిలోని లోపములను పూరించి శిక్షణ నిచ్చి పరిపూర్ణత్వమును కలుగ చేయుటలో ఈ లగ్న ప్రభావం ఎంతైనా వున్నది. కోరికలను చంపుకొనుట , భోగభాగ్యములను పరిత్యజించి యే కొండ గుహాలకో , అరణ్యాలకో తపస్సు నిమిత్తము ఒంటరిగా వెళ్ళటం కూడా ఈ లగ్న ప్రభావమే.
కారకత్వములు :
ఈ లగ్నము బ్రాహ్మణ జాతికి చెందినది. (అదే విధంగా జల లగ్నాలైన కర్కాటక , మీనా లగ్నాలు కూడా ) ఊహాబలము , అనుకరణ మనోచాంచల్యము , ఒక్కొక్కసారి ఏకాగ్రత , లౌకిక వ్యవహార జ్ణాన లోపము , వ్యంగ్యము , హేళన , వక్రముగా మాట్లాడుట - ఈ లగ్న ప్రభావము లోనివే .
లక్షణాలు :
అందమైన స్వరూపము గలవారు , ఆజానుబాహులు , విశాలమైన ముఖము కలవారుగా వుంటారు. దృఢమైన స్వభావము , మనో శక్తి , ఇతరులకంటే తాము గొప్ప అనిపించుకోవటంలో , పట్టుదల , కార్య దీక్ష , ముక్కోపము , ఆధ్యాత్మిక చింతన, రసాయనిక శాస్త్ర పరిశోధన , మొరటుగా ప్రవర్తించుట , రహస్య విషయములను తెలిసికొనుటలో ఇష్టతను కలిగి ఉంటారు. వీరి జీవితములో మొదటి భాగము కన్నా రెండవ భాగము అభివృద్ధి కారముగా వుండును.
ఈ లగ్నము వారికి గురుడు శుభుడు . గురువుకు రవి,చంద్ర సంబంధము మరింత మంచిది. అష్టమ లాబాధిపతి
అగుటచే బుధుడు , సప్తమ వ్యయాధిపత్యముచే శుక్రుడు , తృతీయాధిపత్యముచే శని పాపులాగుచున్నారు. రవి , చంద్రులు కేంద్ర , కోణములందు యోగించుడురు. కుజ , బుధుల కలయిక కానీ , కుజ , శుక్రుల కలయిక కానీ , కుజ శనుల కలయిక కానీ మంచిది కాదు.

Monday, 9 December 2019

తులా లగ్నము :

ఈ లగ్నము రాశి చక్రమున మూడవ చర లగ్నము. రెండవ వాయు తత్వపు లగ్నము. బ్రహ్మాండము నందలి ఆధార బిందువుకు , ధర్మమునకు , ఈ లగ్నము ప్రాతినిధ్యము వహించును. వైవిధ్యము నుండి ఏకత్వమును సాధించుట ఈ లగ్నము యొక్క ఆంతర్య ధర్మము. అంతర్ముఖ స్థితి నుండి బ్రహ్మాండము బాహ్యముగా వ్యక్తమగుటకు ఈ లగ్న ప్రభావమే కారణము. రాశి చక్రమున తులా లగ్నము సప్తమ లగ్నము . సప్తమము ద్వారా వివాహము , జీవిత భాగస్వామి , లైంగిక ఆకర్షణ మొదలగునవి ఇమిడి ఉండును. ఆధునిక నాగరికత యొక్క వైభవములైన మహానగరములు , పరిశ్రమలు , ఫోటోగ్రఫీ , సినిమా , నాటకము , జీవితము నందలి గొప్ప గొప్ప విలాస పూరితమైన అనుభవములు ఈ లగ్న ప్రభావానికి లోనై వుండును. నటులు , నృత్య కళాకారులు , కీర్తివంతులైన కళాకారులు ఈ లగ్న ప్రభావం లోనే వుంటారు. దుస్తులు , సువాసనా ద్రవ్యాలు , ఆహార పానీయాలు , రుచులు , అలంకరణ సామాగ్రి ,మొదలైనవి కూడా ఈ లగ్న ప్రభావం లోనివే .ఈ లగ్నము యొక్క సాంఖ్యాక శక్తి నాలుగు (4).
అయస్కాంతపు ఇనుము ఈ లగ్నము ప్రభావానికి చెందినది. మానవుని లోని అంతర్గత తత్వము లోని వివిధ అంశములను విస్తృత పరచి బాహ్యమునకు ప్రకటించుటలో ఈ లగ్న ప్రభావము ఎక్కువగా వుండును.
కారకత్వములు :
సమ బుద్ది , వాచాలత , సుఖలోలత , నిష్పాక్షిక ప్రవర్తన , అనుకరణ , ఆందోళన చెందుట , వినయ విధేయత , గౌరవము , రాజు , ప్రవర్తన , చట్టము , న్యాయము అను విశ్వాసము , అభిప్రాయాలలో స్పష్టత , ఒకప్పుడు ఆశ మరియొకప్పుడు నిరాశ , మోసమును తట్టుకోలేకపోవుట , పోల్చి చూచుట మొదలైనవి.
ఈ లగ్నము నందు జననమైన వారు పొడవుగా , చక్కగా శరీర సౌష్టవము కలిగి వుంటారు. చక్కని కనుబొమ్మలు , ముక్కు కొద్దిగా వంకర తిరిగి వుండుట , వీరి శిరో భాగము వయస్సు మీరిన కొలదీ బట్టతలగా మారును. ఈ లగ్నము వారికి సున్నిత స్వభావము , విషయములను నూతనముగా , లోతుగా ఆలోచించ గలగటం వుండును. వీరికి హాస్యమనిన ఇష్టము అధికము. కవిత్వ సంగీతాదుల పట్ల ఆసక్తిని కలిగి వుంటారు. ప్రయాణాలనిన ప్రీతికరము . ఎల్లప్పుడూ గౌరవ , ప్రతిష్టల కొరకు తాపత్రయ పడతారు. స్నేహ పాత్రులు . ఎంత త్వరగా కోపము వచ్చునో అంతా త్వరగా శాంతులవుతారు. వీరికి అభిమానము , స్వాతి శయము , ఎక్కువ. వీరికి మూత్రపిండములు , కటిప్రదేశము , మూత్రాశయములకు చెందిన అనారోగ్యములు , మధుమేహము , మలబద్ధకము , ఏర్పడే అవకాశము కలదు.
వీరికి విద్యుత్ శాఖ , రేడియో , టీ,వి ,ధర్మ శాస్త్రము , వాణిజ్యము , వైద్యము , మొదలైనవి రాణించే రంగములు . ఈ లగ్నము వారికి శని , బుధ లు శుభులు . తృతీయ ,షష్టాధిపతి అగుటచే గురువును , లాభాధిపతి అగుటచే రవి , ద్వితీయ , సప్తమాధిపతి అగుటచే కుజుడు పాపులు.
లగ్నాధిపతి లగ్నములో యోగమును ఇవ్వడు. మిగిలిన కేంద్రములైతే మంచివి.
చంద్రుడు పాప స్థానములందు యోగించును.
బుధుడు కేంద్ర , కోణములందు యోగించును.
రవి భాగ్యములో మంచివాడు .
గురువు కేంద్రములందు మంచివాడు.
శనికి కేంద్ర స్థితి మంచిదైనప్పటికి , లగ్న ,చతుర్ధాలందు మిక్కిలి యోగము ఇవ్వలేదు. మిగిలిన కేంద్రము (సప్తమ , దశమ) లందు అధిక యోగము నిచ్చును.
కుజుడు కేంద్ర స్థితి యందు బాగుండును.

Sunday, 8 December 2019

కన్యా లగ్నం :

ఇది రాశి చక్రమున రెండవ ద్విస్వభావ లగ్నము మరియు రెండవ భూ తత్వ లగ్నము . ప్రకృతి యొక్క మాతృత్వము కర్కాటకము కాగా ; పరబ్రహ్మము యొక్క మాతృత్వము కన్యా లగ్నము నందున్నది.. సౌందర్యము వృషభ లగ్నమునకు చెందినది కాగా అనుగ్రహము కన్యా లగ్నమునకు చెందినది. కన్యా లగ్నము నుండి వృశ్చిక లగ్నము వరకు 90 భాగాల భాగము మానవుని బొడ్డు నుండి తొడల వరకు ఆధిపత్యము వహించును. ఇతరులకు ఉపచారములు , సేవ చేయుటకు ఈ లగ్నము ప్రాముఖ్యము వహించుచున్నది. ప్రసూతి , శిశు సంరక్షణాలయములు ఈ లగ్న ప్రభావము లోనివే ! కాన్వెంట్లు , విద్యాభోదనము , అనాధ శరణాలయములు , వికలాంగుల పాఠశాలలు , కుష్టు రోగుల నివాస ప్రాంతాలు , క్షయ రోగ ఆసుపత్రులు , ఇవి ఈ లగ్న ప్రభావంలో ఏర్పడినవే ! రేడియో , చెరకు గడ ఈ లగ్న ప్రభావం నుండి ఉద్భవించినవే.
కారకత్వాలు :
శాస్త్ర విజ్నానము , లలిత కళలు , విమర్శనాత్మక శక్తి , సందేహ బుద్ధి , ఉదార స్వభావం , పారిశ్రామిక నగరాలు , పొట్ట , నాభి ప్రదేశము , వెన్నెముక క్రింది భాగము , అజీర్ణ వ్యాధులు , చురుకు దానము , శారీరక శ్రమ కన్నా మానసిక శ్రమ యందు యిష్టత , సిగ్గు , నవ్వు , గణిత శాస్త్రము , తర్కము , పలురకాలైన లిపుల వ్యాకరణము , జ్నాపక శక్తి , బెణుకుట , మానసిక వ్యాధులు , సహనము , భృత్యులు మొ ||వి .
లక్షణాలు :
సన్నని పొడవైన శరీరం , నల్లని కళ్ళు , నల్లని దట్టమైన వెండ్రుకలు , సుకుమార కంఠస్వరం , త్వరితంగా నడవటం , ఉన్న వయస్సు కన్నా తక్కువగా కన్పిస్తారు . మొహమాటం లేకుండా ఇతరుల చేత పనులు చేయించుకోగలరు. ఇతరుల తప్పులు ఎన్నుటలో ప్రసిద్ధులు. సుఖమన్నా , సుఖ జీవనమన్నా అధిక ప్రీతి వుంటుంది. సంగీత ప్రియత్వం వుంటుంది. ఉత్తరాలు వ్రాయటంలో నేర్పరులు. ఖర్చు చేయటంలో ఎక్కువ జాగ్రత్తను ప్రదర్శిస్తారు. మనసుకు నచ్చిన పనులు మాత్రమే చేస్తారు. కష్టమైన పనులు సులువెరిగి ప్రయత్నిస్తారు. వీరి కష్టములను ఎవరికైనా చెప్పుకొనుటలో తృప్తి పడతారు. వీరికి చొరవ ఎక్కువగానే వుంటుంది గానీ అంతకు మించి బిడియం కూడా వుంటుంది. అపకారం చేసిన వారిని చిరకాలం ద్వేషిస్తూనే వుంటారు. వాణిజ్య ప్రావీణ్యం వుంటుంది. నటన , అనుకరణము , హాస్యము , వక్తృత్వము , ఈ లగ్నప్రభావములోనివే .
ఈ లగ్నమునకు శుక్రుడు ఒక్కడే శుభుడు . తృతీయ అష్టమాధిపతి అగుటచే కుజుడును , ఉభయ కేంద్రధిపత్యమగుటచే గురువును , ముఖ్య పాపులు అవుతారు.
ఈ లగ్నానికి గురు , బుధ లు పాప స్థానాలలో వుంటే యోగిస్తారు. కుజుడు వ్యయమందు యోగమిచ్చుట ఈ లగ్నానికి గల ముఖ్య విశేషము.
శని దశమ కేంద్రమందు అధిక యోగమిచ్చును. రాహు , కేతువులు 3,6 యందున్న యొడల మంచిది.

Saturday, 7 December 2019

సింహ లగ్నం :

ప్రేమ , సత్ప్రవర్తన , ఉదాత్త గుణము , అవరోధాలను అధిగమించటం , పాలనా శక్తి , పోరాట పటిమ , ధర్మ స్థాపన , బలహీనులను సంరక్షించుట ఈ లగ్న స్వభావాలు. స్థిర స్వభావము , క్రమ శిక్షణల వ్యాప్తి.
ఈ లగ్న ప్రభావం లోనివి : హృదయము , తత్సంబంధిత స్వరూప స్వభావాల పైనా ఈ లగ్న ప్రభావం అధికం . తండ్రీ - కొడుకుల మధ్య నున్న సంబంధాన్ని ఈ లగ్నమును కూడా పరిశీలించి ప్రభావాన్ని ఎంచవలెను. ఎందుకంటే , పితృ కారకుడైన రవి లగ్నం కావటం వల్ల రాశి చక్రం లో అయిదవదిగా సంతతి భావాన్ని చూడటం దీనిలోని ఆంతర్యము.
లోహాలలో బంగారముపై ఈ లగ్న ప్రభావము ఉంటుంది . ఆహార పదార్ధాలలో గోధుమ , పానీయాలలో తేనె , దీని ప్రభావ పరిధి లోకి వస్తాయి. క్షత్రియ జాతికి చెందిన లగ్నము. అగ్నితత్వ లజ్ఞాలలో ఇది రెండవది.
లగ్న కారకత్వాలు :
గుండె , వీపు , వెన్నెముక , ఆరోగ్యము , ధైర్యము , వ్యాధులు , ప్రభుత్వ కార్యాలయాలు , అరణ్యములు , కెమికల్ లేబొరేటరీస్ , పట్టుదల , అత్యాశ , డాంబికము , ఆదర్శము , అభిమానము , కుతూహలము , ప్రధమ కోపము , ఓటమిని అంగీకరించకుండా ఉండుటం , కపటమెరుగని ప్రేమ , రహస్య గోపనాలు భరించలేక పోవటం ,కీర్తి కాంక్ష , శాసనాలు , సింహా ద్వారము , ఆఫీసు గది , తూర్పు దిక్కు , జనాకర్షణ , బట్టతల , ప్రాణము ఊపిరి , ఆత్మ , ఆయుర్ధాయము , వ్యక్తిత్వం , భగవద్భక్తి , దివ్య దృష్టి , ఇచ్చా శక్తి , పైత్య తత్వం , రక్తానికి సంబంధించిన -సిరలు, ధమనులు , రక్తస్రావం , కళ్ళు , గుండె జబ్బులు , మతి మరుపు , మూర్ఛ వ్యాధి , టైఫాయిడ్ , వంటి విష జ్వరాలు , కొన్ని రకాల చర్మ వ్యాధులు , రక్షణ శాఖ మొదలైనవి.
ఈ లగ్న మందు జన్మించిన వారు మంచి బలిష్టమైన దేహ నిర్మాణము , ఓజో ధాతువుని కలిగి వుండుట , అనారోగ్యము ఎంత త్వరగా వచ్చునో అంత త్వరగా ఆరోగ్యాన్ని పొందుట వీరి ప్రత్యేకత , అన్నీ విధాలైన భోగాల్ని అనుభవిస్తారు. శత్రువుల్ని జయిస్తారు .
వీరు చేసే పనుల పట్ల ఇతరుల అభిప్రాయాల కన్నా తమ అభిప్రాయానికే విలువిచ్చి నడచుకొందురు . దయా దాక్షిన్యాలు అధికంగా ఉంటాయి. శీఘ్ర కోపం ఉంటుంది. పొగడ్తలకి పొంగిపోతారు. అతి విమర్శ తట్టుకోలేరు. సమాజంలో ఎక్కువమంది వీళ్ళదృష్టికి ఆనరు. కారణమేమంటే వీళ్ళకి నచ్చని విషయాలు ఎదుటి వారిలో కన్పిస్తాయి . ఎంత తప్పు చేసినను క్షమించమని అడిగితే మంస్పూర్తిగా క్షమిస్తారు . ఆస్తి పాస్తులు , అధికార కాంక్ష కన్నా కీర్తి ప్రచార కాంక్షకు లొంగిపోతారు. వైద్య వృత్తులలో , రక్షణ శాఖలలో , అధికార రంగాలలో రాణిస్తారు. వీరిలో శతృత్వం కూడా సహజంగానే వుంటుంది. కోపించటం వీరి లక్షణం . కానీ కుట్ర చేయుట చేత కాదు. వీరి మీద ఆధారపడి ఏదో విధమైన ఆశ్రితులు ఉంటారు. అప్పులు చేయటానికి జంకరు. అధికారులతో చనువు త్వరగా ఏర్పరచుకుంటారు. దూర ప్రయాణాలు అధికంగా చేస్తారు. ప్రధమ సంతానానికి చిన్న వయస్సులో అనారోగ్య సూచనలుంటాయి.
ఈ లగ్నానికి రవి 1,2,4,5,9,10 భావములందు శుభ ప్రదుడు .
చంద్రుడు 3,4,6,8 లలో శుభుడు .
కుజుడు కేంద్ర కోణాలలోనూ 2,6,11 లలో శుభుడు .
బుధుడు కేంద్ర కోణాలలో శుభుడు .
గురువు కేంద్ర , కోణ , లాభ స్థానాలలో శుభుడు.
శుక్రుడు కోణములలో 3,4,8,9,10,11,లలో శుభుడు .
శని 6,8,10,11 లలో శుభుడు.
రాహువు 1,3,8,9,10 లలో శుభుడు.
కేతువు 3,4,6,7,10 లలో శుభుడు.

Friday, 6 December 2019

కర్కాటక లగ్నం :

ఈ లగ్నము ద్వితీయ చర లగ్నము . ఇది జలతత్వము కలది. ఈ లగ్నమునకు సున్నితత్వము అధికము . ఈ లగ్నము వలననే మనః కారకుడైన చంద్రుని వలన మనుషుల మానసిక ధోరణులు వ్యక్తమవుతూ వుంటాయి. సత్వగుణ ప్రధానమైనది. కళాత్మక దృష్టి , ఆచార వ్యవహారాలలో నమ్మకములు కలిగి వుంటాయి . స్త్రీ సంభంధ లక్షణాలు అధికం కొన్ని పర్యాయాలలో మానసిక స్థితి చంచలంగా వుంటుంది. పట్టుదల అధికం .ఏ విషయాన్నైనా సానుకూల దృక్పధంతోనే పరిశీలిస్తారు. ఉల్లాసభరిత మనస్తత్వము ఎక్కువగా వుంటుంది.
హాస్య ప్రసంగాలు ,చతురత , కళాత్మిక దృష్టి వుంటాయి. దైవ భక్తి , శ్రద్ధ విశ్వాసాలు అధికంగా వుంటాయి . శారీరకంగా చాలా ఆకర్షణీయంగా , కోమలత్వాన్ని , మృదుత్వాన్ని కలిగి వుంటారు. ఇతరుల అభిప్రాయాలతో సాధారణంగా ప్రతికూలించరు. అందరితోనూ స్నేహ సంభంధ లక్షణాలను , సహాయపడే తత్వాన్ని కలిగి వుంటారు. వృత్తి రీత్యా పేరు ప్రఖ్యాతలను కలిగి వుంటారు. సంఘంలో ఉన్నతస్థాయిని పొండటమే గాక, ఉత్తమమైన వ్యక్తిగా కూడా ప్రసిద్ధి పొందుతారు. పైకి ఎంతో ధైర్యాన్ని కనబరచినప్పటికీ అప్పుడప్పుడూ పిరికితనం కూడా కలుగుతూ వుంటుంది. ఆధ్యాత్మిక విషయాలపై శ్రద్ధ అధికం. చిన్న పిల్లల మనస్తత్వం , హాస్య ప్రియత్వం చాలా ఎక్కువగానే వుంటుంది . విజ్నానము అధికము . పలు విషయాలలో ప్రవేశం కూడా వుంటుంది. నీతి ప్రదమైన , గౌరవ ప్రదమైన , జీవనాన్ని అభిలషిస్తూ , కొనసాగిస్తూ ఉంటారు . సంభాషణా చాతుర్యము చాలా ఎక్కువ . ఆదరణీయ స్వభావము ఎక్కువ . నిర్ణయాలను తీసికోవటం చాలా ఆలోచించి , వేగంగా తీసుకుంటారు.
కొన్ని సందర్భాలలో బంధు రీత్యా మోసపోవటం కూడా వుండవచ్చు. అందరి తోనూ , స్నేహ భావంతో , సామరస్యంతోనూ వ్యవహరిస్తూ ఉంటారు. చురుకుదనము చాలా ఎక్కువగా వుంటుంది.
లక్షణాలు :
ఈ లగ్నానికి లగ్నాధిపతిగా చంద్రుడు శుభాలను కలిగిస్తాడు. మంచి ఆరోగ్యము , మనశ్శాంతి , మనోల్లాసములను చేకూరుస్తాడు . వృత్తిలో నైపుణ్యాన్ని కూడా కలిగిస్తాడు . కలల పట్ల అభిరుచి , ప్రవేశాలను కలిగిస్తాడు. ధనాధిపతిగా రవి కూడా శుభాలనే కలిగిస్తాడు . ప్రజా సంభంధాలు , ప్రభుత్వ రీత్యా ఆదాయాలను కలిగిస్తాడు. అధికార రీత్యా గౌరవ మర్యాదలు , పేరు ప్రతిష్టలు లభిస్తాయి . మంచి హోదా గల జీవనం వుంటుంది.
తృతీయ వ్యయాధిపతిగా అతి పాపి యైన బుధుని వలన సోదరీ - సోదరుల మూలకంగా అనవసర , అధిక ధన వ్యయం , వ్యవహార , వ్యాపారాలలో నమ్మిన వారి వలన నష్టాలు సంభవిస్తాయి . ఆరోగ్య భంగం కలుగుతుంది. వాహన . లాభాది పతిగా శుక్రుడు పాపి , వివాహాది విషయాలలో , వైవాహిక జీవనంలో అసౌకర్యాన్ని , సౌఖ్య లోపాన్ని కలిగిస్తాడు. భార్యాభర్తల మధ్య వియోగం , దూర ప్రాంతాలలో వుండుట , అన్యోన్యతానురాగాలు స్వల్పమగుట వంటివి కూడా వుంటాయి.
పంచమ రాజ్యాధిపతిగా 
కుజుదొక్కరే ఈ లగ్నానికి మిక్కిలి యోగప్రదుడు , శుభుడు . దీని వలన సంతాన రీత్యా యోగిస్తుంది . వృత్తి రీత్యా పేరు ప్రతిష్టలు , సుఖ సౌఖ్యాలు వుంటాయి. షష్ట భాగ్యాధిపతిగా గురువు అనారోగ్య సమస్యల నుంచి , ప్రమాదాల నుండి , దీర్ఘ వ్యాధుల నుండి రక్షిస్తాడు. పుణ్య క్రియలు , దైవభక్తి , శ్రేష్ట కర్మలను , అదృష్టాన్ని కలుగజేస్తాడు . సప్తమ అష్టమాధిపతిగా శని అతి పాపత్వాన్ని కలిగివుండటంవలన కళత్ర రీత్యా , అనుకోని చిక్కుల రీత్యా ఆవేదనలను , అసమతౌల్యతలను కలిగిస్తాడు. మానసిక ఆందోళనలు , చంచలత్వాన్ని కలిగిస్తాడు. నరముల సంభంధిత అనారోగ్యాన్ని కలిగిస్తాడు.

Wednesday, 4 December 2019

మిధున లగ్నం :

ఈ లగ్నము ప్రధమ ద్విస్వభావ లగ్నము. వాయుతత్వము కలది . ఈ లగ్నానికి వైరుధ్యములను దర్శించు శక్తి ఎక్కువ. మంచి - చెడుల వివేక లక్షణము ఈ లగ్నము యొక్క కీలక లక్షణము. జనన మరణాలను , చీకటి వెలుగులను వివేచించి చూడగల శక్తిని మానవుడు ఈ లగ్నము వలన పొందుచున్నాడు. ఈ లగ్నము వలననే జాతుల మధ్య , వ్యక్తుల మధ్య రాజకీయ మత భేధములు కలుగు చున్నవి. వైరుధ్యములను పరిష్కరించగల నిష్పక్ష పాత బుద్ధి కూడా ఈ లగ్నము నందే వుండును.
విజ్నాన శాస్త్రములో అతి నిర్ధుష్టమైన గణిత శాస్త్రము ఈ లగ్నాధిపతి అయిన బుధుని కారకత్వమునకు చెందినది .
బుధుని యొక్క సంఖ్యాత్మక శక్తి అయిదు గా ఋషులు గుర్తించారు . ఈ లగ్నము సత్వ గుణ ప్రధానమైనది . వైశ్య జాతి . ఈ లగ్న రాశి హరిత వర్ణముపై ఆధిత్యము గలది .ఈ లగ్నము నందు జన్మించిన వారు పొడవు , నిటారుగా ఉండు దేహము , సన్నని పాదాలు , నిశితమగు దృష్టిని కలిగి ఉంటారు . వీరికి చమత్కార ధోరణి ఎక్కువ . ఇతరుల అభిప్రాయములను కనిపెట్టి తదనుగుణముగా ప్రవర్తించుట వీరి ప్రత్యేకత . వీరికి ఏ విషయములోనైన పరిపూర్ణత సాధించుట చాలా కష్టము. వీరి మానసిక స్థితి అధోస్థాయికి చేరితే స్వామిద్రోహము చేయుటకు కూడా వెనుకాడరు. తప్పుడు మార్గాలలో నడవటం , కుటిలోపాయములు పన్నటం వీరికి సులభ సాధ్యము . నీతులు చెప్పినంతగా ఆచరించుట వుండదు. వీరికి ప్రయాణాలు ఎక్కువగా ఉంటాయి. రాత యందు , చర్చించుట యందు నిపుణత ఉంటుంది . వీరికి చురుకుదనము , చాకచక్యము ఎక్కువ . సందేహములు , చిరాకు ఎక్కువ. తక్కువ చొరవ కలిగిన వారు. ఇద్దరి మధ్య భేధాభి ప్రాయములను తీర్చి కలపగలరు. అవసరమనుకుంటే భేధాభిప్రాయములను సృష్టించి విడదీయగలరు . కంగారు , భయము , కోపము , వస్తే వీరి మానసిక శక్తి క్షీణించిపోవును. పైకి గంభీరతే గాని లోపల పిరికితనం ఉంటుంది. జాగ్రత్త ఎక్కువ . పని అవసరమనుకుంటే తలవంచి కూడా పూర్తి చేసుకుంటారు.
లక్షణాలు :
లగ్న , చతుర్ధాలకు బుధుడు అధిపతి ఆగుట కారణంగా , బంధువుల విషయాలలో గాని , కుటుంబ విషయాలలో గాని రహస్యాలుంటాయి . నరాల బలహీనతలుంటాయి . మానసిక వ్యాధులు , నత్తి , చెముడు , తలనెప్పి , ఉన్మాదములు కలుగుటకు ఈ బుధుదే కారణము . అదే విధంగా చట్టము , న్యాయము , ధర్మ శాస్త్రములందలి సూక్ష్మములు పసిగట్టుట కూడా ఈ లగ్నాధిపతి అయిన బుధుని కారణము . నిద్రపట్టక పోవటం , అతి ఆలోచనలు , దిగులు పడినప్పుడల్లా జీర్ణకోశము పాడగును . వృత్తులలో మార్పులేర్పడును . జీవితములో అదృష్టము ఒడిదుడుకులకు లోనగును. లాటరీ , స్పెకులేషన్ వంటి వ్యవహారములలో లాభించుటకు అవకాశము కలదు. ఈ పని చేసినను ఎంత లాభముండునోనని ఆలోచించి పని ప్రారంభిస్తారు. పూర్తిగా ఎవ్వరిని నమ్మరు. అష్టమ , నవమ లగ్నాలు శని సంభందములైనవి. కావున మోకాళ్ళు , మెడ , వెన్ను అవయవముల గురించి ఆరోగ్య విషయములలో జాగ్రత్తగా వుండాలి . షష్ట లాభములు కుజ లగ్నాలు కావటం మూలాన వీరి సోదరులలో ఒకరికి పెద్ద ఉద్యోగం వస్తుంది . పంచమ , వ్యయ లగ్నాలు శుక్ర లగ్నాలవటం వలన సంతతి మీద అపేక్ష ఎక్కువ గాను , ఖర్చు విషయం లో లోభత్వముగానూ ప్రవర్తిస్తారు. సప్తమ , దశమ లగ్నాలు గురు లగ్నాలు కావటం కారణంగా : అదృష్టము , అవకాశాలు , ధన విషయాలు చంచలంగా వుండును. ధన సంభంధ విషయాలలో పర స్త్రీ సాంగత్యం ఏర్పడవచ్చు. భార్య , పిల్లలకు వీరు విశ్వాస పాత్రులు కారు . మొత్తం మీద వీరికి తెలివి ఎక్కువ గాను ,సుఖము తక్కువ గాను వుండును.
లక్షణాలు :
సమన్వయ శక్తి తెలివి , విషయ పరిజ్నానము ,మేనత్తలు , మేనమామలు , సాధకులు , ప్రచారం , తంతి తపాలా , అనువాదము , రాయబారము , మిమిక్రీ , డిక్షనరీస్, పుస్తకాలు , రెవెన్యూ శాఖలు , వాణిజ్య శాఖలు ,టెలిఫోన్ ,టైపు , టెలివిజన్ , తెలివి తేటలు , శాస్త్ర పాండిత్యము , ధాన్యాగారములు , న్యుమోనియా , క్షయ , నాట్య శాస్త్రము , తర్క శాస్త్రము , అధర్వణ వేదము , బహుభాషా జ్నానము, మొదలైనవి.

Tuesday, 3 December 2019

వృషభ లగ్నం :

ఇది స్థిర లగ్నము . పృధ్వీతత్వాన్ని కలిగి వుంటుంది. రజోగుణమైనది .నీల వర్ణాన్ని కలిగి వుంటుంది. భోగము ,ఆనందము ,కార్య దీక్ష ,సౌందర్యము ,ప్రాక్టికల్ థింకింగ్ ఈ లగ్న మూల లక్షణములు.ముఖ్యముగా స్త్రీ పురుష లింగ భేధము నేర్పరచుటలో ఈ లగ్నము మూలకారణమవుతున్నది .ఎందుకంటే దీనికి సప్తమలగ్నమైన వృశ్చికము మర్మస్థానముల మీద ఆధిపత్యము కలిగివుండుట చేత మొత్తము సృష్ఠి అంతా కూడా వృషభ , వృశ్చిక లగ్నములను ప్రధానముగా చేసుకొని క్రీడించుచున్నట్లుండును.ఈ లగ్న స్త్రీ లలో కొన్ని పురుష సంభంధ లక్షణాలు, పురుషులలో స్త్రీ సంభంధ లక్షణములు మేళవించి వుండును.ఈ లగ్నము మిక్కిలి నిగూఢమైనది . సాక్షాత్తు దేవదేవుడైన శ్రీ కృష్ణ పరమాత్మ ఈ లగ్నము ద్వారానే తన పరిపూర్ణ అవతార విశేషమును వ్యక్తపరచుట మనము గమనించవచ్చు .
లక్షణాలు :
పట్టుదల , స్థిరమైన అభిప్రాయాలు , స్వభావమందు మార్పు లేకుండుట , సౌమ్యత ,త్వరగా కోపము రాదు ,వచ్చిన కోపము త్వరగా పోదు. ఈ లగ్నము వారికి మానసిక స్థితిలో లోపము ఏర్పడి దురభిప్రాయాలు ,ద్వేషము , ఈర్ష్యాసూయలు ఏర్పడి అవి కూడా స్థిరపడి పోవును . వీరికి స్వలాభ తత్వమధికము . ఇతరుల అభిప్రాయములను విందురే గాని తమకు తోచిన విధము గానే ప్రవర్తింతురు . వీరికి ఆటుపోటులను తట్టుకోగల శక్తి ప్రకృతి సహజముగానే ఏర్పడగలదు .ఎంత పెద్ద విజయమైనప్పటికి వీరిని ఆశ్చర్య పరచదు .దానికి కారణం అదలా రావటం సహజమేనని వారికున్న నమ్మకం .వీరి మానసిక స్థితి ఉన్నతముగా బలీయముగా రూపొందుతున్న కొద్దీ వీరికి రాజకీయము ,అధికారాలు , పెద్ద పెద్ద సంస్థల బాధ్యతల నిర్వహణ వీరికి సులువు అవుతుంది. వీరు కష్టపడి పని చెయ్యటం , చేయించటం తెల్సిన వారు. వృక్షాల పెంపకం , జంతు పోషణ ,వ్యవసాయం , వ్యాపారాలు వీరికి రాణిస్తాయి . ఒక పనికి ఆరంభంలో కొద్దిగా బద్ధకించిననూ మొదలు పెడితే చివరి వరకు నిలబడటం వీరిలోని ప్రత్యేక గుణం . వీరికి టైమ్ సెన్స్ ఎక్కువ . ఇతరులకు విసుగనిపించే విషయాలు వీరికి కుతూహలంగా మారతాయి . పరశుభ్ర త , ఇంద్రియ తృప్తి , రుచులను కోరుకుంటారు.వీరు కష్టపడుట మాత్రమే గాక బాగుగా సుఖపడుట కూడా తెల్సిన వారు .తమకు దక్కవలసిన వాటిలో అణాపైసలు కూడా వదిలి పెట్టరు. వీరికి కీర్తి కాంక్ష ఎక్కువ . వీరితో చెలిమి కూడిన వారిని ఇంకొకరితో చనువుగా వుండటం వీరు సహించలేరు .
ఈ వృషభ లగ్నానికి ఇతర నైసర్గిక లగ్నాల ద్వారా ఏర్పడే శుభాశుభములు సప్తమ ,వ్యయ లగ్నములు కుజ లగ్నముల కారణముగా చిన్న తనములో ఎత్తు మీద నుండి క్రింద పడటం , జల సంభంధ ప్రమాదాలు , మర్మాంగ దోషాలు , తృతీయ చంద్ర లగ్నము కారణముగా శ్వాస కోశ సంభంధ వ్యాధులేర్పడతాయి . అతి శ్రమ ,అతి భోజనము వలన అజీర్ణ వ్యాధు లేర్పడతాయి . తో బుట్టువులతో మంచి సంభంధ బాంధవ్యాలు ఏర్పరచుకోవటం కష్టము . ధన , పంచమ లగ్నాలు బుధ లగ్నాలు కారణంగా ఈ లగ్నము వారికి ఆకస్మికంగా ధన యోగాలు ఏర్పడును. 30 సంవత్సరాల లోపు కలిగిన సంతతి వీరి మాట వినరు. వీరి శత్రువులు వీరికి ప్రత్యక్షంగా వుంటుంటారు . మానసిక కర్మ క్షేత్రాలు (సింహం , కుంభం) స్థిర లగ్నాలవటం చేత మంచి శరీర పటుత్వముతో నలుగురి శ్రమ వీరొక్కరే చెయ్యగలగటం , స్థిరముగా కూర్చొని పని చేస్తున్న కొద్దీ వీరి శక్తి సామర్ధ్యాలు మరింత పెరగటం , వీరి శ్రమని తమకు నచ్చిన వారు గుర్తించాలని కోరుకోవటం , ప్రతివిషయాన్నీ బాగుగా పరిశీలించిన తరువాతనే ఒక నిర్ణయానికి రావటం వీరి ప్రత్యేక లక్షణాలు .
ఈ లగ్నానికి శుక్రుడు కోణ,వ్యయమాలలో యోగిస్తాడు.
చంద్రుడు కేంద్రాలలో కన్నా కోణాలలో శుభుడు.
రవి కేంద్రాలలో యోగించును.
పాప స్థానాలలో గురువు యోగించును.
శని , కుజ లు , అదే విధంగా రాహు ,కేతు వులు కూడా కేంద్రాలలో యోగిస్తారు.
బుధుడు కోణములలో యోగించును .

Monday, 2 December 2019

మేష లగ్నము :

మేష లగ్నము నుండి బహిర్గతమవుతున్న లక్షణములను గమనించిన అవి ఈ లగ్నమునకు తక్కిన లగ్నములకు ఏర్పడుతున్న నైసర్గిక శుభా శుభ సంభంధములుగనే గోచరించును. ఈ లగ్నము పరిణామానికి ప్రారంభము. ఆందోళన , ఆవేశము , మోసపోవుట , తొందరపాటుదనము , నిజాయితీ , అందరికంటే అధికంగా ఉండాలని కోరుకోవటం , ఆ ప్రయత్నాలలో కొన్ని పర్యాయములు ఈర్ష్యాసూయలకు లోనవటం , స్థాన మార్పును కోరుకోవటం - ఈ లగ్నము యొక్క మూల లక్షణాలు. ఈ లగ్నమునకు శుక్రుడు అశుభుడగుట చేత స్త్రీ మూలక వివాదములు , నష్టములు కలగటము , ఈ లగ్నానికి తృతీయ షష్టాధిపతిగా బుధుడు ఇంకొక అశుభుడగుట చేత వ్యాపార సంభంధ నష్టాలు , బంధువులతో సఖ్యత లేకపోవుట , లాటరీ ,జూదం వంటి వాటిలో చిక్కులు కలుగుట , అదే విధంగా దశమ లాభాధిపతిగా శని మరియొక పాపి ఆగుట చేత ఆలస్యాన్ని తట్టుకోలేక పోవుట , ఆందోళన, అధికారులు పెద్దల యొక్క ఆధిక్యతను అంగీకరించలేక ప్రశ్నించుట , లగ్నాధిపతి యైన కుజుడు సోదర కారకుడు కావున తోబుట్టువులలో మరణములుండుట , రవికి పంచమాధిపత్యము చేత అల్పసంతానము మాత్రమే వుండుట మొదలగు లక్షణాలు ఈ లగ్నానికి ఏర్పడుతాయి.
అంతే గాక , క్షణికావేశం , వ్యాయామ ప్రీతి ఆలోచనా రహితంగా పనులు ప్రారంభించుట , నిలకడ లేని స్థితి , దెబ్బలు తగులుట , పోలీసులు లేక కోర్టు వ్యవహారములు , విద్యావిఘ్నాలు , కుటుంబ కష్టాలు , దూర ప్రాంతాలలో స్థిర పడుట, లగ్న మందు సూర్యుని ఉచ్చ స్థితి వలన పెద్ద పెద్ద పదవులు నిర్వహించగల సామర్ధ్యము , నీతి ,
నిజాయితీ లు కల్గిఉంటారు . ముఖస్తుతికి లొంగుతారు. తలకు , కంటికి , జీర్ణశయములకు సంబంధించిన రోగాలు ఈ లగ్న జాతకులకు సంభవిస్తాయి .
లగ్నాధిపతియైన కుజుని కారకత్వములు :
వైద్య శాఖలు ,రక్తము , భూమి , సోదరులు , మిలటరీ , పోలీసు , శత్రువులు , ఋణములు, వడ్డీలు , కురుపులు , కలరా మశూచికం , మూర్ఛ , క్షయ , గాయాలు , జ్వర భాధలు , అంటూ వ్యాధులు , పైల్సు , ఆయుధాలు , కుసుమ వ్యాధులు , పరస్థల నివాసము , ఆపరేషన్స్ , పరుష పదజాలము , నిందలు , విదేశీ యానము , ఇంగ్లీషు భాష , ఏక్సిడెంట్స్ , దొంగతనములు , భూకంపములు , ఈ కుజుని కారకత్వములు .శరీరములో కనుబొమ్మలనుండి కంఠము వరకు ఈయన ఆధిపత్యము ఎక్కువ.
విశేషాలు :
ఈ లగ్నమునకు రవి , గురు లు శుభులు . ప్రత్యేకించి గురువు యోగ కారకుడు కోణములందు గురువున్న చాలా అదృష్టము , ఆర్ధిక స్థితి తప్పక ఏర్పడుతుంది.
కేంద్రాధిపత్య దోషము వల్ల చంద్రుడు పాప స్థానాల్లో యోగిస్తాడు .
చంద్ర ,బుధు లు కేంద్ర కొణాలలో వుండగా , బంధువులతో అనుకూల స్థితిని ,వ్యాపార విజయాన్ని కలిగిస్తారు .
చంద్ర , కుజ లు కేంద్ర కొణాలలో వుంటే వృత్తి , ఉద్యోగాలకు , ధన భావానికి , మంచి అవకాశాలు కలుగుతాయి.
వ్యయం లో చంద్రుడున్నచో విదేశీ ప్రయాణాలకు , ఉన్నత విద్యలకు దోహదమవుతుంది .
కేంద్ర కోణాలలో శుక్రుడు - కుజ సంభంధము వలన కళత్ర సౌఖ్యం , గృహ సౌఖ్యం కలుగుతాయి .
దశమ కేంద్రములో లగ్నాధిపతి వుండుట అశుభము . వృత్తి ఉద్యోగాలలో నిలకడ వుండదు.
ఏకదశంలో రాహువున్న యొడల వీరిని పరుల యొక్క ఈర్ష్యాసూయల నుండి రక్షిస్తాడు . భాగ్యరాజ్యాధిపతుల యుతి ఈ లగ్నము వారికి మేలు చేయదు.

Sunday, 1 December 2019

VEDIC EVENTS FOR THE MONTH OF DECEMBER 2019.


03 DEC – 8th WAXING MOON
05 DEC –MERCURY ENTERS SCORPIO
08 DEC – EKADASI
09 DEC – SOMA PRADOSHAM
12 DEC – FULL MOON
15 DEC – VENUS ENTERS CAPRICORN
16 DEC – SUN ENTERS SAGITTARIUS
18 DEC – 8TH WANNING MOON
22 DEC – EKADASI
24 DEC – MINI SHIVARATRI
25 DEC – CHRISTMAS

25 DEC – MERCURY ENTERS SAGITTARIUS
25 DEC – MARS ENTERS SCORPIO
26 DEC – NEW MOON
26 DEC – HANUMAN JAYANTHI

వర్గులు - వివరణ :

వర్గులు - వివరణ ..

జాతక చక్రములో కొన్ని శుభ గ్రహములు ఫలితాన్ని అందించవు. దానికి కారణము ఆ చక్రములో ఆ గ్రహానికి గల బలము, ముందుగా మనం గ్రహ బలాలను లెక్కించాలి.
అదే విధంగా భావాలను పరిశీలించేటప్పుడు వివిధ కోణాల నుండి పరిశీలించాలి. వాటి కోసమే రాశి , నవాంశ , దశాంశ , చక్రాలను పరిశీలిస్తూంటాము.
రాశి అంటే 30 డిగ్రీలు. దానిని విభిన్న శాస్త్రవేత్తలు , విభిన్న పద్ధతులలో విభజించి తద్వారా ఫలితాలను తెలిపారు. ఈ విభజననే వర్గులు అంటారు.
కొన్ని వర్గులు :
షడ్వర్గు : రాశి , హోర , ద్రేక్కాణ , నవాంశ , ద్వాదశాంశ , త్రింశాంశ .
సప్త వర్గు : రాశి , హోర , ద్రేక్కాణ , సప్తాంశ , నవాంశ , ద్వాదశాంశ , త్రింశాంశ .
దశ వర్గు : రాశి , హోర , ద్రేక్కాణ , సప్తాంశ , నవాంశ , దశాంశ , ద్వాదశాంశ , షోడశాంశ , త్రింశాంశ , షష్ట్యాంశ .
షోడశ వర్గు : క్షేత్రము , హోర , ద్రేక్కాణ , తుర్యాంశ, సప్తాంశ , నవాంశ , దశాంశ , ద్వాదశాంశ , షోడశాంశ , వింశాంశ, చతుర్వింశాంశ , నక్షత్రాంశ(భాంశ) , త్రింశాంశ , వేదాంశ , అక్షవేదాంశ , షష్ట్యాంశ .
గ్రహము నీచలో ఉన్ననూ , అస్తంగతమైననూ , శుభ వర్గులు నశించును. అట్టి గ్రహము శుభ ఫలితముల నీయదు.

Saturday, 30 November 2019

షోడశ వర్గీయ గ్రహ బలము :


షోడశ వర్గీయ గ్రహ బలము .

ప్రతి గ్రహమునకు క్షేత్రము ,హోర , ద్రేక్కాణ మొదలుగా గల షోడశ వర్గులను కనుగొనాలి. ప్రతి గ్రహమునకు మిత్ర వర్గులు ఎక్కువగా వుంటే ఆ గ్రహము బలమైనదిగాను , శత్రు వర్గులు ఎక్కువగా వుంటే ఆ గ్రహము బలహీనమైనది గాను భావించాలి.
ఉదాహరణ జాతకమునకు షోడశ వర్గులను వేసి బలాబలాలు చూద్దాం .
పుట్టిన తేదీ : 22.05.1980. సాయంత్రము 15:26. (మంగళగిరి లో పుట్టెను).
మొదట రవి గ్రహమును తీసుకొని షోడశ వర్గు చక్రములో అది వుండే రాశిని బట్టి అది మిత్ర క్షేత్రమో , లేదా శత్రు క్షేత్రమో తెలుసుకోవాలి.
జనన సమయమున రవి వృషభం లో 9డిగ్రీ .19ని లలో వున్నాడు . మిత్ర,శత్రు క్షేత్ర పట్టిక నుండి రవి యొక్క శత్రు, మిత్ర వర్గులను చూద్దాము.
క్షేత్రము లేక రాశి : రవి వృషభం లో వున్నాడు. రవికి వృషభం శత్రు క్షేత్రం. కావున రవికి శత్రు వర్గు 1.
హోర : రవి వృషభంలో 9డిగ్రీ .19ని లలో వున్నాడు . అనగా 15 డిగ్రీ లోపు వున్నాడు. కావున వృషభం లో 15 డిగ్రీ ఎదురుగా 4 అనగా కర్కాటకం లో వున్నాడు. రవికి కర్కాటకం శత్రు క్షేత్రం. కావున రవికి శత్రు వర్గు 1.
ద్రేక్కాణ : రవి వృషభం లో 10 డిగ్రీ లోపు వున్నాడు. కావున 10 డిగ్రీ ఎదురుగా గల సంఖ్య 2 అనగా వృషభం లో వున్నాడు. రవికి వృషభం శత్రు క్షేత్రం కావున రవికి శత్రు వర్గు 1.
చతుర్ధాంశ లేక పాదాంశ : రవి వృషభంలో 7 డిగ్రీ 30ని లను దాటి 15 డిగ్రీ లోపు వున్నాడు. కావున వృషభం లో 15 డిగ్రీ లోపు వున్నాడు. కావున 15డిగ్రీ ఎదురుగా గల సంఖ్య 5 అనగా సింహం లో వున్నాడు. రవికి సింహం స్వక్షేత్రం కావున రవికి మిత్ర వర్గు 1.
సప్తాంశ : రవి వృషభంలో 8 డిగ్రీ 34ని 17సె లను దాటి 12డిగ్రీ 51ని 26 సె లోపు వున్నాడు. కావున వృషభంలో 12డిగ్రీ 51ని 26సె ఎదురుగా గల సంఖ్య 10 అనగా మకరం లో వున్నాడు. రవికి మకరం శత్రుక్షేత్రం కావున రవికి శత్రు వర్గు 1.
నవాంశ : రవి వృషభం లో 6 డిగ్రీ 40 ని దాటి 10 డిగ్రీ లోపు వున్నాడు. కావున వృషభం లో 10 డిగ్రీ ఎదురుగా గల సంఖ్య 12 అనగా మీనం లో వున్నాడు. రవికి మీనం మిత్రా క్షేత్రం . కావున రవికి మిత్రా వర్గు 1.
దశాంశ : రవి వృషభం లో 9డిగ్రీ లను దాటి 12 డిగ్రీ లోపు వున్నాడు. కావున వృషభంలో 12 డిగ్రీ ఎదురుగా గల సంఖ్య 1 అనగా మేషం లో వున్నాడు. రవికి మేషం ఉచ్చ క్షేత్రం . కావున రవికి మిత్రా వర్గు 1.
ద్వాదశాంశ : రవి వృషభంలో 7 డిగ్రీ 30ని దాటి 10 డిగ్రీ లోపు వున్నాడు. కావున వృషభంలో 10 డిగ్రీ ఎదురుగా గల సంఖ్య 5 అనగా సింహంలో వున్నాడు. రవికి సింహం స్వక్షేత్రం . కావున రవికి మిత్రా వర్గు 1.
షోడశాంశ : రవి వృషభంలో 7డిగ్రీ 30ని దాటి 9డిగ్రీ 22ని 30సె లోపు వున్నాడు. కావున వృషభంలో 9డిగ్రీ 22ని 30సె ఎదురుగా గల సంఖ్య 9 అనగా ధనుస్సు లో వున్నాడు. రవికి దఃనుస్సు మిత్రా క్షేత్రం . కావున రవికి మిత్ర వర్గు 1.
వింశాంశ : రవి వృషభంలో 9డిగ్రీ లను దాటి 10డిగ్రీ 30ని లోపు వున్నాడు. కావున వృషభంలో 10డిగ్రీ 30ని ఎదురుగా గల సంఖ్య 3 అనగా మిధునంలో వున్నాడు. రవికి మిధునం శత్రు క్షేత్రం . కావున రవికి శత్రు వర్గు 1.
చతుర్వింశాంశ (సిద్ధాంశ ) : రవి వృషభంలో 7డిగ్రీ 45ని లను దాటి 10 డిగ్రీ లోపు వున్నాడు. కావున వృషభంలో 10 డిగ్రీ లకు ఎదురుగా గల సంఖ్య 11 అనగా కుంభంలో వున్నాడు. రవికి కుంభం శత్ర క్షేత్రం. కావున రవికి శత్రువర్గం 1.
నక్షత్రాంశ ( భాంశ ) : రవి వృషభంలో 8 డిగ్రీ 53 ని 20సె లను దాటి 10 డిగ్రీ లోపు వున్నాడు. కావున వృషభంలో 10 డిగ్రీ ఎదురుగా గల సంఖ్య 10 అనగా మకరంలో వున్నాడు. రవికి మకరం శత్రు క్షేత్రం . కావున రవికి శత్రు వర్గు 1.
త్రింశాంశ : రవి సరి రాశి యగు వృషభంలో 9డిగ్రీ 19ని లోపు వున్నాడు. అనగా మొదటి 12 భాగలలో వున్నాడు. అనగా మిధునంలో వున్నాడు. రవికి మిధునం శత్రు క్షేత్రం కావున రవికి శత్రు వర్గు 1.
ఖవేదాంశ : రవి వృషభంలో 9 డిగ్రీ దాటి 9 డిగ్రీ 45ని లోపు వున్నాడు. కావున వృషభంలో 9డిగ్రీ 45ని ఎదురుగా గల సంఖ్య 7 అనగా తుల లో వున్నాడు. రవికి తుల నీచ క్షేత్రం కావున రవికి శత్రు వర్గు 1.
అక్ష వేదాంశ : రవి వృషభంలో 8డిగ్రీ 40ని లను దాటి 9డిగ్రీ 20ని లోపు వున్నాడు. కావున వృషభంలో 9డిగ్రీ 20ని ఎదురుగా గల సంఖ్య 6 అనగా కన్యలో వున్నాడు. రవికి కన్య శత్రు క్షేత్రము కావున రవికి శత్రు వర్గు 1.
షష్ట్యంశ : షష్ట్యంశ లో ఒక్కొక్క భాగము 30 లిప్తలు ప్రమాణం కలిగి వుంటుంది. ఇచ్చట రవి సరి రాశి యగు వృషభంలో 9డిగ్రీ 19ని లోపు వున్నాడు. 9*2=18 భాగములు దాటి 19 లిప్తలులో వున్నాడు. అనగా రవి 19 వ భాగంలో సమ రాశి యగు వృషభంలో వున్నాడు. సమ రాసులలో 19 శుభము . కావున రవికి మిత్ర వర్గు 1.
రవికి మిత్ర వర్గులు 6. శత్రు వర్గులు 10. రవి ఎక్కువగా శత్రు వర్గులు కలిగి వుండుటచే రవి పాప ఫలితాలను ఇస్తాడు.
ఈ విధంగా ప్రతి గ్రహమునకు షోడశ వర్గులను కనుగొని ఆ గ్రహము యొక్క బలా బలాలను కనుగొన వచ్చును .

Friday, 29 November 2019

సర్వాష్టకవర్గు ననుసరించి కొన్ని ఫలములు :

సర్వాష్టకవర్గు ననుసరించి కొన్ని ఫలములు :

సర్వాష్టకవర్గు నందు 30 కంటే ఎక్కువ బిందువులున్న రాశి కార్య సిద్ధిని కలిగించును. శుభ ఫలితాలను యిచ్చును. 25,30 ల మధ్య బిందువులున్న రాశి సాధారణ ఫలమును యిచ్చును. 25 కంటే తక్కువ బిందువులున్న రాశి ఫలితాన్ని యివ్వదు .
లగ్నములో 25 , ద్వితీయ స్థానములో 22 , తృతీయ స్థానములో 29 , చతుర్ధస్థానములో 24 , పంచమ స్థానములో 25 , శష్ట స్థానములో 34 , సప్తమ స్థానములో 19 , అష్టమ స్థానములో 24 , నవమ స్థానములో 29 , దశమ స్థానములో 36 , ఏకాదశ స్థానములో 54 , ద్వాదశ స్థానములో 16 కు తక్కువ కాకుండా బిందువులుంటే ఆ భావాలు బలమైనవి.
లగ్న మందు , చంద్ర రాశి లోనూ , 30 కన్నా ఎక్కువ బిందువులుండి , గురువు యొక్క శుభ దృష్టిని కలిగి వుంటే నాయకుడు లేదా అధికారి అవుతారు.
లగ్నములో 25 కంటే ఎక్కువ బిందువులుండి 9 వ స్థానములో 29 కంటే ఎక్కువ బిందువులుండి , ఆ రెండు స్థానాలకు పాప గ్రహ దృష్టి లేకపోతే సంపద లభిస్తుంది.
4 వ స్థానములో 24 కంటే ఎక్కువ బిందువులుండి , 2 వ స్థానములో 22 కంటే ఎక్కువ బిందువులుండి , ఆ రెండు భావములకు పాప గ్రహ దృష్టి లేకపోతే పూర్వీకుల ఆస్తి లభించును.
10 వ స్థానములో 36 కంటే ఎక్కువ బిందువులుంటే స్వయంగా ధనాన్ని సంపాదిస్తారు.
11 వ స్థానములో 36 కంటే ఎక్కువ బిందువులుంటే ద్రవ్య లాభం కలుగుతుంది.
1,4,7 స్థానములలో 30 కంటే ఎక్కువ బిందువులుంటే అధికారం లభిస్తుంది.
4 వ స్థానములో 40 కంటే ఎక్కువ బిందువులుండి , ఆ స్థానం గురువుకి ఉచ్చ స్థానమై , అచట గురువు యుండి , కుంభములో శని , మీనంలో శుక్రుడు , మకరంలో కుజుడు వుంటే జాతకుడు , విశేష ధనవంతుడు అవుతాడు.
11 వ స్థానంలో కంటే 12 వ స్థానంలో బిందువులు ఎక్కువగా వుంటే అధిక వ్యయం చేస్తాడు.

Thursday, 28 November 2019

జాతకచక్ర పరిశీలనలో “దగ్ధరాశి”



జాతకచక్ర పరిశీలనలో “దగ్ధరాశి”

జాతకచక్రాన్ని పరిశీలన చెసేటప్పుడు,ప్రశ్నచక్రాన్ని పరిశీలన చేసేటప్పుడు దగ్ధరాశిని పరిశిలించటం ఎంతో ముఖ్యం.ముందుగా జాతకచక్రంలో జన్మతిధిని గాని,ప్రశ్నచక్రంలో ప్రశ్నదినపు తిధిని గాని గుర్తించాలి.ప్రతి తిధికి కొన్ని రాశులు దగ్ధ రాశులగును.దగ్ధ రాశులలో పడిన భావములు తమ కారకత్వాలను పోగొట్టుకొనును.అలాగే దగ్ధ రాశులలో ఉన్న గ్రహలు కూడ తమ కారకత్వాలను ఇవ్వజాలవు.
ఉదా;-జాతకచక్రంలో గాని ప్రశ్నచక్రం లో గాని జన్మతిధి లేక ప్రశ్నదినపు తిధి పాడ్యమి అనుకుంటే పాడ్యమి తిధికి దగ్ధరాశులు తులారాశి ,మకరరాసులు అవుతాయి.
జన్మలగ్నం గాని ప్రశ్నలగ్నం గాని మేష లగ్నం అయితే తులారాశి సప్తమ బావం,మకర రాశి దశమ బావ కారకత్వాలను ఇవ్వజాలవు,సప్తమ,దశమ బావాలలో ఉన్న గ్రహాలు కూడా తమ కారకత్వాలను ఇవ్వజాలవు.
సప్తమ బావ కారకత్వాలు:-వైవాహిక జీవితం,వ్యాపార బాగస్వామ్యం,సామాజిక సంబందాలు మొదలగు ముఖ్యమైన కారకత్వాలను దగ్ధరాశి కావటంవలన ఆయా కారకత్వాలను ఇవ్వజాలవు.
దశమ బావ కారకత్వాలు:-వృత్తి,కీర్తి ప్రతిష్ఠలు ,తండ్రి ద్వారా వచ్చే వారసత్వ సంపద మొదలగు ముఖ్యమైన కారకత్వాలను దగ్ధరాశి కావటంవలన ఆయా కారకత్వాలను ఇవ్వజాలవు.ఒక్కొక్కసారి జాతకచక్రంలో బావం,గ్రహం బలంగా ఉన్న పలితం రాకపోవటానికి కారణం దగ్ధరాశి ప్రభావం కూడ ఉంటుంది.
దగ్ధ రాశులలో ఉన్న గ్రహాలు కూడ తమ బావకారకత్వాలను ఇవ్వజాలవు.జాతకచక్రాన్ని పరిశీలించేటప్పుడు తప్పనిసరిగా దగ్ధరాశిని పరిశీలించకుండా పలిత విశ్లేషణ చేయరాదు.

Wednesday, 27 November 2019

ద్విపుష్కర, త్రిపుష్కర యోగాలు

ద్విపుష్కర, త్రిపుష్కర యోగాలు
ధర్మం విధి నిషేధాత్మకం, కొన్ని సమయాల్లో కొన్ని పనులు చేయరాదు. కొన్ని సమయాల్లో కొన్ని పనులు చేస్తే ఉత్తమ ఫలితాలు సిద్ధిస్తాయి. ఉదాహరణకు త్రిపుష్కర, ద్విపుష్కర యోగాల్లో వస్తు లాభాలు, నష్టాలు, డబ్బు ఇవ్వడం, అప్పు తీర్చడం మొదలైనవి పునరావృతం అవుతూ ఉంటాయి. మన చేతిలో లేని నష్టాలు మొదలగువాని విషయం ఎలా ఉన్నా మనం చేసే పనుల్తో డబ్బు ఇవ్వడం, అప్పు తీర్చడం మొదలైనవి పునరావృతమైతే మరల మరల చేయాల్సి వస్తే కష్టం కదా! అందుకని ఆయా సమయాల్లో ఇవ్వవలసినవి గాని ఇష్టపూర్వకంగా ఇచ్చేవి ఇవ్వకుండా జాగ్రత్త పడవచ్చు.
ద్విపుష్కర యోగం: ఆది, మంగళ, శనివారాలు. విదియ, సప్తమి, ద్వాదశి తిథులు. ధనిష్ట, చిత్త, మృగశిర నక్షత్రాలు కలిసినపుడు ద్విపుష్కర యోగం. ఈ రోజుల్లో వస్తువు పోయినా, లభించినా ఆ క్రియలు మరల జరుగుతాయి.
త్రిపుష్కర యోగం: ఆది, మంగళ, శనివారాలు, విదియ, సప్తమి, ద్వాదశి తిథులు. విశాఖ, ఉత్తర, పూర్వాభాద్ర, పునర్వసు, కృత్తిక, ఉత్తరాషాఢ నక్షత్రాలు కలిస్తే త్రిపుష్కరయోగం. ఈ రోజుల్లో మృతి, వస్తులాభాలు, నష్టాలు, డబ్బు ఇవ్వడం మొదలైనవి మూడుసార్లు పునరావృతమవుతాయి. కాబట్టి ఆ రోజుల్లో మరల మరల జరగరాదనుకునే పనులు చేయకుండా జాగ్రత్త పడాలి.ఈ యోగాలలో దానధర్మాలు చేయవచ్చు గానీ, లౌకిక కార్యాలలో డబ్బు ఇవ్వకపోవడం మంచిది. ఈ రోజులలో అప్పిస్తే తిరిగిరాదు సరికదా! మనమే మరల మరల ఇస్తుండాల్సి వస్తుంది. అత్యవసరం కానపుడు మందులు వాడకండి. వాడితే మళ్ళీ మళ్ళీ వాడాల్సి వస్తుంది. అదే విధంగా ఈ రోజుల్లో ఆపరేషన్లు చేయించకుండా ఉంటే మంచిది. మళ్ళీ మళ్ళీ చేయాలంటే ఇబ్బంది. మళ్ళీ మళ్ళీ చేయవచ్చు అనే పనులు చేయాలి. మళ్ళీ మళ్ళీ చేయాల్సి రావటం వలన ఇబ్బంది కలిగే పనులు చేయకండి. ఇలాగే అప్పు చేయడానికి సోమవారం మంచిది. త్రిపుష్కర, ద్విపుష్కర యోగాలు లేని మంగళవారం అప్పు తీర్చడానికి మంచిది. మంగళవారం అప్పు కొంతైనా తీరుస్తే అప్పుగా త్వరగా తీరుతుంది. బుధవారం అప్పు ఇవ్వడానికి గాని, తీసుకోవడం గాని లేదా దేనికైనా డబ్బు ఇవ్వడంగాని మంచిది కాదు.
అప్పు ఇస్తే తిరిగి వసూలు కావడానికి ఇబ్బంది కలిగే నక్షత్రాలు ఉత్తర, ఉత్తరాభాద్ర, ఉత్తరాషాఢ, పుబ్బ, పూర్వాషాఢ, పూర్వాభాద్ర, విశాఖ, రోహిణి, కృత్తిక, మఖ, ఆర్ద్ర, భరణి, ఆశ్లేష, మూల, జ్యేష్ఠ, స్వాతి.

Tuesday, 26 November 2019

పంచమస్ధానం :

పంచమస్ధానం

వ్యక్తి పూర్వ జన్మలో(పంచమ స్ధానం)చేసిన కర్మానుసారంగా తల్లి గర్భంలో (చతుర్ధభావం)పిండంగా తయారై (లగ్నం భావం) ద్వారా జన్మించి (దశమ భావం)ద్వారా కర్మ ఫలాలను అనుభవించి(నవమ భావం)ద్వారా పుణ్యబలం ఆధారంగా మోక్షానికి చేరతాడు.

పంచమస్ధానంలో పూర్వ పుణ్యబలం, మాత్రభావం,పుత్రభావం,ఆలోచన,తెలివితేటలు,పితృభావం, ఆద్యాత్మిక జ్ఞానం, త్రికోణభావం,విద్యయందు ఆసక్తి,తల్లికి అరిష్టం,సోదరుల విజయాలు (సహకారం),LOVE, మంత్రసిద్ధి,తీర్ధయాత్రలు దైవంపై నమ్మకాన్ని,నదీ స్నానాలు,దేవాలయాల ప్రతిష్ఠ,దేవతా ప్రతిష్ఠ,స్పెక్యులేషన్,ఉన్నత విద్య,బీజస్ధానం,ప్లానింగ్,ప్రణాళిక,భవిష్యత్ కార్యక్రమాలు తెలుసుకొనే స్ధానం,తండ్రి చేసిన పుణ్యం.పంచమస్ధానంను అనుసరించి మానవునికి అంతర్గత నైజమును గురించి తెలుసుకోవచ్చును.
పంచమాదిపతికి,పంచమానికి సంబందం ఉంటే జన్మ కాగానే మరొక జన్మలోకి అడుగు పెడతాడు.ప్రతి వ్యక్తి జాతకచక్రంలోను పంచమస్ధానం బాగుంటే మిగతా భావాలు అనుకూలంగా లేక పోయిన మంచి ఆలోచన,తెలివితేటలతోటి జీవితాన్ని భవిష్యత్ కార్యక్రమాలకు అనుగుణంగా తీర్చిదిద్దుకోగలడు.

అగ్నితత్వరాసులు(మేష,సింహ,దనస్సు రాశులు) పంచమస్ధానం అయితే ఏదైనా సాదించాలనే పట్టుదల,చురుకుదనం,ఇతరులు తనని గౌరవించాలనుకోవటం,రాజకీయాలలో రాణింపు.పొగిడితే లొంగిపోయే గుణం,స్వతంత్ర ఆలోచన చేయగలరు.దుష్ప్రవర్తన కలిగి ఉంటారు.ఉద్రేక స్వభావం,దైర్యం,సాహసం కలిగి ఉంటారు.భవిష్యత్ పై ముందు చూపు కలిగి ఉంటారు.
భూతత్వరాశులు(వృషభ,కన్య,మకర రాశులు) పంచమస్ధానం అయితే మెమరీపవర్ బాగుంటుంది,ఏ విషయాన్ని అయిన సరే సూక్ష్మంగా ఆలోచించి నిర్ణయం తీసుకుంటారు.ఊహాత్మకంగా ఉంటారు.తీవ్రమైన భావోద్వేగాలు ఉంటాయి.ప్రతి విషయంలో నిర్లక్ష్యం.గతించిన విషయాలను గురించి ఆలోచిస్తారు.సహనాన్ని కోల్పోవటం.ధనం విషయంలో గుట్టుగా ఉండటం,ఈర్ష్య మొదలైన లక్షణాలు కలిగి ఉంటారు.
వాయుతత్వరాసులు(మిధున,తుల,కుంభ రాశులు) పంచమస్ధానం అయితే ప్రతి చిన్న విషయానికి భాద పడటం,భయపడటం,అలగటం,తొందరగా నిర్ణయాలు తీసుకోలేరు.ఎమోషన్స్ ఎక్కువ.అనవసర విషయాలను పట్టించుకోవటం.సాంప్రదాయాలు,ఉన్నత విలువలకు ప్రాధాన్యత ఇస్తారు.
జలతత్వరాసులు(కర్కాటక,వృశ్చిక,మీన రాశులు) పంచమస్ధానం అయితే మానసిక స్ధిరత్వం,ఊహాశక్తి,మంచి ఆలోచన,చంచలత్వం,అంతర్గత ఆలోచనలు,ప్రతి విషయంలోనూ సీక్రెట్ గా ఉంటారు.ఇతరులలో తప్పులు వెతుకుతుంటారు.విమర్శించే నైజం కలిగి ఉంటారు.విశ్రాంతి లేకుండా పని చేస్తారు.కనపడే శైలికి భిన్నంగా నడుచుకుంటారు.

Monday, 25 November 2019

ఆదిత్య హృదయం

ఆదిత్య హృదయం :
ఆదిత్య హృదయం అనే ఈ స్తోతము సూర్యభగవానుడి ని ఉద్దేశించినది. రామాయణం యుద్ధకాండలో శ్రీ రాముడు అలసట పొందినప్పుడు, అగస్త్య మహర్షి యుద్ధ స్థలానికి వచ్చి ఆదిత్య హృదయం అనే ఈ మంత్రాన్ని ఉపదేశిస్తారు.ఈ ఉపదేశము అయిన తరువాత శ్రీరాముడు రావణాసురుడిని హతుడిని చేస్తాడు. వాల్మీకి రామాయణం లోని యుద్ధకాండమునందు 107 సర్గలో ఈ అదిత్య హృదయ శ్లోకాలు వస్తాయి.
1. తతో యుద్ద పరిశ్రాంతం సమరే చింతయా స్థితం |
రావణంచాగ్రతో దృష్వా – యుద్దాయ సముపస్థితమ్‌ ||
అర్థము : యుద్ధము చేసి చేసి మిక్కిలి అలసియున్న శ్రీరాముడు సమరరంగమున చింతా క్రాంతుడైయుండెను. పిమ్మట రావణుడు యుద్ధసన్నద్ధుడై ఆ స్వామి యెదుట నిలిచి యుండెను.
2. దైవతైశ్చ సమాగమ్య – ద్రుష్టు మభాగ్యతో రణం |
అర్థము : ఉపగమ్యాబ్రవీ ద్రామ – మగస్త్యో భగవాన్‌ ఋషి: ||
యుద్ధమును చూచుటకై దేవతలతో కూడి అచ్చటికి విచ్చేసిన పూజ్యుడైన అగస్త్య మహర్షి శ్రీరాముని సమీపించి, ఆ ప్రభువుతో ఇట్లు పల్కెను.
3. రామ రామ మహాబాహో – శృణుగుహ్యం సనాతనం |
యేనసర్వా నరీ న్వత్స – సమరే విజయిష్యసి ||
అర్థము : ఓరామా! మహాబాహో! నాయనా! సనాతనము మిగుల గోప్యము ఐన ఈ స్తోత్రమును గూర్చి తెలిపెదను వినుము. దీనిని జపించినచో సమరమున నీవు శత్రువులపై విజయము సాధించగలవు.
4. ఆదిత్యహృదయంపుణ్యం – సర్వశత్రువినాశనం |
జయావహం జపేన్నిత్యం – మక్షయ్యం పరమం శుభమ్‌ ||
అర్థము : ఈ ఆదిత్యహృదయ అను స్తోత్రము పరమ పవిత్రమైనది. సమస్త శత్రువులను నశింపజేయునది. నిత్యము దీనిని జపించినచో సర్వత్ర జయములభించుట తథ్యము. ఇది సత్ఫలములను అక్షయముగ ప్రసాదించునది.
5. సర్వ మఙ్గలమాఙ్గల్యం – సర్వపాపప్రణాశనం |
చిన్తాశోకప్రశమన – మాయుర్వర్ధన ముత్తమమ్‌ ||
అర్థము : ఇది పరమపావనమైనది. సకల శ్రేయస్సులను సమకూర్చి సమస్త పాపములను నశింపజేయును ఆధివ్యాధులను తొలగించి ఆయుస్సును వృద్ధిపరుచును. సర్వ జపములలో శ్రేష్ఠమైనది. కావున దీనిని జపించుట ఎంతేని ఆవశ్యము.
6. రశ్మిమన్తం సముద్యన్తం – దేవాసురనమస్కృతం |
పూజయస్వ వివస్వన్తం – భాష్కరం భువనేశ్వరమ్‌ ||
అర్థము : అనంతమైన బంగారుకిరణములతో శోభిల్లుచు, జాతికి జాగృతి కూర్చును. దేవాసురులు ఈయనకు ప్రణమిల్లుదురు. మిక్కిలి తేజస్సుగలవాడు, సమస్త భువనములన నియంత్రించువాడు, లోకములకు వెలుగునిచ్చు ఆదిత్యుని పూజింపుము.
7. సర్వదేవాత్మకో హ్యేష – తేషస్వీ రశ్మిభావన: |
ఏష దేవాసురగణాన్‌ -లోకా న్పాతి గభ స్తిభి: ||
అర్థము : ఇతడు సమస్త దేవతలకు ఆత్మయైనవాడు. తేజో రాశి. తన కిరణములచే లోకమునకు శక్తిని, స్ఫూర్తిని ప్రసాదించువాడు. దేవాసుర గణములతో గూడి సమస్త లోకములను తన కిరణములచే రక్షించుచుండువాడు.
8. ఏష బ్రహ్మాచ విష్ణుశ్చ – శివ స్స్కన్ధ: ప్రజాపతి: |
మహేన్ద్రో ధనద: కాలో – యజు స్సోమో హ్యపాంపతి: ||
అర్థము : బ్రహ్మ, విష్ణువు, శివుడు, కుమారస్వామి, ప్రజాపతి, దేవేంద్రుడు, కుబేరుడు, కాలస్వరూపుడు, యముడు, చంద్రుడు, వరుణుడు మరియు
9. పితరో వసస్సాధ్యా – హశ్శినౌ మరుతో మను: |
వాయు ర్వహ్ని: ప్రజా: ప్రాణా – ఋతుకర్తా ప్రభాకర: ||
అర్థము : పితృదేవతలు. వసువులు, సాధ్యులు. అశ్వినీదేవతలు, మరుత్తులు, మనువు, వాయువు, అగ్ని, ప్రజలు మొదలగువారి స్వరూపములు అన్నిము ఇతనివే. షడృతువులకు కారకుడు ఈ ప్రభాకరుడే.
10 ఆదిత్య స్సవితా సూర్య: – ఖగ: పూషా గభస్తిమాన్‌ |
సువర్ణసదృశో భాను: – స్వర్ణరేతా దివాకర: ||
అర్థము : ఆదిత్యుడు జగత్‌సృష్టికి కారకుడు. జనులు తమవిధులు నిర్వర్తించుటకు ప్రేరణయిచ్చును. లోకోపకారం కొరకు ఆకాశమున సంచరించి వర్షములద్వారా జగత్తును పోషించి తన కిరణములను ప్రకాశింపజేయును. బంగారు వన్నెతో తేజరిల్లుచు అద్భుతముగా ప్రకాశించువాడు. బ్రహ్మాండములు ఉత్పత్తికి బీజమైనవాడు. చీకట్లను తొలగించుచు దివాసమయమున ప్రాణులను కార్యనిమగ్నులను గావించువాడు.
11. హరిదశ్వ స్సహస్రార్చి – స్సప్తసప్తి ర్మరీచిమాన్‌ |
తిమిరోన్మథన శ్శంభు – స్త్వష్టా మార్తాణ్డ అంశుమాన్‌ ||
అర్థము : శ్యామవర్ణముగల రథాశ్వములు గలవాడు. అసం ఖ్యాకములైన కిరణములు గలవాడు. సప్త అను పేరుగల రథాశ్వముగలవాడు. రథమునకు ఏడు గుఱ్ఱములుగలవాడు. తేజో నిధానములైన కిరణములు గలవాడు. సర్వసంహారకుడు. జగత్ప్రళయమునకు పిమ్మట దానిని మరల సృజించుటకై ఆవిర్భవించెడివాడు. నిరంతరము తన కిరణములచే ప్రకాశించుచుండువాడు.
12. హిరణ్య గర్భ శ్శిశిర – స్తపనో భాస్కరో రవి: |
అగ్ని గర్భో దితే:పుత్ర – శ్శంఖ శ్శిశిరనాశన: ||
అర్థము : బ్రహ్మాండములను తన ఉదరమునందు ధరించువాడు. తాపత్రయములతో బాధపడువారికి ఆశ్రయమై వాటిని తొలగించుటకు శాంతిని ప్రసాదించువాడు, తపింపజేయువాడు. దివ్యములైన వెలుగులను గూర్చువాడు. సకల లోకములకు స్తుతిపాత్రుడు. దివాసమయమున అగ్నిని గర్భమునందు ధరించువాడు. అదితి దేవికి పుత్రుడుగా అవతరించినవాడు. సాయంకాలమున స్వయముగా శాంతించువాడు. మంచును తొలగించువాడు.
13. వ్యోమనాథ స్తమోభేదీ – ఋగ్యజుస్సామపారగ: |
ఘనవృష్ఠి రపాంమిత్రో – విన్ద్యవీథీప్లవఙ్గమ: ||
అర్థము : ఆకాశమునకు అధిపతియైనవాడు. రాహువును ఛేదించు లక్షణముగలవాడు. పూర్వాహ్ణమున ఋగ్వేదరూపము, మధ్యాహ్న సమయమున యజుర్వేదరూపమును, సాయంసమయమున సామవేదరూపమునను అలరారుచుండెడివాడు. ఘనముగా వర్షములను కురిపించుచుండువాడు. అందువలననే జలములను వర్షింపజేయువాడు అని ఖ్యాతి వహించెను. వింధ్యగిరి మార్గమున అతివేగముగా సంచరించువాడు.
14. ఆతపీ మణ్డలీ మృత్యు: – పింగల స్సర్వతాపన: |
కవిర్విశ్వోమహాతేజా – రక్త స్సర్వభవోద్భవ: ||
అర్థము : వేడిని కలిగియుండువాడు. వృత్తాకారమైన బింబము గలవాడు. విరోధులను రూపుమాపువాడు. ప్రభాత సమయమున పింగళవర్ణము కలిగియుండువాడు. మధ్యాహ్న సమయమున సర్వప్రాణులను తపింపజేయువాడు. వ్యాకరణాది సమస్త శాస్త్రముల యందును పండితుడు. విశ్వమును నిర్వహించువాడు. గొప్ప తేజస్సు గలవాడు. సకల ప్రాణులయందును అనురక్తి గలిగి యుండువాడు. సమస్త ప్రాణుల ఉత్పత్తికి కారణమైనవాడు.
15. నక్షత్రగ్రహతారాణా – మధిపో విశ్వభావన: |
తేజసా మపితేజస్వీ – ద్వాదశాత్మ న్నమోస్తుతే ||
అర్థము : నక్షత్రములకు, గ్రహములకు, తారలకును అధిపతియైనవాడు. విశ్వస్థితికి హేతువు. అగ్న్యాది తేజస్సులకు మించిన తేజస్సు గలవాడు. పన్నెండు రూపములతో విలసిల్లువాడు. ఈ నామములతో ప్రసిద్ధికెక్కిన సూర్యభగవానుడా నీకు నమస్కారం.
16. నమ: పూర్వాయ గిరయే – పశ్చిమే గిరయే నమ: |
జ్యోతిర్గణానాం పతయే – దినాధిపతయే నమ: ||
అర్థము : స్వామీ! నీవు పూర్వగిరియందును, పశ్చిమగిరి యందును విలసిల్లుచుండువాడు. గ్రహములకు, నక్షత్రములకు, దివారాత్రములకు అధిపతివి. ఉపాసకులకు జయము అనుగ్రహించునట్టి ఓ సూర్యభగవానుడా నీకు నమస్కారము.
17. జయాయ జయభద్రాయ – హర్యశ్వాయ నమో నమ: |
నమో నమ స్సహస్రాంశో – ఆదిత్యాయ నమో నమ: ||
అర్థము : జయములను, శుభములను చేకూర్చువాడవు. శ్యామవర్ణముగల రథాశ్వములుగలవాడవు. వేలకొలది కిరణములు గలవాడవు. అదితి పుత్రుడవైన ఓ సూర్యభగవానుడా నీకు నమస్కారము.
18. నమ ఉగ్రాయ వీరాయ – సారఙ్గాయ నమో నమ: |
నమ: పద్మప్రబోధాయ – మార్తాణ్డాయ నమో నమ: ||
అర్థము : నిన్ను ఉపాసించని వారికి నీవు భయంకరుడవు. ప్రాణులకు శక్తిని ప్రసాదించువాడవు. శీఘ్రముగ ప్రయాణించువాడవు. పద్మములను వికసింపజేయువాడవు. జగత్ప్రళయమునకు పిమ్మట మరల సృజించుటకై ఆవిర్భవించు నట్టి ఓ సూర్యభగవానుడా నీకు నమస్కారము.
19. బ్రహ్మేశానాచ్యుతేశాయ – సూర్యా యాదిత్యవర్చసే |
భాస్వతే సర్వభక్షాయ – రౌద్రాయ వపుషే నమ: ||
అర్థము : బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులకు ప్రతీకవు. దివ్య తేజస్సంపన్నుడవు. కాంతికి నిధియైన వాడవు. ప్రళయకాలమున లయకారకుడవు. అందువలన రుద్రస్వరూపుడవైన ఓ సూర్యభగవానుడా నీకు నమస్కారము.
20. తమోఘ్నాయ హిమఘ్నాయ – శత్రుఘ్నా యామితాత్మనే |
కృతఘ్నఘ్నాయ దేవాయ – జ్యోతిషాం పతయే నమ: ||
అర్థము : తమస్సును రూపుమాపువాడవు. జడత్వమును, శీతలత్వమును నశింపజేయువాడవు. నిన్ను ఆశ్రయించి నవారి శత్రువులను సంహరించువాడవు. పరమాత్మ స్వరూపుడవు. కృతఘ్నులను నశింపజేయుచు, దివ్యతేజస్సు విరజిమ్ముచు, జ్యోతులకు అధిపతివైన నీకు నమస్కారము.
21. తప్తచామీకరాభాయ – వహ్నయే విశ్వకర్మాణే |
నమస్తమోభినిఘ్నాయ – రుచయే లోకసాక్షిణే ||
అర్థము : బంగారమువంటి వన్నెగలవాడవు. ఆహుతులను గ్రహించువాడవు. సర్వజగత్కర్తవు. తమస్సులను పారద్రోలువాడవు. ప్రకాశస్వరూపుడవు. జగత్తున జరిగెడి సర్వజనుల కర్మలకు సాక్షియైన వాడవు. కనుక ఓ భాస్కరుడా నీకు నమస్కారము.
22. నాశయ త్యేష వైభూతం – త దేవ సృజతిప్రభు: |
పాయత్యేష తపత్యేష – వర్స త్యేష గభస్తిభి: ||
అర్థము : రఘునందనా! ఈ ప్రభువే సమస్త ప్రాణులను లయమొనర్చును. పిదప సృష్టించి పాలించుచుండును. ఇతడు తన కిరణముల చేత జగత్తును తపింపజేయును. వర్షములను ప్రాసాదించుచుండును.
23. ఏష సుప్తేషు జాగర్తి – భూతేషు పరినిష్ఠిత: |
ఏష చైవాగ్నిహోత్రఞ్ఛ – ఫలంచై వాగ్ని హోత్రిణామ్‌. ||
అర్థము : ఇతడు సకల ప్రాణులలో అంతర్యామిగా నుండును. వారు నిద్రించుచున్నను తాను మేల్కొనియే యుండును. హవిస్సు యొక్క స్వరూపము ఇతడే. తత్ఫలస్వరూపమూ ఇతడే.
24. వేదాశ్చక్రతవశ్చైవ – క్రతూనాం ఫల మేవ చ |
యాని కృత్యానిలోకేషు – స ర్వ ఏషరవి: ప్రభు: ||
అర్థము : ఇతడు వేదవేద్యుడు. యజ్ఞఫలస్వరూపుడు. లోకములో జరిగెడి సమస్త కార్యములకు ఈ సూర్యభగవానుడే ప్రభువు.
25. ఏనమాపత్సుకృచ్ఛ్రేషు – కాన్తారేషు భయేషు చ |
కీర్తయ న్పురుష: కశ్చి – న్నావసీదతి రాఘవ ||
అర్థము : రఘురామా! ఆపదలయందును, కష్టముల యందును, దుర్గమమార్గములయందును, భయస్థితులయందును ఈ స్వామిని కీర్తించినవారికి నాశము ఉండదు.
26. పూజాయ స్వైన మేకాగ్రో – దేవదేవం జగత్పతిత్‌ |
ఏత త్త్రిగుణితం జప్త్వా- యుద్దేషు విజయిష్యసి ||
అర్థము : దేవదేవుడు, జగత్పతియైన ఈ సూర్యభగవానుని ఏకాగ్రతతో పూజింపుము. ఈ ఆదిత్యహృదయమును ముమ్మారు జపించినచో నీవు ఈ మహా సంగ్రామము నందు విజయము పొందగలవు.
27. అస్మిన్‌ క్షణే మహాబాహో – రావణం త్వం వధిష్యసి |
ఏవముక్త్వాతదా గస్త్యో – జగామ చ యథాగతమ్‌ ||
అర్థము : మహాబాహో! రామా! ఈ క్షణముననే నీవు రావణుని వధింపగలవు అని పలిగి అగస్త్య మహర్షి తన స్థానమునకు చేరెను.
28. ఏత చ్ఛ్రుత్వా మహాతేజా – నష్టోశోకో భవ త్తదా |
ధారయామాస సుప్రీతో – రాఘవ: ప్రయతాత్మవాన్‌ ||
అర్థము : మహాతేజస్వియైన శ్రీరాముడు అగస్త్యమహాముని ద్వారా ఈ ఆదిత్యహృదయ మహిమను గ్రహించి చింతారహితుడయ్యెను. అతడు మిక్కలి సంతృప్తి పొంది ఏకాగ్రతతో ఆదిత్యహృదయ మంత్రమును మనస్సు నందు నిలుపుకొనెను.
29. ఆదిత్యం ప్రేక్ష్య జప్త్వాతు – పరంహర్ష మవాప్తవాన్‌ |
త్రిరాచమ్య శుచిర్భూత్వా – ధను రాదాయ వీర్యావాన్‌ ||
అర్థము : పిదమ ముమ్మారు ఆచమించి శుచియై సూర్యభగవానుని జూచుచు ఈ మంత్రమును జపించి పరమ సంతుష్టుడాయెను. పిమ్మట ఆ రఘువీరుడు తన ధనువును చేబూనెను.
30. రావణం ప్రేక్ష్య హృష్టాత్మా యుద్దాయ సముపాగమత్‌ |
సర్వయత్నేన మహతా వధే తస్య ధృతోభవత్‌ ||
అర్థము : మిక్కిలి సంతుష్టుడైయున్న ఆ రాముడు రావణుని జూచి యుద్ధమునకై పురోగమించెను. అన్ని విధములుగా గట్టి పూనికతో ఆ నిశాచరుని వధించుటకు కృతనిశ్చయుడయ్యెను.
31. ఆథ రవి రవద న్నిరీక్ష్య రామం ముదితమానా: పరమం ప్రహృష్యమాణ: |
నిశచరపతి సంక్షయం విదిత్వా సురగణమధ్యగతో వచ స్త్వరేతి ||
అర్థము : పిమ్మట దేవతలమధ్యనున్న సూర్యభగవానుడు రావణుడు నశించుట తథ్యము అని ఎరింగి మానసోల్లాసమును పొందినవాడై, పరమ సంతోషముతో శ్రీరాముని జూచి రామా! త్వరపడుము అని పలికెను.

గ్రహములు - వీక్షణములు :



గ్రహములు - వీక్షణములు .
అన్ని గ్రహములు తామున్న స్థానము నుండి 7 వ రాశిని అందులోని గ్రహములను చూస్తాయి.
1) రవి : తానున్న స్థానము నుండి 7 వ రాశిని అందులోని గ్రహాలను వీక్షించును.
2) చంద్రుడు : తానున్న స్థానము నుండి 7 వ రాశిని అందులోని గ్రహాలను వీక్షించును..
3) కుజుడు : తానున్న స్థానము నుండి 4,7,8 రాశులను అందులోని గ్రహాలను వీక్షించును.
4) రాహువు : తానున్న స్థానము నుండి 7 వ రాశిని అందులోని గ్రహాలను వీక్షించును.
5) గురువు : తానున్న స్థానము నుండి 5,7,9 స్థానములను అందులోని గ్రహాలను వీక్షించును.
2) శని : తానున్న స్థానము నుండి 3,7,10 స్థానములను అందులోని గ్రహాలను వీక్షించును.
2) బుధుడు : తానున్న స్థానము నుండి 7 వ రాశిని అందులోని గ్రహాలను వీక్షించును.
2) కేతువు : తానున్న స్థానము నుండి 7 వ రాశిని అందులోని గ్రహాలను వీక్షించును.
2) శుక్రుడు : తానున్న స్థానము నుండి 7 వ రాశిని అందులోని గ్రహాలను వీక్షించును.

అన్ని గ్రహములు తామున్న స్థానం నుండి 7వ స్థానం ను చూస్తాయి. శని తానున్న రాశి నుండి 3,10 స్థానములను , కుజుడు తానున్న రాశి నుండి 4,8 స్థానములను , గురుడు తానున్న రాశి నుండి 5,9 స్థానములను కూడా చూస్తాయి.
పాద దృష్టి : 3,10 స్థానములను చూచు దృష్టిని పాద దృష్టి అంటారు. పాద దృష్టిలో శని .బలవంతుడు.
అర్ధ దృష్టి : 5,9 స్థానములను చూచు దృష్టిని అర్ధ దృష్టి అంటారు. అర్ధ దృష్టిలో గురుడు .బలవంతుడు.
త్రిపాద దృష్టి : 4,8 స్థానములను చూచు దృష్టిని త్రిపాద దృష్టి అంటారు. త్రిపాద దృష్టిలో కుజుడు బలవంతుడు.
పరిపూర్ణ దృష్టి : 7 వ స్థానమును చూచు దృష్టిని పరిపూర్ణ దృష్టి అంటారు. పరిపూర్ణ దృష్టిలో అన్ని గహములు బలవంతులే.
పరిశీలించదగిన మరి కొన్ని దృష్టులు :

1.సమాగమ దృష్టి : రెండు గ్రహములు ఒకే డిగ్రీలో లేదా 7 డిగ్రీల తేడాతో ఉంటే సమాగమ దృష్టి ఏర్పడుతుంది.
రెండు శుభ గ్రహముల మధ్య సమాగమ దృష్టి శుభము నిచ్చును. రెండు పాప గ్రహముల మధ్య ఈ దృష్టి అశుభము నిచ్చును.
2.అర్ధ కోణ దృష్టి : రెండు గ్రహముల మధ్య 60 డిగ్రీల దూరముంటే అర్ధకోన దృష్టి ఏర్పడుతుంది. 55 డిగ్రీల నుండి 65డిగ్రీల దూరము వరకు ఈ దృష్టిని పరిగణింతురు.
ఏ రెండు గ్రహముల మధ్యనయినా అర్ధకోణదృష్టి శుభము నిచ్చును.
3.కేంద్ర దృష్టి : రెండు గ్రహముల మధ్య 90 డిగ్రల దూరముంటే కేంద్ర దృష్టి ఏర్పడుతుంది. 85 డిగ్రీల నుండి 95 డిగ్రీల దూరము వరకు ఈ దృష్టిని పరిగణింతురు.
శుభ గ్రహముల మధ్య ఈ దృష్టి శుభ ఫలితాలను యిస్తుంది.
4.కోణ దృష్టి : రెండు గ్రహముల మధ్య 120 డిగ్రీల దూరముంటే కోణ దృష్టి ఏర్పడుతుంది. 115 డిగ్రీల నుండి 125 డిగ్రీల వరకు ఈ దృష్టి ఏర్పడుతుంది.
ఏ రెండు గ్రహముల మధ్యనైనా ఈ దృష్టి శుభము నిస్తుంది.
5.సమసప్తక దృష్టి : రెండు గ్రహముల మధ్య 180 డిగ్రీల దూరముంటే సమసప్తక దృష్టి ఏర్పడుతుంది. 175 డిగ్రీల నుండి 185 డిగ్రీల వరకు ఈ దృష్టి ఏర్పడుతుంది.
రెండు శుభ గ్రహముల మధ్య సమసప్తక దృష్టి శుభము నిస్తుంది.
6.సమాంతర దృష్టి :రెండు గ్రహములు ఉత్తర,దక్షిణములలో ఒకే డిగ్రీలో ఉంటే సమాంతర దృష్టి ఏర్పడుతుంది.
రెండు శుభ గ్రహముల మధ్య సమాంతర దృష్టి శుభము నిస్తుంది. రెండు పాప గ్రహముల మధ్య ఈ దృష్టి అశుభము నిస్తుంది.

                                         https://youtu.be/FUR-4Lbj4Tw?si=XCIZVUq6ALiWlu1S