Tuesday 31 December 2019

రుద్రాక్ష ధారణ :

వృత్తి ఉద్యోగ వ్యాపారాలలో రాణించడానికి స్వయంకృషి , పట్టుదల , ఆత్మ విశ్వాసంతో పాటు 'గ్రహానుకూలత' కూడా అవసరం. జాతక శాస్త్రాన్ననుసరించి , మానవుడి జనన కాలాన్ని బట్టి ఆ వ్యక్తి 27 నక్షత్రాల్లో ఏదో ఒక నక్షత్రానికి చెందినవాడై వుంటాడు . ఈ నక్షత్రాల్లో జన్మించిన వారికి పన్నెండు రాశులు శుభాశుభములను నిర్ణయిస్తాయి. ఈ పన్నెండు రాసులకు అధిపతులుగా నవగ్రహాలు వ్యవహరిస్తుంటాయి. అంటే ఒక వ్యక్తి 'ఫలానా నక్షత్రం' లో జన్మిస్తే , అతని జనన కాలంలో ఆ నక్షత్రం 'ఏ రాశిలో' వుందో ...ఆ రాశి ననుసరించి 'నవగ్రహాలు ఆ సమయంలో ఏ గృహాల్లో వున్నాయో...'గుణించి ఆ వ్యక్తి జాతక చక్రాన్ని తయారు చేస్తారు. ఆ జాతక చక్రాన్ని బట్టి అతడు పుట్టింది మొదలు చివరి క్షణం వరకూ అతడి జీవితంలో ఎప్పుడు ఏయే మార్పులు సంభవిస్తాయో , వృత్తి,వ్యాపార,కుటుంబ,అదృష్ట,ఆరోగ్య,శుభాశుభ పరిణామాలను జ్యోతిష్య వేత్తలు అనుసరించి వ్యాపార,వ్యవహార,వృత్తి కార్యక్రమాల్లో సంభవించే దుష్ఫలితాలను నివారించి సత్ఫలితాలను పొందడానికి గ్రహశాంతులు,దానాలు,దైవపూజలు,తదితర కార్యాలు చేస్తుంటారు. ఇట్టి దైవ సంబంధమైన అంశాలలో అత్యంత పవిత్రమైనది ,మహాశక్తి సంపన్నమైనది,వేదకాలం నుంచీ పూర్వులు ఆచరించి సత్ఫలితాలను పొందినది, నిరపాయకరమైనది,ఎలాంటి దుష్ఫలితాలను చూపనిది ఏదంటే అది 'రుద్రాక్ష ధారణ'.

Monday 30 December 2019

జ్యోతిష్య శాస్త్ర చిట్కాలు :

ఏ భావానికి సంబందించిన ఫలితాన్ని అయిన సాదించాలి అంటే లగ్నం యొక్క బలాన్ని ముఖ్యంగా పరిశీలించాలి.
సాదించిన ఫలితాన్ని అనుభవించగల పరిస్ధితి చంద్ర బలంపై ఆధారపడి ఉంటుంది. చంద్రుడు బలహీనుడైతే సాధించిన ఫలితాన్ని అనుభవించకపోవడం గాని, అనుభవంలో తృప్తి లేకపోవటం గాని సంభవిస్తుంది.

6,8,12 బావాధిపతులు నైసర్గిక పాపులైనా, స్వక్షేత్ర, ఉచ్చ క్షేత్రాల తప్ప వారున్న భావాల ఫలితాలను, వారు చూసే భావాల ఫలితాలను తగ్గిస్తారు.
గురు, బుధులు పాపులైన వారి దృష్టి మంచిది.
6, 8, 12 భావాలకు అధిపతి అయిన గ్రహం మరో ఆదిపత్యం కూడా కలసిన ఆ మరో ఆదిపత్యం కేంద్ర కోణాలకు సంబందించినదైతే ఆ దోష ఫలితం బలహీన పడుతుంది.
6, 8, 12 భావాల అధిపతి దుర్బలుడై శత్రు క్షేత్ర స్ధితి, అస్తంగత్వం అయితే అతని దుష్ట ఫలం బలహీన పడుతుంది.
6 భావంలో గురుస్ధితి, 8 భావంలో బుధ స్దితి, 12 వ భావంలో శుక్ర స్ధితి శని యొక్క రాశి నవాంశలు మకర కుంభాలు కాకున్నా శుభ ఫలితాన్ని ఇస్తుంది.
6,8,12 భావాలలో స్వక్షేత్రాదులలో ఉన్న వారిచ్చే శుభఫలం, దోష ఫలం తక్కువే.
6,8,12 భావాలకు అధిపతులు ఏ భావంలో ఉంటే ఆభావాన్ని పాడు చేస్తారు.
6,8,12 భావాలకు లగ్నాదిపత్యం ఉన్న దోష ఫలితాన్ని ఇవ్వరు.
శుక్రుడు 12 వ భావంలో ఉంటూ మకర, కుంభాలకు చెందిన రాశి, నవాంశలలో ఉంటే జాతకుడు వ్యసనపరుడయ్యే అవకాశం ఉంది.
అష్టమాధిపత్య దోషం సూర్య చంద్రులకు లేదు. మారక స్ధానాధిపతులైన మారకం చేయలేరు.
ఆయుష్కారకుడైన శని అష్టమంలో ఆయువుకు మంచివాడు. అశుభ ఫలితాన్నిచ్చే గ్రహాలు ఎన్ని శుభగ్రహాలచే చూడబడీతే అంతగా వారి దుష్ట ఫలితాలను ఇవ్వడం మానేస్తారు.
గ్రహానికి బలం నిర్ణయించటానికి షష్ట్యంశ అతి ముఖ్యమైనది.

Sunday 29 December 2019

షోడశ వర్గ చక్రాలు :

జాతకచక్రంలో కేవలం రాశి చక్రాన్నే కాకుండా బావచక్రాన్ని,నవాంశ చక్రాన్ని,షోడశ వర్గ చక్రాలను కూడా పరిశీలించాలి. జాతకచక్ర పరిశీలన చేసేటప్పుడు షోడశ వర్గ చక్రాలను కూడ జాతకచక్రంలోని పరిశీలించాలి.ఈ షోడషవర్గుల పరిశిలన వలన జాతకచక్రంలోని రహస్యమైన అంశములను తెలుసుకొనుటకు అవకాశము కలదు.

ఈ షోడశవర్గులే కాక జైమిని పద్దతిలోనూ,తాజక పద్దతి యందు పంచమాంశ,షష్ఠాంశ, అష్ఠమాంశ,లాభాంశ లేక రుద్రాంశ అను నాలుగు వర్గులను సూచించినారు.


పంచమాంశ:- పూర్వపుణ్యబలం,మంత్రం,సిద్దించునా లేదా తెలుసుకోవచ్చు.
షష్టాంశ;- అనారోగ్యం అమంతర్గతంగా ఉందా లేదా బహిర్గతమంగా ఉందో తెలుపును.
అష్టమాంశ:-ప్రమాదాలు,దీర్ఘకాలిక వ్యాదులు,యాక్సిండెంట్స్,వైద్యపరంగా యాక్సిడెంట్ ద్వారా అవయవాన్ని తొలిగించుట.యాసిడ్ దాడులు.
లాభాంశ(రుద్రాంశ):-ఆర్ధికపరమైన లాభాలు,వృషభరాశి ఏలగ్నంగాని,గ్రహంగాని రాదు.వృషభరాశి శివుడికి సంబందించిన రాశి కాబట్టి ఈ రాశిలో ఏగ్రహం ఉండదు.


లగ్న కుండలి


లగ్న కుండలి జాతకానికి సంబంధించిన అన్ని అంశాలను తెలియ జేస్తుంది. మనిషి మనస్తత్త్వం, శారీరక స్థితి, గుణగణాలు, జీవన విధానం మొదలైన అనేక విషయాలు లగ్నకుండలి ద్వారా తెలుసుకొవచ్చు.
నవాంశ కుండలి(D9)
రాశి చక్రమందు యోగం ఉండి నవాంశ యందు గ్రహాల స్ధితి యుతులలో అవయోగ మేర్పడిన రాశి యందలి ఫలితమునకు విఘాతం కలుగును.రాశిచక్రం జన్మమైతే నవాంశ ప్రాణం.నవాంశ కుండలి మనిషి భాగ్యాన్ని, వైవాహిక జీవితాన్ని తెలియ జేస్తుంది. ఒక మనిషి అదృష్టవంతుడా, కాదా, అదృష్టం దేని ద్వారా వస్తుంది. తదితర విషయాలు వివాహానికి సంబంధించి వివాహ యోగం ఉన్నదా, లేదా, జీవిత భాగస్వామికి సంబంధించిన విషయాలు, వైవాహిక జీవితం ఎలా ఉంటుంది మొదలైన విషయాలు నవాంశ కుండలి ద్వారా తెలుస్తాయి.
హోరా(D2) కుండలి
హోరా కుండలి ఆర్థిక స్తితిని గురించి తెలియ జేస్తుంది. అలాగే మనలో ఉండే వివిధ అంశాల సంతులతను సూచిస్తుంది. రవిహోర(సింహరాశి)లో ఎక్కువ గ్రహలు ఉన్నట్లయితే కృషితో ఎక్కువ సంపాదన ఉంటుంది.సింహం మనలో ఉండే బహిర్గత అంశాలను, కర్కాటకం అంతర్గత అంశాలను సూచిస్తుంది.
ద్రేక్కాణ(D3) కుండలి
వైద్య జ్యోతిష్యంలో ద్రేక్కాణం ద్వారా ఏ శరీర భాగానికి అనారోగ్యం కలుగుతుందో తెలుసుకోవచ్చును.
ద్రేక్కాణం శరీర భాగాలు, ఆరోగ్య సమస్యల గురించి చెబుతుంది. ఇది లగ్న కుండలి లో 3 వ భావం, సోదరీమణులు, స్నేహితులు మరియు భాగస్వామ్యాలు గురించి చెబుతుంది. ఇది మన సామర్థ్యాన్ని పని, లేదా ఒక సమూహం లో, కొన్ని లక్ష్యాన్ని సాధించడాన్ని సూచిస్తుంది. శక్తి, ఆసక్తి, ధైర్యం, పరాక్రమం. మొదలైనవి ద్రేక్కాణ కుండలి ద్వారా తెలుసుకోవచ్చు విశ్లేషణ కొరకు లగ్న కుండలి మరియు కుజుడి స్థితి మరియు 3 వ భావాన్ని తనిఖీ చెయ్యాలి.
చతుర్థాంశ(D4) కుండలి
చతుర్థాంశ మనకు కలిగే సౌకర్యాలు, గృహ వాహనాది యోగాలు, మన జీవితం కష్టాలతో కూడినదా లేక సుఖాలతో కూడినదా..తదితర అంశాల గురించి చెపుతుంది.
సప్తాంశ(D7) కుండలి
సప్తాంశ సంతానం గురించి అలాగే మనలో ఉండే సృజనాత్మక శక్తి గురించి చెపుతుంది.సంతానం,వంశోన్నతి,వంశాభివృద్ధి చూడవచ్చు
దశమాంశ(D10) కుండలి
దశమాంశ ఉద్యోగము మరియు కీర్తి ప్రతిష్టల గురించి తెలియ జేస్తుంది.కర్మలు,వాటి ఫలితాలు,ఉద్యోగం,గౌరవాలు,కీర్తిప్రతిష్ఠలు,వృత్తిలో ఒడిదుడుకులు తెలుసుకోవచ్చు.
ద్వాదశాంశ(D12) కుండలి
ద్వాదశాంశ మన అదృష్టం గురించి, పూర్వ జన్మలో మనం చేసిన కర్మ ఫలితాలను గురించి తెలియజేస్తుంది. అలాగే వంశ సంబంధ దోషాలను గురించి కూడా తెలియ జేస్తుంది.తల్లిదండ్రులతో అనుబందాలు,వారి నుండి వచ్చే అనారోగ్యాలు,ఎవరి నుండి ఎవరికి సుఖం ఉన్నదో తెలుసుకోవచ్చును.
షోడశాంశ(D16) కుండలి
షోడశాంశ మనకు గల గృహ, వాహనాది సౌఖ్యాలను గురించి తెలిసజేస్తుంది. అలాగే ఒక వ్యక్తి అంతర్గంతంగా ఎలాంటివాడో తెలుసుకోవటానికి ఇది ఉపయోగపడుతుంది.వాహనసౌఖ్యం,వాహనాలతో చేసే వృత్తి వ్యాపారాలు లాభిస్తాయో లేదో తెలుసుకోవచ్చును.వాహనానికి ఏరంగు మంచిదో తెలుసుకోవచ్చును.
వింశాంశ(D20) కుండలి
వింశాంశ మనం చేసే దైవారాధన, అనుకూల దైవం, గురూపదేశం తదితర ఆధ్యాత్మిక అంశాలను తెలియ జేస్తుంది. మనం ఏ దేవున్ని ఉపాసన చేయాలి అనేది దీని ద్వారా కనుక్కోవచ్చు.మంత్రోచ్చారణ ,దేవుడిని పూజించేటప్పుడు అడ్డంకులు వస్తాయో లేదో తెలుసుకోవచ్చును.వింశాంశలో శుక్రుడు బలహీనంగా ఉండాలి.బలహీనంగా ఉంటేనే సన్యాసియోగం వస్తుంది.అప్పుడే దైవచింతన చేయగలడు.
చతుర్వింశాంశ(D24) కుండలి
చతుర్వింశాంశ మన విద్యను గురించి ఆధ్యాత్మికతను గురించి తెలియజేస్తుంది.ఉన్నతవిద్య,విదేశి విద్య,విద్యలో ఆటంకాలు గురించి తెలుసుకోవచ్చు.
సప్తవింశాంశ(D27) కుండలి
సప్తవింశాంశ మన శారీరక, మానసిక శక్తియుక్తుల గురించి తెలియజేస్తుంది. అలాగే మన జీవితానికి సంబందించిన అంశాల సూక్ష్మపరిశీలనకు లగ్నకుండలితో పాటు దీన్ని కూడా పరిశీలించాలి.జాతకుడిలో ఉండే బలాలు,బలహీనతలు తెలుసుకోవచ్చును.
త్రింశాంశ కుండలి(D30)
త్రింశాంశ మన కష్ట, నష్టాలను గురించి, అనుకోకుండా వచ్చే ఆపదల గురించి, ప్రమాదాల గురించి తెలియజేస్తుంది.స్త్రీ పురుషుల శీలం,వ్యక్తి యొక్క అంతర్గత ఆలోచనలు,అరిష్టాలు తెలుసుకోవచ్చును.
ఖవేదాంశ(D40) కుండలి
ఖవేదాంశ జాతకాన్ని మరింత క్షుణ్ణంగా అధ్యయనం చేయటానికి, జాతకంలో కల శుభాశుభ అంశాలను తెలుసుకోవటానికి అలాగే మనకు కల అలవాట్లను, భావోద్వేగాలను అంచనా వేయటానికి ఉపయోగపడుతుంది.మాతృవంశం నుండి వచ్చే శుభ కర్మ,అశుభ కర్మ ఫలితాలను తెలుసుకోవచ్చును.
అక్షవేదాంశ కుండలి(D45)
అక్షవేదాంశ మనకుండే నైతిక విలువలను గురించి, జాతకానికి సంబంధించిన అంశాలను సూక్ష్మ పరిశీలన చేయటానికి ఉపయోగ పడుతుంది.తండ్రివంశం నుండి వచ్చే శుభ కర్మ,అశుభ కర్మ ఫలితాలను తెలుసుకోవచ్చును.
షష్ట్యంశ కుండలి (D60)
షష్ట్యంశ జాతకానికి సంబంధించి సూక్ష్మ పరిశీలనకు అలాగే కవలల జాతకాల పరిశీలన విషయంలో ఇది ఉపయోగపడుతుంది.పూర్వజన్మ విషయాలు,కవలల విశ్లేషణకు,ముహూర్తమునకు,ముహూర్త లగ్నం షష్ట్యంశలో మంచిగా ఉండాలి.

Saturday 28 December 2019

గ్రహాలకు మూర్తి నిర్ణయం :

శ్లోకం:- జన్మ రక్ష రాజేశ్చ గ్రహ ప్రవేశకాలొడు రాశౌ
యది చార జంచ రుద్రేరసే జన్మని హేమమూర్తి
శ్శుభంక రాజేషు రాజితశ్చ సచాద్రి దిగ్విహ్నిషు
తామ్రమూర్తిః కష్టం గజార్కాబ్ధిషు కౌహితస్య

రవి మొదలైన గ్రహాలు ఒక రాశి నుండి మరొక రాశికి మారుతున్నప్పుడు ఆ రాశిని ప్రవేశించే కాలంలో ఉన్న నక్షత్రం ఏది అవుతుందో పంచాంగాన్ని బట్టి తెలుసుకొని జన్మరాశి లగాయితు నిత్య నక్షత్ర రాశి వరకు లెక్కించగా 1,6,11 రాశుల్లో ఒకటైన సువర్ణమూర్తి అని, 2,5,9 రాశుల్లో ఒకటైతే రజిత మూర్తి అని 3,7,10 రాశుల్లో ఒకటైతే తామ్రమూర్తి అని, 4,8,12 రాశుల్లో ఒకటైతే లోహమూర్తి అని అంటారు.

గోచారరీత్యా గ్రహాలు దుష్టస్ధానాలలో ఉన్న సువర్ణమూర్తి, రజితమూర్తి అయిన శుభ ఫలితాలను ఇస్తారు. తామ్రమూర్తి, లోహమూర్తి అయిన గ్రహాలు శుభస్ధానాలలో ఉన్న చెడు ఫలితాలనే ఇస్తారు.

ఏ జాతకుడికి అయిన జాతకఫలితాలు చెప్పేటప్పుడు రెండు విధాలుగా పరిశీలన చేయవలసిన అవసరం వస్తుంది.
అది ఒకటి గ్రహచారము , రెండవది గోచారము
గ్రహచారము అనగా మనం పుట్టినప్పుడు ఉన్న గ్రహముల స్థితి ఆధారముగా గ్రహములు పొందిన రాశి యొక్క స్వభావమును అనుసరించి గ్రహ దశలను తెలుసుకొని జన్మ లగ్నము లగాయితూ గ్రహములు పొందిన ఆధిపత్యము ననుసరించి ఆయా గ్రహముల బలాబలములను తెలుసుకొని ఫలిత నిర్ణయం చేయటం మొదటిది.
ఇక రెండవది గోచారము ఈ విధానములో వర్తమాన పరిస్థితులలో గ్రహముల గతిని అనుసరించి కలుగు మార్పులకు అనుగుణముగా మానవ జీవితముపై కలుగు శుభ, అశుభ ఫలితములను తెలుసుకొనుటకు ఉపయోగపడుతుంది . గోచారము ప్రకారము గ్రహములకు ఫలితములను తెలుసుకోవాలని అనుకొన్నప్పుడు జన్మ లగ్నమును ప్రామాణికముగా తీసుకోకూడదు. ఇక్కడ జన్మ రాశి మాత్రమే పరిగణనలోకి తీసుకోవాలి. ఎవరైనా ఒక వ్యక్తి యొక్క గోచారము ఫలితమును సులభంగా తెలుకోవడానికి మహర్షులు గ్రహములకు మూర్తి నిర్ణయము చేసినారు. ఈ మూర్తులను లోహములతో పోల్చి చూపారు .
పంచ లోహాలలో బంగారము , వెండి , రాగి , ఇత్తడి , ఇనుము . ఇవి ఒకదానికన్న ఒకటి తక్కువ విలువ కలవి . ఉదా : బంగారము చాలా విలువ కలిగినది దానికన్నా వెండి తక్కువ విలువ దానికన్నా రాగి , దానికనా ఇత్తడి , దానికన్నా ఇనుము ఇలా విలువ తగ్గి పోతుంది .
ఈ లోహాలకున్న విలువలకు అనుగుణముగా సాధారణ మానవునకు కూడా సులభంగా అర్ధం అవుతుందనే ఉద్దేశ్యంతో మన పూర్వీకులు గ్రహములకు మూర్తి నిర్ణయము చేసారు .


1 సువర్ణమూర్తి (బంగారము )2 రజిత మూర్తి( వెండి )3 తామ్ర మూర్తి (రాగి ) 4 లోహ మూర్తి (ఇనుము).


సువర్ణ మూర్తి 100 % శుభ ఫలితములను
రజిత మూర్తి 75% శుభ ఫలితములను
తామ్ర మూర్తి 50% శుభ ఫలితములను
లోహ మూర్తి 25% శుభ ఫలితములను ఇచ్చును.


ఈ గ్రహములకున్న మూర్తి ప్రభావము ప్రకారము గ్రహములు నిత్యమూ పరిభ్రమణము చెందుతూనే ఉంటాయి.ప్రతి గ్రహము తన కక్ష్యను అనుసరించి ముందుకు కదులుతూ ఉంటుంది . అలా గ్రహములు ఒకరాశినుండి మరొక రాశిలోకి ప్రవేశించు సమయమును తెలుసుకొని మూర్తి నిర్ణయము చేయబడుతుంది .
ప్రతి సంవత్సరము మనం రాశి ఫలితములను తెలుసుకోవడం అనేది అనాదిగా వస్తున్న ఆచారము . దీనికి ప్రత్యేకించి ఒక సమయాన్ని నిర్ణయించడం జరిగింది.
మన తెలుగు వారు ముఖ్యముగా ఉగాది నుండి సంవత్సరము ప్రారంభము అయినట్లుగా భావించి రాశి ఫలితములను తెలుసుకోవడం జరుగుతుంది. ఉగాది సమయములో ఉన్న గ్రహముల స్థితి ప్రకారము మాత్రమే సంవత్సర ఫలితములు ఆధారపడి ఉండవు. గ్రహములలో నిత్యమూ జరుగు సంచారమును బట్టి మానవునకు కలుగు శుభ, అశుభములు ఆధారపడి ఉంటాయి . వీటిని సూక్ష్మముగా తెలుసుకొనుటకు వీలుగా ఉంటుందని మూర్తుల నిర్ణయము చేయడం జరిగింది.
చంద్రుని గమనము వలన నక్షత్రములను తెలుసుకోవడం జరుగుతుంది. మనకు మన జన్మ నక్షత్రము తెలిస్తే జన్మరాశి తెలుస్తుంది. జన్మ నక్షత్రము తెలియని వారికి పేరులో ఉన్న మొదటి అక్షరమును బట్టి నక్షత్రము తెలుసుకోవచ్చు.
జన్మ లేక నామ నక్షత్రము తెలుసుకున్న తరువాత జన్మరాశిని లేక నామ రాశిని తెలుసుకోవాలి .
ఏ గ్రహమునకు మూర్తి నిర్ణయము చేయవలెనో మొదట గుర్తించాలి . పిమ్మట ఆ గ్రహము ఏ రోజున ప్రవేశించు చున్నది . గ్రహము ప్రవేశించు రోజున ఉన్న నిత్య నక్షత్రము ఏమిటి ? ఆ నక్షత్రమునకు సంభందించిన రాశి ఏమిటి అను విషయమును జాగ్రత్తగా లెక్కించవలెను. ఆ విధముగా లిక్కింపగా వచ్చిన రాశి సంఖ్యను బట్టి మూర్తి నిర్ణయము చేయాలి .


జన్మరాశి లేక నామ రాశి నుండి


1 6 11 రాశులలో ఉన్న గ్రహములు సువర్ణ మూర్తులు
2 5 9 రాశులలో ఉన్న గ్రహములు రజిత ( వెండి ) మూర్తులు.
3 7 10 రాశులలో ఉన్న గ్రహములు తామ్ర ( రాగి ) మూర్తులు
4 8 12 రాశులలో ఉన్న గ్రహములు లోహ ( ఇనుము ) మూర్తులు


ఈ విధముగా మూర్తి నిర్ణయము చేయాలి. పంచ లోహాలలో వాటికి ఉన్న విలువను ఆధారముగా చేసుకొని గ్రహములు ఇచ్చు శుభ ఫలితములను తెలుసుకొనుటకు వీలుగా ఉంటుందని ఈ మూర్తి నిర్ణయము చేయడం జరిగింది .

Friday 27 December 2019

జాతక చక్రంలో రోగ పరిశీలన :

మానవుని జీవితంలో రుగ్మతలు సర్వ సాధారణం . ఆ రుగ్మతలకు కూడా రాశులు , వాటి అధిపతులైన గ్రహాలు కారణం అవుతాయి. రాసి తత్వాలు ,గ్రహకార కత్వాల ద్వారా రోగ నిర్ధారణకు ఉపకరించేదే వైద్య జ్యోతిషం . ఏ శరీర భాగాలకు రుగ్మతలు వస్తాయో రాశులు తెలుపుతాయి. ఎటువంటి రుగ్మతలు వస్తాయో గ్రహాల ద్వారా తెలుస్తుంది ..ఏ గ్రహానికి సంబందించిన అవయవానికి వ్యాది సోకిందో ఆ గ్రహానికి సంబందించిన వైద్య విధానం ద్వారా మందు వాడితే తొందరగా వ్యాది నయమవుతుంది.
రాశులు - వాటికి వర్తించే శరీర భాగాలు
రాశులు - మేషం - శిరస్సు ,ముఖం, మెదడు , ముఖంలోని ఎముకలు, మెదడు లోని నరాలు, వృషభం - గొంతు, మెడ, వాటిలోని నరాలు,ఎముకలు. మిధునం - భుజాలు, చేతులు, వాటిలోని ఎముకలు, నరాలు, శ్వాస కోశం . కర్కాటకం- రొమ్ము ,జీర్ణాశయం. సింహం - గుండె , వెన్నెముక.
కన్య - ఉదరం, ఉదరకోశం,పొత్తికడుపు ,తుల - కటి భాగం, నాభి, మూత్ర పిండాలు. వృశ్చికం - జననేంద్రియాలు, మూత్రకోశం . ధనుస్సు - తొడలు, పిరుదులు, రక్త నాళాలు. మకరం - మోకాళ్ళు, కీళ్ళు., కుంభం - పిక్కలు, కాళ్ళు, రక్త ప్రసరణం. మీనం - పాదాలు, వేళ్ళు, శరీరంలోని ద్రవ పదార్దాలు.
ఈ రాశులలో మేష, సింహ, ధనుస్సులు అగ్నితత్వానికి, వృషభ, కన్య, మకరాలు భూతత్వానికి, మిధున , తుల, కుంభ రాశులు వాయు తత్వానికి , కర్కాటక, వృశ్చిక, మీన రాశులు జల తత్వానికి చెందినవి. కావున ఈ తత్వానికి సంబందించిన రుగ్మతలు కూడా వచ్చే అవకాశం ఉంది.వీటితో పాటు గ్రహాలు కూడా కొన్ని రుగ్మతలకు కారణం అవుతాయి .
గ్రహాలు ఆ కలుగ చేసే రుగ్మతలు
. గ్రహాలు - రుగ్మతలు సూర్యుడు - హృదయ , నేత్ర సంబంధ వ్యాదులు, రక్త ప్రసరణ ,వెన్నెముక సంబందిత వ్యాధులు, శరీరంలో శక్తి హీనత, పురుషులకు కుడి కన్ను ,మహిళలకు ఎడమకన్ను.
చంద్రుడు - ద్రవ సంబంధ మైన రుగ్మతలు, పైత్యం, దగ్గు, రొమ్ము, ఉదర వ్యాధులు, ఆస్తమా , పురుషులకు ఎడమ కన్ను, స్త్రీలకు కుడి కన్ను , మానసిక రుగ్మతలు.
బుధుడు - జీర్ణాశయం, నరాలు, ఊపిరితిత్తులు, మూగ, చేతులు,నాలుక, నోటికి సంబందించిన రుగ్మతలు, మూర్చ వంటి మానసిక వ్యాధులు.
శుక్రుడు - జననేంద్రియ రుగ్మతలు, గొంతు, మెడ, బుగ్గలు, చర్మ వ్యాధులు.
కుజుడు - నుదురు, శిరస్సు, ముక్కు, కండరాలు, పురుష జననేంద్రియాలు, మొలలు, రక్త స్రావం, గాయాలు, ఉష్ణ వ్యాధులు, అగ్ని, విద్యుత్ ప్రమాదాలు.
గురువు - కాలేయం, మధుమేహం,రక్త నాళాలు, కుడిచెయ్యి, తొడలు, పిరుదులు.
శని - దంతాలు, ఎముకలు, మోకాళ్ళు, కీళ్ళ సంబంధిత నొప్పులు, చర్మ వ్యాధులు.
మన శరీర భాగాలలో ఏ భాగం ఏ వ్యాధికి గురవుతుందో లగ్న, సూర్య , చంద్ర రాశులను, వాటి అధిపతులను బట్టి నిర్దారించు కోవచ్చు .లగ్న రాశి నుంచి గాని , సూర్య రాశి నుంచి గాని ,చంద్ర రాశి నుంచి గాని 6 ,8 ,12 స్థానాలు అనారోగ్య స్థానాలు అంటే ఆ రాశులు , ఆ రాశి అధిపతులు ,ఆ రాశిలో వున్నా గ్రహాలూ ,కారకత్వాలను తెలుసు కుంటే రోగ నిర్ధారణ సాధ్యమవుతుంది.
జాతకంలో లగ్నాదిపతి,లగ్నభావం షష్టాధిపతి,షష్ఠ బావంతో సంబందం ఉన్నయెడల జాతకునికి రోగాలు అడపాదడపా పీడిస్తాయని,ఒక రోగం తరువాత ఇంకో రోగం పీడిస్తూనే ఉంటుంది.వ్యాధి వచ్చిన తరువాత చికిత్స చేసి నయం చేయడం కన్నవ్యాధి రాకుండా చేసుకోవటమే మేలు అని జ్యోతిర్వైద్యం చెబుతున్నది.
రోగ నివారణ కేవలం మందులు వాడటం వలన సాద్యమనుకుంటే పొరపాటే.ఆహారపు అలవాట్లు మార్చుకోవటం వలన,వాతావరణం,నీరు మార్చటం వలన, రత్నధారణ వలన,జప దాన హోమాదుల వలన,ఔషదాల వలన,మంత్రోచ్ఛారణ వలన,కాస్మిక్ కిరణాల ద్వారా,కలర్ ధెరపీ ద్వారా,అయస్కాంత వైద్య చికిత్స విధానాల ద్వారా రోగాన్ని నివారించుకోవచ్చును,ముఖ్యంగా ఆదిత్య హృదయం,విష్ణు సహస్త పారాయణం, దుర్గాసప్తశ్లోకి,సుందరకాండ పారాయణం ప్రతి రోజు చేసే వారికి రోగాలు దరిచేరవు.
అగ్నితత్వ రాశులైన మేషం,సింహం,ధనస్సు లగ్నాలై 6 వ భావంతో సంభందం ఉన్న రోగం వచ్చిన తట్టుకోగలరు.రోగనిరోదక శక్తి కలిగి ఉంటారు.
భూతత్వ రాసులైన వృషభం,కన్య,మకరం లగ్నాలై 6 వ భావంతో సంబందం ఉన్న రోగం వచ్చిన కొంతవరకు తట్టుకోగలరు.వైద్యం చేయించుకుంటే రోగం నయమవుతుంది.
వాయుతత్వ రాశులైన మిధునం,తుల,కుంభ లగ్నాలై 6 వ భావంతో సంబందం ఉన్న కుంభ రాశి మినహా మిగతా రెండు రాశుల వారికి రోగం తొందరగా నయమవ్వదు.
జలతత్వ రాశులైన కర్కాటకం,వృశ్చికం,మీన లగ్నాలై 6 భావంతో సంబంధం ఉన్న వీరికి రోగ నిరోధక శక్తి తక్కువ ఉంటుంది.సులభంగా రోగాలకు లొంగిపోతారు.
లగ్నం శరీరం,6 వ భావం రోగ స్ధానం,6 వ భావానికి వ్యయ స్ధానం పంచమం.పంచమం 6 వ భావానికి వ్యయం కాబట్టి రోగాన్ని నాశనం చేస్తుంది.4 వ భావం రోగాన్ని వృద్ది చేస్తుంది.6 వ భావంతో ఏర్పడిన రోగం 5 వ భావంతో రోగాలను వదిలించుకోచ్చును.లగ్నభావం 5,6 భావాలతో సంబందం ఉంటే రోగం వచ్చిన తగ్గించుకోవచ్చు.
లగ్నం 6 వ భావం కంటే 5 వ భావంతో బలంగా ఉంటే రోగాలు దరిచేరవు.లగ్నం,5 వ భావం బలంగా ఉంటే రోగం వచ్చిన పరిహార క్రియల ద్వారా రోగ నివారణ చేసుకోవచ్చు.మేషాదిగా రవి 5 వ రాశియైన సింహా రాశికి అధిపతి కనుక ప్రతిరోజూ ఉదయం సూర్యోదయం తరువాత సూర్యాస్తమయం ముందు “ఆదిత్య హృదయం”సూర్యునికి ఎదురుగా నిలబడి చదివితే రోగ నివారణ జరిగి చాలా మంచి ఆరోగ్యం కలుగుతుంది.
లగ్నభావం 4 వ భావంతో సంబంధం ఉంటే రోగం నయమవటం కష్టం.ఎందుకంటే 6 వ భావానికి 4 వ భావం 11 వ భావం ఉపచయం కాబట్టి.ఉపచయం అంటే అబివృద్ధి.రోగాన్ని వృద్ధి చేస్తుంది.
శని,కుజ,రాహువులు రోగాన్ని పెంచితే ,రవి,గురువు లు రోగాన్ని తగ్గించే గుణాన్ని కలిగి ఉంటాయి.

Thursday 26 December 2019

నైధనతార పరిశీలన :

ప్రస్తుతం ఈ చిన్న ముహూర్తం చూడాలన్న తారాబలం చూడటం సర్వసాధారణం. తారాబాలం చంద్ర బలం చూడకుండా ముహూర్త నిర్ణయం చేయం. తారలు 9. జన్మతార నుండి పరమమైత్ర తార.
శ్లో:- జన్మన్యర్కో హిమకరసుతః సైంహికేయో సురేద్యః
       కేతుశ్ఛంద్రో దినకరసుతః భార్గవో భూమిపుత్రః

జన్మతారకి అధిపతి సూర్యుడు, సంపత్తారకి అధిపతి బుధుడు, విపత్తారకు అధిపతి రాహువు, క్షేమతారకి అధిపతి గురువు, ప్రత్యక్ తారకు అధిపతి కేతువు, సాధన తారకు అధిపతి చంద్రుడు, నైధనతారకు అధిపతి శని, మిత్రతారకు అధిపతి శుక్రుడు, పరమమైత్ర తారకు అధిపతి కుజుడు.
సంపత్తార, క్షేమతార, సాధనతార, మిత్రతార ఈ నాలుగు తారాలకు అధిపతులు, వాహనాలు శుభులే కావటం వలన అన్నీ శుభకర్మలకు వీటిని వాడతాము. పరమమైత్ర తారకు అధిపతి, వాహనం చెడ్డవి అయిన "పరమమైత్రే లాభంచ" అను నానుడచే వాడుతూ ఉంటాము. తారలు బాగలేనప్పుడు వాటికి దానములు చెప్పబడినవి. ఆయా దానములు ఇచ్చి చెప్పిన ఘడియలు విడచి వాడుతాము. అలాగే నైధనతారకు స్వర్ణదానం చేసి ఆరోజు శుభకార్యం చేయవచ్చు అంటారు. కానీ కొందరు “నైధనం నిధనం” మృత్యుప్రదమని వాడుటలేదు.
వధువు నక్షత్రం నుండి వరుని నక్షత్రం 7 వదైన ఎడల వధువుకు 6 మాసాలలో వైధవ్యం వచ్చునని కొంతమంది వాడుటలేదు. జన్మతారకు అధిపతి రవి, నైధనతారకు అధిపతి శని. వీరువురికి పరమ శతృత్వం కావున శుభకార్యాలు ఆచరించటంలేదు. “నైధానం సర్వత్ర వర్జయేత్” అని కొందరు జ్యోతిష్యవేత్తలు ఏమాత్రం ఒప్పుకొనుటలేదు.
భరణి, పుబ్బ, పూర్వాషాడ నక్షత్రాలలో జన్మించినవారు శుక్రదశలో జన్మిస్తారు. వారికి పుష్యమి, అనూరాధ, ఉత్తరాభాద్ర నక్షత్రాలు నైధన తారలు అవుతాయి. అలాంటప్పుడు ఆ నక్షత్రాలలో ఏ శుభకార్యాలు చేయకూడదు. కాలామృతంలో వధువు నక్షత్రానికి ఏడవ నక్షత్రం వరునితో వివాహం నిషేదించాడు. గ్రంధంలో ఉన్న విషయాలు అనుభవంలో సరిపోతున్నవో లేదో చూడాలి. “శాస్త్రాత్ దృఢిర్బలీయసీ” శాస్త్రం కన్నా అనుభవం బలీయమైనది.
అనుభవ పూర్వకంగా కొంతమంది జ్యోతిష్యవేత్తలు భరణి, పుబ్బ, పూర్వాషాడ నక్షత్ర జాతకులకు పుష్యమి అనూరాధ, ఉత్తరాభాద్ర నక్షత్రములు శుభకార్యాలకు ముహూర్తములు నిర్ణయించి పెట్టినప్పుడు అందరూ క్షేమంగా ఉన్నారు. అలాగే ఆశ్లేష, జ్యేష్ఠ, రేవతి నక్షత్రాలవారికి కూడా నైధనతార దోషయుక్తం కాదు. ఎందుకనగా బుధ, శుక్ర, శనులకు మిత్రత్వం వలన నైధనతార చెడ్డ చేయడు. అదే విధంగా భరణి, పుబ్బ, పూర్వాషాడ నక్షత్ర వధువు జాతకులకు పుష్యమి అనూరాధ, ఉత్తరాభాద్ర నక్షత్ర జాతకులైన వరులతో వివాహం చేయవచ్చును.

Wednesday 25 December 2019

గ్రహాలు ఉచ్చ నీచలు :

గ్రహాలు ఉచ్చ స్ధానాలు

మేషరాశిలో సూర్యుడు 10° పరమోచ్చ.
వృషభరాశిలో చంద్రుడు 3° పరమోచ్చ.
మకరరాశిలో కుజుడు 28° పరమోచ్చ.
కన్యరాశిలో బుధుడు 15° పరమోచ్చ.
కర్కాటకరాశిలో గురువు 5° పరమోచ్చ.
మీనరాశిలో శుక్రుడు 27° పరమోచ్చ
తులారాశిలో శని 20° పరమోచ్చ


గ్రహాలు నీచ స్ధానాలు


తులారాశిలో సూర్యుడు 10° పరమనీచ
వృశ్చికరాశిలో చంద్రుడు 3° పరమనీచ
కర్కాటకరాశిలో కుజుడు 28° పరమనీచ
మీనరాశిలో బుధుడు 15° పరమనీచ
మకరరాశిలో గురువు 5° పరమనీచ
కన్యారాశిలో శుక్రుడు 27° పరమనీచ
మేషరాశిలో శని 20° పరమనీచ.


ఉచ్చస్ధానంలో ఉన్న గ్రహాలు ఆదర్శానికి,నీచ స్ధానంలో ఉన్న గ్రహాలు స్వార్ధానికి సంకేతాలు.ఏ గ్రహామైనను తన నీచరాశిని వదలి ఉచ్చరాశికి పోవుచున్నప్పుడు ఆ గ్రహం ఆరోహణ గ్రహం అనబడును.
ఏ గ్రహామైనను తన ఉచ్చరాశిని వదలి నీచరాశికి పోవుచున్నప్పుడు ఆ గ్రహం అవరోహణ గ్రహం అనబడును.ఆరోహణ గ్రహములు క్రమక్రమముగా బలవంతులై శుభ ఫలములు ఇచ్చేదరు.
అవరోహణ గ్రహములు రాశి క్రమమున బలహీనులై అశుభ ఫలితాలను ఇచ్చేదరు.గ్రహాలు తమ నీచ స్ధానము లగాయితు మూడురాశులు దాటిన తరువాతనే శుభ ఫలములు ఇచ్చేదరు.
చంద్రుడు అమావాస్య తరువాత తిధి క్రమముగా శుక్ల పక్షమున ఆరోహణ గ్రహముగాను,బహుళపక్షంలో తిధి తరువాత తిధి చొప్పున అవరోహణ గ్రహమగును.
గ్రహాలు ఆరోహణ దశలో మంచి ఫలితాలను ఇస్తాయి.గ్రహాలు అవరోహణ దశలో మంచి ఫలితాలను ఇవ్వలేవు.
ఈ వ్యక్తికైనా జాతకచక్రంలో 4 గ్రహాలు (గురు, కుజ, శని, శుక్ర) ఉచ్చ స్ధితి పొందితే ఆ వ్యక్తి చాలా శక్తివంతుడు అవుతాడు.
జాతకచక్రంలో గురువు ఉచ్చ స్ధితి పొంది బలంగా ఉన్న వ్యక్తి ఉన్నత విషయాలు తెలుసుకునే స్ధాయికి, ఉన్నతమైన స్ధానానికి చేర్చుతాడు. గురువు ఉచ్చ స్ధితిలో ఉన్న ఉచ్చ కుజుడు, ఉచ్చ శుక్రులపై ఉంటుంది. ఉచ్ఛలో ఉన్న శని దృష్టి ఉచ్చ గురువుపై ఉంటుంది.
ఉచ్చ శని దృష్టి ఉచ్చ గురువుపై ఉంటే రాజయోగం సిద్ధిస్తుంది. ఎందుకంటే వీరిద్ధరు కాల పురుషునికి నవమ, దశమాధిపతులు. అంటే ధర్మ, కర్మాధిపతులు.

Tuesday 24 December 2019

ఇందు లగ్నము :


రవి యొక్క కళలు 30, చంద్రునకు 16, కుజునకు 6, బుధునకు 8, గురునకు 10 , శుక్రునకు 12, శనికి 1 , అని చెప్పబడేను. ఈ కళలను బట్టి జన్మ లగ్నము లగాయతు , చంద్ర లగ్నము లగాయతు, నవమాధిపతులయొక్క కళలను కలిపి ఆ మొత్తమును 12 చేత భాగించగా , శేషమెంతయుండునో చంద్రుడున్న రాశి లగాయతు అన్నవ రాశి "ఇందు లగ్న" మగును . చంద్రుడు జన్మ లగ్నములో యున్నచో తొమ్మిదవ స్థానాధిపతి యొక్క కళలను ఒక్కటి మాత్రమే గ్రహించి , దానిని 12 చే భాగించి శేషము యెంత యుండునో లగ్నము లగాయతు అన్నవ రాశి "ఇందు లగ్నము" అగును. శేషము రానిచో 12 శేషముగా భావించవలయును.
ఉదాహరణ జాతకము :
లగ్నము లగాయతు 9 వ రాశి మకరం. దాని అధిపతి శని .
చంద్ర లగ్నం లగాయతు 9 వ రాశి వృషభం . దాని అధిపతి శుక్రుడు.
శని కళలు = 1, శుక్రుని కళలు = 12.
ఈ రెండింటి కళలను కూడిన 1+12=13 వచ్చును.13 ను 12 చే భాగించగా వచ్చు శేషము =1 .
ఈ '1' ప్రకారం చంద్ర లగ్నం నుండి లెక్కించిన చంద్రుడు వున్న రాశియే ఇందు లగ్నం అవుతుంది.
కావున ఈ జాతకుని ఇందు లగ్నం "కన్య".
ఇందు లగ్నము - ఫలము.
ఇందు లగ్నమందు ఏదైనా గ్రహము ఉంటే , ఆ గ్రహము యొక్క దశ పూర్తిగా యోగించును.
ఇందు లగ్నంలో పాప గ్రహము వున్నను , దాని దశలో జాతకునికి శుభములు కలుగును.
పాపగ్రహ యుతులు కాని శుభ గ్రహాలు ఇందు లగ్నంలో వుంటే మంచి ధన యోగం.
2,4,5,9,10,11, స్థానాలకు అధిపతులైన పాప గ్రహము ఇందులగ్నంలో వుంటే ధన యోగం కలుగుతుంది.
ధన , లాభాధిపతులు ఇందులగ్నంలో వుంటే రాజయోగం.

Sunday 22 December 2019

బుధాదిత్య యోగం :

శ్లో :-మేషే సింహే యదా భానుః సోమ పుత్రేణ సంయుతః
దీర్ఘయుర్భల సంపన్నో సాధకో బహు పోషకః
సూర్యుడికి ఉచ్చ స్ధానమైన మేషంలోగాని, స్వక్షేత్రమైన సింహాంలో గాని రవి, బుధులు కలిసి ఉండటం బుధాదిత్య యోగం అవుతుంది. ఈ బుధాదిత్య యోగం కలిగిన జాతకులు దీర్ఘాయుర్ధాయం కలిగి ఉంటారు. శక్తి సామర్ధ్యాలు కలిగి ఉంటారు. అనేకమందిని పోషించే సాధకునిగా చేస్తుంది. బుధాదిత్య యోగం రవి, బుధులు కన్య, మిధున రాశులలో ఉన్న ఏర్పడుతుందని కొందరి భావన.
బుధాదిత్య యోగం చాలామంది జాతకాలలో ఏర్పడటానికి అవకాశం ఉంది. బుధుడు, రవి గ్రహాల మద్య దూరం 29 డిగ్రీలకు మించి ఉండదు. రవి, బుధులు అతి దగ్గరలో ఉండటం వలన ఈ యోగం ఏర్పడుతుంది. బుధుడు రవికి 14 డిగ్రీల దూరంలో ఉన్నప్పుడు అస్తంగత్వం కావటం వలన యోగం ఏర్పడినప్పటికి అనుభవంలో ఫలితాలు సరిపోవటం లేదు. బుధుడు అస్తంగత్వం చెందినప్పుడు జాతకునికి స్ఫురణ శక్తి తగ్గుతోందని కొందరు అభిప్రాయ పడుతున్నారు.
సామాన్యమైన జాతకాలలో ఈ యోగం ఉండి, ప్రముఖ వ్యక్తుల జాతకాలలో ఈ యోగం కనిపించకపోవటం జరుగుతుంది. ఇలా యోగాలు పనిచేయని సంధర్భాలు ఎక్కువ. యోగాలు ఎందుకు పనిచేయటం లేదంటే వానిని అన్వయించుకోవటంలో సరైన అవగాహన లేకపోవటం. బహు శాస్త్ర పరిఙ్ఞానమున్నా, శబ్ధాదికారం ఉన్నా, మేధా సంపత్తి ఉన్నా కూడా ఫలిత విషయంలో పూర్వాచార్యులచే చెప్పబడిన సూక్ష్మతర విషయాలను గ్రహించకుండా ఫలితాన్ని నిర్ధారిస్తే భంగపాటు తప్పదని వరాహమిహరుని వచనం.
జాతకంలో యోగం ఉండగానే సరిపోదు. ఆ యోగ కారకులు ఫలితాన్ని అనుభవాన్ని తెలియజేసే నవాంశ వర్గ చక్రంలో మంచి స్ధానాలలో ఉండాలి. యోగం ఫలవంతం అవటానికి ఫలితాన్ని అందించటానికి అనుకూల దశ, గోచారం కీలకపాత్ర వహిస్తాయి. జరుగుతున్న దశ, గోచారం అనుకూలంగా ఉండాలి. యోగ కారక గ్రహాలు దుస్ధానాలకు అధిపతులు కారాదు.
యోగ ఫల నిర్ణయంలో యోగకారకమైన గ్రహం ఇంకా ఇతర ఫల సంబంద కారకత్వ విషయాన్ని పరిగణలోకి తీసుకొని ఫలితాన్ని నిర్ధారించాలి. లేదా ఫలితాలు తారుమారు అయి ఫలిత నిర్దారణ వాస్తవానికి దూరంగా ఉంటుంది. ఏ యోగాన్ని అయిన నిర్ణయించటానికి ముందు జాతక పరిదిరీత్యా యోగ తీవ్రతను, జాతకుని ఆయుః పరిమాణాలను దృష్టిలో ఉంచుకొని ఫలితాంశాన్ని నిర్ణయించాలి అని మంత్రేశ్వరుడి వచనం.

Saturday 21 December 2019

చంద్ర ద్వాదశావస్ధలు........!!

గ్రహావస్ధలు శుక్ర కేరళ రహస్య గ్రంధంలోనివి. పరాశర మహాముని చేత చెప్పబడిన ఈ గ్రహావస్ధలు రహస్య అవస్ధలని తెలియజేయబడినవి.

శ్లో:-మేషాది గణయే త్ప్రా ఙ్ఞా శ్చంద్రావస్ధా ప్రకీర్తితః
ఇతరేషాంగ్రహాణాంతు చంద్రస్ధం రాశిమారభేత్


మేషరాశి మొదలుకొని చంద్రుడున్న రాశి వరకు లెక్కింపగా చంద్రావస్ధలగును. ఇతరగ్రహాలకు చంద్రుడున్న రాశి మొదలుకొని ఇతరగ్రహాలున్న రాశివరకు లెక్కింపగా ఇతర గ్రహావస్ధలగును.


శ్లో:- ప్రవాసనష్టే చ మృతి జయం చ హాస్వంచ క్రీడారతి సుప్తయశ్చ
భుక్తి జ్వరం కంపిత నూస్ధిరాశ్చ భవం త్యవస్ధా స్సతతమ్ శశాంకే¦¦


చంద్రుడు మేషాదిగా 1 వస్ధానంలో ఉంటే ప్రవాసావస్ధ, 2 వస్ధానంలో నష్టం, 3 వస్ధానంలో మృతి, 4 వస్ధానంలో జయం, 5 వస్ధానంలో హాస్యం, 6 వస్ధానంలో క్రీడ , 7 వస్ధానంలో రతి , 8 వస్ధానం లో నిద్రావస్ధ, 9 వస్ధానంలో భోజనం, 10 వస్ధానంలో జ్వరం, 11 వస్ధానంలో తొందరపాటు, 12 వస్ధానంలో స్ధిరత్వం ఈ పన్నెండు అవస్ధలు చంద్ర ద్వాదశావస్ధలు అంటారు.


ఇతర గ్రహ అవస్ధలు


శ్లో:-ధీరఃప్రకంపీ గమితశ్చ భోగీ భుక్తి శ్శయానః కుపితో దయాళుః
నుప్తః ప్రమోదశ్చ నూఖం భయం చ భవంత్యవస్ధా స్సతతంగ్రహేషు¦¦


చంద్రుడున్న రాశి నుండి ఇతర గ్రహాలు 1 వస్ధానంలో ఉన్న ధీరత్వం, 2 వస్ధానంలో ప్రకంపనము, 3 వస్ధానంలో గమనము, 4 వస్ధానంలో భోగం, 5 వస్ధానంలోభోజనం, 6 వస్ధానం లో శయనం, 7 వస్ధానంలోకోపం, 8 వస్ధానంలోదయా స్వభావం, 9 వస్ధానంలోనిద్ర, 10 వస్ధానం లో సంతోషం, 11 వస్ధానంలో సుఖం, 12 వస్ధానంలో భయం. ఈ 12 అవస్ధలు చంద్రుని నుండి ఇతర గ్రహాలైన రవి, బుధ, కుజ, గురు, శుక్ర, శని గ్రహాలు ఉన్నప్పుడు ఈ అవస్ధలు పొందుతారు.


1)ధీరావస్ధను పొందిన గ్రహం ధైర్యవృద్ధిని ,బలం,ధనం,ఆయుష్యును,కీర్తిని,జాతకునికి కలుగజేయును.
2)ప్రకంపనావస్ధను పొందిన గ్రహం మనో దుఃఖం,శత్రుభయం,ధన నాశనం,జాతకునికి కలుగజేయును.
3)గమనావస్ధను పొందిన గ్రహం సుఖమును,ధన లాభం,ప్రయాణాలు జాతకునికి కలుగును.
4)భోగావస్ధను పొందిన గ్రహం భోగభాగ్యాలు,సంపదలు,స్త్రీ సౌఖ్యం,పుత్ర లాభం ,జాతకునికి కలుగును.
5)భుక్తావస్ధను పొందిన గ్రహం సౌఖ్యభోజనం,సంపద,దేహదారుడ్యం జాతకునికి కలుగును.
6)శయనావస్ధను పొందిన గ్రహం జ్వరం,భయం,రోగాలు జాతకునికి కలుగును.
7)దయావస్ధను పొందిన గ్రహం ఙ్ఞానాన్ని,విద్యను,సంపదను,భూలాభాన్ని,జాతకునికి కలుగును.
8)కోపావస్ధను పొందిన గ్రహం అధికారుల ఒత్తిడి,భయం,బంధు ద్వేషం,జాతకునికి కలుగును.
9)నిధ్రావస్ధను పొందిన గ్రహం మరణభయం,రోగభయం,జాతకునికి కలుగును.
10)సంతోషావస్ధను పొందిన గ్రహం ఎల్లప్పుడు సుఖమును,సంతోషమునుగౌరవాలను,సౌఖ్యజీవనం జాతకునికి కలుగును.
11)సుఖావస్ధ యందున్న గ్రహం సుఖం,వాహన సౌఖ్యం,మిత్ర లాభం,పుత్ర వృద్ధిని జాతకునికి కలుగజేయును.
12)భయావస్ధను పొందిన గ్రహం భయాన్ని,బుద్ధిలేమిని,చంచలస్వభావాన్ని జాతకునికి కలుగుజేయును.

Friday 20 December 2019

Navagraha Prardhana :

జాతకంలో గోచార రీత్యా గ్రహ దోషములు ఉన్నవారు ప్రతినిత్యం ఈ నవగ్రహ స్తోత్రమ్ నిష్ఠ నియమాలు తో పఠించడం వలన అన్నిరకాల ఆపదలు నుంచి రక్షణ ఇస్తుంది..👇


జాతకచక్రంలో తృతీయ భావ విశ్లేషణ :

తృతీయ భావంలో సోదరులు, తోబుట్టువులు, ధైర్యం, సాహసం, దగ్గరి ప్రయాణాలు, ఆయుర్ధాయం, చిత్ర లేఖనం, గొంతు, చెవులు, బంధువులు, జన సహకారం, మిత్రులు, కమ్యూనికేషన్, కవిత్వం, మ్యూజిక్, నృత్యాలు, డ్రామా, క్రీడలలో రాణింపు (స్పోర్ట్స్), వృత్తి సేవకులు, సంతానాభివృద్ధి (పంచమానికి లాభ స్ధానం), స్వయం కృషి, స్వయం ఉపాది, స్వయం వృత్తి, శరీర పుష్టి, భుజాలు, కుడిచేయి, సవతి తల్లి, తల్లి అనారోగ్యం (చతుర్ధానికి వ్యయం), వ్యామోహాలు, కోరికలు (కామ త్రికోణం) ఉపచయ స్ధానం వంటి విషయాలను పరిశీలించవచ్చును.
తృతీయం ద్వితీయ భావానికి భావాత్ భావం, అష్టమ భావానికి తృతీయం భావాత్ భావం. అందుకే ద్వితీయం, అష్టమం బాగుంటే సరిపోదు తృతీయం కూడా బాగుండాలి. శుక్ర, చంద్రులు తృతీయ భావంపైన ప్రభావం చూపిస్తుంటే చెల్లెల్లు ఉంటారు. రవి, కుజ, గురు గ్రహాల సంబంధం ఉంటే సోదరులు ఉంటారు. కుజుడు తృతీయంలో స్వక్షేత్ర, మిత్ర, ఉచ్చ క్షేత్రాలలో కాకుండా ఇతర క్షేత్రాలలో ఉంటూ శుభగ్రహ వీక్షణ లేకుంటే సోదర సహాకారం ఉండదు. తృతీయంలో రాహువు ఉంటే కుటుంబంలో చిన్న లేదా పెద్ద అయి ఉంటారు. కేతువు ఉంటే కుటుంబంలో చిన్నవాడై ఒక్కడే ఉంటాడు. తృతీయంలో పాపగ్రహాలు ఉంటే ధైర్యం, సాహసం, బలం ఉంటాయి. శుభగ్రహం ఉంటే సౌమ్యత, దూకుడుతనం తక్కువగా ఉంటాయి.
తృతీయ బావాధిపతి గ్రహ దశ, అంతరదశలలో దగ్గర ప్రయాణాలు చేస్తారు. తృతీయంలో పాపగ్రహం ఉండి శుభగ్రహ దృష్టి లేకుంటే అంగవైకల్యం పొందే అవకాశం ఉంది. 3, 6 అధిపతుల సంబంధం ఉంటే రోగ నిరోదక శక్తి ఉంటుంది. 3, 8 అధిపతుల సంబంధం ఉంటే దీర్ఘ అనారోగ్యం ఉంటుంది. 3, 12 ఆదిపతుల సంబంధం ఉంటే హాస్పటల్ ఖర్చులు ఉంటాయి. కుజుడు తృతీయాధిపతి బేసి రాసులందుండి పురుష గ్రహాలచే చూడబడుతున్న జాతకునికి సోదరులు ఉందురు. సరి రాసులందుండి స్త్రీ గ్రహాలచే చూడబడుతున్న జాతకునికి చెల్లెల్లు ఉందురు. తృతీయం బలహీనమైనను కుజుడు లేదా తృతీయాధిపతి గురువుతో కలసిన సోదర సౌఖ్యం ఉంటుంది. గురువు ఏకాదశంలో ఉన్న జ్యేష్ఠ సోదరునితో సమస్యలు వస్తాయి.
తృతీయాధిపతి రవితో కలసిన తలపొగరు, కోపం ఉంటాయి. చంద్రునితో కలసిన భోళాతనం, కుజునితో ధైర్యం, బుధునితో కలసిన జాగ్రత్త కలవారుగా, గురువుతో కలసిన సూటిగా మాట్లాడతారు. శుక్రునితో కలసిన కాముకులుగా స్త్రీల కారణంగా గొడవలు, శనితో కలసిన మూర్ఖుడిగా, ఉత్సాహం లేనివాడుగా, రాహు, కేతులతో కలసి ఉన్న బయిటకు అమాయకులుగా మంచివారుగా కనపడినను బలహీనమైన మనస్సు కలగి పిరికి వారవుదురు. మరియు సర్ప భయం కలగి ఉంటారు.
తృతీయంలో రవి ఉంటే :-ధైర్యం, తెలివితేటలు, మూర్ఖత్వంతో పాటు విజయం కలిగి ఉందురు. సోదరులకు ఇబ్బంది. తండ్రికి అరిష్టం. పాపగ్రహం కావటం వలన జాతకునికి మంచిది. ప్రభుత్వ సహకారం, ఎముకల పుష్ఠి, సహకారం, పొగరు, పౌరుషం, లైంగిక శక్తిని కోల్పోవుదురు.
తృతీయంలో చంద్రుడు ఉంటే :- సోదరీమణుల సహాకారం, మంచి చిత్రలేఖకులు, క్రియేటివిటి కలిగి ఉంటారు. ప్రయాణాలు అంటే ఇష్టపడతారు. ఈతలో ప్రావీణ్యం ఉంటుంది. తల్లికి అరిష్టం,. జలగండం. జలవ్యాధి, బుధ, శనిగ్రహాలు కలసి ఉంటే నపుంసకులు అగుదురు. వృత్తిలో తరచుగా మార్పులు పొందుతారు. భార్య లేదా భర్త అందంగా ఉంటారు. జ్ఞానం, ఆధ్యాత్మిక విషయాలలో విభిన్న భావాలు కలగి ఉంటారు. మంచి సంతానం, బలహీనమైన క్రూరత్వం, మానసిక శాంతి లేకపోవటం జరుగుతుంది.
తృతీయంలో కుజుడు ఉంటే:- సోదర, సోదరి విషయాలలో ఇబ్బందులు. క్రీడాకారులుగా రాణింపు, స్వయం ఉపాది, డిఫెన్స్ సర్వీస్, చెవి సమస్యలు, భుజాలు బలహీనం, ప్రయాణాలలో ప్రమాదాలు, కుటుంబంలో భేదాభిప్రాయాలు, నిర్లక్ష్యంగా ఉండటం, మాట వినకపోవటం, ఈ స్ధానం బలహీనమైన క్రూర ప్రవృత్తి, ఆత్మహత్యలు ఛేసుకోవటం.
తృతీయంలో బుధుడు ఉంటే:- ఇతరులులకు మంచి మంచి జరుగుతుంది. కాటి తనకు సంతోషం ఉండదు. చురుకుతనం, చదువుపై ఆసక్తి కలిగి ఉంటారు. అప్పగించిన పనిని తెలివితో పూర్తి చేయటం. లౌక్యం, నేర్పు కలిగి ఉంటారు. వ్యాపారంలో రాణిస్తారు. చెస్ క్రీడలో రాణింపు, మిత్రుల, బంధువుల సహాకారం. నరాల బలహీనత, చరరాశి అయితే ప్రయాణాలు, ఆర్టిస్ట్, గణితం, ఆడిటింగ్, మార్కెటింగ్ సేల్స్ ఆఫీసర్ గా రాణింపు.
తృతీయంలో గురువు ఉంటే:- తెలివికలవాడు, తండ్రితో సత్సంబందాలు ఉండవు. తీర్ధయాత్రలు ఛేస్తారు. ఆధ్యాత్మిక పుస్తకాలు వ్రాయటం, వినటం, తోబుట్టువుతో అన్యోన్నత, గురువు పాపి అయితే కృతజ్ఞత, దయాగుణం, మిత్రులు లేనివారగుదురు. సాంప్రదాయం పాటించనివారు. అవకాశాలను ఉపయోగించుకోలేని వారై ఉంటారు.
తృతీయంలో శుక్రుడు ఉంటే:- మానసికంగా మంచిగా ఉన్న అనారోగ్యవంతులు. జీవశక్తి లేనివారై ఉంటారు. గానం, సంగీతం, నృత్యం, లలితా కళలపై ఆసక్తి కలిగి ఉంటారు. ఆర్ధికపరమైన విజయావకాశాలు తక్కువ. శుక్రుడు బలహీనుడైన బీదరికం, పాప బుద్ధి, శారీరక సుఖాలు లేకపోవటం జరుగుతుంది. ఇతరులను బయపెట్టటం, అపవాదులు వేయటం. సోదరులు ఉన్నత స్ధితి కలిగి ఉంటారు. సంతాన సౌఖ్యం ఉండదు. బ్యూటీ పార్లర్, ఫ్యాషన్ డిజైనింగ్, డ్రాయింగ్, నపుంసకుడు, భార్యా విధేయుడు, వినోదయాత్రలు చేయటం. కామాశక్తి కలిగి ఉంటారు.
తృతీయంలో శని ఉంటే :- ఆయుర్దాయం కలిగి ఉంటారు. ప్రజల సహకారం, బద్ధకస్తుడు. మానసిక సమస్యలు, సంతానం వలన సమస్యలు, తోబుట్టువులకు అరిష్టం, సోదర నష్టం, ధైర్యసాహసాలు, క్రూరత్వం కలిగి ఉంటారు. మునిసిపాలిటిలో ఉధ్యోగాలు, నిరాశ నిస్పృహాలు కలిగి అనేక వ్యతిరేకతలకు లోనై తరువాతనే విజయవంతులు అవుతారు. ఉద్వేగం, అనుమానం, కోపం కలిగి ఉంటారు.
తృతీయంలో రాహువు ఉంటే :- బయటకు ధైర్యంగా కనిపిస్తారు. ఆకస్మిక, అనుకోని వార్తలు వినటం, సోదరుల విషయంలో మంచిది కాదు. వీరి ఆలోచనలు, ఉద్దేశాలు కారణంగా విమర్శలు ఎదుర్కొంటారు. ఆయుర్ధాయం, చెవి సమస్యలు, ఎక్కువ మంది చెల్లెల్లు కలిగి ఉంటారు.లోతు వియయాలపై ఆసక్తి.
తృతీయంలో కేతువు ఉంటే:- క్రీడలలో రాణింపు, చురుకుతనం, ధన సంపాదన, భౌతికపరమైన సుఖాలు, శత్రువులపై విజయాలు, కుటుంబంలో చిన్నవాడై ఉంటాడు. భయస్తులు, వైరాగ్యం, మానసిక చింతన కలిగి ఉంటారు. బ్రాంతి కలిగి ఉంటారు.

Thursday 19 December 2019

భాదకులు :

భాదకులు :- చర లగ్నాలకు లాభాదిపతి భాదకుడు అవుతాడు.
స్ధిర లగ్నాలకు భాగ్యాదిపతి భాదకుడు అవుతాడు.
ద్విస్వభావ లగ్నాలకు సప్తమాధిపతి భాదకుడు అవుతాడు.
చరలగ్నాలు అయిన మేషం,కర్కాటకం,తుల,మకర రాశులకు వరుసగా మేషరాశికి లాభాదిపతి శని,కర్కాటక రాశికి లాభాదిపతి శుక్రుడు,తులారాశికి లాభాదిపతి సూర్యుడు ,మకర రాశికి లాభాదిపతి కుజుడు భాదకులు అవుతారు.
స్ధిర లగ్నాలు అయిన వృషభం,సింహం,వృశ్చికం,కుంభ రాశులకు వరుసగా వృషభరాశికి భాగ్యాదిపతి శని,సింహారాశికి భాగ్యాదిపతి కుజుడు వృశ్చిక రాశికి భాగ్యాదిపతి చంద్రుడు,కుంభరాశికి భాగ్యాదిపతి శుక్రుడు భాదకులు అవుతారు.
ద్విస్వభావ లగ్నాలు అయిన మిధునం,కన్య,ధనస్సు,మీన రాశులకు వరుసగా మిధున రాశికి సప్తమాధిపతి గురువు,కన్యారాశికి సప్తమాధిపతి గురువు,ధనస్సు రాశికి సప్తమాధిపతి బుధుడు,మీనరాశికి సప్తమాదిపతి బుధుడు భాదకులు అవుతారు
.
స్దిర లగ్నాల వారికి భాదకులు పరస్పర మిత్రత్వం కూడా ఉంది కాబట్టి భాద పెట్టి మాత్రమే ఫలితాన్ని ఇస్తారు.ప్రతి లగ్నాలకు లగ్నాదిపతి,పంచమాదిపతి,భాగ్యాదిపతి యోగకారకులు అవుతారు.స్దిర లగ్నాలకు బాగ్యాధిపతి భాదకుడు,యోగకారకుడు కావటం వలన భాద పెట్టి మాత్రమే యోగాన్నిస్తాయి.
భాదక గ్రహాల యొక్క దశ ,అంతర్దశ లలో భాదకుడు ఏ భావానికి ఆదిపత్యం వహిస్తున్నాడో ,ఏ భావాన్ని చూస్తున్నాడో ఆ భావ కారకత్వాలకు ఇబ్బందులు,భాద కలుగుతాయి.

Wednesday 18 December 2019

Importance of chanting Vishnu Sahasranamam :

Every person has a Slokam from Vishnu Sahasranama Sthothram, based on his or her birth star and paadam. On chanting that Slokam everyday, the person attains spiritual and material benefits. To know what is your Slokam you have to follow the method explained here:
In Vishnu Sahasranama Sthothram, there are 108 slokas. Totally there are 27 stars, list of which is given below. Each star or nakshatram has 4 paadas. Each person is born in one of the paadas. Therefore totally there are 108 paadas, in one-to-one correspondence with the 108 slokas of Vishnu Sahasranaama Sthothram. Your slokam is that which corresponds to the serial number of paadam in which you are born. For example, if your star is Rohini, paadam is 3rd, your slokam no. = Ashwini 4 +Bharani 4 + Kruttika 4 + Rohini 3 = 15th slokam of Vishnu Sahasranaama Sthothram, which is "Lokaadhyakshassuraadhyaksho..."
This is the list of nakshathras and the sets of slokam numbers for each star:
1) Ashwini - 1-4
2) Bharani - 5-8
3) Kruttika - 9-12
4) Rohini - 13-16
5) Mrugasira - 17-20
6) Ardra - 21-24
7) Punarvasu - 25-28
8) Pushyami - 29-32
9) Aaslesha - 33-36
10) Magha - 37-40
11) Purva Phalguni - 41-44
12) Uttara Phalguni - 45-48
13) Hasta - 49-52
14) Chitra - 53-56
15) Swati - 57-60
16) Vishakha - 61-64
17) Anuradha - 65-68
18) Jyeshttha - 69-72
19) Moola -73-76
20) Purva Ashaadha - 77-80
21) Uttara Ashaadha - 81-84
22) Sravanam 85-88
23) Dhanishttha - 89-92
24) Shathabhisham - 93-96
25) Purva Bhaadrapada - 97-100
26) Uttara Bhaadrapada - 101-104
27) Revati - 105-108
Vishnu Sahasranaama Sthothram has the power to activate Sahasraara Chakra, cause Atmajnaana and Brahmajnaana. To attain Moksha, one's Sahasraara Chakra must be fully opened. Daily concentrated reading of VSS will activate the Kundalini and other Chakras too. VSS contains the 1008 names of the Bhagawan. It was compiled by Sage Veda Vyaasa, and is a part of Mahaabhaaratam. In Mahaabhaaratam, it is told by Bheeshma on his 'ampasayya' to Yudhishtthira (Dharma Raaja) who wanted to know what is the way to attain Moksha..., who asks "ko dharmassarvadharmaanaam bhavatah pramo mataha, kim japan muchyate jantur janmasamsaarabandhanaat ," meaning, which is the greatest dharma and by chanting what do we attain Moksha. Bheeshma chants the VSS to Pandavaas who were present before him at that time
Sarvejana Sukino Bavantu
🙏🙏🙏

Tuesday 17 December 2019

శుక్రహోర ప్రయోజనాలు :

శుక్ర హోరకు అథిపతి శుక్రుడు.శుక్ర వారము లేదా చంద్రుడు భరణి,పూర్వ ఫల్గుణి,పూ ర్వాషాఢ నక్షత్రములలో సంచరిస్తున్నప్పుడు శుక్రహోరా సమయములో శుక్రుని ప్రభావము చాలా అథికముగా ఉంటుంది.
శుక్రవారం శుక్రహోరలో కఠిన హృదయాలు సైతం కరుణ,ప్రేమతో నిండే సమయము.ఎవరైనా కోపిష్టి.మూర్ఖుడు,కఠినుడు అయిన వ్యక్తిని కలవడానికి శుక్రహోరను ఎన్నుకోండి.ఆ సమయములో మీరు చెప్పిన విషయాన్ని సహనముతో వింటారు. మీకు శాంతముగా సమాథానము ఇస్తాడు.
పెళ్ళి చూపులకు శుక్రహోర సమయము ఉత్తమమైనది.నగలు,పట్టు చీరలు,రత్నాలు, గంథము,గ్లాసు,సుగంథ ద్రవ్యములు,అలంకరణ వస్తువులు కొనడానికి మంచి సమయము.అలా గే విలాసవంతమైన వస్తువులు,వాహనము కొనడానికి,సినిమా థియేటర్లు,స్టూడియోలు,సంగీత కళాశాలలు. పాఠశాలలు, కళాశాలలు శుక్రవారము శుక్రహోరలో ప్రారంభించుట శుభదాయకము.
తోళ్ళు,చర్మముతో కూడిన పరిశ్రమలు లేదా సంస్థలు,అనాథ సంక్షేమ గృహాలు మొదలగునవి ప్రారంభించుటకు శనివారం శుక్రహోర చాలా అనుకూలమైన కాలము.
పాడి పరిశ్రమ (మిల్క్ డైరీ) ప్రారంభించుటకు సోమవారం శుక్రహోర చాలా అను కూల మైన సమయము.
బియ్యము,ధాన్యము,వ్యాపారానికి మంగళవారం శుక్రహోర శుభసమయము.
బిస్కట్లు,చాక్లెట్లు,పండ్లు,పూలు,కూరగాయలు,పండ్లు,పూలు,పట్టు,సిల్కుచీరలు,స్త్రీల అలంకరణసామగ్రి,మందుల వ్యాపారాలు ప్రారంభించుటకు, బుథవారం శుక్రహోర చాలా అనుకూలమైన, ఆనందకరమైన సమయము.
తల్లీ పిల్లల హస్పిటల్,పశువుల ఆసుపత్రి, ఆదాయ పన్నుశాఖ, న్యాయము, కోర్టు వంటి వాటికి సంబంథించిన ఆఫీసులను ప్రారంభించటానికి లేదా ఆయా శాఖలలో ఉద్యోగములో చేరడానికి గురువారము శుక్రహోర శుభ సమయము.
సంబంధాలు నిశ్చయించడానికి, సంత కాలు పెట్టడానికి, ఔషధసేవకు, రైలు ప్రయాణానికి, నూతన వస్త్రా లు ధరించడానికి, సమస్త శుభకార్యాలకు, నిశ్చయ తాంబూలాలకు మంచిది. 

Monday 16 December 2019

గ్రహాలకు షడ్బలాలను పరిశీలించే విధానం :

బలం కలిగి ఉండడం అనే విషయంలో ‘బలవాన్ షడ్బల యుక్తస్సన్’ అని చెప్పారు. స్థానంలో షడ్బలయుక్తుడయి ఉండడం ప్రధానం అని చెప్పారు. జాతక చక్రంలో గ్రహాలు షడ్బలములలో ఏదో ఒక బలమును కలిగి ఉండాలి. అప్పుడే ఆ గ్రహం బలం కలిగి ఉంటుంది. జాతకంలో యోగ కారక గ్రహాలు షడ్బలములలో ఏదో ఒక బలము ఖచ్చితంగా కలిగి ఉండాలి.
షడ్బలములు అంటే ఆరు రకములు. స్థానబలం, దిగ్బలం, దృగ్బలం, కాలబలం, చేష్టాబలం, నైసర్గిక బలం అనేవి. షడ్బలములు జాతకపరిశీలనలో ఆయుర్ధాయం, గ్రహ, భావ బలముల, బలహీనతల విషయంలో ఉపయోగపడతాయి. ఉదా:- జాతక చక్రంలో లగ్నం బలంగా ఉంటే లగ్నం నుండి ఫలితాలు బాగుంటాయి. చంద్రలగ్నం బలంగా ఉంటే చంద్రలగ్నం నుండి ఫలితాలు బాగుంటాయి. సూర్య లగ్నం బలంగా ఉంటే సూర్య లగ్నం నుండి ఫలితాలు బాగుంటాయి. అదే విధంగా దశ అంతర్ధశలలోను సూర్యుడి మహాదశలో చంద్ర అంతర్ధశ జరుగుతున్నప్పుడు ఏ గ్రహం బలంగా ఉంటే ఆ గ్రహ ఫలితాలు వస్తాయి.
స్ధానబలం గ్రహానికి ఉంటే ఉన్న ప్రదేశంలో రాణిస్తాడు.
దిగ్భలం గ్రహానికి ఉంటే సమస్య పరిష్కారం తొందరగా అవుతుంది.
చేష్టా బలం గ్రహానికి ఉంటే జాతకుడు చేసే ప్రతి పని మేలు చేస్తుంది. అతని చేష్టలు (పనులు) ఇతరులు మెచ్చుకుంటారు.
కాలబలం గ్రహానికి ఉంటే సమయం వృధా కాకుండా ఉంటుంది.
దృగ్భలం గ్రహానికి ఉంటే ఇతరుల దృష్టిలో మంచివాడవుతాడు. నరదృష్టి ఉండదు.
నైసర్గిక బలం గ్రహానికి ఉంటే ప్రత్యేకమైన ఫలితాలు ఏమి ఉండవు.


1.స్ధానబలం:- జాతకచక్రంలో ఏ గ్రహమైన ఉచ్చ, మూలత్రికోణం, స్వస్ధాన, మిత్ర స్ధానాలలో ఉన్నప్పుడు స్ధాన బలం కలిగి ఉంటుంది.
2.దిగ్భలము:- లగ్నం తూర్పును, దశమం దక్షిణాన్ని, సప్తమం పడమర, చతుర్ధం ఉత్తర దిక్కులను తెలియజేస్తాయి. గురువు, బుధులు లగ్నములో (తూర్పు) ఉన్నప్పుడు , రవి, కుజులు దశమంలో (దక్షిణం) ఉన్నప్పుడు, శని సప్తమంలో (పడమర) ఉన్నప్పుడు, శుక్ర, చంద్రులు చతుర్ధంలో (ఉత్తరం) లో ఉన్నప్పుడు బలం కలిగి దిగ్భలం కలిగి ఉంటారు. వ్యతిరేక దిశలలో ఉంటే దిగ్బలాన్ని కోల్పోతారు. ఉదా:- సూర్యుడు దశమంలో ఉంటే దిగ్భలం కలిగి ఉంటుంది. అదే చతుర్ధంలో ఉంటే దిగ్భాలాన్ని కోల్పోయి నిర్భలము పొందును.
3. చేష్టాబలం:- రవి, చంద్రులు ఉత్తరాయణంలో ప్రయాణిస్తున్నప్పుడు, కుజ, గురు, బుధ, శుక్ర, శనులు వక్రము పొంది ఉన్నప్పుడు బలాన్ని కలిగి ఉంటారు. శుభగ్రహాలు శుక్ల పక్షం నందు, పాపగ్రహాలు బహుళ పక్షము నందు బలవంతులు.
4. కాలబలం:- చంద్ర, కుజ, శనులు రాత్రి సమయములందు, రవి, గురు, శుక్రులు పగటి సమయమందు, బుధుడు అన్నీ సమయములందు బలము కలిగి ఉంటాడు. పాపగ్రహములు కృష్ణపక్షమునందు, శుభగ్రహములు శుక్లపక్షమునందు బలము కలిగి ఉంటారు. ఆయా గ్రహాలకు సంబందించిన వారము, మాసములలోనూ బలము కలిగి ఉంటారు.
5. దృగ్భలం:- గ్రహములు శుభ గ్రహములచే చూడబడుతున్నప్పుడు శుభగ్రహముల దృష్టి దృగ్భలాన్ని, పాపగ్రహముల దృష్టి వ్యతిరేఖ ఫలితాలను కలిగిస్తాయి.
6. నైసర్గిక బలం:- రవి, చంద్ర, శుక్ర, గురు, బుధ, కుజ మరియు శనులు వరసగా బలం కలిగి ఉంటారు. శని కంటే కుజుడు, కుజుని కంటే బుధుడు, బుధుని కంటే గురువు, గురువు కంటే శుక్రుడు, శుక్రుని కంటే చంద్రుడు, చంద్రుని కంటే రవి బలవంతులు.

Sunday 15 December 2019

మీన లగ్నం :

ఈ లగ్నము ద్వాదశ లగ్నాలలో చిట్ట చివరిది. నిజానికి , రాశి చక్రములో ఈ లగ్నము మొట్ట మొదటిది. మరియు చివరిది. ఈ లగ్న సంకేతమును పరిశీలిస్తే రెండు చేపలు వుండును . ఒకటి ఒక దిశ లోనూ , మరొకటి వ్యతిరేక దిశలోనూ వున్నట్లుండును. మకరము సృష్టి యొక్క తుది మొదళ్లను సూచిస్తే , మీనం సృష్టి చివరలో మొదలుని , ప్రారంభములో వున్న అంత్యమును సూచించును. ఈ లగ్న ప్రభావము దేహములోని సుషుమ్నా నాడి పై వుండును. ఈ లగ్న సంకేతమైన మత్స్య మనగా రెండు విరుద్ధ శక్తులు కలిసి బహిర్గత మగుచున్న వెలుగుగా పెద్దలు చెప్పుచున్నారు. మానవుని పరిపూర్ణదశకు పరిణమించు ఉచ్చ స్థితిని కుంభ లగ్నము సూచిస్తే మానవుడు బ్రహ్మ యే అగు చరమ స్థితిని మీనము సూచించును. జీవుల భౌతిక పరిణామము జల చరములతో మొదలగును. ఈ పరిణామముపై మీన ప్రభావమున్నది. ఈ పరిణామము మానవ దేహముతో అంతమగును. ఆధ్యాత్మిక పరిణామము మకరముతో ప్రారంభమై మీనముతో అంతమగును.
మీనము తృతీయ జల తత్వ లగ్నము . మొదటి జలలగ్నమైన కర్కాటకము మరణానంతరము ప్రాణము యొక్క చివరి దశను , వృశ్చికము భౌతిక జీవిత చివరి దశను , మీనము ఆధ్యాత్మిక జీవిత చివరి దశను సూచించును. మీనమునకు చెందిన మత్స్యద్వయ సంకేతము మూతపడని జగన్మాత యొక్క (మీనాక్షీ దేవి)నేత్ర ద్వయముగా ఋషులు కీర్తించెదరు.
ఈ లగ్నము జన్మ లగ్నముగా గాని , చంద్ర లగ్నముగా గాని , వున్న మానవులకు కన్నులలో ఒక రకమైన తేజో శక్తి ఇమిడి వుండును. కారుణ్య పూరిత మానవ సేవా కార్యక్రమములపై ఈ లగ్న ప్రభావము వుండును. ఈ లగ్న జాతకులు సమస్త జీవులయందు వున్న సామాన్య లక్షణము పై దృష్టిని ప్రసరింపగా , వైరుధ్య భావములు కన్యా లగ్నము వారికి కనిపించును. అనగా కన్యా లగ్నము విశేషణాత్మకము , మీనము సమ్మేళనాత్మకము. మెగ్నీషియం అనే ధాతువు ఈ లగ్న ప్రభావమునకు చెందినది.

లౌకిక కారకత్వములు :

భూతదయ , భావోద్రేకము , ధార్మిక బుద్ధి , శాస్త్రముల యందు , కళల యందు , కొంత ప్రావీణ్యత , ఒడిదుడుకులు లేని జీవితమునందు కోరిక , అలాగే పుణ్య నదులు , పుణ్య క్షేత్రములు , కీళ్ల జబ్బులు , నరముల బలహీనత , నీరు పట్టుట మొదలైనవి.

రూప స్వభావములు :

బలహీనమైన శరీరం గలవారు. చేతులు ,పాదములు కొద్దిగా పుష్టిగా కలవారు. ఉబ్బిన కళ్ళు , అందమైన జుట్టు కలిగి వుంటారు. వీరి అభిప్రాయములు నిలకడగా వుండవు. కవిత్వము నందు గాని , గ్రంధ రచనల యందు గాని , కౌశలము కలిగి వుంటారు. చిన్న తనములో అనేక గండములను దాటుతారు. ఇతరులను తేలికగా నమ్మి మోసపోవుటకు ఎక్కువ అవకాశము గలవారు. ఈ లగ్నము వారికి అదృష్టముతో పాటు ఆటంకములు కూడా ఎక్కువే. వీరు మాట్లాడే భాషలో ఒక రకమైన శక్తి వుండి ఇతరులను ఆకర్షించ గలుగుతారు.
ఈ లగ్నమునకు చంద్రుడు , బుధుడు , కుజ గురు లు , కేంద్ర కొణములలో యోగిస్తారు. రవి చంద్రులు గాని , రవి కుజ లు గాని , రవి గురు లు గాని , రవి శుక్రు లు గాని , రవి శను ల కలయిక గాని మంచిది కాదు.

Friday 13 December 2019

కుంభ లగ్నం :

ఇది రాశి చక్రములో అత్యంత పవిత్రమైన నాల్గవ స్థిర లగ్నము . వాయుతత్వపు త్రిపుటి లో మూడవది . ఆధ్యాత్మిక స్థాయి స్థిరమగుటకు కూడా ఈ లగ్నము ప్రాతినిధ్యము వహించును. మంత్రోఛారణ చేయు సాధకులలో పరవశత్వము , తాదాత్మ్యత అను ప్రభావములు ఈ లగ్నానికి సంబంధించినవే. ఈ లగ్నము కార్యకారణములపై ఆధిపత్యము వహించుచున్నది. ఒకానొక ఆదర్శము , ఆశయము , వాస్తవ రూపము ధరించుటకు ఈ లగ్నమునకు , ఈ లగ్న భావమునకు గల కీలక సూత్రము. పరమ గురువుల పరమ లక్ష్యము వాస్థవీకరించుటలో ఈ లగ్న దివ్య కారకత్వమే కారణము. బాధలు , కష్ట నష్టములు , అగ్ని పరీక్షలు , కరువు కాటకములు , మొదలైన బాధలు,గాధలు చేదుగా మారుచున్నప్పుడు ఈ లగ్న అధిపత్యము ఏర్పడును. యురేనస్ అను వరుణ గ్రహ మూర్తి ఈ లగ్నముపై సంపూర్ణ ఆధిపత్యము వహించును. ఈ లగ్నము యొక్క రంగు నీలి రంగుకు , వంగఛాయకు మధ్యస్థముగా వుండు ఛాయావర్ణము. సంగీతము మీద కూడా ఈ లగ్నమునకు ఆధిపత్యము కలదు. ఈ సంగీతము ఆత్మాభివ్యక్తీకరణ చెందు దివ్య సంగీత మగును. అనగా గాంధర్వ గానమగును. వరుణ గ్రహము సృష్టి లయములో ప్రధాన భూమికను పోషించును. అందుకనే పెద్దలు ఇది శివుని మూడవ కంటిలో వుండు నదిగా వ్యాఖ్యానిస్తారు. ఈ లగ్నమందు ఏ గ్రహము ఉచ్చ పొందుట గాని , నీచ పొందుట గాని జరుగదు . బుధ శుక్రు లకు మిత్ర క్షేత్రము గాని , రవి చంద్ర కుజ గురు లకు శత్రు క్షేత్రము గాను వహించును.
లౌకిక కారకత్వములు :
లలిత కలల యందు అభిరుచి , సంస్కృతి , తెలివి తేటలు , ఏ పనినైనా వాయిదా వేయుట , సోమరితనము , ఓర్పు , మధ్యపానాశక్తి , కంటి జబ్బులు , నరముల బలహీనత , రక్త హీనత , రక్త దోషము , గుండె జబ్బు , బెణుకు , నెప్పులు , విపరీత వ్యాధులు , సూక్ష్మ గ్రహణ శక్తి , ఈ లగ్న మూల సూత్రము. ఈ లగ్నము వారికి ప్రస్తుతపు సమాజమునకు సంబంధించి తీరని అసంతృప్తి వుంటుంది. చట్టాన్ని , వ్యవస్థని , పునః నిర్మించాలని ఆలోచిస్తారు. ఒక నిర్దిష్ట లక్ష్యమునకు ఉన్ముఖమైన ప్రణాళిక గల జీవితము ఏర్పడును. వీరి శక్తిని వీరు గమనిస్తే జీవితమును సద్వినియోగ పరచుకోగలరు. చక్కటి తర్క జ్నానము వుండును. ఈ లగ్నము వారికి ఆత్మ విశ్వాసము తక్కువ. పరిసరముల వ్యక్తుల భావ తరంగములు వీరిని ఎక్కువగా ప్రభావితులను చేయును. మత సాంఘిక ,ఆర్ధిక, రాజకీయ , సమస్యలు పరిష్కరించే రంగాలు వీరికి ఉపయోగపడును. విద్యా సంస్థలు నడుపుటలో వీరు ప్రావీణ్యం ఎక్కువగా కలిగి వుంటారు. వీరిది ప్రేమ తత్వము కానీ ప్రేమ వ్యక్తీకరణకు సంబంధించిన పనులు చేత కావు. వీరిని దగ్గరగా వున్నవారి కన్నా కొత్త పరిచయస్తులు ఎక్కువగా గౌరవిస్తారు. ఎంతటి అపకారినైనను హాని చేయలేరు. జ్యోతిషం , యోగ విద్య , మానసిక శక్తుల సాధనము , వైద్య శాఖ , మనస్తత్వ శాఖ , మొదలైనవి వీరికి రాణించును. శారీరక శ్రమతో కూడినవి గానీ , మార్పు లేక ఒకే విధమైన పని గాని వీరు చేయలేరు. వీరు ఎక్కువగా మేల్కొని యుండుట వలన చిరాకు , నిద్రలేమి , నరముల పట్లు , మెడ ,వెన్ను నొప్పి , నీరసము వుండును.
లక్షణాలు :
బలిష్టమైన శరీరము , గుండ్రని ముఖము , చక్కటి ముఖ వర్చస్సు , కలిగి వుంటారు. ఇతరుల కష్టములను తమవిగా భావించి ఉపకారము చేయగలరు. ఇతరుల మనోభావములను బాగుగా గ్రహించగలరు.పలుకుబడిని సంపాదించు వారగుదురు. వీరు ఎల్లప్పుడూ కళత్ర సుఖము కోసము పాటుపడుచున్ననూ విచారమే కలుగుచుండును. వీరి జీవితములో మధ్య మధ్య అవమానములు , అపవాదులు , తటస్థించుచుండును. విశేషమైన జ్నాపక శక్తి , పట్టుదల ,కార్య సాధన , ఏ విషయాన్నైనా బాగుగా పరిశీలించిన పిదప కార్య రంగము లోనికి దిగుట ,
శాస్త్రీయమైన సత్యాన్వేషణ వీరికి స్వభావ సిద్ధ్హము . వీరి మంచితనము అంతరంగములో వుండును గాని పైకి కనిపించక పోవుట ఈ లగ్నము వారి యొక్క ప్రత్యేకతగా చెప్పవచ్చు. వీరు మత సంబంధమైన విషయాలలో ఆసక్తిని చూపిస్తారు. సుగంధ ద్రవ్యాలన్నా , పువ్వు లన్నా , ఎక్కువ ప్రీతి కలిగి వుంటారు.
వీరికి అంటు వ్యాధులు , దంత వ్యాధులు , రక్త ప్రసారము , మితిమీరిన శ్రమ , వీరి శరీరాన్ని ఇబ్బంది పెట్టవచ్చు.
ఈ లగ్నమునకు రవి,కుజ ,శను లు ఒంటరిగా కేంద్ర కోణములలో యోగము నిచ్చెదరు. గురువు లాభము నందు కంటే ద్వితీయాన యోగము నిచ్చును. శని ద్వితీయం , ద్వాదశములలో యోగము నిచ్చును.

Thursday 12 December 2019

మకర లగ్నం :

రాశి చక్రములో ఇది నాల్గవ చర లగ్నము . ఈ లగ్నము బాలభాస్కర తేజస్సును సూచించును. మకర కాల గర్భము నందు అనంతములైన రహస్యములు దాగివున్నవని ఋగ్వేదమునందు సాక్ష్యము కలదు. అవి ఆధ్యాత్మిక సంకేత గర్భితములు. సూర్యకిరణములు దివ్య శక్తి పూరితములు. అవి ఉషః కాలమందు మరింత శక్తివంతంగా ఉండును. మకర మాసము దేవతల ఉషః కాలము. ఈ మకర లగ్నము మరణ ద్వారముగా గుర్తింప బడినది. జీవుల ఉత్పత్తికి అనగా పుట్టుటకు కర్కాటకము సంకేతము కాగా శారీరక మరణమునకు మకర లగ్నము ప్రభావము కలిగియున్నది. కాల స్వరూపుడు ఆయుష్కారకుడు , అయిన శని కి ఇది మొదటి స్వక్షేత్రము. మకర లగ్నము దేవతలకు ప్రాతః సంధ్యా కాలము. కర్కాటకము సాయం సంధ్యా కాలము. మొదటిది సురసంధ్య రెండవది అసుర సంధ్య . మకర లగ్నము నుండి కర్కాటకము వరకు లగ్నములు ఉత్తర దిశగా వంగి తోరణమువలె వుండును. దీనిని దేవాలయ పరిభాషలో మకర తోరణమని వ్యవహరించు చున్నారు. అనగా మరణమును అతిక్రమించిన దివ్య ప్రాంగణములోనికి అడుగిడుటకు సంకేతము. ఈ తోరణమే మానవునికి-దైవానికి వారధి. దైవము యొక్క సాయుజ్యమునను కాకపోయినను సామీప్యమును సూచించును. మకర , కర్కాటక లగ్నములకు అధిపతులైన శని , చంద్రులు ఇరువురు శీతల గ్రహములు. వీరికి భిన్నములైన సాంఖ్యసారూప్యము కలదు. ఒక రాశి ని అతిక్రమించుటకు చంద్రునికి 2 1/2 రోజులు పడితే శనికి 2 1/2 సంవత్సరములు పట్టుచున్నది. భౌతిక జన్మపై చంద్రునికి , భౌతిక మరణముపై శని కి ఆధిపత్య మెక్కువ.
లౌకిక కారకత్వములు :
ఈ లగ్నము కాలపురుషుని మోకాళ్ళని తెలియజేయును. వృషభ , కన్య, మకరములు శూద్రజాతికి చెందినవి. అత్యాశ , నేర్పరితనము , ఎత్తుగడలు , పిసినారి తనము , అధిక శ్రమ , స్వార్ధపరత్వము , దారుఢ్యము లేని శరీరము , అజీర్ణము , రక్త దోషములు , కీళ్లవాతములు , నెప్పులు , చర్మ వ్యాధులు , మొదలైనవి ఈ లగ్న కారకత్వము లోనివి.
లక్షణాలు :
గుండ్రని మొఖము , లోతైన కళ్ళు , సన్నని దేహము , కలిగి వుంటారు . ముతక అయిన తల వెంట్రుకలు కలిగి వుంటారు. కార్య సాధన స్వభావ మెక్కువ . పని నెరవేరే అవకాశముల కోసం ఎంతకాలమైనా వుంటారు. అమాయకుల వలె కనిపిస్తారు కానీ వ్యవహార సామర్ధ్యమెక్కువ. వీరిని కోపించిన వారిని అవసరమనుకుంటే సంతోషపెట్టి దాస్యము చేయించుకోగలరు.ఏ విషయములోనైనా తన క్రింద వారితో నిర్మొహమాటంగా ప్రవర్తించ గలరు. పై వారితో ప్రవర్తించలేరు. అపారమైన జ్నాపకశక్తి కలిగివుంటారు. అడ్రస్ లు , టెలిఫోన్ నెంబర్లు , ధరల వివరాలు , వేలకువేలు నోటిమీద గుర్తుంచుకొనగలరు. సంకల్ప బలం ఎక్కువ. ఓటమిని ఒక పట్టాన అంగీకరించరు.
మంచివాళ్ళని కూడా అనుమానించుట క్షేమమని వీరి నమ్మకము. కీడించి మేలెంచుట , ఏమరిపాటు లేకుండుట , వీరి మానసిక స్థితి . ధన , పదవీ వ్యామోహాలుంటాయి. అపకారము చేసిన మనిషిని ఎప్పటికీ మన్నించారు. వివాహ సందర్భములో తండ్రితో వివాదములు ఏర్పడవచ్చు.
ఈ లగ్నానికి అధిపతి అయిన శని ఆయుష్కారకుడు. ఈ శని నపుంసక గ్రహమే కాక క్రూర గ్రహము కూడా. తమోగుణ ప్రధానుడైన ఈతడు పశ్చిమ దిక్కునకు అధిపతి. దారిద్ర్యము , మరణము , ఆయుర్దాయము , దుఃఖము , దురదృష్టము , అనివార్య కష్టములు , ఆలస్యము , విషాదము , సోమరితనము , దీర్ఘ వ్యాధులు , , అలాగే జాగ్రత్త , పట్టుదల , శక్తి ,ధైర్యము , ఖర్చు చేయుటలో నేర్పరి తనము , పనులు చక్క బెట్టుటలో నేర్పు , ఆలోచనా శక్తి , జీవితములో ఒక ప్రత్యేక రంగములో అనుభవము కూడా ఇతని లక్షణములే ఇంకనూ మలమూత్ర వ్యాధులు , దంతములు , ఎముకల వ్యాధులు , ఆకస్మిక ప్రమాదములు , చలి , జలుబు , చేముడు , క్షయ , క్యాన్సరు , పక్షవాతము , మెదడుకి సంబంధించిన రోగములు , ఇతని కారకత్వములే . ఈ లగ్నమునకు బుధ , శుక్రు ల సంబంధము యోగము నిచ్చును. శని కేంద్ర కోణములలో యోగించును. శని , శుక్రు ల సంబంధము కేంద్రములలో మంచిది గాదు . శని , కుజు ల సంబంధము కేంద్ర , కోణములలో మంచిది. శని , గురు ల సంబంధం కేంద్రములయందు మంచిది. గురువు కేంద్రములయందు యోగించును. గురు , బుధ ల సంబంధము పాప స్థానముల యందు మంచిది. కుజుడు 4 , 10 , కేంద్రముల యందు , లాభము నందు యోగించును. శుక్రుడు
కోణములయందు యోగించును. సుకృనికి శని , బుధ ల సంబంధం వుండరాదు. బుధుడు కేంద్ర , కోణములలో యోగించును. రవి షష్టామవ్యయము లందు యోగించును. రాహు,కేతువు లు కేంద్రములందు యోగించును.

Wednesday 11 December 2019

ధనుర్లగ్నము :

ద్వాదశ లగ్నాలలో ఇది తొమ్మిదవ లగ్నము. జాతకుల నవమ భావమునకు సంబంధించునది. ఈ లగ్నమును దివ్య ప్రభోదాత్మక లగ్నమందురు . సామాన్య మానవులకు సంబంధించి దూర ప్రయాణములను ,స్వప్నములను , ఆశయములను , స్వీయ ప్రణాళికలను ఈ లగ్నము సూచించును.
ఈ లగ్న ప్రభావము వలన మహా మహుములైన , ధర్మానిర్ణేతలు , న్యాయ వాదులు జన్మించుచున్నారు. ఈ లగ్నము ద్వి స్వభావము. బాణమును సంధించు ధనుర్ధారి ఈ లగ్న సంకేతము. బారి ప్రయోగము , గుర్రపు స్వారీ , గుర్రపు పందెములు , ఈ లగ్నాధిపత్యములో వుండును.
సూర్యుడు ధనస్సు లగ్నమున సంచరిస్తున్న సమయము విశేషమైన దివ్య ప్రభోదాత్మకమైన కాలము. అందులోనూ శుద్ధ ఏకాదశీ పర్వదినము , పండుగ(వైకుంఠ ఏకాదశి) . ఎండినవి అయిన పండ్లు ఈ లగ్న ప్రభావము లోనికి వచ్చును. పప్పు ధాన్యములు ఈ లగ్నాధిపత్యములో వుండును.
మంత్రము మననము చేయుటలో ఈ లగ్న సహకారము వుండును. ఈ లగ్నము దేవతల బ్రాహ్మీ ముహూర్త లగ్నము . ఈ లగ్నమునకు సంబంధించిన ధాతువు తగరము . ఇది బృహస్పతి ఆధీనములో వుండును.
లౌకిక కారకత్వములు :
ఈ లగ్నము క్షత్రియ లగ్నము . ఈ లగ్నమందు ఏ గ్రహము ఉచ్చ పడుట గానీ , నీచ పడుట గానీ జరుగదు . కానీ బుదునికి మాత్రము శత్రు క్షేత్రమే గాక హానికర ప్రదేశము కూడా అగుచున్నది. రవి , చంద్ర , కుజ లకు , మిత్ర లగ్నము . బుధ ,శుక్ర , శను లకు శత్రు లగ్నము.
ఉదార స్వభావం , ఎప్పుడు ఏదో ఒక పనిని చెయ్యటం , ఆటపాటలలో ఆసక్తి , ప్రజ్న , అకారణంగా ఇతరులపై అపనమ్మకం , తాత్విక చింతన , ప్రమాదాలకు గురియగుట , తొడలు , పిరుదులు , నరములు , వీటికి సంబంధించిన అనారోగ్యము , కీళ్ల వ్యాదులు , గాయములు , రక్త దోషములు , ఈ లగ్న ప్రభావములో వుండును. అదే విధంగా అశ్వసంపద , పత్రికలు , యాగ శాలలు , ఆయుధ సామాగ్రి కూడా ఈ లగ్న ప్రభావము లోనివే .
లక్షణాలు :
కాంతివంతమైన కళ్ళు , పొడవైన ముక్కు , దట్టమైన కనుబొమ్మలు , వెడల్పు ముఖము కలిగి అందముగా వుంటారు. వీరి మానసిక ప్రవృత్తి గంటకొరకముగా మారగలదు. దయా దాక్షిణ్యములు వున్ననూ శీఘ్ర కోపం కలిగి వుంటారు. గ్రహణ శక్తి , వాక్చాతుర్యము ఎక్కువ. మత , వేదాంత , సంగీత , సాహిత్య , కవిత్వముల యోడల ఆపేక్షను కలిగి వుంటారు.
పిత్రార్జిత ధనాన్ని వృద్ధి పరచ గలరు. భోగములను అనుభవిస్తారు. వీరి ఆర్ధికాభి వృద్ధి క్రమేణా జరుగును గానీ , ఆకస్మికముగా జరుగదు. భార్య పట్ల అనురాగము కలిగి వుంటారు.
నిస్సంకోచముగా, నిర్మొహమాటముగా, మాట్లాడటం వీరి నైజము. కుటిలత్వము వీరికి తెలియదు. వీర్కి ఏకాగ్రత శక్తి ఎక్కువ . వార్ధక్యము లో కూడా మనస్సును ఆశావంతముగా వుంచుకొని యువకుల లక్షణాలను కలిగి వుంటారు . కష్ట , సుఖముల యందు సమ భావములను ప్రదర్శించగలరు. నచ్చని వారి దగ్గరకు వెళ్లరు. చిన్న వయస్సులో కుటుంబ సంబంధ ఇబ్బందులు వుండవచ్చు. పట్టుదలతో స్వప్రయత్నంతో స్థిరపడగలరు. సోదర వర్గము అల్ప సంఖ్యలో వుంటుంది. వీరి సంతతి లో ఒకరు దత్తత పోవుట గానీ , దూరముగా పెరుగుట గానీ జరగవచ్చు.

Tuesday 10 December 2019

వృశ్చిక లగ్నము :

ఇది రాశి చక్రమందు మూడవ స్థిర రాశి . రెండవ జల రాశి. "రహస్యం" అనేది ఈ లగ్నానికి చెందిన కీలక పదము. నీటి మడుగులు ,కుంటలు , లోతైన గుంటలు , నీడలో పెరుగు మొక్కలు , నేలపై పాకులాడు విష జంతువులు , నిర్మానుష్య ప్రదేశాలు , రహస్య ప్రదేశాలు , నేర ప్రవృత్తి గలవారు , ఈ లగ్న ప్రభావములో వుండును. అంతే గాక , దివ్య ప్రభోదములు అందుకొనదగు ప్రదేశములు , మహాతపశ్శాలురు అయినవారు కూడా ఈ లగ్న ప్రభావములోనే వుందురు .
రాశి చక్రమున ఇది 8 వ లగ్నము . దీని సాంఘిక శక్తి , అష్టమ భావ సూచకము . దీని ప్రభావము వలన మరణము,తెలివి కోల్పోవుట , స్పృహ తప్పుట , సంధి లక్షణములు లాంటికి అవసాన దశలు ఉత్పన్నమగును. పెద్ద ఉల్లిపాయలు , వెల్లుల్లి పాయలు , నల్లమందు , కొన్ని ఇతర మత్తు పదార్ధములు ఈ లగ్న ప్రభావములో వుండును. శరీరములో జననేంద్రియములు (మర్మ స్థానాలు) మూత్రపిండాలు ఈ లగ్న ప్రభావములో వుండును.
వృశ్చికలగ్నము అధోస్తాయి , సర్పములపై ఆధిపత్యము వహించును. వృషభం ఉన్నతస్థాయి ఆధ్యాత్మిక పారవశ్యమునకు సంబంధించినది. దేవదేవుడైన శ్రీకృష్ణుని కాళీయ మర్ధనములోని ఆంతర్యము ఈ రెండు లగ్నములకు సంబంధించినదై యున్నది. ఈ అనంత కాలగమనంలో నదుల వరదలు , సముద్రపు ఆటుపోటులు , ఉప్పెనలు , భూకంపములు , అగ్ని పర్వతపు ప్రేలుళ్ళు మొదలైనవి కూడా ఈ లగ్న ప్రభావములో వుండును. అష్టమ భావమునకు జ్యోతిష్య సంకేతము తంత్రము. అనగా మానవునిలోని లోపములను పూరించి శిక్షణ నిచ్చి పరిపూర్ణత్వమును కలుగ చేయుటలో ఈ లగ్న ప్రభావం ఎంతైనా వున్నది. కోరికలను చంపుకొనుట , భోగభాగ్యములను పరిత్యజించి యే కొండ గుహాలకో , అరణ్యాలకో తపస్సు నిమిత్తము ఒంటరిగా వెళ్ళటం కూడా ఈ లగ్న ప్రభావమే.
కారకత్వములు :
ఈ లగ్నము బ్రాహ్మణ జాతికి చెందినది. (అదే విధంగా జల లగ్నాలైన కర్కాటక , మీనా లగ్నాలు కూడా ) ఊహాబలము , అనుకరణ మనోచాంచల్యము , ఒక్కొక్కసారి ఏకాగ్రత , లౌకిక వ్యవహార జ్ణాన లోపము , వ్యంగ్యము , హేళన , వక్రముగా మాట్లాడుట - ఈ లగ్న ప్రభావము లోనివే .
లక్షణాలు :
అందమైన స్వరూపము గలవారు , ఆజానుబాహులు , విశాలమైన ముఖము కలవారుగా వుంటారు. దృఢమైన స్వభావము , మనో శక్తి , ఇతరులకంటే తాము గొప్ప అనిపించుకోవటంలో , పట్టుదల , కార్య దీక్ష , ముక్కోపము , ఆధ్యాత్మిక చింతన, రసాయనిక శాస్త్ర పరిశోధన , మొరటుగా ప్రవర్తించుట , రహస్య విషయములను తెలిసికొనుటలో ఇష్టతను కలిగి ఉంటారు. వీరి జీవితములో మొదటి భాగము కన్నా రెండవ భాగము అభివృద్ధి కారముగా వుండును.
ఈ లగ్నము వారికి గురుడు శుభుడు . గురువుకు రవి,చంద్ర సంబంధము మరింత మంచిది. అష్టమ లాబాధిపతి
అగుటచే బుధుడు , సప్తమ వ్యయాధిపత్యముచే శుక్రుడు , తృతీయాధిపత్యముచే శని పాపులాగుచున్నారు. రవి , చంద్రులు కేంద్ర , కోణములందు యోగించుడురు. కుజ , బుధుల కలయిక కానీ , కుజ , శుక్రుల కలయిక కానీ , కుజ శనుల కలయిక కానీ మంచిది కాదు.

Monday 9 December 2019

తులా లగ్నము :

ఈ లగ్నము రాశి చక్రమున మూడవ చర లగ్నము. రెండవ వాయు తత్వపు లగ్నము. బ్రహ్మాండము నందలి ఆధార బిందువుకు , ధర్మమునకు , ఈ లగ్నము ప్రాతినిధ్యము వహించును. వైవిధ్యము నుండి ఏకత్వమును సాధించుట ఈ లగ్నము యొక్క ఆంతర్య ధర్మము. అంతర్ముఖ స్థితి నుండి బ్రహ్మాండము బాహ్యముగా వ్యక్తమగుటకు ఈ లగ్న ప్రభావమే కారణము. రాశి చక్రమున తులా లగ్నము సప్తమ లగ్నము . సప్తమము ద్వారా వివాహము , జీవిత భాగస్వామి , లైంగిక ఆకర్షణ మొదలగునవి ఇమిడి ఉండును. ఆధునిక నాగరికత యొక్క వైభవములైన మహానగరములు , పరిశ్రమలు , ఫోటోగ్రఫీ , సినిమా , నాటకము , జీవితము నందలి గొప్ప గొప్ప విలాస పూరితమైన అనుభవములు ఈ లగ్న ప్రభావానికి లోనై వుండును. నటులు , నృత్య కళాకారులు , కీర్తివంతులైన కళాకారులు ఈ లగ్న ప్రభావం లోనే వుంటారు. దుస్తులు , సువాసనా ద్రవ్యాలు , ఆహార పానీయాలు , రుచులు , అలంకరణ సామాగ్రి ,మొదలైనవి కూడా ఈ లగ్న ప్రభావం లోనివే .ఈ లగ్నము యొక్క సాంఖ్యాక శక్తి నాలుగు (4).
అయస్కాంతపు ఇనుము ఈ లగ్నము ప్రభావానికి చెందినది. మానవుని లోని అంతర్గత తత్వము లోని వివిధ అంశములను విస్తృత పరచి బాహ్యమునకు ప్రకటించుటలో ఈ లగ్న ప్రభావము ఎక్కువగా వుండును.
కారకత్వములు :
సమ బుద్ది , వాచాలత , సుఖలోలత , నిష్పాక్షిక ప్రవర్తన , అనుకరణ , ఆందోళన చెందుట , వినయ విధేయత , గౌరవము , రాజు , ప్రవర్తన , చట్టము , న్యాయము అను విశ్వాసము , అభిప్రాయాలలో స్పష్టత , ఒకప్పుడు ఆశ మరియొకప్పుడు నిరాశ , మోసమును తట్టుకోలేకపోవుట , పోల్చి చూచుట మొదలైనవి.
ఈ లగ్నము నందు జననమైన వారు పొడవుగా , చక్కగా శరీర సౌష్టవము కలిగి వుంటారు. చక్కని కనుబొమ్మలు , ముక్కు కొద్దిగా వంకర తిరిగి వుండుట , వీరి శిరో భాగము వయస్సు మీరిన కొలదీ బట్టతలగా మారును. ఈ లగ్నము వారికి సున్నిత స్వభావము , విషయములను నూతనముగా , లోతుగా ఆలోచించ గలగటం వుండును. వీరికి హాస్యమనిన ఇష్టము అధికము. కవిత్వ సంగీతాదుల పట్ల ఆసక్తిని కలిగి వుంటారు. ప్రయాణాలనిన ప్రీతికరము . ఎల్లప్పుడూ గౌరవ , ప్రతిష్టల కొరకు తాపత్రయ పడతారు. స్నేహ పాత్రులు . ఎంత త్వరగా కోపము వచ్చునో అంతా త్వరగా శాంతులవుతారు. వీరికి అభిమానము , స్వాతి శయము , ఎక్కువ. వీరికి మూత్రపిండములు , కటిప్రదేశము , మూత్రాశయములకు చెందిన అనారోగ్యములు , మధుమేహము , మలబద్ధకము , ఏర్పడే అవకాశము కలదు.
వీరికి విద్యుత్ శాఖ , రేడియో , టీ,వి ,ధర్మ శాస్త్రము , వాణిజ్యము , వైద్యము , మొదలైనవి రాణించే రంగములు . ఈ లగ్నము వారికి శని , బుధ లు శుభులు . తృతీయ ,షష్టాధిపతి అగుటచే గురువును , లాభాధిపతి అగుటచే రవి , ద్వితీయ , సప్తమాధిపతి అగుటచే కుజుడు పాపులు.
లగ్నాధిపతి లగ్నములో యోగమును ఇవ్వడు. మిగిలిన కేంద్రములైతే మంచివి.
చంద్రుడు పాప స్థానములందు యోగించును.
బుధుడు కేంద్ర , కోణములందు యోగించును.
రవి భాగ్యములో మంచివాడు .
గురువు కేంద్రములందు మంచివాడు.
శనికి కేంద్ర స్థితి మంచిదైనప్పటికి , లగ్న ,చతుర్ధాలందు మిక్కిలి యోగము ఇవ్వలేదు. మిగిలిన కేంద్రము (సప్తమ , దశమ) లందు అధిక యోగము నిచ్చును.
కుజుడు కేంద్ర స్థితి యందు బాగుండును.

Sunday 8 December 2019

కన్యా లగ్నం :

ఇది రాశి చక్రమున రెండవ ద్విస్వభావ లగ్నము మరియు రెండవ భూ తత్వ లగ్నము . ప్రకృతి యొక్క మాతృత్వము కర్కాటకము కాగా ; పరబ్రహ్మము యొక్క మాతృత్వము కన్యా లగ్నము నందున్నది.. సౌందర్యము వృషభ లగ్నమునకు చెందినది కాగా అనుగ్రహము కన్యా లగ్నమునకు చెందినది. కన్యా లగ్నము నుండి వృశ్చిక లగ్నము వరకు 90 భాగాల భాగము మానవుని బొడ్డు నుండి తొడల వరకు ఆధిపత్యము వహించును. ఇతరులకు ఉపచారములు , సేవ చేయుటకు ఈ లగ్నము ప్రాముఖ్యము వహించుచున్నది. ప్రసూతి , శిశు సంరక్షణాలయములు ఈ లగ్న ప్రభావము లోనివే ! కాన్వెంట్లు , విద్యాభోదనము , అనాధ శరణాలయములు , వికలాంగుల పాఠశాలలు , కుష్టు రోగుల నివాస ప్రాంతాలు , క్షయ రోగ ఆసుపత్రులు , ఇవి ఈ లగ్న ప్రభావంలో ఏర్పడినవే ! రేడియో , చెరకు గడ ఈ లగ్న ప్రభావం నుండి ఉద్భవించినవే.
కారకత్వాలు :
శాస్త్ర విజ్నానము , లలిత కళలు , విమర్శనాత్మక శక్తి , సందేహ బుద్ధి , ఉదార స్వభావం , పారిశ్రామిక నగరాలు , పొట్ట , నాభి ప్రదేశము , వెన్నెముక క్రింది భాగము , అజీర్ణ వ్యాధులు , చురుకు దానము , శారీరక శ్రమ కన్నా మానసిక శ్రమ యందు యిష్టత , సిగ్గు , నవ్వు , గణిత శాస్త్రము , తర్కము , పలురకాలైన లిపుల వ్యాకరణము , జ్నాపక శక్తి , బెణుకుట , మానసిక వ్యాధులు , సహనము , భృత్యులు మొ ||వి .
లక్షణాలు :
సన్నని పొడవైన శరీరం , నల్లని కళ్ళు , నల్లని దట్టమైన వెండ్రుకలు , సుకుమార కంఠస్వరం , త్వరితంగా నడవటం , ఉన్న వయస్సు కన్నా తక్కువగా కన్పిస్తారు . మొహమాటం లేకుండా ఇతరుల చేత పనులు చేయించుకోగలరు. ఇతరుల తప్పులు ఎన్నుటలో ప్రసిద్ధులు. సుఖమన్నా , సుఖ జీవనమన్నా అధిక ప్రీతి వుంటుంది. సంగీత ప్రియత్వం వుంటుంది. ఉత్తరాలు వ్రాయటంలో నేర్పరులు. ఖర్చు చేయటంలో ఎక్కువ జాగ్రత్తను ప్రదర్శిస్తారు. మనసుకు నచ్చిన పనులు మాత్రమే చేస్తారు. కష్టమైన పనులు సులువెరిగి ప్రయత్నిస్తారు. వీరి కష్టములను ఎవరికైనా చెప్పుకొనుటలో తృప్తి పడతారు. వీరికి చొరవ ఎక్కువగానే వుంటుంది గానీ అంతకు మించి బిడియం కూడా వుంటుంది. అపకారం చేసిన వారిని చిరకాలం ద్వేషిస్తూనే వుంటారు. వాణిజ్య ప్రావీణ్యం వుంటుంది. నటన , అనుకరణము , హాస్యము , వక్తృత్వము , ఈ లగ్నప్రభావములోనివే .
ఈ లగ్నమునకు శుక్రుడు ఒక్కడే శుభుడు . తృతీయ అష్టమాధిపతి అగుటచే కుజుడును , ఉభయ కేంద్రధిపత్యమగుటచే గురువును , ముఖ్య పాపులు అవుతారు.
ఈ లగ్నానికి గురు , బుధ లు పాప స్థానాలలో వుంటే యోగిస్తారు. కుజుడు వ్యయమందు యోగమిచ్చుట ఈ లగ్నానికి గల ముఖ్య విశేషము.
శని దశమ కేంద్రమందు అధిక యోగమిచ్చును. రాహు , కేతువులు 3,6 యందున్న యొడల మంచిది.

Saturday 7 December 2019

సింహ లగ్నం :

ప్రేమ , సత్ప్రవర్తన , ఉదాత్త గుణము , అవరోధాలను అధిగమించటం , పాలనా శక్తి , పోరాట పటిమ , ధర్మ స్థాపన , బలహీనులను సంరక్షించుట ఈ లగ్న స్వభావాలు. స్థిర స్వభావము , క్రమ శిక్షణల వ్యాప్తి.
ఈ లగ్న ప్రభావం లోనివి : హృదయము , తత్సంబంధిత స్వరూప స్వభావాల పైనా ఈ లగ్న ప్రభావం అధికం . తండ్రీ - కొడుకుల మధ్య నున్న సంబంధాన్ని ఈ లగ్నమును కూడా పరిశీలించి ప్రభావాన్ని ఎంచవలెను. ఎందుకంటే , పితృ కారకుడైన రవి లగ్నం కావటం వల్ల రాశి చక్రం లో అయిదవదిగా సంతతి భావాన్ని చూడటం దీనిలోని ఆంతర్యము.
లోహాలలో బంగారముపై ఈ లగ్న ప్రభావము ఉంటుంది . ఆహార పదార్ధాలలో గోధుమ , పానీయాలలో తేనె , దీని ప్రభావ పరిధి లోకి వస్తాయి. క్షత్రియ జాతికి చెందిన లగ్నము. అగ్నితత్వ లజ్ఞాలలో ఇది రెండవది.
లగ్న కారకత్వాలు :
గుండె , వీపు , వెన్నెముక , ఆరోగ్యము , ధైర్యము , వ్యాధులు , ప్రభుత్వ కార్యాలయాలు , అరణ్యములు , కెమికల్ లేబొరేటరీస్ , పట్టుదల , అత్యాశ , డాంబికము , ఆదర్శము , అభిమానము , కుతూహలము , ప్రధమ కోపము , ఓటమిని అంగీకరించకుండా ఉండుటం , కపటమెరుగని ప్రేమ , రహస్య గోపనాలు భరించలేక పోవటం ,కీర్తి కాంక్ష , శాసనాలు , సింహా ద్వారము , ఆఫీసు గది , తూర్పు దిక్కు , జనాకర్షణ , బట్టతల , ప్రాణము ఊపిరి , ఆత్మ , ఆయుర్ధాయము , వ్యక్తిత్వం , భగవద్భక్తి , దివ్య దృష్టి , ఇచ్చా శక్తి , పైత్య తత్వం , రక్తానికి సంబంధించిన -సిరలు, ధమనులు , రక్తస్రావం , కళ్ళు , గుండె జబ్బులు , మతి మరుపు , మూర్ఛ వ్యాధి , టైఫాయిడ్ , వంటి విష జ్వరాలు , కొన్ని రకాల చర్మ వ్యాధులు , రక్షణ శాఖ మొదలైనవి.
ఈ లగ్న మందు జన్మించిన వారు మంచి బలిష్టమైన దేహ నిర్మాణము , ఓజో ధాతువుని కలిగి వుండుట , అనారోగ్యము ఎంత త్వరగా వచ్చునో అంత త్వరగా ఆరోగ్యాన్ని పొందుట వీరి ప్రత్యేకత , అన్నీ విధాలైన భోగాల్ని అనుభవిస్తారు. శత్రువుల్ని జయిస్తారు .
వీరు చేసే పనుల పట్ల ఇతరుల అభిప్రాయాల కన్నా తమ అభిప్రాయానికే విలువిచ్చి నడచుకొందురు . దయా దాక్షిన్యాలు అధికంగా ఉంటాయి. శీఘ్ర కోపం ఉంటుంది. పొగడ్తలకి పొంగిపోతారు. అతి విమర్శ తట్టుకోలేరు. సమాజంలో ఎక్కువమంది వీళ్ళదృష్టికి ఆనరు. కారణమేమంటే వీళ్ళకి నచ్చని విషయాలు ఎదుటి వారిలో కన్పిస్తాయి . ఎంత తప్పు చేసినను క్షమించమని అడిగితే మంస్పూర్తిగా క్షమిస్తారు . ఆస్తి పాస్తులు , అధికార కాంక్ష కన్నా కీర్తి ప్రచార కాంక్షకు లొంగిపోతారు. వైద్య వృత్తులలో , రక్షణ శాఖలలో , అధికార రంగాలలో రాణిస్తారు. వీరిలో శతృత్వం కూడా సహజంగానే వుంటుంది. కోపించటం వీరి లక్షణం . కానీ కుట్ర చేయుట చేత కాదు. వీరి మీద ఆధారపడి ఏదో విధమైన ఆశ్రితులు ఉంటారు. అప్పులు చేయటానికి జంకరు. అధికారులతో చనువు త్వరగా ఏర్పరచుకుంటారు. దూర ప్రయాణాలు అధికంగా చేస్తారు. ప్రధమ సంతానానికి చిన్న వయస్సులో అనారోగ్య సూచనలుంటాయి.
ఈ లగ్నానికి రవి 1,2,4,5,9,10 భావములందు శుభ ప్రదుడు .
చంద్రుడు 3,4,6,8 లలో శుభుడు .
కుజుడు కేంద్ర కోణాలలోనూ 2,6,11 లలో శుభుడు .
బుధుడు కేంద్ర కోణాలలో శుభుడు .
గురువు కేంద్ర , కోణ , లాభ స్థానాలలో శుభుడు.
శుక్రుడు కోణములలో 3,4,8,9,10,11,లలో శుభుడు .
శని 6,8,10,11 లలో శుభుడు.
రాహువు 1,3,8,9,10 లలో శుభుడు.
కేతువు 3,4,6,7,10 లలో శుభుడు.

Friday 6 December 2019

కర్కాటక లగ్నం :

ఈ లగ్నము ద్వితీయ చర లగ్నము . ఇది జలతత్వము కలది. ఈ లగ్నమునకు సున్నితత్వము అధికము . ఈ లగ్నము వలననే మనః కారకుడైన చంద్రుని వలన మనుషుల మానసిక ధోరణులు వ్యక్తమవుతూ వుంటాయి. సత్వగుణ ప్రధానమైనది. కళాత్మక దృష్టి , ఆచార వ్యవహారాలలో నమ్మకములు కలిగి వుంటాయి . స్త్రీ సంభంధ లక్షణాలు అధికం కొన్ని పర్యాయాలలో మానసిక స్థితి చంచలంగా వుంటుంది. పట్టుదల అధికం .ఏ విషయాన్నైనా సానుకూల దృక్పధంతోనే పరిశీలిస్తారు. ఉల్లాసభరిత మనస్తత్వము ఎక్కువగా వుంటుంది.
హాస్య ప్రసంగాలు ,చతురత , కళాత్మిక దృష్టి వుంటాయి. దైవ భక్తి , శ్రద్ధ విశ్వాసాలు అధికంగా వుంటాయి . శారీరకంగా చాలా ఆకర్షణీయంగా , కోమలత్వాన్ని , మృదుత్వాన్ని కలిగి వుంటారు. ఇతరుల అభిప్రాయాలతో సాధారణంగా ప్రతికూలించరు. అందరితోనూ స్నేహ సంభంధ లక్షణాలను , సహాయపడే తత్వాన్ని కలిగి వుంటారు. వృత్తి రీత్యా పేరు ప్రఖ్యాతలను కలిగి వుంటారు. సంఘంలో ఉన్నతస్థాయిని పొండటమే గాక, ఉత్తమమైన వ్యక్తిగా కూడా ప్రసిద్ధి పొందుతారు. పైకి ఎంతో ధైర్యాన్ని కనబరచినప్పటికీ అప్పుడప్పుడూ పిరికితనం కూడా కలుగుతూ వుంటుంది. ఆధ్యాత్మిక విషయాలపై శ్రద్ధ అధికం. చిన్న పిల్లల మనస్తత్వం , హాస్య ప్రియత్వం చాలా ఎక్కువగానే వుంటుంది . విజ్నానము అధికము . పలు విషయాలలో ప్రవేశం కూడా వుంటుంది. నీతి ప్రదమైన , గౌరవ ప్రదమైన , జీవనాన్ని అభిలషిస్తూ , కొనసాగిస్తూ ఉంటారు . సంభాషణా చాతుర్యము చాలా ఎక్కువ . ఆదరణీయ స్వభావము ఎక్కువ . నిర్ణయాలను తీసికోవటం చాలా ఆలోచించి , వేగంగా తీసుకుంటారు.
కొన్ని సందర్భాలలో బంధు రీత్యా మోసపోవటం కూడా వుండవచ్చు. అందరి తోనూ , స్నేహ భావంతో , సామరస్యంతోనూ వ్యవహరిస్తూ ఉంటారు. చురుకుదనము చాలా ఎక్కువగా వుంటుంది.
లక్షణాలు :
ఈ లగ్నానికి లగ్నాధిపతిగా చంద్రుడు శుభాలను కలిగిస్తాడు. మంచి ఆరోగ్యము , మనశ్శాంతి , మనోల్లాసములను చేకూరుస్తాడు . వృత్తిలో నైపుణ్యాన్ని కూడా కలిగిస్తాడు . కలల పట్ల అభిరుచి , ప్రవేశాలను కలిగిస్తాడు. ధనాధిపతిగా రవి కూడా శుభాలనే కలిగిస్తాడు . ప్రజా సంభంధాలు , ప్రభుత్వ రీత్యా ఆదాయాలను కలిగిస్తాడు. అధికార రీత్యా గౌరవ మర్యాదలు , పేరు ప్రతిష్టలు లభిస్తాయి . మంచి హోదా గల జీవనం వుంటుంది.
తృతీయ వ్యయాధిపతిగా అతి పాపి యైన బుధుని వలన సోదరీ - సోదరుల మూలకంగా అనవసర , అధిక ధన వ్యయం , వ్యవహార , వ్యాపారాలలో నమ్మిన వారి వలన నష్టాలు సంభవిస్తాయి . ఆరోగ్య భంగం కలుగుతుంది. వాహన . లాభాది పతిగా శుక్రుడు పాపి , వివాహాది విషయాలలో , వైవాహిక జీవనంలో అసౌకర్యాన్ని , సౌఖ్య లోపాన్ని కలిగిస్తాడు. భార్యాభర్తల మధ్య వియోగం , దూర ప్రాంతాలలో వుండుట , అన్యోన్యతానురాగాలు స్వల్పమగుట వంటివి కూడా వుంటాయి.
పంచమ రాజ్యాధిపతిగా 
కుజుదొక్కరే ఈ లగ్నానికి మిక్కిలి యోగప్రదుడు , శుభుడు . దీని వలన సంతాన రీత్యా యోగిస్తుంది . వృత్తి రీత్యా పేరు ప్రతిష్టలు , సుఖ సౌఖ్యాలు వుంటాయి. షష్ట భాగ్యాధిపతిగా గురువు అనారోగ్య సమస్యల నుంచి , ప్రమాదాల నుండి , దీర్ఘ వ్యాధుల నుండి రక్షిస్తాడు. పుణ్య క్రియలు , దైవభక్తి , శ్రేష్ట కర్మలను , అదృష్టాన్ని కలుగజేస్తాడు . సప్తమ అష్టమాధిపతిగా శని అతి పాపత్వాన్ని కలిగివుండటంవలన కళత్ర రీత్యా , అనుకోని చిక్కుల రీత్యా ఆవేదనలను , అసమతౌల్యతలను కలిగిస్తాడు. మానసిక ఆందోళనలు , చంచలత్వాన్ని కలిగిస్తాడు. నరముల సంభంధిత అనారోగ్యాన్ని కలిగిస్తాడు.

Wednesday 4 December 2019

మిధున లగ్నం :

ఈ లగ్నము ప్రధమ ద్విస్వభావ లగ్నము. వాయుతత్వము కలది . ఈ లగ్నానికి వైరుధ్యములను దర్శించు శక్తి ఎక్కువ. మంచి - చెడుల వివేక లక్షణము ఈ లగ్నము యొక్క కీలక లక్షణము. జనన మరణాలను , చీకటి వెలుగులను వివేచించి చూడగల శక్తిని మానవుడు ఈ లగ్నము వలన పొందుచున్నాడు. ఈ లగ్నము వలననే జాతుల మధ్య , వ్యక్తుల మధ్య రాజకీయ మత భేధములు కలుగు చున్నవి. వైరుధ్యములను పరిష్కరించగల నిష్పక్ష పాత బుద్ధి కూడా ఈ లగ్నము నందే వుండును.
విజ్నాన శాస్త్రములో అతి నిర్ధుష్టమైన గణిత శాస్త్రము ఈ లగ్నాధిపతి అయిన బుధుని కారకత్వమునకు చెందినది .
బుధుని యొక్క సంఖ్యాత్మక శక్తి అయిదు గా ఋషులు గుర్తించారు . ఈ లగ్నము సత్వ గుణ ప్రధానమైనది . వైశ్య జాతి . ఈ లగ్న రాశి హరిత వర్ణముపై ఆధిత్యము గలది .ఈ లగ్నము నందు జన్మించిన వారు పొడవు , నిటారుగా ఉండు దేహము , సన్నని పాదాలు , నిశితమగు దృష్టిని కలిగి ఉంటారు . వీరికి చమత్కార ధోరణి ఎక్కువ . ఇతరుల అభిప్రాయములను కనిపెట్టి తదనుగుణముగా ప్రవర్తించుట వీరి ప్రత్యేకత . వీరికి ఏ విషయములోనైన పరిపూర్ణత సాధించుట చాలా కష్టము. వీరి మానసిక స్థితి అధోస్థాయికి చేరితే స్వామిద్రోహము చేయుటకు కూడా వెనుకాడరు. తప్పుడు మార్గాలలో నడవటం , కుటిలోపాయములు పన్నటం వీరికి సులభ సాధ్యము . నీతులు చెప్పినంతగా ఆచరించుట వుండదు. వీరికి ప్రయాణాలు ఎక్కువగా ఉంటాయి. రాత యందు , చర్చించుట యందు నిపుణత ఉంటుంది . వీరికి చురుకుదనము , చాకచక్యము ఎక్కువ . సందేహములు , చిరాకు ఎక్కువ. తక్కువ చొరవ కలిగిన వారు. ఇద్దరి మధ్య భేధాభి ప్రాయములను తీర్చి కలపగలరు. అవసరమనుకుంటే భేధాభిప్రాయములను సృష్టించి విడదీయగలరు . కంగారు , భయము , కోపము , వస్తే వీరి మానసిక శక్తి క్షీణించిపోవును. పైకి గంభీరతే గాని లోపల పిరికితనం ఉంటుంది. జాగ్రత్త ఎక్కువ . పని అవసరమనుకుంటే తలవంచి కూడా పూర్తి చేసుకుంటారు.
లక్షణాలు :
లగ్న , చతుర్ధాలకు బుధుడు అధిపతి ఆగుట కారణంగా , బంధువుల విషయాలలో గాని , కుటుంబ విషయాలలో గాని రహస్యాలుంటాయి . నరాల బలహీనతలుంటాయి . మానసిక వ్యాధులు , నత్తి , చెముడు , తలనెప్పి , ఉన్మాదములు కలుగుటకు ఈ బుధుదే కారణము . అదే విధంగా చట్టము , న్యాయము , ధర్మ శాస్త్రములందలి సూక్ష్మములు పసిగట్టుట కూడా ఈ లగ్నాధిపతి అయిన బుధుని కారణము . నిద్రపట్టక పోవటం , అతి ఆలోచనలు , దిగులు పడినప్పుడల్లా జీర్ణకోశము పాడగును . వృత్తులలో మార్పులేర్పడును . జీవితములో అదృష్టము ఒడిదుడుకులకు లోనగును. లాటరీ , స్పెకులేషన్ వంటి వ్యవహారములలో లాభించుటకు అవకాశము కలదు. ఈ పని చేసినను ఎంత లాభముండునోనని ఆలోచించి పని ప్రారంభిస్తారు. పూర్తిగా ఎవ్వరిని నమ్మరు. అష్టమ , నవమ లగ్నాలు శని సంభందములైనవి. కావున మోకాళ్ళు , మెడ , వెన్ను అవయవముల గురించి ఆరోగ్య విషయములలో జాగ్రత్తగా వుండాలి . షష్ట లాభములు కుజ లగ్నాలు కావటం మూలాన వీరి సోదరులలో ఒకరికి పెద్ద ఉద్యోగం వస్తుంది . పంచమ , వ్యయ లగ్నాలు శుక్ర లగ్నాలవటం వలన సంతతి మీద అపేక్ష ఎక్కువ గాను , ఖర్చు విషయం లో లోభత్వముగానూ ప్రవర్తిస్తారు. సప్తమ , దశమ లగ్నాలు గురు లగ్నాలు కావటం కారణంగా : అదృష్టము , అవకాశాలు , ధన విషయాలు చంచలంగా వుండును. ధన సంభంధ విషయాలలో పర స్త్రీ సాంగత్యం ఏర్పడవచ్చు. భార్య , పిల్లలకు వీరు విశ్వాస పాత్రులు కారు . మొత్తం మీద వీరికి తెలివి ఎక్కువ గాను ,సుఖము తక్కువ గాను వుండును.
లక్షణాలు :
సమన్వయ శక్తి తెలివి , విషయ పరిజ్నానము ,మేనత్తలు , మేనమామలు , సాధకులు , ప్రచారం , తంతి తపాలా , అనువాదము , రాయబారము , మిమిక్రీ , డిక్షనరీస్, పుస్తకాలు , రెవెన్యూ శాఖలు , వాణిజ్య శాఖలు ,టెలిఫోన్ ,టైపు , టెలివిజన్ , తెలివి తేటలు , శాస్త్ర పాండిత్యము , ధాన్యాగారములు , న్యుమోనియా , క్షయ , నాట్య శాస్త్రము , తర్క శాస్త్రము , అధర్వణ వేదము , బహుభాషా జ్నానము, మొదలైనవి.

Tuesday 3 December 2019

వృషభ లగ్నం :

ఇది స్థిర లగ్నము . పృధ్వీతత్వాన్ని కలిగి వుంటుంది. రజోగుణమైనది .నీల వర్ణాన్ని కలిగి వుంటుంది. భోగము ,ఆనందము ,కార్య దీక్ష ,సౌందర్యము ,ప్రాక్టికల్ థింకింగ్ ఈ లగ్న మూల లక్షణములు.ముఖ్యముగా స్త్రీ పురుష లింగ భేధము నేర్పరచుటలో ఈ లగ్నము మూలకారణమవుతున్నది .ఎందుకంటే దీనికి సప్తమలగ్నమైన వృశ్చికము మర్మస్థానముల మీద ఆధిపత్యము కలిగివుండుట చేత మొత్తము సృష్ఠి అంతా కూడా వృషభ , వృశ్చిక లగ్నములను ప్రధానముగా చేసుకొని క్రీడించుచున్నట్లుండును.ఈ లగ్న స్త్రీ లలో కొన్ని పురుష సంభంధ లక్షణాలు, పురుషులలో స్త్రీ సంభంధ లక్షణములు మేళవించి వుండును.ఈ లగ్నము మిక్కిలి నిగూఢమైనది . సాక్షాత్తు దేవదేవుడైన శ్రీ కృష్ణ పరమాత్మ ఈ లగ్నము ద్వారానే తన పరిపూర్ణ అవతార విశేషమును వ్యక్తపరచుట మనము గమనించవచ్చు .
లక్షణాలు :
పట్టుదల , స్థిరమైన అభిప్రాయాలు , స్వభావమందు మార్పు లేకుండుట , సౌమ్యత ,త్వరగా కోపము రాదు ,వచ్చిన కోపము త్వరగా పోదు. ఈ లగ్నము వారికి మానసిక స్థితిలో లోపము ఏర్పడి దురభిప్రాయాలు ,ద్వేషము , ఈర్ష్యాసూయలు ఏర్పడి అవి కూడా స్థిరపడి పోవును . వీరికి స్వలాభ తత్వమధికము . ఇతరుల అభిప్రాయములను విందురే గాని తమకు తోచిన విధము గానే ప్రవర్తింతురు . వీరికి ఆటుపోటులను తట్టుకోగల శక్తి ప్రకృతి సహజముగానే ఏర్పడగలదు .ఎంత పెద్ద విజయమైనప్పటికి వీరిని ఆశ్చర్య పరచదు .దానికి కారణం అదలా రావటం సహజమేనని వారికున్న నమ్మకం .వీరి మానసిక స్థితి ఉన్నతముగా బలీయముగా రూపొందుతున్న కొద్దీ వీరికి రాజకీయము ,అధికారాలు , పెద్ద పెద్ద సంస్థల బాధ్యతల నిర్వహణ వీరికి సులువు అవుతుంది. వీరు కష్టపడి పని చెయ్యటం , చేయించటం తెల్సిన వారు. వృక్షాల పెంపకం , జంతు పోషణ ,వ్యవసాయం , వ్యాపారాలు వీరికి రాణిస్తాయి . ఒక పనికి ఆరంభంలో కొద్దిగా బద్ధకించిననూ మొదలు పెడితే చివరి వరకు నిలబడటం వీరిలోని ప్రత్యేక గుణం . వీరికి టైమ్ సెన్స్ ఎక్కువ . ఇతరులకు విసుగనిపించే విషయాలు వీరికి కుతూహలంగా మారతాయి . పరశుభ్ర త , ఇంద్రియ తృప్తి , రుచులను కోరుకుంటారు.వీరు కష్టపడుట మాత్రమే గాక బాగుగా సుఖపడుట కూడా తెల్సిన వారు .తమకు దక్కవలసిన వాటిలో అణాపైసలు కూడా వదిలి పెట్టరు. వీరికి కీర్తి కాంక్ష ఎక్కువ . వీరితో చెలిమి కూడిన వారిని ఇంకొకరితో చనువుగా వుండటం వీరు సహించలేరు .
ఈ వృషభ లగ్నానికి ఇతర నైసర్గిక లగ్నాల ద్వారా ఏర్పడే శుభాశుభములు సప్తమ ,వ్యయ లగ్నములు కుజ లగ్నముల కారణముగా చిన్న తనములో ఎత్తు మీద నుండి క్రింద పడటం , జల సంభంధ ప్రమాదాలు , మర్మాంగ దోషాలు , తృతీయ చంద్ర లగ్నము కారణముగా శ్వాస కోశ సంభంధ వ్యాధులేర్పడతాయి . అతి శ్రమ ,అతి భోజనము వలన అజీర్ణ వ్యాధు లేర్పడతాయి . తో బుట్టువులతో మంచి సంభంధ బాంధవ్యాలు ఏర్పరచుకోవటం కష్టము . ధన , పంచమ లగ్నాలు బుధ లగ్నాలు కారణంగా ఈ లగ్నము వారికి ఆకస్మికంగా ధన యోగాలు ఏర్పడును. 30 సంవత్సరాల లోపు కలిగిన సంతతి వీరి మాట వినరు. వీరి శత్రువులు వీరికి ప్రత్యక్షంగా వుంటుంటారు . మానసిక కర్మ క్షేత్రాలు (సింహం , కుంభం) స్థిర లగ్నాలవటం చేత మంచి శరీర పటుత్వముతో నలుగురి శ్రమ వీరొక్కరే చెయ్యగలగటం , స్థిరముగా కూర్చొని పని చేస్తున్న కొద్దీ వీరి శక్తి సామర్ధ్యాలు మరింత పెరగటం , వీరి శ్రమని తమకు నచ్చిన వారు గుర్తించాలని కోరుకోవటం , ప్రతివిషయాన్నీ బాగుగా పరిశీలించిన తరువాతనే ఒక నిర్ణయానికి రావటం వీరి ప్రత్యేక లక్షణాలు .
ఈ లగ్నానికి శుక్రుడు కోణ,వ్యయమాలలో యోగిస్తాడు.
చంద్రుడు కేంద్రాలలో కన్నా కోణాలలో శుభుడు.
రవి కేంద్రాలలో యోగించును.
పాప స్థానాలలో గురువు యోగించును.
శని , కుజ లు , అదే విధంగా రాహు ,కేతు వులు కూడా కేంద్రాలలో యోగిస్తారు.
బుధుడు కోణములలో యోగించును .

Monday 2 December 2019

మేష లగ్నము :

మేష లగ్నము నుండి బహిర్గతమవుతున్న లక్షణములను గమనించిన అవి ఈ లగ్నమునకు తక్కిన లగ్నములకు ఏర్పడుతున్న నైసర్గిక శుభా శుభ సంభంధములుగనే గోచరించును. ఈ లగ్నము పరిణామానికి ప్రారంభము. ఆందోళన , ఆవేశము , మోసపోవుట , తొందరపాటుదనము , నిజాయితీ , అందరికంటే అధికంగా ఉండాలని కోరుకోవటం , ఆ ప్రయత్నాలలో కొన్ని పర్యాయములు ఈర్ష్యాసూయలకు లోనవటం , స్థాన మార్పును కోరుకోవటం - ఈ లగ్నము యొక్క మూల లక్షణాలు. ఈ లగ్నమునకు శుక్రుడు అశుభుడగుట చేత స్త్రీ మూలక వివాదములు , నష్టములు కలగటము , ఈ లగ్నానికి తృతీయ షష్టాధిపతిగా బుధుడు ఇంకొక అశుభుడగుట చేత వ్యాపార సంభంధ నష్టాలు , బంధువులతో సఖ్యత లేకపోవుట , లాటరీ ,జూదం వంటి వాటిలో చిక్కులు కలుగుట , అదే విధంగా దశమ లాభాధిపతిగా శని మరియొక పాపి ఆగుట చేత ఆలస్యాన్ని తట్టుకోలేక పోవుట , ఆందోళన, అధికారులు పెద్దల యొక్క ఆధిక్యతను అంగీకరించలేక ప్రశ్నించుట , లగ్నాధిపతి యైన కుజుడు సోదర కారకుడు కావున తోబుట్టువులలో మరణములుండుట , రవికి పంచమాధిపత్యము చేత అల్పసంతానము మాత్రమే వుండుట మొదలగు లక్షణాలు ఈ లగ్నానికి ఏర్పడుతాయి.
అంతే గాక , క్షణికావేశం , వ్యాయామ ప్రీతి ఆలోచనా రహితంగా పనులు ప్రారంభించుట , నిలకడ లేని స్థితి , దెబ్బలు తగులుట , పోలీసులు లేక కోర్టు వ్యవహారములు , విద్యావిఘ్నాలు , కుటుంబ కష్టాలు , దూర ప్రాంతాలలో స్థిర పడుట, లగ్న మందు సూర్యుని ఉచ్చ స్థితి వలన పెద్ద పెద్ద పదవులు నిర్వహించగల సామర్ధ్యము , నీతి ,
నిజాయితీ లు కల్గిఉంటారు . ముఖస్తుతికి లొంగుతారు. తలకు , కంటికి , జీర్ణశయములకు సంబంధించిన రోగాలు ఈ లగ్న జాతకులకు సంభవిస్తాయి .
లగ్నాధిపతియైన కుజుని కారకత్వములు :
వైద్య శాఖలు ,రక్తము , భూమి , సోదరులు , మిలటరీ , పోలీసు , శత్రువులు , ఋణములు, వడ్డీలు , కురుపులు , కలరా మశూచికం , మూర్ఛ , క్షయ , గాయాలు , జ్వర భాధలు , అంటూ వ్యాధులు , పైల్సు , ఆయుధాలు , కుసుమ వ్యాధులు , పరస్థల నివాసము , ఆపరేషన్స్ , పరుష పదజాలము , నిందలు , విదేశీ యానము , ఇంగ్లీషు భాష , ఏక్సిడెంట్స్ , దొంగతనములు , భూకంపములు , ఈ కుజుని కారకత్వములు .శరీరములో కనుబొమ్మలనుండి కంఠము వరకు ఈయన ఆధిపత్యము ఎక్కువ.
విశేషాలు :
ఈ లగ్నమునకు రవి , గురు లు శుభులు . ప్రత్యేకించి గురువు యోగ కారకుడు కోణములందు గురువున్న చాలా అదృష్టము , ఆర్ధిక స్థితి తప్పక ఏర్పడుతుంది.
కేంద్రాధిపత్య దోషము వల్ల చంద్రుడు పాప స్థానాల్లో యోగిస్తాడు .
చంద్ర ,బుధు లు కేంద్ర కొణాలలో వుండగా , బంధువులతో అనుకూల స్థితిని ,వ్యాపార విజయాన్ని కలిగిస్తారు .
చంద్ర , కుజ లు కేంద్ర కొణాలలో వుంటే వృత్తి , ఉద్యోగాలకు , ధన భావానికి , మంచి అవకాశాలు కలుగుతాయి.
వ్యయం లో చంద్రుడున్నచో విదేశీ ప్రయాణాలకు , ఉన్నత విద్యలకు దోహదమవుతుంది .
కేంద్ర కోణాలలో శుక్రుడు - కుజ సంభంధము వలన కళత్ర సౌఖ్యం , గృహ సౌఖ్యం కలుగుతాయి .
దశమ కేంద్రములో లగ్నాధిపతి వుండుట అశుభము . వృత్తి ఉద్యోగాలలో నిలకడ వుండదు.
ఏకదశంలో రాహువున్న యొడల వీరిని పరుల యొక్క ఈర్ష్యాసూయల నుండి రక్షిస్తాడు . భాగ్యరాజ్యాధిపతుల యుతి ఈ లగ్నము వారికి మేలు చేయదు.

Sunday 1 December 2019

VEDIC EVENTS FOR THE MONTH OF DECEMBER 2019.


03 DEC – 8th WAXING MOON
05 DEC –MERCURY ENTERS SCORPIO
08 DEC – EKADASI
09 DEC – SOMA PRADOSHAM
12 DEC – FULL MOON
15 DEC – VENUS ENTERS CAPRICORN
16 DEC – SUN ENTERS SAGITTARIUS
18 DEC – 8TH WANNING MOON
22 DEC – EKADASI
24 DEC – MINI SHIVARATRI
25 DEC – CHRISTMAS

25 DEC – MERCURY ENTERS SAGITTARIUS
25 DEC – MARS ENTERS SCORPIO
26 DEC – NEW MOON
26 DEC – HANUMAN JAYANTHI

వర్గులు - వివరణ :

వర్గులు - వివరణ ..

జాతక చక్రములో కొన్ని శుభ గ్రహములు ఫలితాన్ని అందించవు. దానికి కారణము ఆ చక్రములో ఆ గ్రహానికి గల బలము, ముందుగా మనం గ్రహ బలాలను లెక్కించాలి.
అదే విధంగా భావాలను పరిశీలించేటప్పుడు వివిధ కోణాల నుండి పరిశీలించాలి. వాటి కోసమే రాశి , నవాంశ , దశాంశ , చక్రాలను పరిశీలిస్తూంటాము.
రాశి అంటే 30 డిగ్రీలు. దానిని విభిన్న శాస్త్రవేత్తలు , విభిన్న పద్ధతులలో విభజించి తద్వారా ఫలితాలను తెలిపారు. ఈ విభజననే వర్గులు అంటారు.
కొన్ని వర్గులు :
షడ్వర్గు : రాశి , హోర , ద్రేక్కాణ , నవాంశ , ద్వాదశాంశ , త్రింశాంశ .
సప్త వర్గు : రాశి , హోర , ద్రేక్కాణ , సప్తాంశ , నవాంశ , ద్వాదశాంశ , త్రింశాంశ .
దశ వర్గు : రాశి , హోర , ద్రేక్కాణ , సప్తాంశ , నవాంశ , దశాంశ , ద్వాదశాంశ , షోడశాంశ , త్రింశాంశ , షష్ట్యాంశ .
షోడశ వర్గు : క్షేత్రము , హోర , ద్రేక్కాణ , తుర్యాంశ, సప్తాంశ , నవాంశ , దశాంశ , ద్వాదశాంశ , షోడశాంశ , వింశాంశ, చతుర్వింశాంశ , నక్షత్రాంశ(భాంశ) , త్రింశాంశ , వేదాంశ , అక్షవేదాంశ , షష్ట్యాంశ .
గ్రహము నీచలో ఉన్ననూ , అస్తంగతమైననూ , శుభ వర్గులు నశించును. అట్టి గ్రహము శుభ ఫలితముల నీయదు.

                                https://youtube.com/shorts/hXs7ylVV_Rs?si=eAVlfsOGtiuuLmaF